పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ పోలింగ్ నేడు(మంగళవారం) జరుగుతోంది. ఇంతలో వికాశ్ శీల్ ఇన్సాన్ పార్టీ(వీహెచ్‌పీ).. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ)కి షాకిచ్చింది. బీహార్‌లోని ప్రతిపక్ష కూటమిలో వీఐపీ రెండవ దశ అసెంబ్లీ పోలింగ్‌కు ముందు కైమూర్ జిల్లాలోని నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్న ఆర్జేడీ అభ్యర్థులకు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.
ఆదివారం భబువాలో ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ ఎన్నికల ర్యాలీ నిర్వహించాక, చైన్పూర్ వీఐపీ అభ్యర్థికి మద్దతు పలికేందుకు ఆయన నిరాకరించిన దరిమిలా రాష్ట్ర జిల్లా వీహెచ్ చీఫ్ బాల్ గోవింద్ బింద్ ఈ ప్రకటన చేశారు. చైన్పూర్ (కైమూర్, గౌరా బౌరం (దర్భంగా) స్థానాల్లో ఆర్జేడీ, వీఐపీలు స్నేహపూర్వకంగా ఎన్నికల బరిలోకి దిగాయి. నవంబర్ 4న వీఐపీ చీఫ్ గౌరా బౌరం నుండి తన సోదరుడు సంతోష్ సాహ్ని అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుని, అఫ్జల్ అలీ ఖాన్ (ఆర్జేడీ)కి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ముఖేష్ సాహ్ని.. తేజస్వీ యాదవ్ ఒక అవగాహనకు వచ్చారు.
కాగా చైన్పూర్ బీజేపీ అభ్యర్థి బ్రిజ్ కిషోర్ బింద్‌ను బాల్ గోవింద్ బింద్‌కు అనుకూలంగా ఉపసంహరించుకునేందుకు ఆర్జేడీ అంగీకరించిందని వీఐపీ నేతలు పేర్కొన్నారు. శుక్రవారం చైన్పూర్‌లో తమ అభ్యర్థికి మద్దతుగా జరిగిన ఎన్నికల ర్యాలీలో ముఖేష్ సాహ్ని దీనిని ధృవీకరించారు. దీంతో తేజస్వీ యాదవ్.. ఆర్జేడీ అభ్యర్థికి ఫోన్ చేసి, అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే ఆయన అందుకు నిరాకరించారు.
దీంతో తేజస్వీ యాదవ్ వీఐపీ చైన్పూర్ అభ్యర్థిని బ్లాక్ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే వీఐపీ అభ్యర్థి చైన్పూర్‌లో తేజస్వీ యాదవ్ కోసం ఒక వేదికను ఏర్పాటు చేశారు. అయితే తేజస్వీ యాదవ్ భబువాలో ర్యాలీ నిర్వహించి, ఆర్జేడీ అభ్యర్థికి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో కైమూర్‌లో ఆర్జేడీ అభ్యర్థికి వీఐపీ మద్దతును ఉపసంహరించుకుంది. సోమవారం బాల్ గోవింద్ బింద్ మాట్లాడుతూ, కైమూర్‌లోని నాలుగు స్థానాలకు ఆర్జేడీతో పొత్తు ముగిసిందని ప్రకటించారు. దీనిపై ఆర్జేడీ స్పందించలేదు.
ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు: ఈ కష్టం పగవాడికి కూడా.. కండక్టర్ విషాదాంతం


