పూర్నియా: బిహార్ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేది మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమేనని కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా స్పష్టం చేశారు. ఈ రోజు(శనివారం, నవంబర్ 8వ తేదీ) బిహార్‌లో పూర్నియా నగరంలో ఎన్డేటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ.. బిహార్‌లో తిరిగి అధికారం చేపట్టబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. బిహార్‌లో ఉన్న 243 సీట్లకు గాను 160 సీట్లను కచ్చితంగా గెలుస్తామన్నారు అమిత్ షా.
ఇక్కడ చొరబాటు అనేది చాలా సీరియస్ అంశం. సీమాంచల్ ప్రాంతంలో అనేక సమస్యలున్నాయి. అందులో చొరబాటు అనేది అతి ప్రధానమైనది. ఇది బిహార్ రాష్ట్రంలో అత్యంత ప్రభావం చూపుతుంది. లా అండ్ ఆర్డర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. మేము ఇక్కడ కచ్చితంగా ఒకటి నిర్ణయించుకున్నాం.
వచ్చే ఐదేళ్లలో చొరబాటు దారుల్ని నియంత్రించడంపైనే మా దృష్టి ఉంది. ఇక్కడ అక్రమ వ్యాపారాలు చేసే వారికి చోటు లేదు. ప్రతీ ఒక్క అక్రమ వలస దారుడ్ని ఒకరి తరువాత ఒకర్ని వెనక్కి పంపేస్తాం’ అని అమిత్ షా పేర్కొన్నారు.


