అధికార టీఆర్‌ఎస్ ప్లీనరీని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకత్వం పని మొదలు పెట్టింది.
హైదరాబాద్ సిటీ : అధికార టీఆర్‌ఎస్ ప్లీనరీని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకత్వం పని మొదలు పెట్టింది. ఈనెల 24న ఎల్‌బీ స్టేడియంలో జరగనున్న ప్లీనరీ కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ మేరకు వేదిక, సభా ప్రాంగణం ఏర్పాట్ల కమిటీ చైర్మన్, మంత్రి పద్మారావు గౌడ్ శుక్రవారం ఎల్‌బీ స్టేడియాన్ని సందర్శించారు. జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.
పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్లీనరీకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి కలిపి 36వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి చెప్పారు.