నా జీవితంలో ఇదొక అద్భుతమైన రోజు : చిరంజీవి

sye raa narasimha reddy pre release on september 22 - Sakshi

నా మొట్టమొదటి సినిమా ప్రాణం ఖరీదు సెప్టెంబర్‌ 22నే విడుదలైందని..అప్పుడు ఎలాంటి ఫీలింగ్‌ కల్గిందో.. మళ్లీ 41ఏళ్ల తరువాత అప్పటి ఫీలింగే మళ్లీ కలుగుతోంది. దానికి కారణం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అన్నారు. దాదాపు పుష్కర కాలం నుంచి ఈ కథ నా మదిలో మెలుగుతూ ఉండేదంటూ నేటి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చిరంజీవి మాట్లాడారు. పూర్తి ప్రసంగం కోసం కింది వీడియోను చూడండి.

పవన్‌కళ్యాణ్‌ మట్లాడుతూ.. ‘ఈ ఈవెంట్‌కు నన్ను పిలిచింనందు అదృష్టంగా భావిస్తున్నాను.. ఆయనకు మీలా నేనూ ఓ అభిమానినే. ఆ విధంగానే నేను ఇక్కడకు వచ్చాను. అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి చిరంజీవి. మీ అభిమానుం నాకు దక్కిందటే.. ఆయన నేర్పిన పాఠాలే కారణం. ఆయన అప్పుడు ఇచ్చిన ధైర్యం.. నన్ను ఇప్పుడు మీ ముందు నిలబెట్టింది’అంటూ మాట్లాడారు.

రాజమౌళి మాట్లాడుతూ.. ఇంత పెద్ద సినిమా వేడుక జరుగుతుందంటే.. పరుచూరి బ్రదర్స్‌ గారికిథ్యాంక్స్‌ చెప్పాలి. బ్రిటీష్‌ వారిపై మొట్టమొదటగా పోరాడింది మన తెలుగు వాడని అందరికీ తెలిసేలా మా హీరో రామ్‌ చరణ్‌ చేశాడు. ఇది మీ డాడీకే గిఫ్ట్‌ కాదు.. మొత్తం తెలుగు వారికి అందిస్తున్న గిఫ్ట్‌’అని అన్నారు.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ... ‘అందరికీ నమస్కారం.. వర్షం ఇంత కురుస్తున్నా మీరు ఇలా ఉంటూ.. మెగాస్టార్‌పై మీకున్నా అభిమానాన్ని చూపిస్తున్నారు.. సమయం లేనందున.. అందరి గురించి చెప్పలేకపోతున్నాను. ఎవరికీ తెలియని ఓ విషయాన్ని చెబుతాను. పవర్‌స్టార్‌కూడా తెలియనిది చెబుతాను. నేను సైరాను చూశాను.. నేను మొట్టమొదటి ప్రేక్షకుడిని. సినిమా చూసి కింద పడిపోయాను.. ఈ మూవీ సూపర్‌హిట్‌’ అని అన్నారు. .

చిత్ర నిర్మాత, హీరో రాంచరణ్‌ మాట్లాడుతూ.. ‘ఇక్కడకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. సినిమాకు పనిచేసిన అన్ని శాఖల వారికి థ్యాంక్యూ. షూటింగ్‌ చేసిన ప్రతి రోజు వారందరికీ థ్యాంక్స్‌ చెబుతూనే ఉన్నాను. వారంతా సహకరించడం వల్లే ఈ సినిమా పూర్తి చేయగలిగాం. ఎక్కువసేపు నాన్నగారిని, బాబాయ్‌ని వెయిట్‌ చేయించి మాట్లాడలేను. అందుకే ముగించేస్తున్నాను. అంతేకాకుండా వర్షం వచ్చేలా కూడా ఉంది కాబట్టి మరోసారి అందరికి ధన్యవాదాలు చెబుతూ ముగించేస్తున్నాను’ అని తెలిపాడు.

హైదరాబాద్‌లో సముద్రం లేదని ఎవరు చెప్పారు..? తరలిరాదా తనే వసంతం తనదరికి రాని వనాల కోసం అంటూ రుద్రవీణ పాట పాడాడు మాటల రచయిత సాయి మాధవ్‌బుర్రా. చిరంజీవి పిలిస్తే.. వసంతాలు కాదు సముద్రాలే తరలివస్తాయన్నారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. మా అమ్మమ్మకు 80లో ఉన్న హీరోలు ఎవరూ తెలీదు. ఒక్క చిరంజీవి తప్పా.. ఆయన పాటను వింటూనే ఉంటుంది. నేను సినిమా ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు చిరంజీవికి మాటలు రాయమని మా అమ్మమ్మ అనేది. ఆకాశాన్ని అందుకోమని అంటే ఎలా అది కుదరని పని అంటూ చెప్పేవాడ్ని కానీ ఆయన సినిమాకు ఇప్పుడు మాటలు రాశాను. 

ఆయనకు ఒక్క మాట రాసినా చాలు అనుకునే వాడిని.. ఖైదీ నెం.150కు డైలాగ్స్‌రాయమని పిలిచారు. ఆయన డైలాగ్‌చెబితే.. ఆయన మాత్రమే చెప్పేలా ఉండాలి.. అందుకే ఓ డైలాగ్‌రాశానని.. పొగరు నా ఒంట్లో ఉంటది.. హీరోయిజం నా ఇంట్లో ఉంటది అనే మాటలు రాశాను. అది ఆయనకు తప్పా ఇంకెవరికి సెట్‌ కాదు. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ టెక్నీషియన్‌ను రామ్‌ చరణ్‌ బాగా చూసుకున్నాడు. అతనొక గొప్ప హీరో మాత్రమే కాదు.. గొప్ప ప్రొడ్యూసర్‌. ఈ సినిమాలో డైలాగ్స్‌ బాగున్నాయంటే.. నా ఒక్కడి కృషి కాదు.. అది అందరి సమష్టి కృషి. ఈ సినిమా ద్వారా సురేందర్‌ రెడ్డి ఓ మంచి స్నేహితుడయ్యాడు.

ఈ సినిమా తమకు పదేళ్ల కల అని.. కల ఎపపుడు చెదిరపోదని పరుచూరి వెంటేశ్వర్రావు అన్నారు. ఈ కథను చిరంజీవి కోసమే ఎంతోమంది పెద్దొళ్లు వదిలేశారని అనిపిస్తుంది. అందుకే పదేళ్ల తరువాత కూడా చిరు కోసమే ఈ సినిమా ముందుకు కదల్లేదు. ఆయన ఇప్పుడు కూడా ఆలానే కనిపిస్తున్నాడు. తన తండ్రి కోసం రామ్‌ చరణ్‌.. ఈ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించాడు. తండ్రిని ఎక్కడో కూర్చోబెట్టాలని ఈ చిత్రాన్ని తీశాడు. సినిమాలోని ఓ డైలాగ్‌ చెప్పి అభిమానులను అలరించారు. తన గురువైన గోసాయి వెంకన్న దగ్గరికి ఉయ్యాల వాడ నరసింహారెడ్డి వెళ్లి.. భార్యాబిడ్డల్నీ వదిలేసి యుద్దానికి వెళ్తున్నా ఆశీర్వందించండి అనే చెప్పే సందర్భంలో వచ్చే ఈ డైలాగ్‌ను స్టేజ్‌పై చెప్పాడు.

‘భార్య కోసం యుద్దం చేస్తే పురాణం అవుతుంది.. భూమి కోసం యుద్దం చేస్తే ఇతిహాసం అవుతుంది.. జాతి కోసం యుద్దం చేస్తే చరిత్ర అవుతుంది’ అంటూ అమితాబ్‌ చెప్పే అద్భుతమైన డైలాగ్‌ను ఆయన స్టేజ్‌పైనే చెప్పారు. తన తండ్రి అచ్చం నరసింహారెడ్డిలా కనిపించాలని దగ్గరుండి మరీ సుష్మిత  క్యాస్టూమ్స్‌ను డిజైన్‌ చేసిందని కొనియాడారు. ఎవరిని ఎంతగా వాడుకోవాలో.. ఎవరి చేత ఎంతగా నటింపజేయాలో సురేందర్‌ రెడ్డికి బాగా తెలుసంటూ.. ఈ సినిమా హిట్‌ కాబోతోన్నందుక ముందుగానే అతని కంగ్రాట్స్‌ చెప్పారు.

చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. ఈ చిత్రాన్ని రామ్‌ చరణ్‌ నిర్మించారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటించారు. ఆల్రెడీ విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఈ సినిమా ప్రీ–రిలీజ్‌ వేడుక ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో మొదలైంది. ఈ వేడుక కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. అభిమానుల మధ్య ‘సైరా’ ప్రీ–రిలీజ్‌ వేడుక కన్నుల పండవగా జరుగనుంది. రెండు రాష్ట్రాల్లోని మెగా అభిమానులు ఈ వేడుకకు భారీగా హాజరయ్యారు. ముందుగా చిరంజీవి నటించిన హిట్‌ చిత్రాలలోని పాటలను గాయనీ,గాయకులు ఆలపిస్తూ, అభిమానులను అలరిస్తున్నారు. కాగా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో అక్టోబరు 2న ‘సైరా’ చిత్రం విడుదల కానుంది.

సాయంత్రం 6 గంటల నుంచి సాక్షి టీవీలో ప్రత్యక్ష ప్రసారం

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top