breaking news
Scramjet engine
-
స్క్రామ్ ఇంజన్ పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: అత్యాధునిక హైపర్సోనిక్ క్షిపణుల తయారీలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) కీలక ముందడుగు వేసింది. ఇందుకు సంబంధించిన స్క్రామ్‌జెట్ ఇంజిన్ తాలూకు దీర్ఘకాలిక క్షేత్రస్థాయి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. సంస్థకు చెందిన హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్, డెవలప్మెంట్ లే»ొరేటరీ ఈ ఘనతను సాధించినట్టు రక్షణ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అత్యాధునిక స్క్రామ్ జెట్ కనెక్ట్ పైప్‌లైన్ టెస్ట్ (ఎస్‌సీపీటీ) కేంద్రంలో గురువారం జరిగిన పరీక్ష సందర్భంగా ఇంజిన్ 12 నిమిషాల రన్ టైమ్‌ను సాధించినట్టు వెల్లడించింది. హైపర్సోనిక్ క్షిపణులు ధ్వని వేగానికి ఏకంగా ఐదురెట్ల వేగంతో దూసుకెళ్తాయన్నది తెలిసిందే. -
ఇస్రో 'ఏటీవీ' రాకెట్ విజయవంతం
నెల్లూరు: ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఏటీవీ రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెహికిల్ (ఏటీవీ) ప్రయోగాన్ని షార్ శాస్త్రవేత్తలు 60 సెకన్లలోపే పూర్తిచేయగా, ఏటీవీ తొలి 5 సెకెన్లలోపే 70 కిలోమీటర్ల లక్ష్యాన్ని పూర్తిచేసింది. ఆ తర్వాత కూస్టింగ్ దశలో సెకనుకు రెండు కిలోమీటర్ల వేగంతో నింగిలోకు దూసుకుపోయింది. ఈ ప్రయోగాన్ని ఇస్త్రో చేర్మన్ కిరణ్‌కుమార్, షార్ డైరెక్టర్ శివన్ ఉన్నికృష్ణన్ తదితర శాస్త్రవేత్తలు వీక్షించారు. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఏటీవీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. దాంతో ఏటీవీ రాకెట్ ప్రయోగం విజయవంతమైనట్టు ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు.నింగిలోకి ప్రవేశపెట్టానికి రాకెట్లో స్క్రాంజెట్ మోటార్‌ను అమర్చి ప్రయోగించారు. ఈ ప్రయోగంలో ఆక్సిజన్‌కు బదులుగా గాలి ఇంధనంగా ప్రయోగించినట్టు ఇస్రో పేర్కొంది. ఏటీవీ ప్రయోగంతో భవిష్యత్తులో ప్రయోగాల వ్యయం తగ్గనుంది. అలాగే భవిష్యుత్తులో బరువైన రాకెట్లను నింగిలోకి ప్రయోగించే అవకాశం ఉంది.


