యూత్‌లో ఫుల్‌జోష్ | sakshi Arena One Youth Fest awards ceremony | Sakshi
Sakshi News home page

యూత్‌లో ఫుల్‌జోష్

Feb 22 2016 2:13 AM | Updated on Aug 20 2018 8:09 PM

సీబీఐటీ కళాశాలకు కాలేజీ ఆఫ్ ద ఇయర్ అవార్డు ప్రదానం చేస్తున్న 'సాక్షి' కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగం డైరెక్టర్ రాణిరెడ్డి - Sakshi

సీబీఐటీ కళాశాలకు కాలేజీ ఆఫ్ ద ఇయర్ అవార్డు ప్రదానం చేస్తున్న 'సాక్షి' కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగం డైరెక్టర్ రాణిరెడ్డి

స్పూర్తిదాయక ప్రసంగాలు.. మధ్య, మధ్యలో సినీతారల తళుక్కులు.. హోరెత్తించే యువ ఉత్సాహం.. పాశ్చాత్య, సంప్రదాయ మ్యూజిక్.. బాబా సెహగల్ సినీ సంగీతం.. రోల్ రిడా పతంగ్.. వెరసి యూత్‌లో ఫుల్‌జోష్!

ఉత్సాహంగా సాక్షి ఎరీనా వన్ అవార్డుల ప్రదానోత్సవం
హాజరైన సినీ, విద్యా, రాజకీయ ప్రముఖులు


సాక్షి, హైదరాబాద్: స్పూర్తిదాయక ప్రసంగాలు.. మధ్య, మధ్యలో సినీతారల తళుక్కులు.. హోరెత్తించే యువ ఉత్సాహం.. పాశ్చాత్య, సంప్రదాయ మ్యూజిక్.. బాబా సెహగల్ సినీ సంగీతం.. రోల్ రిడా పతంగ్.. వెరసి యూత్‌లో ఫుల్‌జోష్! ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సాక్షి ఎరీనా వన్ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా సాగింది. ‘సాక్షి’ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగం డైరెక్టర్ రాణిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ అధినేత, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, అడ్వర్‌టైజింగ్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ కేఆర్‌పీ రెడ్డి, ఫైనాన్స్ డైరెక్టర్ వైఈపీ రెడ్డి, విజ్ఞాన్ యూనివర్సిటీ అధినేత డాక్టర్ రత్తయ్య, ఐపీఎస్ డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, సినీతార లక్ష్మీ మంచు, నటులు మంచు మనోజ్, సునీల్, ఆది పినిశెట్టి, ఆదా శర్మ, రేష్మి, స్నిగ్ధ, అనసూయ, అడివి శేషు, నిర్మాత దిల్‌రాజ్, ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధూ విశిష్ట అతిథులుగా హాజరై వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) ఉత్తమ కళాశాలగా నిలిచింది. ఉత్తమ బోధన, క్యాంపస్ ప్లేస్‌మెంట్, బెస్ట్ క్యాంపస్, విద్యార్థుల ప్రతిభ తదితర అంశాల్లో ‘కాలేజ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును దక్కించుకుంది. యుువతలోని ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేందుకు సాక్షి మీడియూ గ్రూప్ ‘ఈ మెగా ఈవెంట్’ నిర్వహించడం అభినందనీయమని కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు కొనియాడారు.
 

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సినీ నటి లక్ష్మి మంచు, విజ్ఞాన్ యూనివర్సిటీ అధినేత లావు రత్తయ్య,  సాక్షి ఫైనాన్స్ డైరెక్టర్ వైఈపీ రెడ్డి, ఐపీఎస్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణిరెడ్డి, అడ్వర్టైజింగ్ అండ్ ఫైనాన్స్ డైరెక్టర్ కేఆర్పీ రెడ్డి


మనోళ్లే గొప్పోళ్లు: ఎంపీ మల్లారెడ్డి

ప్రపంచ దేశాలతో పోలిస్తే తెలంగాణ యువతలోనే తెలివితేటలు ఎక్కువ. ప్రపంచ దేశాలన్నీ మనల్నే చూస్తున్నాయి. ఇక్కడ ప్రతిభకు కొదవ లేదు. చదువు, పరీక్షలు ఒక్కటే జీవితం కాదు. ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని వెలికి తీసినప్పుడే వాడు గొప్పవాడవుతాడు.

కృషి, పట్టుదల చాలు: ప్రవీణ్‌కుమార్

పరీక్షలో మార్కులు తక్కువ వచ్చినా.. ఇంగ్లిష్ అంతగా రాక పోయినా బాధపడాల్సిన అవసరం లేదు. ఉన్నతమైన ఆశయం, కృషి, పట్టుదల ఉంటే విజయం సిద్ధిస్తుంది. సమాజంలో మనల్ని గొప్పవాళ్లుగా నిలబెడుతుంది. సాధారణ విద్యార్థులైన మాలవత్ పూర్ణ, ఆనంద్ ఎవరెస్ట్‌ను అధిరోహించారు. వారి కృషిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి.

చదువొక్కటే కాదు: డాక్టర్ రత్తయ్య

చదువు ఒక్కటే జీవితం కాదు. బాగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వారు మంచి ఉద్యోగాన్నైతే పొందవచ్చు కానీ.. మంచి జీవితాన్ని మాత్రం పొందలేదు. సమాజంలో సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా ఆలోచించే వారికి మంచి గుర్తింపు ఉంటుంది.

ఐపీఎస్ సాధిస్తా: ఆనంద్, ఎవరెస్ట్ అధిరోహించిన విద్యార్థి

ఇప్పటివరకు మంచును, ఎతైన మంచు శిఖరాలను సినిమాలోనే చూశాను. నిజ జీవితంలో వాటిని చూస్తానా? అనుకున్నాను. కానీ కృషి, పట్టుదలతో ఎవరెస్ట్‌ను అధిరోహించా. పేదవాడికి అవకాశం ఇస్తే.. వారు కూడా నాలాగే విజయం సాధించి చూపిస్తారు. భవిష్యత్తులో ఐపీఎస్ అవుతాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement