హైపర్‌సోనిక్ క్షిపణుల తయారీలో ముందడుగు
న్యూఢిల్లీ: అత్యాధునిక హైపర్‌సోనిక్ క్షిపణుల తయారీలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) కీలక ముందడుగు వేసింది. ఇందుకు సంబంధించిన స్క్రామ్‌జెట్ ఇంజిన్ తాలూకు దీర్ఘకాలిక క్షేత్రస్థాయి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. సంస్థకు చెందిన హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్, డెవలప్‌మెంట్ లే»ొరేటరీ ఈ ఘనతను సాధించినట్టు రక్షణ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అత్యాధునిక స్క్రామ్ జెట్ కనెక్ట్ పైప్‌లైన్ టెస్ట్ (ఎస్‌సీపీటీ) కేంద్రంలో గురువారం జరిగిన పరీక్ష సందర్భంగా ఇంజిన్ 12 నిమిషాల రన్ టైమ్‌ను సాధించినట్టు వెల్లడించింది. హైపర్‌సోనిక్ క్షిపణులు ధ్వని వేగానికి ఏకంగా ఐదురెట్ల వేగంతో దూసుకెళ్తాయన్నది తెలిసిందే.


