పాట్నా: బిహార్‌లో ఎన్నికల ప్రచారం ముగిసింది. రెండో విడుతలో ఎల్లుండి 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇవాళ చివరిరోజు అగ్రనేతలు రంగంలోకి దిగారు. కూటమి తరుఫున సభలు,రోడ్‌షోలు, సమావేశాల్లో ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. బిహార్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆర్జేడీ వామపక్షాలతో కూడిన మహాగట్ బంధన్(మహా కూటమి)తరుఫున రాహుల్‌గాంధీ ఎన్నికలు ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ కిషన్‌గంజ్, అమోర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో చుట్టేశారు. 1302 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.


