సీఎంగా రేవంత్‌ ప్రమాణ స్వీకారం.. కేసీఆర్‌తోపాటు వీరికి ఆహ్వానం..

Congress Invitation To Celebrities For Revanth Aath Taking As CM - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మెజార్టీతో విజయం సాధించింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుపై హస్తం పార్టీ నేతలు ప్లాన్‌ చేస్తున్నారు. ఇక, తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి రేపు(గురువారం) ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 1:42 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

కాగా, రేవంత్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను కాంగ్రెస్‌ నేతలు, అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు, రేవంత్‌ ‍ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందించారు. రేవంత్‌ ఢిల్లీ పర్యటనలో ఉండగా.. ఇప్పటికే సోనియా, రాహుల్‌, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ను కలిసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ఇక, కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌ ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని ఏఐసీసీ నేతలకు, ఇతర రాష్ట్రాల నేతలకు ఆహ్వానం పంపారు.

వీరికి ఆహ్వానం పంపనున్నారు..

 • కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కర్ణాటక మంత్రులు.
 • రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్, ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేష్ బఘెల్, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహన్. 
 • తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆహ్వానం
 • మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా ఆహ్వానం పంపనున్నారు.
 • గతంలో ఇంఛార్టీలుగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, కుంతియా, వాయిలార్ రవి, మాణిక్కం ఠాగూర్, మరికొందరు ముఖ్యులు. 
 • తెలంగాణ ఏర్పాటు కీలక పాత్ర పోషించిన చిదంబరం, మీరాకుమారి, సుశీల్ కుమార్ షిండే, కురియన్, మరికొందరు నేతలు. 
 • తెలంగాణ ఉద్యమంలో అమరుల కుటుంబాలు 
 • కోదండరామ్, గాదె ఇన్నయ్య, హరగోపాల్, కంచ ఐలయ్య తోపాటు మరికొందరు ఉద్యమ కారులు.
 • రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపనున్నారు 
 • మాజీ సీఎం చంద్రబాబు, సినీ నటులకు ఆహ్వానం పంపనున్నారు.
 • హైకోర్టు చీఫ్ జస్టిస్‌తోపాటు వివిధ కులసంఘాల నేతలకు, మేధావులకు ఆహ్వానం పంపనున్నారు.
Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top