తెలంగాణ చెస్‌ టోర్నీ విజేత రామకృష్ణ  | Telangana Senior Chess Championship Wins Ramakrishna | Sakshi
Sakshi News home page

తెలంగాణ చెస్‌ టోర్నీ విజేత రామకృష్ణ 

Feb 17 2022 1:02 AM | Updated on Feb 17 2022 1:03 AM

Telangana Senior Chess Championship Wins Ramakrishna  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సీనియర్‌ పురుషుల చెస్‌ చాంపియన్‌షిప్లో జె.రామకృష్ణ చాంపియన్‌గా నిలిచాడు. ఎల్బీ స్టేడియంలో తొమ్మిది రౌండ్లపాటు జరిగిన టోర్నీలో  హైదరాబాద్‌కు చెందిన రామకృష్ణ, పోలూరి భరత్‌ కుమార్‌ రెడ్డి (కో దాడ) 8 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టై బ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా రామకృష్ణకు టాప్‌ ర్యాంక్‌... భ రత్‌ కుమార్‌ రెడ్డికి రెండో ర్యాంక్‌ లభించాయి.

రామకృష్ణ, భరత్‌ కుమార్‌ రెడ్డి ఏ డు గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. 7.5 పాయింట్లతో ఆదిరెడ్డి అర్జున్‌(రంగారెడ్డి) మూడో స్థానంలో, 7 బాషిక్‌ ఇమ్రోజ్‌ (నల్లగొండ) నాలుగోస్థానంలో నిలిచారు. రామకృష్ణ, భరత్‌ కుమార్, అర్జున్, ఇమ్రోజ్‌ ఈనెల 25 నుంచి కా న్పూర్‌లో జరిగే జాతీయ సీనియర్‌ చెస్‌ చాంపియన్‌షిప్లో తెలంగాణ జట్టుకు ప్రా తినిధ్యం వహిస్తారు. సీనియర్‌ చెస్‌ కోచ్‌ జొన్నలగడ్డ ప్రసాద్‌ ట్రోఫీలు అందజేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement