లక్నోలో వాజ్‌పేయీ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్‌దయాళ్ విగ్రహాల ఆవిష్కరణ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ గురువారం ఉత్తర ప్రదేశ్‌లో కీలకమైన జాతీయ స్మారకాన్ని ప్రారంభించనున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ, బీజేపీ సిద్ధాంతకర్తలు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయల భారీ కాంస్య విగ్రహాలను ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. నేడు(డిసెంబర్ 25) వాజ్‌పేయీ 101వ జయంతిని పురస్కరించుకుని లక్నోలో ఈ నేషనల్ మొమోరియల్, కాంప్లెక్స్‌ను ఆరంభిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం మోదీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో హిందీలో ఒక పోస్ట్ పెట్టారు.
‘‘ భారత రత్న, దివంగత వాజ్‌పేయీ జయంతి రోజున లక్నోలో రాష్రీ్టయ ప్రేరణ స్థల్ స్మారకం నా చేతుల మీదుగా ప్రారంభంకావడం నా అదృష్టం. వాజ్‌పేయీ, ఎస్పీ ముఖర్జీ, పండిత్ దీన్‌దయాళ్ విగ్రహాలు, ఈ ముగ్గురు దిగ్గజాలు దేశానికి చేసిన సేవను తెలిపే వివరాలతో అధునాతన మ్యూజియం సైతం ఇదే ప్రాంగణంలో అందుబాటులోకి రానుంది’’ అని మోదీ చెప్పారు. ప్రారం¿ోత్సవంలో భాగంగా మోదీ ఆ తర్వాత భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. 65 ఎకరాల విస్తీర్ణంలో రూ.230 కోట్ల వ్యయంతో ఈ మెమోరియల్, కాంప్లెక్స్‌ను నిర్మించారు. ముగ్గురు నేతల 65 అడుగుల ఎత్తయిన విగ్రహాలను ప్రతిష్టించారు. 98,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో తామర పువ్వు ఆకృతిలో మ్యూజియం కట్టారు.


