బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వీటిలో ఎన్డీఏ కూటమినే అధికారం చేపట్టబోతున్నట్లు మెజార్టీ సర్వేలు వెల్లడించాయి. పీపుల్స్ సర్వే, టైమ్స్ నౌ, ఆపరేషన్ చాణక్యలు ఎన్డీఏకే పట్టం కట్టాయి. 243 అసెంబ్లీ స్థానాలకు గాను జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమినే విజయం వరించినున్నట్లు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. మంగళవారం(నవంబర్ 11వ తేదీ) జరిగిన బిహార్ మలి విడత పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేశాయి పలు సంస్థలు.
పీపుల్స్ పల్స్
బిహార్‌లో ఎన్‌డీఏకే మొగ్గు..
బిహార్ లో బీజేపీ, జేడీయూ(యూ) నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి భారీ మెజారిటీతో అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నట్టు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడయింది.
ఎన్డీయే కూటమి దాదాపు 8.3 శాతం ఓట్ల ఆధిక్యంతో మహాఘట్ బంధన్ మీద పైచేయి సాధించినట్లు పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడయ్యింది.
నితీష్ కుమార్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళా రోజ్‌గార్ యోజన పథకం కింద కోటి 25 లక్షల మంది మహిళలకు రూ.10 వేల నగదు పంపిణీ చేయడం ఎన్డీఏ భారీ మెజారిటీ సాధించడానికి దోహదపడింది.
ఎన్డీయే కూటమికి 46.2 శాతం ఓట్లు, మహాఘట్ బంధన్ కు 37.9 శాతం, నూతనంగా స్థాపించిన జన్ సురాజ్ పార్టీకి 9.7 శాతం, ఇతరులకు 6.2 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది
ఈ సర్వే ఫలితాల్లో మూడు శాతం ‘ప్లస్ ఆర్ మైనస్’ ఉండే అవకాశాలు ఉంటాయి
243 స్థానాలు ఉన్న బిహార్ శాసనసభలో అధికారం చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 122 కాగా, ఎన్డీయే కూటమికి 133-159 స్థానాలు, మహాఘట్ బంధన్ కూటమికి 75-101 స్థానాలు, ఇతరులకు 2 నుంచి 8 స్థానాలు, నూతనంగా ప్రారంభించిన జన్ సురాజ్ పార్టీకి 0-5 స్థానాలు వచ్చే అవకాశం ఉంది
టైమ్స్ నౌ
ఎన్డీయే 135-150 సీట్లు
మహాఘట్ బంధన్ 83-105 సీట్లు
జన్ సురాజ్ పార్టీ (ప్రశాంత్ కిషోర్ పార్టీ)-1 సిటు
ఇతరులు 3-6 సీట్లు
దైనిక్ భాస్కర్
ఎన్డీయే 145-160 సీట్లు
మహాఘట్ బంధన్ 79-91 సీట్లు
జన్ సురాజ్ పార్టీ (ప్రశాంత్ కిషోర్ పార్టీ)-0 సిటు
ఇతరులు 5-10 సీట్లు
ఎస్‌ఏఎస్ గ్రూప్
ఎన్డీయే 126-130 సీట్లు
మహాఘట్ బంధన్ 106-110 సీట్లు
జన్ సురాజ్ పార్టీ (ప్రశాంత్ కిషోర్ పార్టీ)-7-10 సిట్లు
ఇతరులు 4-6 సీట్లు
మాట్రిజ్ సర్వే
- ఎన్డీఏ 147 -167
- ఎంజీబీ 70- 90
సిఎన్ఎన్ న్యూస్ 18
ఫస్ట్ పేజ్ (121)
- ఎన్డీఏ 60 -70
- ఇండియా కూటమి : 45-55
ఆత్మసాక్షి: ఎన్‌డీఏ 126-130, మహాఘట్‌బంధన్ 106-110,జేఎస్‌పీ 7-10
ఆపరేషన్ చాణక్య: ఎన్‌డీఏ 140-147, మహాఘట్‌బంధన్ 86-92,జేఎస్‌పీ 2-4


