ఎల్బీ స్టేడియంలో బీజేపీ సమ్మేళన్ కు హాజరైన కార్యక్రమానికి హజరైన
హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో బీజేపీ సమ్మేళన్ కు హాజరైన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, వెంకయ్యనాయుడు ప్రజలను ఉద్దేశించి ప్రసగించారు. యాపీఏ హయాంలో అవినీతి అంతరిక్షం నుంచి పాతాళానికి దిగజారిందని వెంకయ్యనాయుడు విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని.. ఆదివారం ఐదుగురు కేంద్రమంత్రులు రాష్ట్రానికి వచ్చి రూ.17 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించారని దత్తాత్రేయ చెప్పారు.
దేశ సమగ్రాభివృద్ధికి మోదీ కృషి చేస్తున్నారని టీబీజేపీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ అన్నారు. పార్టీలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ వారసత్వ రాజకీయాలను చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని అన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతామని తెలిపారు.