సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. బుధవారం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చేస్తున్నారు. కేంద్ర ప్రగతిని ఆమె చదివి వినిపిస్తున్నారు. రేపు సభ ముందుకు ఆర్థిక సర్వే రానుంది. ఫిబ్రవరి 1వ తేదన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.