పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఏకు ఎగ్జిట్ పోల్స్ పట్టం కట్లాయి. ఈ నేపధ్యంలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ డీజేడీయూలో అపరిమితమైన ఉత్సాహం తొణికిసలాడుతోంది. నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఇంతలో ఫలితాలకు ముందే సీఎం నితీష్ ఇంటి బయట ‘టైగర్ అభీ జిందా హై’ అంటూ రాసిన ఒక పోస్టర్ వెలిసింది. నితీష్ కుమార్ పార్టీ గణనీయమైన సీట్లను గెలుచుకుంటుందని అందరూ భావిస్తున్నారు. ఇది నితీష్ తన ముఖ్యమంత్రి తన పదవిని నిలబెట్టుకునేందుకు అవకాశాలను మరింత పెంచుతుందని అంటున్నారు.
#WATCH | Poster featuring CM Nitish Kumar that reads "Tiger abhi zinda hain" put up outside JDU office in Patna, Bihar #BiharElection2025 pic.twitter.com/zZIggXeyJ5
— ANI (@ANI) November 13, 2025
పట్నాలో సీఎం ఇంటి ముంగిట వెలసినీ పోస్టర్‌కు సంబంధించిన వీడియోను బీహార్ మాజీ మంత్రి రంజిత్ సిన్హా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్‌పై ‘టైగర్ అభీ జిందా హై’ (పులి ఇంకా బతికే ఉంది) అని రాసివుంది. అలాగే దానిలో నితీష్ కుమార్‌ను.. ‘దళితులు, మహా దళితులు, వెనుకబడినవారు, అత్యంత వెనుకబడినవారు, అగ్రవర్ణాలు, మైనారిటీల రక్షకుడు’ అని రాశారు. ఈ సందేశం ద్వారా ముఖ్యమంత్రి నితీష్‌ను సమాజంలోని అన్ని వర్గాల కోసం పనిచేసే సంఘటిత వ్యక్తిగా చూపించడానికి ప్రయత్నించారు.
నవంబర్ 14న బీహార్ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. తదుపరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనేది ఈ ఫలితాలు నిర్ణయించనున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని సన్నాహాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్స్ (వీవీపాట్‌లు)కు రెండంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల చుట్టూ భద్రతను పటిష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Bihar Election: రోహ్తాస్‌లో ఈవీఎంల మార్పిడి?.. స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉద్రిక్తత


