
తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ)తో పాటు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, టీఎస్‌పీఎస్సీల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 5192 మంది అభ్యర్థులకు సోమవారం ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది

విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ఆ శాఖకు చేస్తున్న ఖర్చు భవిష్యత్ తరానికి పెట్టుబడిగా భావిస్తున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు

యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఎల్బీ స్టేడియం వేదికగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు




























