బిహార్‌ సీఎంగా నితీష్‌.. మంత్రులుగా 26 మంది ప్రమాణం | Bihar chief Minister Nitish Kumar Swearing in ceremony | Sakshi
Sakshi News home page

బిహార్‌ సీఎంగా నితీష్‌.. మంత్రులుగా 26 మంది ప్రమాణం

Nov 20 2025 11:45 AM | Updated on Nov 20 2025 1:36 PM

Bihar chief Minister Nitish Kumar Swearing in ceremony

పట్నా: జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడు నితీష్ కుమార్ గురువారం పట్నాలోని గాంధీ మైదానంలో రికార్డు స్థాయిలో 10వ సారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)కి చెందిన పలువురు సీనియర్ నేతలు, ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
 

సీఎం నితీష్‌ కుమార్‌తో పాటు జేడీయూ ఎమ్మెల్యేలు విజయ్ కుమార్ చౌదరి, అశోక్ చౌదరి, శ్రావణ్ కుమార్, లేషి సింగ్, మొహ్మద్‌ జమాఖాన్‌, బీజేపీ ఎమ్మెల్యేలు సంజయ్‌ సింగ్‌, రామనిషాద్‌, నితిన్‌ నబీన్‌, అరుణ్‌ శంకర్‌ ప్రసాద్‌, సురేంద్ర మెహతా, లఖేంద్ర కుమార్ రోషన్, నారాయణ ప్రసాద్‌, శ్రేయసి సింగ్ తదితరులు మంత్రులుగా ప్రమాణం చేశారు. దీనికిముందు నితీష్‌ ఎన్‌డీఏ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ నుంచి అనుమతి తీసుకున్నారు.

ప్రమాణ స్వీకారం చేసిన బిహార్‌ కేబినెట్ మంత్రులు

సామ్రాట్ చౌదరి (బీజేపీ)
విజయ్ కుమార్ సిన్హా (బీజేపీ)
దిలీప్ జైస్వాల్ (బీజేపీ)
మంగళ్ పాండే (బీజేపీ)
విజయ్ కుమార్ చౌదరి (జేడీయూ)
బిజేంద్ర ప్రసాద్ యాదవ్ (జేడీయూ)
శ్రావణ్ కుమార్ (జేడీయూ)
అశోక్ చౌదరి (జేడీయూ)
లేషి సింగ్ (జేడీయూ)
మదన్ సాహ్ని (జేడీయూ)
సునీల్ కుమార్ (జేడీయూ)
రామ్ కృపాల్ యాదవ్ (బీజేపీ)
సంతోష్ సుమన్ (బీజేపీ)
నితిన్ నబిన్ (బీజేపీ)
మహ్మద్ జమా ఖాన్ (జేడీయూ)
సంజయ్ సింగ్ టైగర్ (బీజేపీ)
అరుణ్ శంకర్ ప్రసాద్ (బీజేపీ)
సురేంద్ర మెహతా (బీజేపీ)
నారాయణ ప్రసాద్ (బీజేపీ)
రామ నిషాద్ (బీజేపీ)
లఖేంద్ర కుమార్ రోషన్ (బీజేపీ)
ప్రమోద్ కుమార్ (బీజేపీ)
సంజయ్ కుమార్ (బీజేపీ)
సంజయ్ కుమార్ సింగ్ (బీజేపీ)
దీపక్ ప్రకాష్ (బీజేపీ)
ఈ జాబితాలో బీజేపీకి చెందిన వారు 14 మంది , జేడీయూ నుంచి ఎనిమిది, చిరాగ్ పార్టీ నుంచి ఇద్దరు, ముస్లిం ఒకరు మొత్తం 26 మంది మంత్రులు ఉన్నారు. 



 


 కొత్త మంత్రివర్గ ఏర్పాటులో భాగంగా బీజేపీ, జేడీయూలు అత్యధిక మంత్రి పదవులను పొందాయి. నవంబర్ 26 నుండి మూడు రోజుల పాటు నూతన ప్రభుత్వ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనిలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికవుతారు.  కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. బీజేపీకి చెందిన  ప్రేమ్ కుమార్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. వచ్చే ఏడాది జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత కొత్త మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement