న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడులో ప్రాణాలు కోల్పోయిన తొమ్మిది మందిలో అశోక్ కుమార్ ఒకరు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాకు చెందిన అశోక్ తన రెక్కల కష్టంతో ఎనిమిది మంది కుటుంబ సభ్యులను పోషిస్తున్నాడు. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో కండక్టర్‌గా అశోక్ పనిచేస్తున్నాడు. పాత ఢిల్లీ మార్గంలో విధులు నిర్వహిస్తుంటాడు.
ఢిల్లీ పేలుడు బాధితుల జాబితాలో తన బంధువు అశోక్ పేరును చూడగానే పప్పు షాక్ అయ్యాడు. ఎల్‌ఎన్‌జేజీ ఆస్పత్రి వెలుపల మీడియాతో ఆయన మాట్లాడుతూ, ‘నేను జాబితాలో అశోక్ పేరు చూశాను. అతను నాకు బంధువు. దీనిని ధృవీకరించడానికి నేను ఫోన్ చేశాను. అశోక్ బైక్ ఏమయ్యిందో తెలియడం లేదు’ అని అన్నారు. పేలుడు సమయంలో అశోక్ విధుల్లో ఉన్నారా? అని అడగగా, అతను ఈ రూట్‌లోనే విధులు నిర్వహిస్తుంటాడని, డ్యూటీ లేనప్పుడు కూడా ఇదే మార్గంలో వెళుతుంటాడని’ తెలిపారు.
అశోక్‌కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి 15 కి.మీ దూరంలో ఉన్న జగత్‌పూర్‌లో కుటుంబంతో పాటు ఉంటున్నాడు. అతని తల్లి సోమవతి పెద్ద కుమారుడు సుభాష్‌తో కలిసి గ్రామంలో ఉంటోంది. సుభాష్ తరచుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో.. అశోక్ వారి కుటుంబ బాధ్యతలు కూడా మోసేవాడు. పగటిపూట కండక్టర్‌గా, రాత్రి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ అశోక్ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు.
ఇది కూడా చదవండి: Delhi 10/11 Blast: యూపీ నుంచి వస్తువుల కొనుగోలుకు వచ్చి..


