తెలంగాణ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో 12న ఇఫ్తార్ విందు | Hyderabad: Government Organises Iftar Party At Lb Stadium On April 12 | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో 12న ఇఫ్తార్ విందు

Apr 8 2023 7:13 PM | Updated on Apr 8 2023 7:26 PM

Hyderabad: Government Organises Iftar Party At Lb Stadium On April 12 - Sakshi

సాక్షి,హైద‌రాబాద్:  రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 12న ఇఫ్తార్ విందు నిర్వహించాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి తన కార్యదర్శి భూపాల్‌రెడ్డిని ఆదేశించారు. ఇఫ్తార్‌ విందుకు కోసం ఎల్‌బీ స్టేడియంలో అధి​కారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇఫ్తార్‌ విందులో సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన‌నున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రంజాన్‌ పండుగ నేపథ్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement