తెలంగాణ సాంస్కృతిక వేడుక బతుకమ్మ పండుగ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో ఎక్కేందుకు సన్నద్ధమవుతుండగా.. కాసేపు వరుణుడు అడ్డుపడ్డాడు. భారీగా వర్షం కురువడంతో ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన మహా బతుకమ్మ వేడుకలకు కాసేపు అంతరాయం ఏర్పడింది. వర్షం వెలియడంతో మళ్లీ బతుకమ్మ సందడి మొదలైంది.