పోలింగ్‌ ఆపేస్తా.. బూత్‌లోకి దూసుకెళ్లిన జగ్గారెడ్డి | Tension In Sangareddy: Argument Between Police And Jagga Reddy | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ ఆపేస్తా.. బూత్‌లోకి దూసుకెళ్లిన జగ్గారెడ్డి

Feb 11 2026 2:54 PM | Updated on Feb 11 2026 5:06 PM

Tension In Sangareddy: Argument Between Police And Jagga Reddy

సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి మున్సిపాలిటీ 34వవార్డులో ఉ‍ద్రిక్తత చోటుచేసుకుంది. సీఐ కాంగ్రెస్‌ అభ్యర్థి చొక్కాను పట్టుకున్నారన్న సమాచారంతో పోలింగ్‌ బూత్‌కు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. పోలింగ్‌ ఆపేస్తానంటూ బూత్‌లోకి దూసుకెళ్లారు. పోలీసులపై జగ్గారెడ్డి బూతు పురాణం అందుకున్నారు. తన కాలర్‌ పట్టుకున్నారంటూ సీఐపై కాంగ్రెస్‌ అభ్యర్థి ఆరోపిస్తున్నారు. పోలీసులు, జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఘటనా స్థలానికి కాంగ్రెస్‌ నాయకులు భారీగా చేరుకుంటున్నారు.

సీఐ శివకుమార్ ఇక్కడకు రావాలని పోలీసులతో జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంగారెడ్డిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయడానికే  సీఐ వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి రిగ్గింగ్‌కు పూర్తిగా సపోర్ట్ చేశాడని మండిపడ్డారు. వార్డులో ఎన్నికలు రద్దు చేయాలంటూ  జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు.

అరేయ్ ఎవడ్రా అంటూ పోలీసులపైకి దూసుకెళ్లిన జగ్గారెడ్డి

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పలు మున్సిపాలిటీల్లో ఉద్రికత్త చోటుచేసుకున్నాయి. పలుచోట్ల బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, ఎంఐఎం కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. భౌతిక దాడులకు కూడా దిగారు. మహబూబాబాద్ 14వ వార్డులో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. కాంగ్రెస్‌ అభ్యర్థిపై బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేయి చేసుకున్నారు. భూపాలపల్లి మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ కేంద్రం వద్ద టెన్షన్‌ వాతావరణం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ శ్రేణులు డబ్బుల పంపిణీ  చేస్తున్నారంటూ..  స్థానికుల సమాచారంతో పోలింగ్‌ కేంద్రం వద్దకు పోలీసులు చేసుకున్నారు.  దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి అనుచరులు డబ్బులు వదిలేసి పరారీ అయ్యారు. లక్షకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement