ఎల్బీ స్టేడియంలో శాంతియాగం | santi yagam in LB Stadium | Sakshi
Sakshi News home page

ఎల్బీ స్టేడియంలో శాంతియాగం

Aug 4 2016 8:14 PM | Updated on Mar 29 2019 9:31 PM

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల7న హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ రాష్ట్రకమిటీ భారీ ఏర్పాట్లు చేస్తోంది.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల7న హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ రాష్ట్రకమిటీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా విజయవంతం కావాలని కోరుతూ గురువారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారె డ్డి ఆధ్వర్యంలో శాంతి యజ్ఞం, సుదర్శన యాగం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా మ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని సభకు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు తరలివస్తున్నారన్నారు. వీఐపీ వాహనాలకు బాబు జగ్జీవన్‌రామ్ చౌరస్తా వరకు అనుమతి ఉంటుందన్నారు. వాహనాల పార్కింగ్‌ైకై నిజాం కళాశాల మైదానం, మహబూబియా పాఠశాల, పబ్లిక్ గార్డెన్ ప్రాంతాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. వేదికను పూర్తిగా డిజిటల్ పరిజ్ఞానంతో తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. అనంతరం నగర అధ్యక్షులు వెంకట్‌రెడ్డి, డీసీపీ కమల్‌హాసన్ రెడ్డితో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement