ప్రధాని రాక నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు | Traffic restrictions in the wake of the arrival of the Prime Minister | Sakshi
Sakshi News home page

ప్రధాని రాక నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Aug 5 2016 10:32 PM | Updated on Aug 15 2018 6:34 PM

ఎల్బీ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు.

► రేపు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వరకు

సాక్షి, సిటీబ్యూరో: ఎల్బీ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం జరుగనున్న భారతీయ జనతా పార్టీ వర్కర్స్‌ సమ్మేళన్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ రోజు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ కొత్వాల్‌ మహేందర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
►    ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ నుంచి బీజేఆర్‌ స్టాట్యూ వైపు వచ్చే ట్రాఫిక్‌ను నాంపల్లి, రవీంద్రభారతి వైపు పంపిస్తారు.
►    అబిడ్స్, గన్‌ఫౌండ్రీ వైపు నుంచి బీజేఆర్‌ స్టాట్యూ, బషీర్‌బాగ్‌ జంక్షన్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను చాపెల్‌ రోడ్‌ వైపు మళ్ళిస్తారు.
►   బషీర్‌బాగ్‌ జంక్షన్‌ నుంచి జీపీఓ, అబిడ్స్‌ వైపు వెళ్ళే ట్రాఫిక్‌ను హైదర్‌గూడ, కింగ్‌కోఠి మీదుగా పంపిస్తారు.
►   ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్‌ ‘వై’ జంక్షన్‌ మీదుగా మళ్ళిస్తారు.
►  కింగ్‌ కోఠి భారతీయ విద్యాభవన్‌ మీదుగా నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను తాజ్‌మహల్‌ హోటల్‌ మీదుగా పంపిస్తారు.
►  లిబర్టీ నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్‌ వైపు, ట్రాఫిక్‌ కంట్రోల్‌ నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు మళ్ళిస్తారు.
►  కార్యక్రమానికి వచ్చే ఆహుతులు, పాస్‌లు ఉన్న వారికి ఈ మళ్ళింపులు వర్తించవు. వీరికి ప్రత్యేక పార్కింగ్‌ ప్రాంతాలు, గేట్లు కేటాయించారు.
► ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 వరకు ఎస్పీ రోడ్, గ్రీన్‌ల్యాండ్స్, క్యాంప్‌ ఆఫీస్, రాజ్‌భవన్‌ రోడ్, ఖైరతాబాద్‌ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వాహనచోదకులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement