breaking news
Delhi Blasts Case
-
ప్రేమతో మొదలై.. ఉగ్రవాదంలో తేలింది..!
న్యూఢిల్లీ: డాక్టర్ షాహీన్ సయీద్.. ఢిల్లీ పేలుడు కేసులో నిందితురాలు.. ఉగ్రవాదులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈమె తన జీవితంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నారు. ప్రేమ విఫలమయ్యింది. పెళ్లి పెటాకులయ్యింది. ప్రజల మధ్య మంచి వైద్యురాలిగా పేరు తెచ్చుకున్నా, ఆమె సేవలు ఉగ్రవాదులకు అందుతున్నాయని తేలడంతో ఆమెను ఎరిగినవారంతా కంగుతిన్నారు.లక్నోకు చెందిన డాక్టర్ షాహీన్ సయీద్ (46) తన కెరీర్లో ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో ఆనందం కరువైంది. ఎంబీబీఎస్ పూర్తి చేసి, ఫార్మకాలజీలో నైపుణ్యం సాధించిన సయీద్ 2003లో కంటి వైద్యుడు డాక్టర్ జాఫర్ హయత్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. వృత్తిపరమైన ఒత్తిళ్లు, విదేశాల్లో మెరుగైన జీవితం కోసం ఆమె పట్టుబట్టడం తదితర కారణాలతో 2012 చివర్లో ఆ దంపతులు పదేళ్ల వైవాహిక బంధానికి తెరపడింది. విడాకులతో కుంగిపోయిన సయీద్ అనంతరం ఘజియాబాద్‌కు చెందిన వస్త్ర వ్యాపారిని రెండోసారి వివాహం చేసుకున్నారు. అయితే ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు.సయీద్ జీవితంలోకి కశ్మీరీ వైద్యుడు, ఆమె జూనియర్ డాక్టర్ ముజమ్మిల్ షకీల్ ప్రవేశించడంతో ఆమె కథ మరో మలుపు తిరిగింది. హర్యానాలోని అల్‌ఫలా విశ్వవిద్యాలయంలో ఇద్దరూ కలిసి పనిచేయడం, రోజువారీ మీటుంగులతో వారి మధ్య ప్రేమ చిగురించింది. 2023 సెప్టెంబర్‌లో వీరిద్దరూ మసీదులో సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. అయితే ఈ కొత్త బంధం.. సయీద్‌కు ఇంతకు ముందు ఎప్పుడూ లేని ప్రపంచానికి పరిచయం చేసింది. ముజమ్మిల్‌తో కలిసి జీవితం సాగుతున్న తరుణంలో ఆమె మతపరమైన కార్యకలాపాలు, విద్యార్థి సమావేశాలలో విరివిగా పాల్గొనడం ప్రారంభించారు. ఈ సమయంలోనే జైష్ ఎ మొహమ్మద్ (జేఈఎం) మహిళా విభాగమైన జమాత్ ఉల్ మోమినాత్ సభ్యులు ఆమెను సంప్రదించారు.డాక్టర్ షాహీన్ సయీద్ మేధస్సు, సామాజిక గుర్తింపును వాడుకొని ఆ ఉగ్రవాద సంస్థలు ఆమెకు తీవ్రవాద భావజాలంలో శిక్షణ ఇచ్చాయి. దీంతో ఆమె వైద్యురాలిగా తనకున్న గుర్తింపును ఒక కవచంగా ఉపయోగించుకున్నారు. జమ్ముకశ్మీర్, ఢిల్లీ-ఎన్సీఆర్, హర్యానా మధ్య ప్రయాణాలు సాగిస్తూ ‘సందేశాలు’ అందించడం, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు బదిలీ చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. పాకిస్తాన్‌లోని జేఈఎం వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరి నేతృత్వంలోని జమాత్ ఉల్ మోమినాత్ భారత శాఖకు డాక్టర్ షాహీన్ బాధ్యతలు చేపట్టినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇదేవిధంగా ఐదుగురు ఉగ్రవాద వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను కూడా ఆమెకు అప్పగించినట్లు సమాచారం.డాక్టర్ షాహీన్ సాగించిన ఈ ఉగ్రవాద ప్రయాణం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన 10/11 పేలుడు ఘటనతో వెలుగులోకి వచ్చింది. ఈ కేసు దర్యాప్తులో డాక్టర్ సయీద్, ఆమె భర్త ముజమ్మిల్ షకీల్, మరో సహచరుడు అదీల్ అహ్మద్ రాథర్ అరెస్టయ్యారు. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ఆత్మాహుతి బాంబర్ ఉమర్ మొహమ్మద్ కూడా అల్‌ఫలా విశ్వవిద్యాలయంతో అనుబంధం కలిగిన కశ్మీరీ వైద్యుడే. కాగా డాక్టర్ షాహీన్ సయీద్ కుటుంబ సభ్యులు (తండ్రి, సోదరుడు) ఆమెపై వచ్చిన ఆరోపణలను నమ్మలేకున్నామని అంటున్నారు.ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు కేసు: విదేశీ డిగ్రీ వైద్యులపై నిఘా! -
ఢిల్లీ పేలుడు కేసు: విదేశీ డిగ్రీ వైద్యులపై నిఘా!
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన పేలుడుపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు విదేశీ డిగ్రీ కలిగిన వైద్యులపై నిఘా సారించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), చైనా నుంచి ఎంబీబీఎస్ డిగ్రీలు పొంది, ఢిల్లీలో ప్రాక్టీస్ చేస్తున్న వైద్యుల వివరాలను అందించాలంటూ ఢిల్లీ పోలీసులు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు.ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి జారీ చేసిన నోటీసులో ‘ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు దర్యాప్తును దృష్టిలో ఉంచుకుని, పాకిస్తాన్, బంగ్లాదేశ్, యూఎఈ, చైనా నుండి డిగ్రీ పొందిన వైద్యులు మీ ఆసుపత్రిలో ఉంటే, వారి వివరాలను అందించండి. దీనిని అత్యవసరమైనదిగా పరిగణించండి’ అని ఆ నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అల్ ఫలా విశ్వవిద్యాలయంలో తమ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఢిల్లీ పేలుడుకు సంబంధించి విశ్వవిద్యాలయంలోని 30 మంది వైద్యుల వాంగ్మూలాలను నమోదు చేశారు. ఈ వైద్యులను.. ఉమర్ ప్రవర్తన గురించి ప్రశ్నించారు. తోటి వైద్యులు ఉమర్ ప్రవర్తన దురుసుగా ఉండేదని, కొంతమందిని మాత్రమే తన గదిలోకి అనుమతించేవాడని వెల్లడించారు.ఉమర్ ఉపయోగించిన ఫోన్లలో ఒకటి జమ్ముకశ్మీర్ పోలీసుల దగ్గరుంది. దర్యాప్తు సంస్థ ఈ ఫోన్లో నాలుగు వీడియోలను కనుగొంది. వాటిలో ఒకటి ఇప్పటికే బహిరంగపరిచారు. అందులో ఉమర్.. జిహాద్‌తో పాటు మానవ బాంబులను సమర్థించాడు. మిగిలిన మూడు వీడియోలు కూడా ఉమర్ చిత్రీకరించనవే. ఒక్కొక్కటి మూడు నుండి ఐదు నిమిషాల వ్యవధితో ఉన్నాయి. ఉమర్ ఫోన్ సాయంతో దర్యాప్తు సంస్థ అతని సహచరులను, నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకూ జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధం ఉన్న డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనాయ్, డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ వాగే (జమ్ముకశ్మీర్), డాక్టర్ షాహీన్ సయీద్ (ఉత్తరప్రదేశ్)లను అరెస్టు చేశారు.ఇది కూడా చదవండి: శ్రీలంకకు ‘ఆపరేషన్ సాగర్ బంధు’ -
ఢిల్లీ పేలుడు: ఎన్ఐఏ చేతికి కీలక ఆధారం
న్యూఢిల్లీ: ఢిల్లీ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి మరో కీలక ఆధారం లభ్యమయ్యింది. నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట వెలుపల కారు బాంబు దాడికి పాల్పడిన కేసులో మరో ముందడుగు పడింది. ఈ ఘటనలో కీలకంగా ఉన్న సూసైడ్ బాంబర్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి ఆశ్రయం కల్పించిన హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన సోయాబ్‌ను తాజాగా ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.ఇండియా టీవీ అందించిన కథనం ప్రకారం సోయాబ్ ఉగ్రవాది ఉమర్‌కు లాజిస్టికల్(రవాణా) సాయాన్ని అందించాడు. ఈ పేలుడులో 15 మంది మృతిచెందగా, 20 మందికి పైగా జనం గాయపడ్డారు. ఇది యావత్ దేశాన్నీ భయభ్రాంతులకు గురిచేసింది. కాగా సోయాబ్ అరెస్టుతో ఈ కేసులో ఎన్ఐఏ అరెస్టు చేసిన నిందితుల సంఖ్య ఏడుకు చేరింది. షోయబ్.. జమ్ముకశ్మీర్ పోలీసులు గతంలో ఛేదించిన వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్లో భాగమని విచారణలో తేలింది. అలాగే ఈ కేసులో సోయాబ్ పాత్ర ఉగ్రవాది ఉమర్‌కు బస కల్పించడం వరకూ మాత్రమే పరిమితం కాలేదని తేలింది.ఫరీదాబాద్‌లోని అల్ఫాలా విశ్వవిద్యాలయంలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేసిన సోయాబ్, ఆ విశ్వవిద్యాలయ ప్రయోగశాల నుండి పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన రసాయనాలను సేకరించేందుకు ఉమర్‌కు సహాయం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే సోయాబ్.. హర్యానాలోని నుహ్‌లోని హిదాయత్ కాలనీలో ఉమర్ కోసం ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఈ ఇంటిని ఉమర్ తాను తప్పించుకునే సమయంలో ఉపయోగించాడు. అలాగే ఇక్కడే పేలుడు పదార్థాలను కూడా నిల్వ చేశాడని అధికారులు వెల్లడించారు.ఈ అద్దె ఇంటిని హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) నవంబర్ 16న తనిఖీ చేసి, ఆ తర్వాత సీలు చేసింది. ఇక్కడి నుంచే ఉమర్ కారులో ప్రయాణించాడు. ఈ ప్రయాణ మార్గాన్ని కూడా అధికారులు గుర్తించారు. ఫిరోజ్‌పూర్ ఝిర్కాలో ఏటీఎం నుండి డబ్బు విత్‌డ్రా చేసుకున్న తరువాత, ఉమర్ ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పైనుంచి బాదర్పూర్ మీదుగా ఐ20 కారులో ఢిల్లీలోకి ప్రవేశించాడు. తరువాత ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో ఆ కారు పేలిపోయింది. దీంతో మంటలు చెలరేగి సమీపంలోని ఇతర వాహనాలు కూడా దగ్ధమయ్యాయి. ఈ దాడిని కేంద్ర మంత్రివర్గం ఉగ్రవాద ఘటనగా పేర్కొంది. దీని వెనుక ఉన్న కుట్రను ఛేదించేందుకు దర్యాప్తు సంస్థలు కృషి చేయాలని ఆదేశించింది. ఎన్ఐఏ ప్రస్తుతం ఆత్మాహుతి బాంబు దాడికి సంబంధించిన వివిధ ఆధారాలను సేకరిస్తోంది. ఈ దాడిలో భాగస్వామ్యమున్న ఇతరులను గుర్తించేందుకు పోలీసు బలగాలతో సమన్వయంతో వివిధ రాష్ట్రాలలో సోదాలు కొనసాగుతున్నాయి.ఇది కూడా చదవండి: కమ్రా టీ షర్టు వివాదం: ఉతికి ఆరేసిన బీజేపీ, శివసేన -
అందుకు ప్రతీకారంగానే ఎర్రకోట ఘటన!
ఢిల్లీ: ఎర్రకోట కారు పేలుడు ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కశ్మీర్ మిలిటెంట్ గ్రూప్ నాయకుడు, హిజ్బుల్ ముజాహిదీన్‌లో కమాండర్‌గా ప్రసిద్ధి పొందిన బుర్హాన్ ముజాఫర్ వాని ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా ఢిల్లీ కారు పేలుడు జరిపినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది. పేలుడు ఘటనలో డాక్టర్ ఉమర్ ఉన్ నబీ ‘సూసైడ్ బాంబర్’గా మారి పదుల సంఖ్యలు ప్రాణాలు తీశాడు. అలా ప్రాణాలు తీసే ముందు తనలాగే వైట్ కాలర్ ఉగ్రవాదులగా మారిన ఇతరులకు తాను పాలకుడిని, నాయకుడిని అని, ఎమిర్(రాజుగా) అని పిలిపించుకునేవాడని తేలింది. బుర్హాన్ ముజాఫర్ వాని ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని గతంలో పలు మార్లు వారికి చెప్పినట్లు సమాచారం. ఢిల్లీ కారు పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు హర్యానాలోని ఫరీదాబాద్‌లో అనుమానిత వైట్ కాలర్ ఉగ్రవాదుల్ని ప్రశ్నించినప్పుడు ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉమర్ ఉన్ నబీని ‘ఎమిర్’గా వర్ణించిన వ్యక్తి, అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో వైద్యుడిగా పనిచేసే ముజామిల్ షకీల్ అని అధికారులు నిర్ధారించారు. ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రధాన వ్యక్తి మౌల్వి ఇర్ఫాన్ అహ్మద్ ద్వారా దేశంలోని పలువుర్ని వైట్ కాలర్ ఉగ్రవాదిగా మార్చేందుకు ప్రయత్నం చేశారు. అలా వైట్ కాలర్ ఉగ్రవాదిగా రిక్రూట్ చేసిన వ్యక్తి కూడా ఉమన్ ఉన్ నబీనేనని తేలింది. షాహీన్ సయీద్ కూడావిచారణలో అరెస్టయిన మరో అనుమానితుడు షాహీన్ సయీద్ కూడా దర్యాప్తుకు ఉపయోగపడే కీలక సమాచారాన్ని అందించినట్లు వర్గాలు వెల్లడించాయి. దర్యాప్తు అధికారుల ప్రకారం.. జమ్మూ కశ్మీర్‌కు చెందిన డాక్టర్ ముజామిల్ షకీల్ ఇటీవల ఎర్రకోట వద్ద కారు పేలుళ్ల కేసులో కీలక నిందితుడిగా అరెస్టయ్యాడు. ఆయన పేలుడు పదార్థాలు తయారు చేయడం, రసాయనాలను ప్రాసెస్ చేయడం, విపరీతమైన ఎక్స్‌ప్లోసివ్ మెటీరియల్ నిల్వ చేయడం వంటి కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు విచారణ సంస్థలు పేర్కొన్నాయి.ఆపరేషన్ ఎమిర్ ముజామిల్ షకీల్ తనను తాను కేవలం పని వాడిగా మాత్రమే భావించేవాడని, ఉమర్ ఉన్ నబీకి ఉన్న హోదా, అనుభవం, ప్రభావం తమ మాడ్యూల్లో అత్యంత ఉన్నత స్థాయిలో ఉండేదని తెలిపాడు. మాడ్యూల్ సభ్యులు తమ ఆపరేషన్‌కు ‘ఆపరేషన్ ఎమిర్’ అని పేరు పెట్టడం కూడా ఉమర్ ఉన్ నబీకి ఇచ్చిన ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఆత్మాహుతి బాంబర్‌గా వ్యవహరించిన ఉమర్ ఉన్ నబీ వైట్ కాలర్ ఉగ్రవాదులకు ఆదేశాలు, సూచనలు ఆధారంగానే మిగతా సభ్యులు పనిచేసినట్లు విచారణలో బయటపడింది.బుర్హాన్ ముజఫర్ వానిబుర్హాన్ ముజఫర్ వాని దక్షిణ కశ్మీర్ లోని సంపన్న కుటాంబానికి చెందిన ఓ యువకుడు. అయితే 2010లో తన సోదరుడిని ఆర్మీ బలగాలు చంపాయన్న కారణంగా 15 ఏళ్ల వయసులోనే ఉగ్రవాద గ్రూపులో చేరిపోయాడు. అప్పటి నుంచే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మిలిటెంట్ల ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం, తన ప్రసంగాలతో యువకులను మిలిటెంట్లుగా మారేందుకు ఉత్తేజ పరిచేవాడు. అలా వందల సంఖ్యలో మిలిటెంట్లుగా మార్చడంలో బుర్హాన్ ముజఫర్ వాని కీలక పాత్ర పోషించాడు. 2016లో భారత భద్రతా బలగాలు అతడిని ఎన్కౌంటర్ చేశాయి. ఆ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా ఉమర్ ఉన్ నబీ ఢిల్లీ కారు పేలిన ఘటనలో సూసైడ్ బాంబార్గా మారి అమాయకుల్ని పొట్టనబెట్టుకున్నాడు. -
నిందితులపై ఎన్ఐఏ ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: ఎర్రకోట వద్ద బాంబుపేలుడు ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణను మరింత వేగవంతంచేసింది. జమ్మూకశ్మీర్ పోలీసులు కస్టడీలో ఉన్న నిందితులు డాక్టర్ ముజామిల్ ఘనీ, అదీల్ రాఠర్, వైద్యురాలు షాహీనా సయీద్, మత బోధకుడు ఇర్ఫాన్ అహ్మద్ వగాయ్లను ఎన్ఐఏ గురువారం తమ కస్టడీలోకి తీసుకుంది. వారిని రహస్య ప్రదేశంలో ఉంచి ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఫరీదాబాద్ ఉగ్రమాడ్యూల్ సభ్యులు ఎలా అఫ్గాన్, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్, తుర్కియేలోని హ్యాండ్లర్లతో సత్సంబంధాలు పెట్టుకున్నారు? నిధులు ఏఏ మార్గాల్లో సంపాదించారు? విధ్వంసకర రచన చేసిందెవరు? వైద్యుల ముసుగులో ఉన్న ఉగ్రమాడ్యూల్లో వాస్తవంగా ఎంత మంది సభ్యులు ఉన్నారు? అంటూ ప్రశ్నలవర్షం కురిపించి వారి నుంచి సమాధానాలు రాబడుతున్నారు. ‘‘ ఈ నలుగురు మొత్తం ఉగ్రమాడ్యూల్లో అత్యంత కీలకమైన సభ్యులు. వీళ్ల వద్ద చాలా సమాచారం ఉంటుంది’’ అని జాతీయ దర్యాప్తు సంస్థ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. ఢిల్లీ పోలీసుల నుంచి నవంబర్ 11న అధికారికంగా కేసు తమ చెంతకు వచ్చాక ఎన్ఐఏ అమీర్ రషీద్ అలీ, జసీర్ బిలాల్ వానీ అలియాస్ డ్యానిష్లను అరెస్ట్‌చేసింది. గురువారం ఈ నలుగురిని తమ అదుపులోకి తీసుకోవడంతో ఎన్ఐఏ అరెస్ట్‌ల సంఖ్య ఆరుకు పెరిగింది. గురువారం ముజామిల్, అదీల్, షాహీనా, ఇర్ఫాన్ వగాయ్లను ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుల ప్రాంగణంలోని కోర్టులో ఎన్ఐఏ ప్రవేశపెట్టింది. కేసు దర్యాప్తు నిమిత్తం వీళ్లందర్నీ తమకు అప్పగించాలని కోర్టును కోరగా 10 రోజుల కస్టడీకి అప్పగిస్తూ ప్రధాన జిల్లా, సెషన్స్ జడ్జి అంజూ బజాజ్ ఛాంద్నా ఉత్తర్వులు జారీచేశారు. -
ఢిల్లీ పేలుడు పాక్ పనే.. ‘దాయాది నేత’ స్పష్టం
న్యూఢిల్లీ: ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోట వెలుపల జరిగిన కారు బాంబు పేలుడు వెనుక పాక్ హస్తం ఉందని స్పష్టం అయ్యింది. ఈ దాడితో పాకిస్తాన్‌కు ప్రత్యక్ష సంబంధం ఉందంటూ ఆ దేశ రాజకీయ నేత ఒకరు బహిరంగంగా ప్రకటించడంతో దాయాది దేశం తీరు మరోమారు బయటపడింది. ఇది ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింతగా పెంచింది.పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) మంత్రి చౌదరి అన్వరుల్ హక్ పీఓకే అసెంబ్లీలో మాట్లాడుతూ ‘భారతదేశం ఉద్దేశపూర్వకంగా బలూచిస్తాన్‌లో అశాంతిని రేకెత్తిస్తే, తాము ఎర్రకోట నుండి కశ్మీర్ అడవుల వరకు దాడి చేస్తామని ముందే చెప్పామని, అల్లా దయతో మేము దీనిని చేసి చూపామని’ వ్యాఖ్యానించారు. అయితే పాకిస్తాన్ అధికారికంగా ఈ ప్రకటనపై స్పందించనప్పటికీ, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.. భారతదేశంతో యుద్ధం అవకాశాన్ని తోసిపుచ్చలేమని ప్రకటించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. కాగా పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో భారత్ అశాంతిని రేకెత్తిస్తోందన్న ఆరోపణలను భారత్ కొట్టిపారేసింది.ఢిల్లీ పేలుడు కోసం జమ్ముకశ్మీర్‌లోని షోపియన్‌కు చెందిన ఇస్లామిక్ మౌల్వి ఇర్ఫాన్ అహ్మద్ 10 మంది సభ్యుల సెల్‌ను నిర్మించడంలో కీలకపాత్ర పోషించాడని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. అలాగే పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాది ఉమర్ బిన్ ఖత్తాబ్ అలియాస్ హంజుల్లా దీనికి ఆర్గనైజర్ గా వ్యవహరించాడని వెల్లడయ్యింది. ఎన్ఐఏ అధికారులు ఈ సెల్‌లోని సభ్యులందరినీ అరెస్టు చేశారు. మరోవైపు ఈ పేలుడు తర్వాత జైష్ నేతలు భారతదేశంపై మరిన్ని దాడులు చేసేందుకు నిధులు కావాలంటూ పిలుపునిచ్చారు. ఇందుకోసం వారు ‘సదాపే’యాప్ ద్వారా నిధుల సేకరణకు శ్రీకారం చుట్టారు. అయితే ఎన్ఐఏ దాడులతో జైష్ నేతల చర్యలకు అడ్డుకట్ట పడింది. ఇది కూడా చదవండి: యూరప్‌లో ‘హమాస్’ కుట్ర.. భగ్నం చేసిన ‘మొసాద్’ -
భారత్‌లో మరోసారి ఆత్మాహుతి దాడికి జైషే కుట్ర
ఢిల్లీ: ఎర్రకోట బాంబు తరహాలో భారత్‌లో మరోసారి ఆత్మాహుతి దాడికి నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్- మహమ్మద్ ప్రయత్నిస్తుందని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా ఆదాడి కోసం పాకిస్థాన్‌లో విరాళాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నాయి.ఎర్రకోట బాంబు పేలుళ్లపై ఎన్ఐఏ జరుపుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జైష్ ఉగ్ర సంస్థ ఎర్రకోట కారు బాంబు తరహాలో భారత్‌లో మరో ఆత్మాహుతి దాడి (ఫిదాయిన్)కు ప్రణాళికలు రచించిందని తెలుస్తోంది. అంతే కాకుండా ఆ దాడికోసం డిజిటల్ మార్గాల ద్వారా విరాళాలు సేకరిస్తుందని అందులో సదాపే అనే పాకిస్థాన్‌కు చెందిన యాప్ కూడా ఉందని తెలిపింది. ఫండ్ రుసుము పాకిస్థాన్ కరెన్సీలో 20వేలు భారత్(రూ.6400) ఉన్నట్లు పేర్కొంది. ఈ డబ్బులను ఉగ్రవాదుల ఖర్చులకోసం ఉపయోగిస్తున్నట్లు సమాచారం.వీటితో పాటు ఉగ్రవాదులకు చలికాలపు కిట్ ముజాహిద్ ఇచ్చే వారినెవరినైనా జిహాదీలుగా పరిగణిస్తారని జిహాదీల మరణానంతరం వారిపై శ్రద్ధ కనిపించేవారిని సైతం జిహాదీలుగానే గుర్తిస్తున్నట్లు దర్యాప్తులో వివరాలు తెలిసాయి. ఇటీవల ఎర్రకోటలో జరిగిన బాంబు దాడులలో టెర్రర్ డాక్టర్ గ్రూప్‌కు డిజిటల్ మార్గంలోనే నిధులు అంది ఉండవచ్చని దానిపై ప్రత్యేక దర్యాప్తు చేపడుతున్నామని ఎన్ఐఏ బృందాలు పేర్కొన్నాయి.కాగా ఇటీవల ఫరీదాబాద్ అక్రమ పేలుడు పదార్థాల కేసులో అరెస్టయిన డాక్టర్. షహీన్ సయీద్ ఈ దాడికి ఫండ్ చేసిందని ఎన్ఐఏ బృందాలు అనుమానిస్తున్నాయి. ఈ బాంబు పేలుళ్ల కేసులో షహీన్ సయీద్‌ను మేడమ్ సర్జన్ అనే కోడ్ నేమ్ కలిగి ఉంది. జమాత్ - ఉల్- ముమినాత్ అనే యూనిట్లో ఆమె సభ్యురాలిగా ఉన్నట్లు సమాచారం. -
ఢిల్లీ బాంబర్ ప్లాన్: పుల్వామాలోని తన ఇంటికి వెళ్లి..
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్ అలియాస్ ఉమర్ ఉన్ నబి.. పేలుడుకు వారం ముందు నుంచి తన ప్రణాళికను అమలు చేస్తూ వచ్చాడని ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. నవంబర్ 10న దాడి జరగగా, దానికి వారం రోజుల ముందు ఉమర్ జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో గల తన ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వెళ్లే ముందు తన వద్ద ఉన్న రెండు ఫోన్లలో ఒకదానిని తన సోదరునికి ఇచ్చాడు.శ్రీనగర్, ఫరీదాబాద్‌లలో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయంటూ ఉమర్ సహచరులు డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్ అరెస్టు చేయడంతో ఉమర్ సోదరుడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఆ మర్నాడు ఉమర్ మరో సహోద్యోగి డాక్టర్ షాహీన్ సయీద్ కూడా అరెస్టు అయినట్లు ఉమర్ సోదరునికి తెలిసింది. ఉమర్ కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారని తెలుసుకున్న సోదరుడు భయంతో ఉమర్ ఇచ్చిన ఫోన్‌ను వారి ఇంటి సమీపంలోని ఒక చెరువులో పడేశాడు. దర్యాప్తు అధికారులు ఉమర్ ఫోన్ల కోసం గాలించారు. ఆ రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయని, వాటి చివరి స్థానాలు ఢిల్లీ, పుల్వామాలో ఉన్నట్లు గుర్తించారు.అధికారులు పుల్వామాలోని ఉమర్ ఇంటికి చేరుకుని అతని సోదరుడిని విచారించగా, అతను చెరువులో పడేసిన ఫోన్ గురించి వెల్లడించాడు. నీటిలో పడి, పాడైపోయిన ఆ ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ మదర్బోర్డ్ కూడా పనిచేయని స్థితిలో ఉన్నప్పటికీ, అధికారులు అతి కష్టం మీద.. ఆ ఫోనులో.. ఉమర్ ఆత్మాహుతి బాంబు దాడులను సమర్థిస్తూ చేసిన కీలక వీడియోను రికవరీ చేయగలిగారు. మంగళవారం బహిర్గతమైన ఆ వీడియోలో.. ఇస్లాంలో ఆత్మహత్యను నిషేధించినప్పటికీ, ఉమర్ దానిని సమర్థిస్తూ బలిదాన చర్యలుగా అభివర్ణించాడు. అలాగే మరణానికి భయపడవద్దు అనే సందేశాన్ని వినిపించాడు.ఇది కూడా చదవండి: ట్రంప్ కొత్త డ్రామా.. డీల్స్ కోసం ‘ఎంబీఎస్’కు క్లీన్చిట్ -
Delhi Blast Case: ఉగ్రవాది ఉమరు సహకరించిన కీలక వ్యక్తి ఇతడే..
-
Delhi Blast: పేలుడు ఘటనకు ముందు వీడియో రికార్డ్ చేసిన డాక్టర్ ఉమర్
-
అల్‌ఫలా యూనివర్సిటీపై ఈడీ దాడులు
సాక్షి, ఢిల్లీ: ఎర్రకోట పేలుడు కేసులో అల్‌ఫలా యూనివర్సిటీపై మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) దాడులు చేపట్టింది. యూనివర్సిటీకి అందుతున్న నిధులపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. విశ్వవిద్యాలయానికి, నిషేధిత ఉగ్రవాద సంస్థలకు మధ్య ఉన్న అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల చిట్టాను ఛేదించే లక్ష్యంతో ఢిల్లీ, ఫరీదాబాద్‌లలో ఏకకాలంలో 25 వేర్వేరు ప్రాంతాల్లో ఈడీ బృందాలు మెరుపుదాడులు నిర్వహించాయి.అల్‌ఫలా విశ్వవిద్యాలయం యజమానులు, సంబంధిత వ్యక్తులపై ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేసింది. విశ్వవిద్యాలయం ఆర్థిక లావాదేవీలు, ఫీజుల వసూళ్లు, నిధుల మళ్లింపు తదితర అంశాలపై దర్యాప్తు సంస్థ లోతుగా విచారణ జరుపుతోంది. ఈ దాడులలో కీలకమైన పత్రాలు, డిజిటల్ ఆధారాలు, ఆర్థిక వివరాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు హమాస్ తరహాలో డ్రోన్ ఆయుధాలతో దాడులకు ఉగ్రవాదుల ప్లాన్ చేశారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఈ నేపధ్యంలో అధికారులు డ్రోన్లు, పలు ఆయుధాలను కనుగొన్నారు. సూసైడ్ బాంబర్ ఉమర్ నబి సహచరుడు జహీర్ బిలాల్ వాణి అలియాస్ డానిష్ అరెస్టు దరిమిలా డ్రోన్ల దాడి ప్రణాళిక వెల్లడయ్యింది. డ్రోన్లకు ఆయుధాలు బిగించడంలో డ్యానిష్ సాంకేతిక సహకారం అందించాడని తేలింది. కారు బాంబు దాడికి ముందు డ్రోన్లకు రాకెట్లు ఉపయోగించాలని ప్రణాళికలు రూపొందించారని సమాచారం. రోడ్లకు పవర్ఫుల్ బ్యాటరీలు ఉపయోగించి భారీ ఆయుధాలు, కెమెరాలను బిగించాలని ప్లాన్ చేశారని తెలుస్తోంది. భారీ ఎత్తున జనం ఉన్న ప్రాంతాలలో డ్రోన్ల ద్వారా దాడులు చేయాలని ముష్కరులు ప్లాన్ చేశారని ఎన్ఐఏ అధికారులు కనుగొన్నారు. 2023లో ఇదే తరహాలో ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేశారని అధికారులు చెబుతున్నారు. -
పాతాళంలో ఉన్నా సరే పట్టుకొస్తాం: అమిత్ షా
ఫరీదాబాద్: ఢిల్లీ పేలుళ్ల నిందితులను ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వారు ఈ భూమ్మీద కాదు.. పాతాళంలో ఉన్నా వేటాడి పట్టుకొచ్చి కఠిన శిక్షలు పడేలా చేస్తామన్నారు. ఈరోజు(సోమవారం, నవంబర్ 17వ తేదీ) హరియాణాలోని ఫరిదాబాద్‌లో నార్తరన్ జోనల్ కౌన్సిల్(ఎన్‌జెడ్‌సీ) సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. దీనిలో భాగంగా అమిత్ షా మాట్లాడుతూ.. ఢిల్లీ పేలుళ్ల ఘటనపై తీవ్రంగా స్పందించారు. దేశంలో ఈ తరహా ఉగ్రచర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని హచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని దాని మూలాల నుండి నిర్మూలించడమనేది తమ సమిష్టి నిబద్ధత అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క 'బలమైన రాష్ట్రాలు మాత్రమే బలమైన దేశాన్ని సృష్టిస్తాయి అనే దార్శనికతను చాటడంలో జోనల్ కౌన్సిల్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు. ప్రతి రంగంలో జాతీయ పురోగతితో పాటు భారతదేశం యొక్క ప్రపంచ నాయకత్వంలో ప్రాంతీయ బలమే తమ లక్ష్యమన్నారు. ఇదిలా ఉంచితే, ఢిల్లీ పేలుళ్లలో మృతుల సంఖ్య 14కు చేరింది. ఈ రోజు ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. -
ఢిల్లీ ఉగ్రదాడి కేసులో వీడని మిస్టరీ ఆ మూడు బుల్లెట్లు ఎక్కడివి?
-
Delhi Car Blast: ఎవరీ మేడమ్ X, మేడమ్ Z?
ఢిల్లీ: ఢిల్లీ పేలుడు ఘటనలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోట సమీపంలో హ్యుందయ్ ఐ20లో ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ మహ్మద్‌కు.. భారత్‌లోని జైషే మహమ్మద్ నెట్వర్క్ స్థాపించేందుకు చేసే ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ఉగ్రవాది డాక్టర్ షాహిన్ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. పేలుళ్లతో పాటు ఇతర ఉగ్రకుట్రకు సంబంధింత అంశాల్లో అనుమానాస్పద వ్యక్తులతో చేసిన చాటింగ్, అందుకు ఉపయోగించిన కోడ్ సైతం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ పేలుడు ఘటనతో పాటు జైషే మహమ్మద్‌తో సంబంధాలు ఉన్నాయని ఆధారాలతో డాక్టర్ షాషిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసును దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో అధికారులు ఆమె కదలికలు, ఫోన్, ల్యాప్‌ట్యాప్‌లపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా డాక్టర్ షాహిన్ ఫోన్ నుంచి సేకరించిన వాట్సప్‌లో కీలక ఆధారాల్ని వెలుగులోకి తెచ్చారు. మేడమ్ X,మేడమ్ Z వాటిల్లో మేడమ్ X,మేడమ్ Z పేరుతో సేవ్ చేసిన మహిళలతో షాషిన్ మాట్లాడినట్లు తేలింది. అదే సమయంలో ఈ రెండు నంబర్ల నుండి డాక్టర్ షాహీన్‌కు క్రమం తప్పకుండా కాల్స్, మెసేజ్‌లు వచ్చేవి. ఆ మెసేజ్‌లలో ‘మెడిసిన్’ అనే పదం ఎక్కువగా ఉపయోగించినట్లు,.. మెడిసిన్ అంటే పేలుడు పదార్థాలేనని దర్యాప్తు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానం ప్రకారం మెడిసిన్ అంటే వేరేదేమైనా ఉందా? అన్న కోణంలో దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. ఓ మెసేజ్‌లో మేడమ్ X నుంచి షాహిన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌లో ‘ఆపరేషన్‌కు ఔషధం కొరత ఉండకూడదు’ అని ఉంది. ‘హమ్దర్ద్’ అంటే ఇంకొక మెసేజ్‌లో మేడమ్ జెడ్ ‘మేడమ్ సర్జన్, ఆపరేషన్ హమ్దర్ద్పై మరింత శ్రద్ధ పెట్టండి’అని పేర్కొనడం గమనార్హం.‘ఆపరేషన్ హమ్దర్ద్’ అనేది మహిళా ఉగ్రవాదులను నియమించేందుకు రూపొందించిన ప్రణాళికగా గుర్తించారు. ‘హమ్దర్ద్’ అంటే ఉర్దూలో సానుభూతి పరులని సమాచారం. డాక్టర్ షాషీన్ లక్నోలోని లాల్ బాగ్ నివాసి. పాకిస్తాన్‌కు చెందిన జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థ మహిళా విభాగానికి నాయకత్వం వహించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. 2001లో పార్లమెంటుపై దాడి, 2019లో పుల్వామా దాడికి బాధ్యత వహించిన జైషే మహ్మద్ ఈ ముఠాను నడిపినట్టు సమాచారం.కాగా, షాహీన్ గతంలో కాన్పూర్ మెడికల్ కాలేజ్‌లో ఫార్మకాలజీ విభాగానికి అధిపతిగా పనిచేశారు. అనంతరం ఆమె కన్నౌజ్ మెడికల్ కాలేజీకు బదిలీ అయ్యారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ పేలుడు ఘటనలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌కు గంటల ముందు ఉమర్ మహ్మద్ హ్యూందయ్ ఐ20 కారులో ఆత్మాహుతి చేసుకున్నాడు. -
మూడు బుల్లెట్ల మిస్టరీ!
న్యూఢిల్లీ: ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎర్రకోట వద్ద ఘటనా స్థలానికి సమీపంలోనే మూడు తుపాకీ తూటాలను స్వాదీనం చేసుకున్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయన్నదానిపై దర్యాప్తు మొదలైంది. ఇందులో ఒకటి తూటా తొడుగు(కార్ట్రిడ్జ్) కాగా, మరో రెండు లైవ్ బుల్లెట్లు అని అధికారులు చెప్పారు. ఇవి 9ఎంఎం తూటాలు. సైనిక దళాలు లేదా స్పెషలైజ్డ్ యూనిట్లు లేదా ప్రత్యేక అనుమతి కలిగిన వ్యక్తులు మాత్రమే వీటిని ఉపయోగించేందుకు జారీ చేస్తుంటారు. ఈ నెల 10వ తేదీన ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడు తర్వాత పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. ఈ తూటాలు భద్రతా సిబ్బందికి సంబంధించినవేనా? అని తనిఖీ చేయగా, అలాంటిదేమీ లేదని తేలింది. బాంబు పేలుడుకు ఉపయోగించిన ఐ20 కారు పక్కనే ఈ తూటాలు లభించాయి. కానీ, అక్కడ తుపాకీ కనిపించలేదు. మొత్తానికి బుల్లెట్ల మిస్టరీని ఛేదించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. విదేశాల నుంచి రూ.20 లక్షలు! పేలుడు ఎలా జరిగిందో గుర్తించడానికి సీన్ రీకన్‌స్ట్రక్షన్‌కు సిద్ధమవుతున్నారు. నిందితుడు ఉమర్ నబీ హరియాణాలోని ఫరీదాబాద్ నుంచి బయలుదేరాడు. నూహ్ పట్టణంలో తలదాచుకున్నాడు. తర్వాత ఢిల్లీకి చేరుకొని ఒక చోట టీ తాగాడు. ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడుకు పాల్పడి, తాను కూడా మరణించాడు. ఈ మొత్తం మార్గంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. అతడు ఎవరెవరిని కలిశాడు? అతడిని ఎవరు అనుసరించారు? ఎవరు సహకరించారు? అనేది గుర్తించబోతున్నారు. ఈ కేసులో కొత్త కోణాలు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిందితులైన ముజమ్మిల్, షహీన్‌లు హవాలా మార్గంలో డబ్బులు స్వీకరించినట్లు తెలుస్తోంది. విదేశాల్లో ఉన్న హ్యాండర్ల నుంచి వారికి రూ.20 లక్షలు అందినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఆ సొమ్ముతో మొత్తం ముగ్గురు నిందితులు పేలుడు పదార్థాలు సమకూర్చుకున్నట్లు అంచనా వేస్తున్నారు. బాంబును తయారు చేయడానికి ట్రైఅసిటోన్ ట్రైపెరాక్సైడ్(టీఏటీపీ) ఉపయోగించినట్లు నిపుణులు అనుమానిస్తున్నారు. అది చాలా అస్థిరమైనది, సున్నితమైనది. కాస్త వేడి తగిలినా, రాపిడికి గురైనా వెంటనే పేలిపోతుంది. మరోవైపు అల్–ఫలా యూనివర్సిటీలో ఆధారాల కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. అరెస్టయిన డాక్టర్లతో సంబంధాలున్నవారిని ప్రశ్నిస్తున్నారు. ఉమర్, ముజమ్మిల్, షహీన్‌తో సన్నిహిత సంబంధాలున్న పలువురు వ్యక్తులు యూనివర్సిటీ క్యాంపస్ నుంచి హఠాత్తుగా కనిపించకుండాపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. మరో నిందితుడు అమీర్ రషీద్ అలీ అరెస్టు ఢిల్లీలో పేలుడు సూసైడ్ బాంబర్ ఉమర్ నబీతో కలిసి కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న అమీర్ రషీద్ అలీని ఎన్ఐఆర్ అధికారులు ఢిల్లీలో అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఇదొక కీలక మలుపు అని చెబుతున్నారు. అమీర్ రషీద్ అలీ స్వస్థలం కశ్మీర్. అతడిపైన ఇప్పటికే కేసు నమోదయ్యింది. పేలుడుకు ఉపయోగించిన ఐ20 కారును కొనుగోలు చేయడానికి అతడు సహకరించినట్లు సమాచారం. ఆ కారు అమీర్ రషీద్ అలీ పేరిటే రిజిస్టర్ అయ్యింది. అతడిని ప్రశ్నిస్తే మరింత కీలక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు ఐ20 కారులో పేలుడు పదార్థాలు అమర్చి ఎర్రకోట వద్ద పేల్చేసినట్లు ఎన్ఐఏ సిబ్బంది అధికారికంగా ధ్రువీకరించారు. జమ్మూకశ్మీర్‌లో కొత్త నియామకాలు ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లో కొత్త నియామకాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు అధికారులు గుర్తించారు. గతం ఎలాంటి నేర చరిత్ర గానీ, వేర్పాటువాదులతో సంబంధాలు గానీ లేని యువకులను చేర్చుకుంటున్నారని చెప్పారు. ఇప్పటిదాకా అనుసరించిన వ్యూహానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. భద్రతా దళాల నిఘాకు చిక్కకుండా ఈ ఎత్తుగడ వేశారని వెల్లడించారు. వైట్‌కాలర్ టెర్రర్ నెట్వర్క్ కొత్త వ్యూహం అనుసరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఢిల్లీ పేలుడు కేసులో నిందితులైన డాక్టర్ అదీల్ రాథర్, డాక్టర్ ముజఫర్ రాథర్, డాక్టర్ ముజమ్మిల్‌కు గతంలో నేర చరిత్ర లేదు. దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో వారు పాల్గొనలేదు. అలాంటివారినే ఉగ్రవాదులు ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సూసైడ్ బాంబర్ కోసం ఏడాదిగా గాలింపు! ఢిల్లీలో పేలుడుకు కుట్ర చాలా కాలంనుంచే సాగింది. తమకు అవసరమైన సూసైడ్ బాంబర్ కోసం ముష్కరులు ఏడాది కాలంపాటు అన్వేíÙంచారు. చివరకు వారికి డాక్టర్ ఉమర్ నబీ దొరికాడు. వైట్‌కాలర్ టెర్రర్ మాడ్యూల్ ఆదేశాలను పాటించాడు. ఢిల్లీలో కారు బాంబు పేల్చేశాడు. దర్యాప్తులో అధికారులు ఈ విషయాలను గుర్తించారు.హరియాణా మహిళా డాక్టర్ విచారణ ఢిల్లీ పేలుడు కేసులో హరియాణాలోని రోహ్తక్కు చెందిన మహిళా డాక్టర్ ప్రియాంక శర్మను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ముష్కరులతో సంబంధాల గురించి ఆరా తీశారు. ఆమె ప్రస్తుతం దక్షిణ జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నారు. ప్రశ్నించిన అనంతరం ప్రియాంక శర్మను విడిచిపెట్టారు. ఆమె ఫోన్‌ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపించబోతున్నారు. డాక్టర్ అదీల్ అరెస్టు తర్వాత ప్రియాంక శర్మ పేరు తెరపైకి వచ్చింది. అదీల్ కాల్ రికార్డుల్లో ఆమె ప్రస్తావన కూడా ఉంది. -
ఢిల్లీ పేలుళ్ల కేసు: అమిర్ రషీద్ అరెస్ట్
ఢిల్లీ: ఢిల్లీ నగరంలోని ఎర్రకోటకు సమీపంలో ఇటీవల జరిగిన బాంబు పేలుళ్ల కేసులో మరొక వ్యక్తిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఈరోజు(ఆదివారం) అమిర్ రషీద్ అలీ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన సూత్రధారిగా ఉన్న ఉమర్ నబీకి సహచరుడిగా ఉన్న అమిర్ రషీద్‌ను అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఉమర్ నబీ కారు కొనడంలో అమిర్ రషీద్ సహకారం అందించాడు. రషీద్ అలీ పేరుపైనే దాడిలో ఉపయోగించిన కారు రిజిస్ట్రేషన్ అయ్యింది. ఆ రోజు కారు నడిపింది ఉమర్ నబీ అనే విషయం ఫోరెన్సిక్ రిపోర్ట్‌ల ఆధారంగా బయటపడింది. కారు కొనడానికి అమిర్ కశ్మీర్ నుంచి ఢిల్లీకి వచ్చాడని, ఈ దాడిలో అమిర్ పాత్ర కూడా ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు నిర్ధారణకు వచ్చారు. అమిర్ రషీద్ అరెస్ట్‌తో మరిన్ని విషయాలు తమ దర్యాప్తు ద్వారా రాబట్టవచ్చిన అధికారులు భావిస్తున్నారు.కాగా, నవంబర్ పదో తేదీ మధ్యాహ్నం నుంచి సాయంత్రందాకా మూడు గంటలపాటు కారులో నబీ ఏంచేశాడు? అతని వెంట ఇంకా ఎంత మంది ఉన్నారు? ఉంటే వాళ్లు ఆ తర్వాత ఏమయ్యారు? అనే ప్రశ్నలకు సమాధానాలకు వెతికేపనిలో అధికారులు తలమునకలయ్యారు.పేలుడుపదార్థాలతో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్(ఐఈడీ) తయారుచేయడంలో డాక్టర్ ఉమర్ నైపుణ్యం సాధించాడని దర్యాప్తు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. విదేశీ హ్యాండ్లర్ నుంచి అందుకున్న బాంబుతయారీ విధాన పీడీఎఫ్ ఫైళ్లు, ఓపెన్ ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అక్రమ సమాచారంతో బాంబుల తయారీలో ఉమర్ నిపుణుడిగా మారాడని తెలుస్తోంది. అమ్మోనియం నైట్రేట్, పెట్రోలియం, డిటోనేట్ ఉపకరణాలతో వీటిని తయారుచేసి ఉండొచ్చని చెబుతున్నారు. వీటి సాయంతో ఐఈడీని కేవలం 5–10 నిమిషాల్లో తయారుచేయొచ్చు. ఎర్రకోట పార్కింగ్ స్థలంలోనే ముడిపదార్థాలతో అప్పటికప్పుడు బాంబు తయారుచేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.పేలుడు తీవ్రతను బట్టి ఆరోజు రెండు కేజీల అమ్మోనియం నైట్రేట్, పెట్రోలియం ఉపయోగించి ఉంటారని ఫోరెన్సిక్ నిపుణులు అంచనావేస్తున్నారు. ఆదివారం తోటి డాక్టర్లు అరెస్ట్ కావడంతో హడావిడిగా ముందస్తు ప్లాన్‌లేకుండా ఉమర్ సోమవారం ఎర్రకోటకు వచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సాధారణంగా ఎర్రకోట సందర్శనలకు సోమవారం సెలవు. ఆరోజు పర్యాటకులు రద్దీ ఉండదు. రద్దీ లేనప్పుడు బాంబు పేల్చినా తీవ్రత పెద్దగా ఉండదని ఉమర్ భావించి ఉండొచ్చు. సాయంత్రం వేళ అయినా కనీసం ఛాందినిచౌక్ ప్రాంత కొనుగోలుదారులు, స్థానికులతో ఆ ప్రాంతం కిటకిటలాడితే అప్పుడు బాంబు పేలుద్దామనే ఆ 3 గంటలు ఉమర్ పార్కింగ్ ఏరియాలోనే వేచిచూశాడని పోలీసులు ఓ అంచనాకొచ్చారు. -
ఢిల్లీ బ్లాస్ట్... మరో డాక్టర్ అరెస్ట్
-
అప్పుడే అమర్చి పేల్చాడా?
న్యూఢిల్లీ: యావత్ భారతావని ఉలిక్కిపడేలా చేసిన ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో డాక్టర్ ఉమర్ నబీ ఒక్కడే ఇంతటి మారణహోమం సృష్టించాడా? లేదంటే మరికొందరు ఆరోజు అదే కారులో వచ్చి పరారయ్యారా? అనే అనుమానాలు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)లో ఎక్కువయ్యాయి. దీంతో కేసు దర్యాప్తును మెరుపువేగంతో ముందుకు తీసుకెళ్తున్నారు. నవంబర్ పదో తేదీ మధ్యాహ్నం నుంచి సాయంత్రందాకా మూడు గంటలపాటు కారులో నబీ ఏంచేశాడు? అతని వెంట ఇంకా ఎంత మంది ఉన్నారు? ఉంటే వాళ్లు ఆ తర్వాత ఏమయ్యారు? అనే ప్రశ్నలకు సమాధానాలకు వెతికేపనిలో అధికారులు తలమునకలయ్యారు. కారు మూడు గంటలపాటు పార్కింగ్‌లోనే ఉండగా చుట్టూ వాహనాలు పార్కింగ్‌లోకి వస్తూ పోతూ ఉన్నట్లు తేలడంతో ఆయా వాహనాల డ్రైవర్లు, యజమానులను అధికారులు ప్రశ్నించడం మొదలెట్టారు. సమీప వాహనాలను స్వా«దీనంచేసుకున్నారు. కారులో ఉమర్ ఏంచేశాడు? ఏదైనా బాంబులాంటిది బిగించడం చూశారా? కారులో ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది ఉన్నారా? అనే ప్రశ్నలను అడిగినట్లు సమాచారం. బాంబుల తయారీలో ఉమర్‌కు నైపుణ్యం పేలుడుపదార్థాలతో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్(ఐఈడీ) తయారుచేయడంలో డాక్టర్ ఉమర్ నైపుణ్యం సాధించాడని దర్యాప్తు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. విదేశీ హ్యాండ్లర్ నుంచి అందుకున్న బాంబుతయారీ విధాన పీడీఎఫ్ ఫైళ్లు, ఓపెన్ ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అక్రమ సమాచారంతో బాంబుల తయారీలో ఉమర్ నిపుణుడిగా మారాడని తెలుస్తోంది. అమ్మోనియం నైట్రేట్, పెట్రోలియం, డిటోనేట్ ఉపకరణాలతో వీటిని తయారుచేసి ఉండొచ్చని చెబుతున్నారు. వీటి సాయంతో ఐఈడీని కేవలం 5–10 నిమిషాల్లో తయారుచేయొచ్చు. ఎర్రకోట పార్కింగ్ స్థలంలోనే ముడిపదార్థాలతో అప్పటికప్పుడు బాంబు తయారుచేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. పేలుడు తీవ్రతను బట్టి ఆరోజు రెండు కేజీల అమ్మోనియం నైట్రేట్, పెట్రోలియం ఉపయోగించి ఉంటారని ఫోరెన్సిక్ నిపుణులు అంచనావేస్తున్నారు. ఆదివారం తోటి డాక్టర్లు అరెస్ట్ కావడంతో హడావిడిగా ముందస్తు ప్లాన్‌లేకుండా ఉమర్ సోమవారం ఎర్రకోటకు వచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సాధారణంగా ఎర్రకోట సందర్శనలకు సోమవారం సెలవు. ఆరోజు పర్యాటకులు రద్దీ ఉండదు. రద్దీ లేనప్పుడు బాంబు పేల్చినా తీవ్రత పెద్దగా ఉండదని ఉమర్ భావించి ఉండొచ్చు. సాయంత్రం వేళ అయినా కనీసం ఛాందినిచౌక్ ప్రాంత కొనుగోలుదారులు, స్థానికులతో ఆ ప్రాంతం కిటకిటలాడితే అప్పుడు బాంబు పేలుద్దామనే ఆ 3 గంటలు ఉమర్ పార్కింగ్ ఏరియాలోనే వేచిచూశాడని పోలీసులు ఓ అంచనాకొచ్చారు. -
వైట్ కాలర్ ఉగ్రవాదం... ఓ వాస్తవం
నవంబర్ 10 సాయంత్రం జరిగిన కారు బాంబు పేలుడుతో న్యూఢిల్లీ గతుక్కుమంది. భద్రతా సంస్థలు ఒక ప్రధాన నిందితుడిని గుర్తించగలిగాయి. కశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన ఈ డాక్టర్ అధునాతన టెర్రర్ మాడ్యూల్లో భాగమని భావిస్తున్నారు. ఈ వైట్–కాలర్ టెర్రర్ మాడ్యూల్‌కు పాకిస్తాన్లో పేరుమోసిన జైషే మహమ్మద్ సంస్థతో సంబంధం ఉన్నట్లు వెలుగు చూస్తున్న సాక్ష్యాధారాలు వెల్లడిస్తున్నాయి. ఉగ్రవాద సంస్థలు తాము నేరుగా ప్రమేయం పెట్టుకోకుండా, విద్యావంతులైన స్థానిక రిక్రూట్లతో దుశ్చర్యలకు పాల్పడే ధోరణి పెరుగుతోంది. విద్యావంతుల దుశ్చర్య‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత కూడా, ఉగ్రవాద ప్రయత్నాలలో ఎక్కడా విరామం కనిపించడం లేదు. భద్రతా దళాలు మే నెల నుంచి, కొన్ని డజన్ల ప్రయత్నాలను భగ్నం చేసినట్లు నిపుణుల అంచనా. స్థానిక మాడ్యూళ్ళ ప్రమేయమే చాలా వాటిలో ఉంది. కారు పేలుడుకు ముందు, వివిధ చట్ట సంస్థల అధికారులు రెండు గణనీయమైన డంపులను బట్టబయలు చేయగలిగారు. పోలీసులు నవంబర్ 9న వసతి భవనాల నుంచి 350 కిలోల అమోనియం నైట్రేట్‌తో సహా దాదాపు 3,000 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి కశ్మీర్ నుంచి పనిచేస్తున్న ఒక ఉగ్ర ముఠాకు చెందినవి. స్వాధీనపరచుకున్న వాటిలో అసాల్ట్ రైఫిళ్ళు, పిస్తోళ్ళు, బాంబుల తయారీకి ఉపయోగపడే టైమర్లు, రిమోట్ డిటొనేషన్ సాధనాలు కూడా ఉన్నాయి. గుజరాత్ ఉగ్ర నిరోధక స్క్వాడ్ (ఏటీఎస్) అదే రోజున ముగ్గురు అనుమానితులను అరెస్టు చేసింది. వారి నుంచి బిరెట్టా పిస్తోళ్ళు, తూటాలు స్వాధీనపరచుకున్నారు. ఈ రెండు కేసుల్లోనూ డాక్టర్లు, విశ్వవిద్యాలయ ఉద్యో గులు నిందితులుగా ఉన్నారు. వైట్–కాలర్ ఉగ్రవాదం పెరుగుతున్న ధోరణికి ఇవి మరిన్ని ఆధారాలను సమకూర్చాయి. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ సాగి స్తున్న సీమాంతర ఉగ్రవాదంలో మారిన వ్యూహానికి ఢిల్లీ ఘటన అద్దం పడుతోంది. అది ఇక ఎంతమాత్రం విదేశీ ముష్కరులపై ఆధార పడటం లేదు. సరిహద్దుల నుంచి నేరుగా చొర బడేటట్లు చేయడం లేదు. భారతదేశం లోపల వృత్తి నిపుణులను మతోన్మాదులుగా తయారు చేసి వారిని దాడులకు ఉపయోగించుకునే పనికి పాకిస్తాన్ నిగూఢ వ్యవస్థ పాల్పడుతోంది. ఇది తమకేం సంబంధం లేదని చెప్పుకొనేందుకు పాక్ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నం. దీనివల్ల ఉగ్రవాద చర్యలను పాకిస్తాన్‌తో, దాని లోని సంస్థలతో నేరుగా ముడిపెట్టడం కుదరదు.మారిన పాక్ వ్యూహంపాక్ ఇలా వ్యూహం మార్చుకోవడం వెనుక దేశీయ, అంతర్జాతీయ అంశాలు చాలా ఉన్నాయి. ఉగ్ర సంఘటనల్లో పాత్రకుగానూ అంతర్జాతీ యంగా ఎదురయ్యే విఘాతాలను తప్పించుకోవా లని పాక్ యోచిస్తోంది. ‘ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్’ ఈ మధ్య అంటే అక్టోబర్ నెలలో పాకిక్కు తాజాగా హెచ్చరిక జారీ చేసింది. నిషే ధిత జాబితా నుంచి 2022లో బయటపడినందుకు సంబరపడిపోవద్దనీ, అది గుప్త ధనాన్ని మార్చడం, ఉగ్రవాదులకు నగదు చేకూర్చడానికి సంబంధించి అంతర్జాతీయ పర్యవేక్షణ నుంచి తప్పించుకున్నట్లు కాదనీ స్పష్టం చేసింది. పాకిస్తాన్ లోపల కూడా పరిస్థితులు సవ్యంగా లేవు.‘తెహ్రీక్–ఏ–తాలిబాన్ పాకిస్తాన్’ మళ్ళీ విజృంభిస్తోంది. అఫ్గానిస్తాన్‌తో ఘర్షణ కొనసాగుతోంది. ఫలితంగా, పాక్ సైన్యం ఆంతరంగిక భద్రతా విధుల పైనా, డ్యూరాండ్ రేఖ పైనా ఎక్కువ దృష్టి పెట్టవలసి వస్తోంది. ప్రాంతీయ ఘర్ష ణల్లో వ్యూహాత్మక లివరేజీని నిలబెట్టుకుంటూనే అంతర్జాతీయంగా తనకున్న చెడ్డ పేరును చెరిపేసు కుని, కొత్త అవతారం దాల్చినట్లుగా కనిపించవలసిన అవసరాన్ని అది గుర్తించింది. భారతదేశపు భద్రతా సంస్థలు కనివిని ఎరుగని సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. విదేశీ చొర బాటుదారులకు, దేశీయ కుట్రదారులకు మధ్యనున్న రేఖలు చెరిగిపోతున్నాయి. టెర్రర్ మాడ్యూళ్ళు వృత్తి నిపుణుల ముసుగును కూడా వేసుకుంటున్నాయి. వివిధ ప్రాంతాల్లో దొరికిన ఆయుధాలు, పేలుడు పదార్థాలు, అవి ఏవో చెదురుమదురు దాడులకు ఉద్దేశించినవి కావనీ, సరిహద్దుకు ఆవల నున్న సూత్రధారుల ఆదేశాల మేరకు విస్తృత దాడులకు పథకాలు రచించుకున్నాయనీ తేలుతోంది. భద్రతా సంస్థలు ఎప్పటికప్పుడు చురుకుగా వ్యవహరిస్తూ నూతన రిక్రూట్మెంట్ మార్గాల రూపు రేఖలను కనిపెట్టవలసి ఉంది. వృత్తి విద్యా సంస్థల్లో రాడికలైజేషన్‌పై మానవ ఇంటెలిజెన్స్ పెంచు కోవాల్సి ఉంది. ఎవరెవరు చేతులు కలుపుతున్నారో గ్రహించేందుకు ఫోరెన్సిక్ డేటాను, డిజిటల్ నిఘాను వినియోగించుకోవాలి. సంస్థలు కూడా ఉద్యోగాలిచ్చే ముందు క్షుణ్ణంగా నేపథ్యాలు తెలుసు కోవాలి. యూనివర్సిటీలు, వృత్తి విద్యా సంస్థల లోపల కౌంటర్–రాడికలైజేషన్ ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాలి. ఫ్రాన్స్ 2018లో చేపట్టిన ‘కాపాడుకునేందుకు నివారణ’ మార్గాన్నే మనమూ అనుసరించవచ్చు. సామాజిక, విద్యా, భద్రతా, జైలు వ్యవస్థలను కూడగట్టుకుని ప్రభుత్వం సమ న్వయ కార్యాచరణ ద్వారా ఎవరూ ఉగ్రవాదం వైపు మళ్ళకుండా నివారించడంపై దృష్టి పెట్టాలి.లెఫ్ట్‌నెంట్ జనరల్ ఎస్.కె. సైనీ (రిటైర్డ్)వ్యాసకర్త సైనిక దళ మాజీ వైస్ చీఫ్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)విశ్లేషణఎర్ర కోట వద్ద జరిగిన కారు పేలుడు ఘటనను ఉగ్ర దాడిగా ముద్ర వేయడంపై ప్రభుత్వం అభినందనీయమైన రీతిలో ఆచితూచి వ్యవహరించింది. దర్యాప్తు మొదలైన రెండు రోజుల తర్వాతే, దాన్ని ధ్రువపరచింది. కొన్ని ప్రాథమిక వాస్తవాలు తేటతెల్లమయ్యాయి. ఒక మాడ్యూల్ కశ్మీర్లో పనిచేస్తోంది. పెద్ద యెత్తున పేలుడు పదార్థాలు సహారన్‌పుర్, ఫరీదాబాద్ మీదుగా దేశ రాజధానికి చేరుకున్నాయి. ఆ రెండూ పరస్పర సంబంధం కలిగినవనీ, పాలుపంచుకున్నది ఒకే మాడ్యూలేననీ కొత్త డేటా తెలుపుతోంది. కానీ ఎవరి ప్రేరణతో జరిగిందనేది స్పష్టం కాలేదు. దీన్ని మరింత ప్రమాదకరమైనదిగా భావించవలసి వస్తోంది. ఇది అజ్ఞాతంగా పాకుతూ పోయే వైరస్ లాంటిది. డాక్టర్ టెర్రర్పోలీసులకు సహకరించవద్దని ఉద్భోదిస్తూ జైషే–మహమ్మద్ పోస్టర్లు నౌగామ్, శ్రీనగర్‌లలో అక్టోబర్‌లో దర్శనమిచ్చాయి. అప్రమత్తంగా ఉన్న పోలీస్ సూపరింటెండెంట్ వాటికి కారకుడైన వ్యక్తిని గుర్తించారు. అతను అదీల్ అహ్మద్ రాథెర్ అనే డాక్టర్. అనంతనాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశా లలో సీనియర్ రెసిడెంట్‌గా పనిచేశాడు. జమ్ము–కశ్మీర్ పోలీసులు ఆ వైద్య కళాశాలలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కనుగొన్నారు. వాళ్ళు ఉత్తర ప్రదేశ్ పోలీసులను అప్రమత్తం చేయడంతో, అది నవంబర్ మొదటి వారంలో సహారన్పుర్కు మకాం మార్చిన రాథెర్ అరెస్టుకు దారి తీసింది. అక్కడ తీగ లాగితే ఫరీదాబాద్‌లో డొంక కది లింది. ముజమ్మీల్ గనాయీ అరెస్టయ్యాడు. పుల్వామాకు చెందిన అతడు ఫరీదాబాద్‌లోని అల్–ఫలా ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తు న్నాడు. ఇవి నవంబర్ మొదట్లో జరిగిన సంఘ టనలు. ఫలితంగా, ఫరీదాబాద్‌లో అమో నియం నైట్రేట్‌తో సహా సుమారు 2,900 కిలోల పేలుడు పదార్థాలు దొరికాయి. మరింత మంది ఉగ్రవాదులను పసిగట్టే పనిని పోలీసులు నవంబర్ 10న ప్రారంభించి నప్పటికీ, ఆ సాయంత్రం ఎర్ర కోట వద్ద కారు బాంబు పేలింది. సీసీటీవీ ఫుటేజీలో ఉమర్ ఉన్–నబీ అనే మరో డాక్టర్ పైకి తేలాడు. కారు నడిపింది అతడేనని ఫోరెన్సిక్ ఆధారాలు వెల్ల డించాయి. అతనూ ఫరీదాబాద్‌లోని అదే ఆస్ప త్రికి చెందినవాడు. షోపియాన్‌లో ఒక రాడికల్ ఇమామ్‌ను, అల్–ఫలాకు చెందిన మహిళా డాక్టర్‌ను లక్నోలో అదుపులోకి తీసుకున్నారు. మరింత మంది పట్టుబడవచ్చు. అసలు కారు బాంబును ఉద్దేశపూర్వకంగానే పేల్చారా అనేది సందేహంగా మారింది. అక్కడికి కొద్ది వందల గజాల దూరంలో శ్రీ గౌరీ శంకర్ ఆలయం ఉంది. అక్కడ కారు బాంబును పేల్చి ఉంటే మరింత మంది చని పోయి ఉండేవారు. ఉగ్ర వాదులు సాధారణంగా కోరుకునే మతపరమైన కల్లోలాలను రేకెత్తించి ఉండేది. ముఠాలోని ఇతర సభ్యులు పట్టుబడటంతో, అతను భయోత్పాతానికి లోనై పేల్చేసుకున్నాడన్నది ఒక భావన. ఏ విధంగా చూసినా, ఇది రెండేళ్ళుగా సాగుతున్న పథకంగా కనిపిస్తోంది. ‘ఆపరేషన్ సిందూర్’కు ముందే ఈ సెల్ క్రియాశీలంగా ఉంది కనుక, జైష్, లష్కర్ల పురిటి గడ్డపై వైమానికి దాడులకు ప్రతీకారంగా ఇది జరిగి ఉండవచ్చునుకోవడానికి లేదు. కాచుకుని ఉన్న శత్రువులుఇది సడీచప్పుడు లేకుండా పనిచేస్తూ వచ్చిన, విస్తృతమైన స్లీపర్ సెల్. అనుమానించడానికి ఏమాత్రం అవకాశం లేని వ్యక్తులు దీనిలో ఉన్నారు. వారందరూ కశ్మీర్‌కు చెందినవారు కాదు. ఈ ధోరణిని అర్థం చేసుకునేందుకు స్పెయిన్, ఇటాలియన్ పోలీసుల చర్యలోకి వెళ్ళాలి. వారు అక్కడ ఒక పెద్ద పాకిస్తానీ సెల్‌ను కనుగొన్నారు. అది జనాన్ని ఉగ్రవాదం వైపు నడిపిస్తోందని తేలింది. దాని ఆనుపానులు కనుగొనేందుకు పోలీసులకు రెండేళ్ళు పట్టింది. ఈ ఏడాది మార్చిలో మాత్రమే వారు కొందరిని అరెస్టు చేయగలిగారు. ఒక కీలక వాస్తవాన్ని గుర్తించి తీరాలి. ఉగ్రవాదాన్ని సరికొత్తగా సృష్టించలేం. ప్రస్తుతమున్న వేర్పాటువాద పరిస్థితిని ఆధారం చేసుకునే అది పైకి లేస్తుంది. వీటిలో రెండవ దానికి పాకిస్తానే చక్కని ఉదాహరణ. ఢిల్లీ ఇంతవరకు ఉపేక్షించిన ఒక అంశానికి వ్యతిరేకంగా కార్యాచరణకు దిగాలి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మత విద్వేషం సెగలు గక్కుతోంది. రెండు వర్గాలకు చెందిన మనుషులు చనిపోయిన అంశాన్ని మీడియా ప్రముఖంగా పేర్కొనవలసిన అవసరం ఉంది. ఇది దేశాల సరిహద్దులను దాటిన అంతర్జాతీయంగా కనిపిస్తున్న ధోరణి. కీలక ఉగ్రవాద నాయకులు తుర్కియేలోని ‘సూత్రధారుల’తో సమావేశమైనట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో, అంకారాను హెచ్చరించడం కూడా సమయోచితం అనిపించుకుంటుంది. భారతదేశాన్ని ఎలాగైనా ముక్కచెక్కలు చేయాలని చాలా మంది శత్రువులు కాచుకుని కూర్చున్నారు. భారత్–పాక్ యుద్ధానికి దిగాలని చూస్తున్నారు. భారత్ ఆర్థికంగా స్థిరంగా వృద్ధి చెందుతూండటం అనేక రాజధానులలో గణనీయమైన ఆందోళన రేకెత్తిస్తోంది. తారా కార్థా వ్యాసకర్త నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ మాజీ డైరెక్టర్(‘ద హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
కుట్రదారులకు అత్యంత కఠిన శిక్షలు తథ్యం
అహ్మదాబాద్: ఢిల్లీ పేలుడు ఘటన వెనుక ఉన్న అసలైన సూత్రధారులకు అత్యంత కఠిన శిక్షలు పడేలా కృషి చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి దాడికి పాల్పడేందుకు మరొకరు సాహసించకుండా ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో పలు కార్యక్రమాలను అమిత్ షా గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు. షెడ్యూల్ ప్రకారం ఆయన ఇక్కడ స్వయంగా పర్యటించాల్సి ఉండగా, ఢిల్లీ పేలుడు నేపథ్యంలో రద్దు చేసుకున్నారు. వర్చువల్‌గా మాట్లాడారు. ముష్కరులకు కఠిన శిక్ష పడితేనే అది మరొకరికి హెచ్చరిక అవుతుందని అన్నారు. ఢిల్లీ పేలుడు కుట్రదారులకు సాధ్యమైనంత ఎక్కువ కఠిన శిక్ష పడేలా చూస్తామని తెలిపారు. వారిని చట్టం ముందు నిలబెట్టే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా ఉగ్రవాదంపై పోరాడుతూనే ఉందని గుర్తుచేశారు. -
32 చోట్ల మారణహోమానికి స్కెచ్
న్యూఢిల్లీ: దశాబ్దాల క్రితం బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా, తాజాగా ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్తాన్లో జైషే మొహమ్మద్ కీలక నేతల మరణాలకు కక్షసాధింపుగా నిద్రాణ ముష్కరమూకలు తలపెట్టిన మారణకాండ గుట్టు రట్టవుతోంది. ఎర్రకోట వద్ద కారును పేల్చేసిన ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీ హాస్టల్ గది వేదికగా పేలుళ్ల కుట్రకు ఉగ్రవాదులు పథక రచన చేశారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఏఐ) అధికారులు గురువారం తేల్చారు. ఫరీదాబాద్‌లోని అల్–ఫలాహ్ విశ్వవిద్యాలయంలోని బాయ్స్ హాస్టల్ 17వ భవంతిలోని 13వ నంబర్ గదిని ఉగ్రవాదులు తమ రహస్య అడ్డాగా ఉపయోగించుకున్నారు. ఇక్కడి నుంచే అన్ని చోట్లా దాడులకు వ్యూహం పన్నారు. 32 పాత, కొత్త కార్లలో బాంబులను అమర్చి దేశంలోని నాలుగు ప్రధాన నగరాలతోపాటు 32 ప్రాంతాల్లో పేల్చేసి పెను విధ్వంసం సృష్టించాలనేది ఉగ్రవాదుల అసలు కుట్ర అని స్పష్టమైంది. ఇప్పటికే అరెస్టయిన డాక్టర్ ముజామిల్‌కు, ఉమర్‌కు మధ్య చివర్లో విబేధాలు పొడచూపాయి. ఈ కారణంగానే దాడి ప్రాంతాలు మారాయా? దాడి చేయాల్సిన తేదీలు మారాయా? అనేది తేలాల్సి ఉంది. డైరీలో కోడ్ నేమ్‌లు, బాంబుల నిల్వ ప్రాంతాలు.. వర్సిటీ హాస్టల్లో ముజామిల్‌కు చెందిన 13వ నంబర్ గదితోపాటు ఉమర్ ఉండే నాలుగో నంబర్ గదిలో అధికారులు 3 డైరీలను స్వాధీనంచేసుకున్నారు. వీటిలో 25 మంది వ్యక్తుల పేర్లు ఉన్నాయి. వీరిలో చాలా మంది జమ్మూకశ్మీర్, ఫరీదాబాద్‌కు చెందిన వాళ్లే. కోడ్ భాషలో పలు ప్రాంతాల పేర్లు, కొన్ని నంబర్లు రాసి ఉన్నాయి. డైరీలో నవంబర్ 8 నుంచి 12వ తేదీ వరకు మార్కింగ్ చేసి ఉంది. చాలా చోట్ల ‘ఆపరేషన్’ అని రాసి ఉంది. దీంతో ఇది ఎంతో పకడ్బందీగా జరిగిన విద్రోహచర్య అని అర్థమైంది. పాతిక మంది సాయంతో తమ ప్రణాళికను ఆచరణలో పెట్టాలని ఉమర్, ముజామిల్ భావించారని దర్యాప్తు అధికారులు తెలిపారు. ధౌజ్ గ్రామంలో 360 కేజీల అమ్మోనియం నైట్రేట్‌ను స్వా«దీనంచేసుకున్న లాడ్జ్ వివరాలను ముజామిల్ డైరీలో అధికారులు గుర్తించారు. అక్రమంగా పెద్ద ఎత్తున కొనుగోలుచేసిన ఎరువులను తమ యూనివర్సిటీ ల్యాబ్‌లోని రసాయనాల తో కలిపి అత్యంత వినాశకర, విస్ఫోటక అమ్మోనియం నైట్రేట్ ప్యూయల్ ఆయిల్(ఏఎన్‌ఎఫ్‌ఓ)ను తయారుచేసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇందుకు బలం చేకూర్చేలా హాస్టల్ గదిలో పలు రకాల రసాయనాల జాడను ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. భారీ ఎత్తున ఎరువుల కొనుగోలు ఉమర్ ఏకంగా రూ.26 లక్షల నిధులను సమీకరించాడు. ఇందులో రూ.3 లక్షలు ఖర్చుపెట్టి 26 క్వింటాళ్ల ఎన్పీకే(నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాíÙయం) ఫెర్టిలైజర్‌ను కొనుగోలుచేశాడు. గురుగ్రామ్, నూహ్, సమీప పట్టణాలకు చెందిన సప్లయర్ల ద్వారా వీటిని తెప్పించాడు. ఈ ఎరువులను ల్యాబ్‌లో తీసుకొచ్చిన రసాయనాలతో తొలుత సూక్ష్మస్థాయిలో అత్యంతపేలుడు పదార్థం(ఐఈడీ) తయారుచేశాడు. అది విజయవంతమయ్యాకే పేలుడు పదార్థాలను సొంత కార్లలో ధౌజ్, తాగా గ్రామాల్లోని తమ స్థావరాలకు తరలించారు. అక్కడే కార్లకు బాంబు సర్క్యూట్లను బిగించి లక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్లాన్ చేశారు. థ్రీమా మెసేజింగ్ యాప్‌లో చాటింగ్ తమ ప్లాన్ ఎవరికీ తెలీకూడదనే ఉద్దేశంతో స్విట్జర్లాండ్‌కు చెందిన మెసేజింగ్ యాప్ ‘థ్రీమా’లో ఉమర్, ముజామిల్ ఘనీ, వైద్యురాలు షాహీన్ సయీద్‌లు చాటింగ్ చేసుకునేవారు. ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్‌లోని కీలకమైన సభ్యులతో చర్చించేందుకు ఉమర్ విడిగా సిగ్నల్ యాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశాడు. 4 నగరాల్లో పేలుళ్లకు సంబంధించిన ప్లాన్‌ను నేరుగా పర్యవేక్షించేందుకు ఒక్కో నగరానికి ఇద్దరు ఉగ్రవాదుల చొప్పున మొత్తం ఎనిమిది మంది కీలక సభ్యులను ఎంపికచేశాడు. వర్సిటీని జల్లెడ పడుతున్న అధికారులు ఒకే వర్సిటీలో ఒకే వృత్తిలోని వ్యక్తులు ఉగ్రభావజాలంలో మునిగిపోవడంతో ఈ విద్యాసంస్థ ఉగ్రఅడ్డాగా మారిందా? అనే కోణంలో దర్యాప్తు అధికారులు వర్సిటీని జల్లెడపడుతున్నారు. వర్సిటీకి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లను ఫోరెన్సిక్ ఆడిట్‌కు పంపించారు. ఇప్పటికే దొరికిన ఆధారాలతో ఇక్కడి విద్యార్థుల ఫోన్ నంబర్లు, సామాజిక మాధ్యమ ఖాతాలు, సొంత గ్రామాల చిరునామాలు సరిపోలుతాయో లేదోనని చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అరెస్టయిన వైద్యురాలు షాహీన్‌తో సత్సంబంధాలున్న 32 ఏళ్ల వైద్య విద్యార్థి మొహమ్మద్ ఆరిఫ్ మిర్‌ను పోలీసులు గురువారం అరెస్ట్‌చేశారు. ఆరిఫ్ ప్రస్తుతం కాన్పూర్‌లోని లక్ష్మీపత్ సింఘానియా కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ కాలేజీలో ఎండీ వైద్య విద్యనభ్యసిస్తున్నాడు. కశ్మీర్‌లోని ఖాగూర్ సాదవారీ ప్రాంతం ఆరిఫ్ స్వస్థలం. నజీరాబాద్‌లో ఆరిఫ్ ఇంట్లోంచి పోలీసులు ఒక ల్యాప్‌టాప్‌ను స్వా«దీనంచేసుకున్నారు. ఏటీఎస్ బృందం వచ్చే సమయానికి ఆరిఫ్ తన ఫోన్ డేటాను తొలగిస్తూ కనిపించాడు. ఆరిఫ్‌కు గతంలో నీట్ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామినేషన్‌లో ఆలిండియా 1608 ర్యాంక్ రావడం విశేషం. ఇంతటి ప్రతిభావంతుడు ఉగ్రవాదులతో చేతులు కలపడం ఆశ్చర్యంగా ఉందని కాలేజీ ప్రిన్సిపల్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ పట్టణంలోని జీఎస్ మెడికల్ కాలేజీ అధ్యాపకుడు డాక్టర్ ఫారూఖ్‌ను ఢిల్లీ పోలీసులు ఇదే కేసులో గురువారం అరెస్ట్ చేశారు. ఇతను కూడా గతంలో అల్–ఫలాహ్ కాలేజీలోనే విద్యనభ్యసించాడు. వీళ్లంతా ఒకే ఈ–మెయిల్ ఐడీని వాడుతున్నట్లు గుర్తించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ చిక్కకుండా చిక్కుముడి రూట్ ఢిల్లీకి వచ్చేటప్పుడు మార్గమధ్యంలో పోలీసులకు చిక్కకుండా ఫరీదాబాద్ నుంచి ఉమర్ ప్రయాణించిన మార్గాన్ని పోలీసులు గుర్తించారు. డజన్లకొద్దీ సీసీటీవీ ఫుటేజీలను జల్లెడపట్టాక అతని ప్రయాణరూట్పై ఒక స్పష్టత వచి్చంది. ఆదివారం అతను ఫరీదాబాద్ నుంచి బయల్దేరి ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణించాడు. నూహ్ జిల్లాలోని ఫిరోజ్‌పూర్ ఝిర్కాకు రాగానే రోడ్డు పక్కన ధాబా వద్ద ఆగాడు. వెనక సీట్లో పెద్ద బ్యాగులో బాంబు ఉండటంతో ఎటూ పోకుండా కారులోనే కూర్చున్నాడు. రాత్రంతా కారులోనే నిద్రపోయాడు. మార్గమధ్యంలో పట్టణాల మీదుగా వెళ్లకుండా గ్రామాలమీదుగా వెళ్లాడు. పెద్ద హోటళ్లలో తినకుండా రోడ్డు పక్కన చిన్న హోటళ్లలో భోజనాలు కానిచ్చాడు. బదార్పూర్ బోర్డర్ గుండా ఢిల్లీకి చేరుకున్నాడు. సరళరేఖ మార్గంలో వెళ్లకుండా గజిబిజి ప్రయాణాల చేశాడు. తూర్పు ఢిల్లీ, ఓఖ్లా, పారిశ్రామిక నడువా, కన్నాట్ ప్లేస్ ఇలా వేర్వేరు చోట్ల తిరిగి చివరకు ఎర్రకోట వద్దకు చేరుకున్నాడు. ఎక్కువ రద్దీ ఉంటే చోట్ల తనిఖీలు, ట్రాఫిక్ పోలీసుల నిఘా ఉండదనే ఉద్దేశ్యంతో ఆ మార్గాల్లో ప్రయాణించాడు.ఉమర్ మూడో కారు లభ్యం వర్సిటీ పార్కింగ్ ప్రదేశంలో ఉమర్ మూడో కారును పోలీసులు గుర్తించారు. ఇది ఇప్పటికే అరెస్టయిన వైద్యురాలి పేరిట ఉంది. దీనిని ఉమర్ పేలుడు పదార్థాల రవాణా కోసం ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు. మొత్తం పేలుళ్లకు 32 కార్లు అవసరమని, వాటిల్లో కొన్నింటిని కొత్తగా కొనుగోలుచేయాలని పథక రచనచేశారు. పలువురిచేతులు మారి మూలాలు కనిపెట్టలేని పాత కార్లను దాడుల కోసం ఎంచుకున్నారు. మరోవైపు అల్–ఫలాహ్ వర్సిటీ సభ్యత్వాన్ని రద్దుచేస్తున్నట్లు ‘ది అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్’(ఏఐయూ) గురువారం ప్రకటించింది. విద్యాప్రమాణాల మేరకు సంస్థను నడపని ఈ వర్సిటీకి సంఘంలో ఉండే అర్హతలేదని ఏఐయూ తెలిపిందిపంజాబ్లో ఉగ్ర కుట్ర భగ్నం 10 మంది అరెస్టు చండీగఢ్: పంజాబ్‌లో మరో ఉగ్రవాద కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ అండదండలతో గ్రెనేడ్ దాడికి ముష్కరులు పథకం వేయగా, పోలీసులు ముందుగానే గుర్తించి అడ్డుకున్నారు. ఈ కుట్రకు సంబంధించి 10 మందిని అరెస్టు చేశారు. పంజాబ్‌లో గ్రెనేడ్ దాడి చేసి, అశాంతి సృష్టించాలన్నదే వారి అసలు లక్ష్యమని విచారణలో పోలీసులు తేల్చారు. పాకిస్తాన్‌లోని హ్యాండ్లర్స్‌తో వారు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారని చెప్పారు. ముగ్గురు నిందితులను కులదీప్ సింగ్, శేఖర్ సింగ్, అజయ్ సింగ్‌గా గుర్తించారు. వారు పంజాబ్‌లోని శ్రీముక్తార్ సాహిబ్‌కు చెందినవారేనని డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు. చైనాలో తయారైన హ్యాండ్ గ్రెనేడ్‌ను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ప్రకటించారు. -
భారీ 'ఉగ్ర' కుట్ర.. ప్రసాదాల్లో కలిపి పంచేద్దాం!
సాక్షి, హైదరాబాద్: అహ్మదాబాద్ ఏటీఎస్ కస్టడీలో ఉన్న ఇస్లామిక్ స్టేట్ ఖురాసన్ ప్రావెన్సీ (ఐఎస్కేపీ) ఉగ్రవాదుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్, ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాకు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్, లక్ష్మీపూర్‌ఖేరీ జిల్లాకు చెందిన మహ్మద్ సుహైల్ సలీం ఖాన్‌లను వివిధ కోణాల్లో అధికారులు విచారిస్తున్నారు. ముఖ్యంగా ప్రమాదకరమైన విషం రిసిన్‌ను ఎలా తయారు చేశారు? దాన్ని ఎక్కడ, ఎలా వినియోగించాలని భావించారు? ఈ మాడ్యూల్లో ఇంకా ఎవరైనా ఉన్నారా? తదితర అంశాలను ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితులు రిసిన్‌ను ప్రసాదాల్లో కలిపి పంచడం ద్వారా ఎక్కువ ప్రాణ నష్టం కలిగించే ఆలోచన కూడా చేసినట్లు తెలిసింది. పీడీఎఫ్ ఫార్మాట్లో వచ్చిన పత్రాలు పాక్–అఫ్గాన్ సరిహద్దుల్లో ఉండి ఈ మాడ్యూల్‌ను నడిపిస్తున్న అబు ఖదీజా ఆదేశాల మేరకు పని చేసిన మొయినుద్దీన్‌కు అవసరమైన సమాచారం కూడా అతడి నుంచే అందింది. ఎంపిక చేసుకున్న వ్యక్తుల్ని మట్టుపెట్టే టార్గెట్ కిల్లింగ్‌కు బదులు ఎక్కువ సంఖ్యలో ప్రాణనష్టం కలిగించేలా మాస్ కిల్లింగ్ చేయాలని ఖదీజా ఆదేశించాడు. దీనికోసం బాంబులు, తుపాకులు కాకుండా విషం ప్రయోగించాలని సలహా ఇచ్చాడు. ఈ మేరకు ప్రాణాంతక రిసిన్ తయారీ విధానాన్ని వివరించే పత్రాలను పీడీఎఫ్ ఫార్మాట్లో టెలిగ్రాం ద్వారా షేర్ చేశాడు. దీని ఆధారంగా ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన మొయినుద్దీన్ దాని తయారీపై కొంత పరిజ్ఞానం సంపాదించాడు. పల్ప్ ఎక్స్ట్రాక్టర్ మిషన్ సహాయంతో.. ఎలాంటి రుచి లేని ఈ విషపదార్థం సైనైడ్ కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ఆముదం గింజలపైన ఉండే తెల్లటి బుడిపె నుంచి మాత్రమే దీన్ని తయారు చేసే అవకాశం ఉంది. దీని తయారీ కోసం మొయినుద్దీన్ స్థానిక మార్కెట్ నుంచి చిన్న సైజు పల్ప్ ఎక్స్ట్రాక్టర్ మిషన్ ఖరీదు చేశాడు. షావర్మా సెంటర్ కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ మిషన్ తన వద్ద ఉన్నట్లు తెలిసినా ఎవరూ అనుమానించరనే ఉద్దేశంతో ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నాడు. ఇటీవల మొయినుద్దీన్ ఇల్లు, షావర్మా సెంటర్ నుంచి ఏటీఎస్ అధికారులు స్వా«దీనం చేసుకున్న వాటిలో అబు ఖదీజా పంపిన పీడీఎఫ్ ఫార్మాట్ పత్రాల ప్రింట్ అవుట్‌తోపాటు పల్ప్ ఎక్స్ట్రాక్టర్ మిషన్ కూడా ఉంది. భారీ కుట్ర చేసిన యూపీ ద్వయం తన ఇంటితోపాటు షావర్మా సెంటర్లో రిసిన్ తయారు చేస్తున్న మొయినుద్దీన్ దీని వినియోగంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఖదీజా నుంచి వచ్చే ఆదేశాల ప్రకారమే కుట్ర అమలు చేయాలని వేచి ఉన్నాడు. సులేమాన్, సలీం ఖాన్ మాత్రం భారీ కుట్ర చేశారు. రిసిన్‌ను కలిపిన ప్రసాదాలు తయారు చేద్దామని, వాటిని పండుగలకు, ఆధ్యాత్మిక ఊరేగింపుల సమయంలో పంచి పెడదామని మొయినుద్దీన్‌కు చెప్పారు. దీనివల్ల ఒకేచోట భారీ స్థాయిలో ప్రాణనష్టం కల్పించవచ్చంటూ ప్రేరేపించారు. అయితే అబూ ఖదీజా నుంచి క్లియరెన్స్ వచ్చే వరకు ఎలాంటి చర్యలు వద్దని మొయినుద్దీన్ వారించాడు. అనేకమార్లు అహ్మదాబాద్‌కు మొయినుద్దీన్ గడిచిన రెండేళ్ల కాలంలో మొయినుద్దీన్ అనేకసార్లు అహ్మదాబాద్ వెళ్లివచ్చినట్లు ఏటీఎస్ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది సెపె్టంబర్లో వెళ్లిన అతను ఓ హోటల్లో బస చేశాడు. ఆపై గుర్తుతెలియని వ్యక్తి నుంచి కొంత నగదు అందుకొని మరుసటి రోజు తిరిగి వచ్చాడు. ఈ విషయం ఏటీఎస్ విచారణలో అంగీకరించిన మొయినుద్దీన్ కేవలం ఖదీజా ఆదేశాల మేరకు రాకపోకలు సాగించానని, నగదు అందించిన వ్యక్తి ఎవరన్నది అతడికే తెలుస్తుందని వెల్లడించాడు. దీంతో ఈ మాడ్యూల్లో మరికొందరు ఉన్నారని అనుమానిస్తున్నారు. పదో తరగతి వరకు ఖమ్మంలోనే.. ఖమ్మం క్రైం: మెయినుద్దీన్ సయ్యద్ ఖమ్మంవాసి కావడంతో ఆయనతో ఇక్కడ ఎవరికైనా సంబంధం ఉందా అనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఖమ్మం వన్‌టౌన్ ప్రాంతంలో నివాసమున్న సయ్యద్ కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు మకాం మార్చింది. అయితే వారి సన్నిహితులు, బంధువుల్లో కొందరు ఖమ్మంలోనే ఉండటంతో వారితో సయ్యద్ సంబంధాలు కలిగి ఉన్నాడా అనే కోణంలో ఆరా తీసినట్లు తెలిసింది. ఖమ్మంలోని తాత ఇంటి వద్ద పదో తరగతి వరకు చదువుకున్న మొయినుద్దీన్.. చైనాలో ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్లిన సమయంలో వారి కుటుంబం హైదరాబాద్‌కు వెళ్లింది. కాగా, గురువారం గుజరాత్ ఏటీఎస్ అధికారులు హైదరాబాద్ రాజేంద్రనగర్ ఫోర్ట్ వ్యూ కాలనీలోని మొయినుద్దీన్ నివాసంలో విస్తృత్త సోదాలు నిర్వహించారు. తెల్లవారుజామునే వచ్చిన సిబ్బంది.. మొయినుద్దీన్ గదిలోని డైరీతోపాటు ఇతర పుస్తకాలు, కొన్ని ముడిపదార్థాలను సీజ్ చేసి తీసుకెళ్లినట్లు సమాచారం. -
ఢిల్లీ పేలుడు..చిన్న పోస్టర్‌తో.. జైషే కుట్రపై గర్జించిన తెలుగు సింహం!
న్యూఢిల్లీ: భారత్‌లో భారీ ఉగ్రహింసకు స్కెచ్ వేసిన జైషే మహ్మద్ ఉగ్రకుట్రను ఓ చిన్న పోస్టర్ ద్వారా భగ్నం చేయడం విశేషం. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు వ్యూహరచన చేసిన జైషే మహ్మద్ పోస్టర్లను నెల క్రితమే ఓ పోలీసు అధికారి గుర్తించి, సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ఫలితంగా దేశాన్ని పెను విధ్వంసం నుంచి కాపాడగలిగారు. ఈ ఘనత సాధించిన అధికారి మన తెలుగువారే కావడం గర్వకారణం.తెలుగు ఐపీఎస్ అధికారి సందీప్ చక్రవర్తి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన డాక్టర్ జీవీ సందీప్ చక్రవర్తి, జైషే మహ్మద్ కుట్రను ఛేదించి తన శౌర్యాన్ని చాటారు. ఇప్పటికే ఆరు సార్లు రాష్ట్రపతి పోలీసు శౌర్య పతకం అందుకున్న ఆయన, ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నారు. ఇది ఆయనకు ఆరో అవార్డు కావడం విశేషం.పోస్టర్‌తో బండారం బట్టబయలు 2019 వరకు కాశ్మీర్లో ఉగ్రసంస్థలు సైనిక అధికారులను బెదిరిస్తూ పోస్టర్లు వేయడం సాధారణంగా జరిగేది. కానీ ఆర్మీ అప్రమత్తతతో ఆ కార్యకలాపాలు తగ్గాయి. అయితే, గత నెలలో శ్రీనగర్‌లో రహస్యంగా తరలిస్తున్న జైషే మహ్మద్ పోస్టర్లను ఐపీఎస్ సందీప్ గమనించారు. వెంటనే సీసీటీవీ ఫుటేజీ తెప్పించి, ముగ్గురు యువకులు పోస్టర్లు తరలిస్తున్న దృశ్యాలను గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి విచారించగా, షోపియాన్‌కు చెందిన మత గురువు ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ ఆధ్వర్యంలో జైషే కుట్ర జరుగుతున్నట్లు వెల్లడైంది.ఉగ్రవాదుల అరెస్టు..పేలుడు పదార్థాల స్వాధీనం విచారణలో జమ్మూ కశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు స్కెచ్ వేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఫరిదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో డాక్టర్లుగా పనిచేస్తున్న ముజమ్మీల్ షకీల్, అదీల్ అహ్మద్, లక్నోకు చెందిన షాహీన్ సహా మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2900 కిలోల పేలుడు పదార్థాలు, అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్, అలాగే రెండు AK-47 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. పుల్వామాకు చెందిన మరో డాక్టర్ ఉమర్ పరారీలో ఉండగా, అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.సందీప్ చక్రవర్తి ప్రస్థానం కర్నూలులో జన్మించిన సందీప్ చక్రవర్తి, మాంటిస్సోరి పబ్లిక్ స్కూల్లో విద్యనభ్యసించి, మెడిసిన్ పట్టభద్రులయ్యారు. అనంతరం సివిల్స్‌లో ర్యాంకు సాధించి 2014లో ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం శ్రీనగర్‌లో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) గా సేవలందిస్తున్నారు. పూంచ్ ఏఎస్పీగా తన సర్వీసు ప్రారంభించిన ఆయన, హంద్వారా, కుప్వారా, కుల్గాం, అనంతనాగ్, శ్రీనగర్ సౌత్ జోన్, బారాముల్లా వంటి కీలక ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహించారు.ఆరు రాష్ట్రపతి శౌర్య పతకాలుసందీప్ ఇప్పటివరకు ఆరు రాష్ట్రపతి శౌర్య పతకాలు, నాలుగు జమ్మూ అండ్ కశ్మీర్ గ్యాలంట్రీ మెడల్స్, ఇండియన్ ఆర్మీ చీఫ్ కమెండేషన్ డిస్క్ సహా అనేక పురస్కారాలు అందుకున్నారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం ముగ్గురు పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఆపరేషన్ మహదేవ్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. -
ఢిల్లీ పేలుళ్లు.. అల్ ఫలాహ్ యూనివర్సిటీ సభ్యత్వం రద్దు
ఢిల్లీ: ఢిల్లీ పేలుళ్ల కేసులో కీలకంగా మారిన అల్ ఫలాహ్ యూనివర్సిటీపై చర్యలు ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీల సంఘం (Association of Indian Universities – AIU) ఈ అల్ ఫలహా్ యూనివర్సిటీకి ఇచ్చిన సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఢిల్లీ పేలుడు ఘటనలో ఈ యూనివర్సిటీకి సంబంధించి ఉగ్రవాద అనుమానితుల అరెస్టు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇటీవల ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు కేసులో జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఇద్దరు డాక్టర్లు ముజమ్మీల్ షకీల్, అదీల్ అహ్మద్ ఈ యూనివర్సిటీలో పనిచేసినట్లు గుర్తించారు. వీరికి జైషే మహ్మద్ ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉగ్రకుట్రలో భాగంగా దేశవ్యాప్తంగా పేలుడు పదార్థాలు తరలించినట్లు విచారణలో వెల్లడైంది.ఈ క్రమంలో ఏఐయూ అల్ ఫలాహ్ యూనివర్సిటీ సభ్యత్వాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం కాకుండా పూర్తిగా రద్దు చేసింది విద్యార్థుల భద్రత, విద్యా ప్రమాణాల పరిరక్షణ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐయూ తెలిపింది. ఈ సభ్యత్వ రద్దుతో, యూనివర్సిటీకి ఏఐయూ గుర్తింపు ద్వారా లభించే ప్రయోజనాలు ఇకపై అందుబాటులో ఉండవు. -
సంచలనం.. దేశ వ్యాప్తంగా 32 కార్లతో దాడులకు కుట్ర?
ఢిల్లీ: ఎర్రకోట పేలుడు కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాబ్రీ మసీదును కూల్చేసిన డిసెంబర్ ఆరున ఢిల్లీలో వరుస బాంబుపేలుళ్లు జరపాలని వైద్యుల ముసుగులో ఉన్న ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తేలింది. ఆరు దశల్లో దాడులు జరిపేందుకు ఉగ్రవాదులు 32 కార్లను సిద్ధం చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులకు పలు కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం రెడ్‌పోర్టు సమీపంలో హ్యుందయ్ ఐ20లో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 13మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు జరిగిన హ్యూందయ్ ఐ20తో పాటు మారుతి సూజికీ బ్రీజా, స్విఫ్ట్ డిజైర్,ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ వంటి కార్లు ఈ కుట్రలో భాగంగా ఉన్నట్లు తేలింది అందుకు ఎర్రకోట పేలుళ్లలో మరణించిన కారుతోపాటు పేలిపోయిన డాక్టర్ ఉమర్ నబీ కారు హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని మేవాట్‌కు చెందిన అల్–ఫలాహ్ యూనివర్సిటీలో లభ్యం కావడంతో ముష్కరుల ప్లాన్ బెడిసి కొట్టింది. ఎర్రకోట పేలుళ్లు, కారులో డాక్టర్ ఉమర్ నబీ డీఎన్ఏ లభ్యం కావడం, అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఉమర్ కారు ప్రత్యక్షమవ్వడంతో దర్యాప్తు సంస్థలు ఈ యూనివర్సిటీనే ఉగ్రవాదలు తమ కార్యకలాపాలకు అడ్డగా మార్చుకున్నారనే అనుమానాలు మొదలయ్యాయి. దీంతో జాతీయ భద్రతా సంస్థలు పేలుళ్ల కేసును ఆ కోణంలో దర్యాప్తు చేపట్టగా.. 32 కార్లతో దేశ వ్యాప్తంగా దాడులకు పాల్పడేందుకు కుట్ర జరిపిన ఆధారాలు సైతం వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అనుమానిత కార్లను గుర్తించేందుకు పోలీసులు,కేంద్ర భద్రతా బలగాలు సంస్థలు జల్లెడ పడుతున్నాయి. ఫరీదాబాద్‌లో అల్–ఫలాహ్ విశ్వవిద్యాలయం సమీపంలోని తన అద్దె ఇంట్లో పేలుడుపదార్థాలను దాచిపెట్టేందుకు ఉగ్రవాదులకు సాయపడిన ఇస్లాం మతబోధకుడు, మౌల్వీ ఇష్తియాఖ్ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మౌల్వీ తరచూ అల్–ఫలాహ్ విశ్వవిద్యాలయంలో మత సంబంధ కార్యక్రమాలు నిర్వహించేవాడు. అలా ఉమర్, ఘనీసహా పలువురు వైద్యులు, విద్యార్థుల మెదళ్లలోకి ఉగ్రభావజాలాన్ని నింపినట్లు తేలింది.ఐఈడీల తయారీ! మౌల్వీ సాయంతో ఉగ్రమూకలు 200 ఐఈడీల తయారీలో ఉగ్రమాడ్యూల్ సభ్యులు గతంలోనే మునిగిపోయారని దర్యాప్తులో తేలింది. ఢిల్లీలోని ఎర్రకోట, ఇండియాగేట్, కాన్సిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం, గురుగ్రామ్, ఫరీదాబాద్‌సహా దేశంలోని కీలక ఎయిర్‌పోర్ట్‌లు, రైల్వేస్టేషన్లు, మాల్స్ వద్ద పేలుళ్లు జరపాలని భారీ ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో అమ్మోనియం నైట్రేట్‌తోపాటు ఒక కొత్తతరహా రసాయనం అశేషాలను పోలీసులు గుర్తించడంతో దేశ వ్యాప్తంగా ఉగ్రకుట్రను భగ్నం చేశారు. -
పుల్వామా మాస్టర్‌మైండ్‌తో షహీన్‌కు లింకులు?
ఫరీదాబాద్ పేలుడు పదార్థాల కేసులో అరెస్టయిన డాక్టర్ షహీన్ సయీద్‌పై ఎన్ఐఏ జరుపుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పుల్వామా దాడుల మాస్టర్ మైండ్ ఉమర్ ఫారుక్ భార్య అపీరా బీబీతో సంబంధాలున్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. అంతేకాకుండా జైషే-మహమ్మద్ చీఫ్ మసూద్ చెల్లెలితోనూ తను సంప్రదింపులు జరిపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పుల్వామా అటాక్ ఈపదం వింటే చాలు భారతావని గుండె బరువెక్కుతోంది. 2019లో సీఆర్పీఎఫ్ సిబ్బంది కాన్వాయ్ పై జైషే-మహమ్మద్ అనే ఉగ్రసంస్థ జరిపిన ఈ దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడుల వ్యూహకర్తగా ఉమర్ ఫారుక్ భావిస్తారు. తాజాగా ఫరీదాబాద్‌లో అరెస్టయిన డా.షహీన్ సయీద్‌కి ఫారుక్ భార్య అపీరా బీబీతో సంబంధాలున్నట్లు ఎన్ఐఏ అనుమానిస్తుంది. ఇటీవలే ఏర్పాటైన జైషే మహమ్మద్ మహిళా విభాగం జమాత్-ఉల్-మెమినాత్ లో అపీరా బీబీది ప్రధానపాత్రని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. డా. షహీన్ కేవలం అపీరాతోనే కాకుండా జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ చెల్లెలితోనూ సంప్రదింపులు జరిపినట్లు ఎన్ఐఏ ఆరోపిస్తోంది.ఫరీదాబాద్ పేలుడు పదార్థాల అక్రమ రవాణా కేసులో డాక్టర్ షహీన్‌ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్టు చేసింది. విచారణలో జైషే మహమ్మద్ మహిళా విభాగాన్ని ఇండియాలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నించినట్లు తేలింది. దీంతో ఎన్ఐఏ మరింత లోతుగా విచారణ జరుపుతుంది. -
ఆపరేషన్ 2.0 : గంటలో యుద్ధం ముగించే సామర్థ్యం మనది!
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా ఆందోళన రేపింది. ఇది ఉగ్రదాడి అని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాదు రాజధాని ప్రాంతంలో వరుస దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. మరోవైపు ఈ పేలుడు నేపథ్యంలో ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు కేంద్రం ఆపరేషన్ సిందూర్ 2.0 చేపట్టబోతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై మేజర్ శ్రీనివాస్‌తో సాక్షి ఫ్యామిలీ ప్రత్యేకంగా మాట్లాడింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రజల కోరిక మేరకు జరిగిందని శ్రీనివాస్ స్పష్టం చేశారు. కశ్మీర్‌లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రగిలించిందనీ, దాని నేపథ్యంలోనే ప్రధాని ఆపరేషన్ సిందూర్ చేపట్టారని వెల్లడించారు. మళ్లీ ఇలాంటి దాడి జరగడం మన దేశానికి పాకిస్తాన్ బహిరంగ సవాల్ విసిరినట్టే భావించాలని శ్రీనివాస్ అన్నారు. తాజా ఢిల్లీ ఎటాక్ నేపథ్యంలో ప్రజలు కోరుకుంటే ఆపరేషన్ సిందూర్ 2.0 అనివార్యమన్నారు. అయితే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునేటపుడు క్యాబినెట్ నిర్ణయం అనేది చాలా కీలకం. ఉగ్రమూకల దాడులను తిప్పికొట్టకపోతే, వాళ్లు మరింత పేట్రేగి పోయే అవకాశం ఉంది. అందుకే దీన్ని అడ్డుకోవాల్సిందే అన్నారాయన. ఉగ్రదాడి అని తేలితే కచ్చితంగా ఆపరేషన్ సింధూర్ 2.0 చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అయితే ఇది ప్రెషిషన్ స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్ 2.0నా, లేదా నేరస్థులను మట్టు బెట్టడమా అనేది అత్యధిక సెక్యూరిటీ సంస్థ నిర్ణయం తీసుకుంటుందని శ్రీనివాస్ చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ఆగిందా? కొనసాగుతుందా అనే దానికి సమాధానం ఇస్తూ శ్రీనివాస్ ఏమన్నారంటే... పేరు ఏదైనా గానీ, ఉగ్రవాదుల చర్యల్ని నిరోధించే చర్యగా ఉండాలన్నారు. భారత్ వైపు కన్నెత్తి చూస్తే, ప్రతిఘటన తప్పదు అనే భయం ఉగ్రవాదుల్లో పుట్టాలని, అలా మన దేశ ఆపరేషన్స్ ఉండాలని, ఉంటాయని శ్రీనివాస్ స్పష్టం చేశారు.ప్రపంచ దేశాల్లో సహనానికి మారు పేరైన భారత ధోరణి, దేశ సెక్యూరిటీ స్టేటస్ ఇపుడు మారింది. భారత్‌ను దెబ్బతీయాలని చూసే ఎవరికైనా దెబ్బకు దెబ్బ తప్పదని ఆయన హెచ్చరించారు. దేశ సమగ్రతను విచ్ఛిన్నం చేయాలి, ఉగ్రవాద చర్య చేయాలి, భారత్‌ను దెబ్బతీయాలనే ఆలోచన చేసే ఉగ్రమూకల గుండెల్లో ఫిరంగులు మెగేలా ప్రస్తుత రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఆలోచిస్తోందన్నారు. మన మిలిటరీ పరంగా ఆయుధ సంపత్తి, ఆపరేషన్స్‌లో మన శక్తి సామర్థ్యాలపై ఆయన అభిప్రాయాలు, తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా చూడండి. -
ఢిల్లీ పేలుడు.. ఉమర్ డైరీలో షాకింగ్ విషయాలు
ఢిల్లీ: ఢిల్లీ పేలుడు ఘటనలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉమర్ డైరీలో ఉగ్ర కుట్రలకు సంబంధించిన షాకింగ్ వివరాలు బయటపడ్డాయి. 8 మంది సూసైడ్ బాంబర్లతో దేశవ్యాప్తంగా 4 ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తేలింది. అల్-ఫలాహ్లోకి రూమ్ నెంబర్ 13లో పేలుళ్లకు పథక రచన చేయగా.. ఉమర్‌కు చెందిన రూమ్ నెం-4లో మూడు డైరీలు లభ్యమయ్యాయి.ఉగ్రకుట్రకు కేంద్రంగా అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీ మారింది. బాయ్స్ హాస్టల్ భవనంలోని రూమ్ నెంబర్-13లో పేలుళ్లకు పథక రచన చేశారు. ఆ రూమ్.. డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌కి చెందినదిగా గుర్తించారు. పేలుళ్ల కుట్ర అమలుకు రూ. 20 లక్షలు సేకరించిన ఉమర్ గ్యాంగ్.. గురుగ్రామ్, నూహ్ నుంచి 20 కేజీల ఎన్పీకే ఫెర్టిలైజర్ కొనుగోలు చేశారు.డైరీల్లో 25 మంది పేర్లు కూడా ఉన్నాయని, వారిలో ఎక్కువ మంది జమ్మూకశ్మీర్ (ముజమ్మిల్, ఉమర్ స్వస్థలం), అలాగే ఫరీదాబాద్, పరిసర ప్రాంతాలకు చెందినవారని అధికారులు తెలిపారు. అల్-ఫలాహ్ హాస్పిటల్‌లోని ఒక కంపౌండర్ సహా పలువురు యూనివర్సిటీ సిబ్బందిని విచారణ కోసం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఢిల్లీ బ్లాస్ట్ నేపథ్యంలో కాశ్మీర్లో 13 చోట్ల కౌంటర్ ఇంటెలిజెన్స్ సోదాలు చేపట్టాయి. అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఉగ్రవాదులు డాక్టర్ ఉమర్ డాక్టర్ ముజంమిల్ గదులలో డైరీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. డైరీలలో నవంబర్ 8 నుంచి 12 మధ్యలో పేలుళ్లకు పాల్పడాలని ప్లానింగ్ చేసినట్లు గుర్తించారు. పక్కా ప్రణాళికతోనే ఎర్రకోట వద్ద పేలుడుకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.ఉమర్, ముజం ముజం మిల్.. కోడ్ భాషలో కీలక సమాచారాన్ని రాసి ఉంచారు. ఐ20 కారు, ఈకోస్పోర్ట్ కారుతో పాటు మరో రెండు వాహనాల ద్వారా మొత్తం నాలుగు చోట్ల పేలుళ్లకు పాల్పడాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు 8 మంది ఈ ప్రణాళికలో పాలుపంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఢిల్లీ పేలుడు: చాందిని చౌక్ మార్కెట్‌కు రూ.400 కోట్ల నష్టం!
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన కారణంగా చాందిని చౌక్ మార్కెట్‌కు భారీ వ్యాపారాన్ని నష్టపోయింది. ఎర్ర కోట సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిగా భావిస్తున్న పేలుడు ఘటనలో 12 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం జనాల తాకిడి ఒక్కసారిగా తగ్గిపోవడంతో మార్కెట్ వ్యాపారులు రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకూ ఆదాయాన్ని కోల్పోయినట్లు తెలుస్తోంది.దేశంలో అతిపెద్ద హోల్ సేల్ మార్కెట్ అయిన చాందినీ చౌక్ మార్కెట్ నిత్యం జనాల రద్దీతో కిక్కిరిసి ఉంటుంది. రోజుకు సగటున దాదాపు నాలుగు లక్షల మంది ఈ మార్కెట్‌ను సందర్శిస్తుంటారు. ఇక్కడ ప్రతిరోజూ రూ .450 కోట్ల నుంచి రూ.500 కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుందని అంచనా. అయితే, పేలుడు తర్వాత జనాల తాకిడి ఒక్కసారిగా తగ్గిపోయిందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.చాందినీ చౌక్ ప్రాంతంలో వ్యాపారాలు తాత్కాలికంగానే అయినా భారీగా దెబ్బతిన్నాయని స్థానిక ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు. ‘ఇక్కడ వాణిజ్యం సుమారు రూ .300-400 కోట్ల నష్టాన్ని చవిచూసింది. కానీ సాధారణ పరిస్థితులు తిరిగి వచ్చి, ట్రాఫిక్ తిరిగి ప్రారంభమైన వెంటనే, కస్టమర్ల తాకిడి తిరిగి పెరుగుతుంది. మా చాందినీ చౌక్ వ్యాపారులకు స్థైర్యం ఎక్కువ’ అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.చాందినీ చౌక్‌కు కొన్ని మీటర్ల దూరంలోనే ఎర్రకోట ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో సోమవారం సాయంత్రం ఆత్మాహుతి పేలుడు సంభవించింది. నెమ్మదిగా కదులుతున్న వాహనంలో అమర్చిన అధిక తీవ్రత కలిగిన పేలుడు పరికరం పేలింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. -
ఢిల్లీలో మరో పేలుడు శబ్దం
ఢిల్లీ: ఢిల్లీలో మరో పేలుడు సంభవించింది. మహిపాల్పూర్ (Mahipalpur) ప్రాంతంలోని రాడిసన్ హోటల్ సమీపంలో గురువారం ఉదయం భారీ శబ్దంతో పేలుడు జరిగింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఉదయం 9.18 గంటల సమయంలో ఈ పేలుడు జరిగినట్లు సమాచారం. డీటీసీ బస్సు టైర్ పేలిన భారీ శబ్దంగా పోలీసులు పేర్కొన్నారు.అనుమానాస్పద వస్తువులేవి కనిపించలేదని పోలీసులు వెల్లడించారు. సాధారణ టైరు పగిలిన సంఘటనగా పోలీసులు తేల్చారు. ఉదయం 9.18 నిమిషాల సమయంలో పేలుడు శబ్దం వినిపించిందని కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ శబ్దం విన్న ఓమహిళ మొదట PCR కాల్ చేయగా, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.At 9:18am on November 13, a commuter informed the Delhi Police about explosion near Radisson Hotel in Mahipalpur #DelhiUpon reaching the site, the police found nothing. It was a tyre burst of a DTC bus. #RedFort #LalQila #DelhiPolice pic.twitter.com/60WMstnA9r— Anish Singh (@anishsingh21) November 13, 2025ఢిల్లీ పోలీస్ బృందాలు, బాంబు నిర్వీర్య దళం, అగ్నిమాపక సిబ్బందితో కలిసి తనిఖీ చేపట్టారు. అయితే, హోటల్ పరిసరాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఢౌలా కువాన్ వైపు వెళ్తున్న డీటీసీ బస్సు వెనుక టైరు పేలడంతో ఆ శబ్దం వచ్చిందని తెలిపారు. నవంబర్ 10 సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు నేపథ్యంలో దేశ రాజధానితో పాటు ఇతర రాష్ట్రాల్లో విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. -
ఢిల్లీ పేలుడు: ‘మహిళా డాక్టర్’ను ‘డీకోడ్’ చేసిన సన్నిహితులు
లక్నో: అది.. యూపీలోని లక్నోకు చెందిన జనసాంద్రత కలిగిన దాలిగంజ్ ప్రాంతం.. అక్కడి ఒక ఇరుకైన సందులో సయ్యద్ అహ్మద్ అన్సారీ ఇల్లు ఉంది. అతని కుమార్తె డాక్టర్ షాహీన్ సయీద్‌ను ఢిల్లీలో జరిగిన పేలుడు కేసుతో పాటు ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మొహమ్మద్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టు చేశారు. అప్పటి నుంచి అందరి దృష్టి డాక్టర్ షాహీన్ సయీద్వైపు మళ్లింది.‘మాట్లాడి నాలుగేళ్లయ్యింది’పాకిస్తాన్‌కు చెందిన జైష్ ఎ మొహమ్మద్ (జెఎం) మహిళా నియామక విభాగాన్ని భారతదేశంలో నెలకొల్పేందుకు డాక్టర్ సయీద్ పనిచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఫరీదాబాద్‌లో 2,900 కిలోల పేలుడు పదార్థాలు దొరికిన దరిమిలా డాక్టర్ సయీద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. లక్నోలో ఉంటున్న సయీద్ మొహమ్మద్ షోయబ్ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు, ఏటీఎస్ అధికారులు తమ ఇంటికి వచ్చారని, మర్యాద పూర్వకంగా వ్యవహరించారని తెలిపారు. తన సోదరి నాలుగేళ్లుగా తమతో తమతో మాట్లాడలేదన్నారు. అయితే తన సోదరి గురించి తాను ఆందోళన చెందుతున్నానన్నారు. ఆమెకు ఐఐఎం రోడ్దులో ఎక్కడో ఒక ఇల్లు ఉందని మాత్రమే తెలుసని, అయితే అది ఎక్కడ ఉందో తనకు తెలియదన్నారు. ఆమె తప్పు చేసినట్లు తాను ఎప్పుడూ అనుమానించలేదని పేర్కొన్నారు. ఆమె మెడిసిన్ చదువుతున్నప్పుడు కూడా అనుమానాస్పద ఆనవాళ్లు కనిపించలేదన్నారు. ఇప్పటికీ ఈ ఆరోపణలను నమ్మలేక పోతున్నానని అన్నారు.‘చిన్న కొడుకును అరెస్ట్ చేశారు’డాక్టర్ సయీద్ తండ్రి సయ్యద్ అహ్మద్ అన్సారీ మాట్లాడుతూ తన కుమార్తె అలాంటి కార్యకలాపాలలో పాల్గొన్నదంటే తాను నమ్మలేకపోతున్నానని అన్నారు. తన పెద్ద కుమారుడు షోయబ్ నాతో ఇక్కడే ఉంటున్నాడని, రెండవ కొడుకు షాహీన్ సయ్యద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. తన చిన్న కొడుకు పర్వేజ్ అన్సారీ చాలా కాలం క్రితమే నగరం విడిచి వెళ్లాడన్నారు. తాను చివరిసారిగా తన కుమార్తె షాహీన్‌తో నెల రోజుల క్రితం మాట్లాడానన్నారు. సయీద్ మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నదని, ఆ తరువాత విడాకులు తీసుకున్నాదని అహ్మద్ అన్సారీ తెలిపారు.‘విడాకుల తర్వాత...’క్రైమ్ బ్రాంచ్ అధికారులు డాక్టర్ సయీద్ మాజీ భర్త డాక్టర్ జాఫర్ హయత్‌ను విచారించారు. తాము 2023, నవంబర్‌లో వివాహం చేసుకున్నామని, అయితే తమకు విడాకులు 2012 చివరిలో అయ్యాయన్నారు. ఆమె మనసులో ఏముందో తనకు తెలియదని, మా మధ్య ఎప్పుడూ ఎలాంటి వివాదం లేదన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలలో ఆమె ప్రమేయం ఉందనే సంగతి తనకు తెలియదని, తమ విడాకుల తర్వాత ఆమె ఏమి చేస్తున్నదో తనకు తెలియదని స్పష్టం చేశారు. ఢిల్లీ పేలుడు తర్వాత జరిగిన నిఘా సమాచారం ఆధారంగానే క్రైమ్ బ్రాంచ్ అధికారులు డాక్టర్ హయత్‌ను విచారించారని కాన్పూర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రఘుబీర్ లాల్ మీడియాకు తెలిపారని ‘ఎన్డీటీవీ’ పేర్కొంది.ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు: ‘నడిపింది’ అతనే.. డీఎన్ఏ పరీక్షలో వెల్లడి -
ఢిల్లీ పేలుడు: ‘నడిపింది’ అతనే.. డీఎన్ఏ పరీక్షలో వెల్లడి
న్యూఢిల్లీ: ఢిల్లీ పేలుడు కేసులో దర్యాప్తు సంస్థల అనుమానం నిజమయ్యింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట దగ్గర పేలిన ఐ20 కారును డాక్టర్ ఉమర్ మొహమ్మద్ నడిపారని డీఎన్ఏ పరీక్షా ఫలితాలను స్పష్టం చేస్తున్నాయని సంబంధిత వర్గాలు మీడియాకు తెలిపాయి. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తోంది.డాక్టర్ ఉమర్ మొహమ్మద్.. ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో సీనియర్ వైద్యునిగా పనిచేస్తున్నారు. ఆయన డీఎన్ఏ నమూనాతో అతని తల్లి, సోదరుని డీఎన్ఏతో 100 శాతం సరిపోలిందని అధికారులు తెలిపారని ‘ఎన్డీటీవీ’ పేర్కొంది. పేలుడు తర్వాత ఐ20లో దొరికిన ఎముకలు, దంతాలు, దుస్తుల ముక్కలను సేకరించి, పరీక్షలు నిర్వహించిన అధికారులు కారు నడిపింది ఉమర్ అనే నిర్థారణకు వచ్చారు. దీనికి ముందు ఉమర్ తల్లిని డీఎన్ఏ పరీక్ష కోసం పుల్వామాలో అదుపులోనికి తీసుకున్నారు. అలాగే పేలుడు తరువాత ఉమర్ తల్లి, అతని ఇద్దరు సోదరులను విచారిస్తున్నారు.జమ్ముకశ్మీర్ పోలీసులు హర్యానాలోని ఫరీదాబాద్‌లోని రెండు నివాస భవనాల నుండి దాదాపు 3,000 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల తర్వాత ఈ పేలుడు సంభవించింది. ఈ నేపధ్యంలో వైట్-కాలర్ ఉగ్రవాద వ్యవస్థలో కీలక లింక్‌గా మారిన డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. షకీల్ కూడా అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్ నివాసి డాక్టర్ ఆదిల్ రాథర్ ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మహ్మద్‌కు మద్దతుగా పోస్టర్లు వేసినందుకు అరెస్టు చేశారు. ఆ తరువాత తర్వాత షకీల్‌ను అరెస్టు చేశారు. షకీల్, రాథర్ అరెస్టులతో భయపడిన ఉమర్ ఎర్రకోట సమీపంలో పేలుడుకు కారకునిగా నిలిచాడని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: Delhi Blast: ట్రాఫిక్‌లో కారు పేలిందిలా.. తాజా వీడియో -
Delhi Blast: ట్రాఫిక్‌లో కారు పేలిందిలా.. తాజా వీడియో
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన శక్తివంతమైన పేలుడులో 13 మంది మృతి చెందారు. 20 మందికిపైగా జనం గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత, బయటపడిన సీసీటీవీ ఫుటేజ్‌లో రద్దీ సమయంలో హ్యుందాయ్ ఐ20 కారు పేలిన ఖచ్చితమైన క్షణాన్ని చూపించింది.ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ వన్ సమీపంలోని ట్రాఫిక్ కెమెరా నుంచి లభ్యమైన ఫుటేజ్‌లో.. ట్రాఫిక్ రద్దీలో నెమ్మదిగా కదులుతున్న తెల్లని హ్యుందాయ్ ఐ20 కారు, దాని చుట్టూ ఈ-రిక్షాలు, ఆటోలు, ఇతర వాహనాలు కనిపిస్తున్నాయి. తరువాత పేలుడు దృశ్యం కనిపించింది. సోమవారం సాయంత్రం సరిగ్గా 6:52 గంటలకు జరిగిన ఈ పేలుడు.. జనసాంద్రత అధికంగా ఉన్న పాత ఢిల్లీ ప్రాంతంలో సంభవించింది. అక్కడికి సమీపంలోని వాహనాలు, భవనాలు పేలుడు తీవ్రతకు దెబ్బతిన్నాయి. #WATCH | Delhi 10/11 Blast: Latest CCTV footage captures the moment of blast#DelhiBlast pic.twitter.com/MjC9fzjqR1— NDTV (@ndtv) November 12, 2025కేంద్రం దీనిని హేయమైన ఉగ్రవాద చర్యగా పేర్కొంది. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారికంగా దర్యాప్తు చేపట్టింది. సీసీటీవీ వీడియోలో ఐ20 హ్యుందాయ్ కారు భారీ ట్రాఫిక్ గుండా ముందుకు కదలడం తరువాత ఆకస్మిక పేలుడుతో మంటల్లో చిక్కుకోవడం కనిపిస్తుంది. అత్యవసర సేవలు సంఘటనా స్థలానికి చేరుకోలోగానే, కారు పూర్తిగా దగ్ధమైపోయింది. దర్యాప్తు అధికారులు ఆ వాహనం HR 26CE7674 రిజిస్ట్రేషన్ నంబర్ కలిగినదిగా గుర్తించారు. దీనిని పాకిస్తాన్‌కు చెందిన జైష్ ఎ మొహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న అనుమానిత సభ్యుడు డాక్టర్ ఉమర్ నబీ నడిపినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.ఉన్నతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్ ఉమర్ నబీ అక్టోబర్ 29న ఫరీదాబాద్‌కు చెందిన సోను అనే కార్ డీలర్ నుండి ఐ20ని కొనుగోలు చేశాడు. తరువాతి సీసీటీవీ ఫుటేజ్‌లో నబీ ఆ కారును రాయల్ కార్ జోన్ సమీపంలోని కాలుష్య నియంత్రణ (పీయూసీ) బూత్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అనంతరం నబీ ఆ కారును అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లాడని, అక్కడ డాక్టర్ ముజమ్మిల్ షకీల్ యాజమాన్యంలోని స్విఫ్ట్ డిజైర్ పక్కన పార్క్ చేశాడని దర్యాప్తు అధికారులు కనుగొన్నారని ‘ఎన్డీటీవీ’ తన కథనంలో పేర్కొంది. కాగా అతని నుంచి 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న తరువాత పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ షకీల్ వాహనం లక్నోకు చెందిన డాక్టర్ షాహీన్ సయీద్ పేరుతో రిజిస్టర్ అయివుంది. ఆయనను కూడా ఉగ్రవాద సంబంధాల ఆరోపణలతో అరెస్టు చేశారు.ఇది కూడా చదవండి: Delhi blast: అయోధ్యలో స్లీపర్ సెల్? వారణాసిలో.. -
‘ఉగ్ర’మూలం వెతికే డిజైన్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ సహా ఇతర డిప్లొమా కోర్సుల్లో సైబర్ సెక్యూరిటీ కోర్సును రీడిజైన్ చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కేంద్రానికి ప్రతిపాదించింది. ఉగ్ర దాడుల దర్యాప్తు, నిఘాకు ఉపయోగకరంగా ఇది ఉండాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను కూడా రూపొందించింది. మార్పులతో కూడిన సైబర్ సెక్యూరిటీ కోర్సులను వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి తెచ్చే వీలుందని ఏఐసీటీఈకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో ఇప్పుడీ అంశం చర్చకు వచ్చింది. దేశంలోని కొన్ని ఐఐటీలు, ఎన్ఐటీలకు చెందిన ప్రొఫెసర్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులు, దర్యాప్తు సంస్థల అభిప్రాయాలకు కోర్సు రీడిజైన్‌లో అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఉగ్రవాద చర్యల్లో సమాచార మార్పిడి, సైబర్ దాడులు, డేటా చోరీ వంటివి అత్యంత కీలకమైనవని దర్యాప్తు వర్గాలు అంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు వివిధ సందర్భాల్లో సెక్యూరిటీని భగ్నం చేసే విధానాలు, కోడింగ్ పద్ధతులపై ఇప్పటికే అనేక మంది నిపుణులు అధ్యయనం చేశారు. ఇందులోని సారాంశాన్ని కూడా ఐఐటీ సంస్థలు అధ్యయనం చేశాయి. అవే కీలకాంశాలు... ఉగ్రవాదులు డిజిటల్ పద్ధతులను అనుసరిస్తున్నారని ఇటీవల అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థ పేర్కొంది. దేశాల్లోని మౌలిక సదుపాయాలపై దాడులు,డేటా హ్యాకింగ్, తప్పుడు వార్తల ద్వారా మానసిక యుద్ధం సృష్టించడం, ఆర్థిక మోసాలకు పాల్పడటం వంటివి చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సైబర్ సెక్యూరిటీలో సైబర్ ఇంటెలిజెన్స్, ఎథికల్ హ్యాకింగ్, నెట్వర్క్ డిఫెన్స్ సబ్జెక్టులను మరింత ఆధునీకరించాలని ఏఐసీటీఈ భావించింది. చాప్టర్ల రూపకల్పనే కాకుండా ఇంటెలిజెన్స్ బ్యూరో, ఫోరెన్సిక్ విభాగం నుంచి నిపుణులతో ప్రాక్టికల్ అనుభవాన్ని విద్యార్థులకు అందించేలా కోర్సు డిజైన్ చేయాలని తలపోస్తోంది. వీటన్నింటినీ జోడిస్తూ సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీ పేరుతో కొత్త బ్రాంచీని కూడా తేవాలని యోచిస్తోంది. ఇంటర్న్‌షిప్ కూడా దర్యాప్తు సంస్థల తోడ్పాటుతో చేస్తే బాగుంటుందని సూచించింది. వీటిపై ఫోకస్ ఉగ్రవాద చర్యలకు మూలంగా నిర్ధారించే సైబర్ దాడులు, సహకారం, వాటి రకాలపై దృష్టి పెడుతున్నారు. కంప్యూటర్ నెట్‌వర్క్‌లో లాన్, వాన్, ఇంటర్నెట్, నెట్వర్క్ ప్రొటోకాల్స్‌లో టీసీపీ, ఐపీ, డీఎన్ఎస్, హెచ్‌టీటీపీ, ఫైర్వాల్స్లో డిటెక్షన్ సిస్టమ్, వీపీఎన్ వంటివి ఆధునీకరించాలని ఏఐసీటీఈ భావిస్తోంది. ఉగ్రవాదులు కోడింగ్, ఉగ్ర చర్యలకు అవసరమైన స్థలాల ఎంపిక వంటివి గుర్తించే విధంగా క్లాసికల్, మోడ్రన్ క్రిటోగ్రఫీ, హాషింగ్ అల్గారిథం, డిజిటల్ సిగ్నేచర్ వంటి అంశాలపై దర్యాప్తు సంస్థల తోడ్పాటుతో మార్పులు చేస్తున్నారు. మాల్వేర్ అనాలసిస్, సైబర్ ఫోరెన్సిక్ సబ్జెక్టులు అత్యంత కీలకమని భావిస్తున్నారు. ఇందులో మాల్వేర్ డిటెక్షన్, రిమూవల్, మెమొరీ, డిస్క్ ఫోరెన్సిక్ వంటి చాప్టర్లను సమూలంగా మార్చాలని ఏఐసీటీఈ భావిస్తోంది. లాస్, పాస్, సాస్వంటి క్లౌడ్, ఐవోటీ సెక్యూరిటీ విధానాలను అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా తీసుకురావాలని గుర్తించింది. దీంతోపాటు ఘటనాస్థలం ఆధారంగా నేరస్తుడు వాడిన సైబర్ మెథడ్స్‌ను ప్రాక్టికల్‌గా పరిశీలించేలా సైబర్ సెక్యూరిటీ కోర్సును తీర్చిదిద్దే యోచనలో ఉంది. -
ముమ్మాటికీ ఉగ్ర దాడే
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్ద 12 మందిని బలి తీసుకున్న కారు పేలుడు ఘటన ముమ్మాటికీ ఉగ్రవాద దాడేనని కేంద్ర మంత్రివర్గం తేల్చిచెప్పింది. ఈ పేలుడుపై విచారణ వేగవంతం చేయాలని దర్యాప్తు సంస్థలను ఆదేశించింది. దుశ్చర్యకు కారకులైన దుండగులను, వారి భాగస్వాములను, వారి వెనుక ఉన్న అసలైన కుట్రదారులను సాధ్యమైనంత త్వరగా చట్టం ముందుకు తీసుకురావాలని నిర్దేశించింది. ఉగ్రవాద పోషకులను వదిలిపెట్టబోమని తేల్చిచెప్పింది. విచారణలో ఎలాంటి జాప్యం చేయొద్దని దర్యాప్తు సంస్థలకు సూచించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీ దాడిలో మరణించివారి ఆత్మశాంతి కోసం ప్రధాని, మంత్రులు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. దాడిలో సామాన్యులు మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తంచేస్తూ మంత్రివర్గ సమావేశంలో ఒక తీర్మానం ఆమోదించారు. మొత్తం పరిస్థితిని ఉన్నత స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు కేబినెట్ వెల్లడించింది. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని మంత్రివర్గం తమ తీర్మానంలో స్పష్టంచేసింది. ఉగ్రవాదం ఎక్కడ, ఏ రూపంలో ఉన్నాసరే అంతం చేయాల్సిందేనని పేర్కొంది. దర్యాప్తు జరుగుతున్న తీరు, కుట్రదారులను గుర్తించడానికి చేపట్టిన చర్యలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంత్రివర్గ సహచరులకు తెలియజేశారు. ‘భద్రతపై కేబినెట్ కమిటీ’ సమావేశం ఢిల్లీ పేలుడు ఘటనను మతిలేని ఉగ్రవాద చర్యగా కేబినెట్ అభివర్ణించింది. ఈ పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టంచేసింది. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. బాధితులకు తగిన సాయం, చికిత్స అందించడంలో వైద్య సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, దర్యాప్తు సంస్థల సిబ్బంది, సాధారణ పౌరులు చురుగ్గా వ్యవహరించారని ప్రశంసించింది. వారి అంకితభావం, విధి నిర్వహణలో చిత్తశుద్ధి శ్లాఘనీయమని ఉద్ఘాటించింది. బాధితులకు అండగా ఉంటామని ప్రకటించింది. దేశ పౌరుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు మంత్రివర్గం తేల్చిచెప్పింది. జాతీయ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు మోదీ నేతృత్వంలో ‘భద్రతపై కేబినెట్ కమిటీ’ సమావేశం జరిగింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి శాఖ మంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు. ఢిల్లీ పేలుడు ఘటనతోపాటు తాజా పరిస్థితిపై ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. రూ.25,060 కోట్లతో ఎగమతి ప్రోత్సాహక మిషన్ ఎగమతి ప్రోత్సాహక మిషన్(ఈపీఎం)కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఆరు ఆర్థిక సంవత్సరాల్లో రూ.25,060 కోట్లతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభిస్తారు. భారత ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం భారీగా సుంకాలు విధించిన నేపథ్యంలో దేశీయ ఎగుమతిదారులను ఆదుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో రెండు ఉప పథకాలు ఉన్నాయి. అవి నిర్యాత్ పోత్రాహన్(రూ.10,410 కోట్లు), నిర్యాత్ దిశ(రూ.14,659 కోట్లు). ⇒ అరుదైన ఖనిజాలైన గ్రాఫైట్, సేసియం, రుబీడియం జిర్కోనియంపై రాయల్టీ రేట్ల హేతుబదీ్ధకరణ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. దేశీయంగా ఉత్పత్తిని పెంచడం, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మన దేశంలో ఇంధన భద్రత మరింత బలోపేతం అవుతుందని చెబుతున్నారు. ఆయా ఖనిజాలపై రాయలీ్టని తగ్గించబోతున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ⇒ మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతులను మరింతగా ప్రోత్సహించడానికి వీలుగా క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని ప్రవేశపెట్టడానికి మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ పథకంలో భాగంగా ఎగుమతిదారులకు 100 శాతం క్రెడిట్ గ్యారంటీ కవరేజీని వర్తింపజేస్తారు. అర్హులైన ఎగుమతిదారులకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ) అదనంగా రూ.20,000 కోట్ల మేర రుణ సౌకర్యం కల్పించబోతున్నారు. -
ఢిల్లీ పేలుడు ఘటన.. మరో కారు స్వాధీనం
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం(నవంబర్ 10వ తేదీ) రాత్రి జరిగిన భారీ పేలుళ్లలో అక్కడికక్కడే తొమ్మిది మంది దుర్మరణం చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు అసువులు బాశారు. ఈ ఉగ్ర కార్యకలాపాలకు కారణమైన ఒక్కొక్కరినీ స్పెషల్ టీమ్స్ అదుపులోకి తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మరో కారును స్వాధీనం చేసుకున్నారు. హరియాణాలోని ఖండవాలీ గ్రామంలో రెడ్ పోర్డ్ ఈకోస్పోర్ట్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఢిల్లీ కారు బాంబు పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న డాక్టర్ ఉమర్‌దిగా గుర్తించారు. ఆ కారు సదరు గ్రామంలో ఓ ఇంటి బయట పార్క్ చేసి ఉండటంతో దాన్ని తనిఖీ చేసి చూడగా అది ఉమర్ మహ్మద్‌కు చెందినిదిగా కనుగొన్నారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ కారులోనే ఢిల్లీ పేలుళ్లకు సంబంధించి భారీ పేలుడు పదార్థాలను తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంచితే, ఢిల్లీలో పేలుళ్ల నేపథ్యంలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కారు పేలుడు ఘటనలో తదుపరి కార్యచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సోమవారం రాత్రి జరిగిన పేలుడు ధాటికి సమీప మార్కెట్లోని ప్రజలు, రోడ్లమీద ఉన్న వ్యక్తులు ప్రాణభయంతో పరుగులుతీశారు. తీవ్రస్థాయి పేలుడు కారణంగా మృతదేహాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో అక్కడ భీతావహవాతావరణం నెలకొంది. మంటలు, హాహాకారా లు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీ సమీప ఫరీదాబాద్‌లో 2,900 కేజీల పేలుడు పదార్థాలను జమ్మూకశ్మీర్, హరియాణా, యూపీ పోలీసుల బృందం స్వాదీనంచేసుకున్న కొన్ని గంటలకే ఢిల్లీలో భారీ పేలుడు సంభవించడం యాధృచ్ఛికం కాదని దర్యాప్తు వర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. -
దేశంలో ఆరు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్: దేశంలో పలు ఎయిర్ పోర్టులకు బాబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. విమానాశ్రయాలను పేల్చేస్తామంటూ వచ్చిన మెయిల్‌తో అదికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేండ్రం, గోవా ఎయిర్‌పోర్టులను పేల్చివేస్తామంటూ ఇండిగో, ఎయిరిండియా ఎయిర్ లైన్స్ కార్యాలయాలకు మెయిల్స్ పంపించారు. దీంతో ఎయిర్ పోర్టు భద్రత దళాలు తనిఖీలు చేపట్టాయి. ఆరు ఎయిర్ పోర్టుల్లో బాంబు స్వ్కాడ్ విస్తృత తనిఖీలు చేస్తున్నాయి.ఢిల్లీలో పేలుడు ఘటనతో అంతటా అలర్ట్ ప్రకటించగా రెండు కేసుల్లో మూలాలను వెతికిపట్టుకునేందుకు ఢిల్లీ పోలీస్, ఎన్ఐఏ, నిఘా ఏజెన్సీల బృందాలు దేశవ్యాప్తంగా దర్యాప్తు కోసం బయల్దేరాయి. మంగళవారం కశ్మీర్లో నలుగురు అనుమానితులను అరెస్ట్‌చేశారు. ఢిల్లీలోని ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్లు, బస్ టర్మినళ్ల వద్ద కట్టుదిట్ట భద్రత కొనసాగుతోంది.భారతావని ఉలిక్కిపడేలా చేసిన కారు పేలుడు ఘటనను ఉగ్రవాద దుశ్చర్యగా కేంద్ర దర్యాప్తు సంస్థలు అనధికారికంగా ప్రకటించాయి. ఉగ్ర వైద్యుడు డాక్టర్ ఉమర్ మొహమ్మద్ నబీ అత్యంత విస్ఫోటక స్వభావమున్న అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ (ఏఎన్‌ఎఫ్‌ఓ)తో నిండిన కారును ఎర్రకోట సమీపంలో నడిరోడ్డుపై పేల్చేశాడని తొలుత వార్తలొచ్చాయి.అయితే ఆరుబయట అధిక వేడిమి, ఒత్తిడి కారణంగా అమ్మోనియం నైట్రేట్ పేలిపోయి ఉంటుందని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఐ20 కారును జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా లీథ్‌పురాకు చెందిన ఉమర్ నబీ నడిపినట్లు సమీప సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. దీంతో కారులో ఉన్నది అతనేనా కాదా అనేది శాస్త్రీయంగా నిర్ధారించేందుకు ఉమర్ తల్లి షమీమా బానో నుంచి డీఎన్ఏ శాంపిళ్లను సేకరించారు.ఇప్పటికే ఆమెతోపాటు ఉమర్ సోదరులు ఆషిక్ అహ్మద్, జహూర్ అహ్మద్‌లను పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. పుల్వామాలోని ఉమర్ ఇంట్లో సోదాలుచేసి కీలక డాక్యుమెంట్లు, ఎల్రక్టానిక్ పరికరాలను స్వాదీనం చేసుకున్నారు. కారు పేలినప్పుడు అందులో ఉమర్ ఒక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స చెందుతున్న క్షతగాత్రులు ముగ్గురు మంగళవారం ప్రాణాలు కోల్పోవడంతో సోమవారం నాటి పేలుడు ఘటనలో మరణాల సంఖ్య 12కు పెరిగింది. -
ఢిల్లీ పేలుడు.. హైదరాబాద్‌లో బాంబ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో హైదరాబాద్‌లో బాంబ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు చేపట్టాయి. పలు షాపింగ్ మాల్స్, ఆలయాలు, బస్స్టాఫ్లొ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. రద్దీ ప్రదేశాల్లో బాంబ్ స్క్వాడ్‌తో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఢిల్లీ పేలుడుతో అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు.. పాతబస్తీలో అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రధానంగా హైదరాబాద్ పాత నగరం నాకాబందీతో పాటు ఇతర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా పేలుళ్ల దృష్ట్యా హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ నగర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద వ్యక్తులు,వస్తువులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
Delhi Blast: టార్గెట్ జనవరి 26.. జైషే మహమ్మద్ బిగ్ ప్లాన్
-
Delhi blast: అయోధ్యలో స్లీపర్ సెల్? వారణాసిలో..
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ కారు పేలుళ్లతో సంబంధం కలిగిన ఉగ్రవాద ముఠా ఉత్తరప్రదేశ్‌లోని మతపరమైన ప్రదేశాలను, ముఖ్యంగా అయోధ్య, వారణాసిని లక్ష్యంగా చేసుకున్నదని నిఘా వర్గాలు కనుగొన్నాయి. ‘ఇండియా టీవీ’ తెలిపిన వివరాల ప్రకారం అయోధ్యలో భారీ పేలుడుకు ఈ బృందం ప్రణాళిక రచించిందని, ఢిల్లీ పేలుడు కేసులో అరెస్టయిన డాక్టర్ షాహీన్ షాహిద్.. స్లీపర్ సెల్‌ను ఇప్పటికే యాక్టివేట్ చేశాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రణాళిక అమలుకు ముందే యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)తోపాటు స్థానిక పోలీసుల సాగించిన వరుస దాడులు, అరెస్టులు ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ఛేదించడానికి దారితీశాయి.ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఉగ్రవాదుల ముఠా ప్రణాళికలో భాగం కాదని విచారణ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రాథమిక పరిశోధనల ప్రకారం పేలుడు పరికరంలో టైమర్ లేదా రిమోట్ ట్రిగ్గర్ లేదు. దీని ప్రకారం చూస్తే పేలుడు ప్రమాదవశాత్తు లేదా తొందరపాటులో జరిగి ఉండవచ్చని సూచిస్తున్నది. అనుమానితులు పేలుడు పదార్థాలను రవాణా చేస్తుండగా, అది పేలిపోయిందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.అధికారుల విచారణలో ఉగ్రవాద నెట్వర్క్ ఆస్పత్రులు, ఇతర రద్దీగా ఉండే ప్రాంతాలను కూడా టార్గెట్ చేసినట్లు తేలింది. నిందితులు లక్ష్యంగా చేసుకున్న ప్రాంతాల్లో అధిక రద్దీతో ఉండే ఆస్పత్రులు, జనసమ్మర్థం ఉన్న ప్రదేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో భద్రతా సంస్థలు తాజాగా కమ్యూనికేషన్ రికార్డులు, డిజిటల్ ట్రయల్స్, ఈ మాడ్యూల్, ఉత్తర భారతదేశంలో చురుగ్గా ఉన్న ఉగ్రవాద సంస్థల మధ్య సంబంధాలను పరిశీలిస్తున్నాయి.సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో నిలిపివుంచిన హ్యుందాయ్ ఐ20 కారులో చోటుచేసుకున్న పేలుడులో 13 మంది మృతిచెందారు. 20 మందికి పైగా జనం గాయపడ్డారు పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ పేలుడు కారణంగా మంటలు చెలరేగి, సమీపంలోని కార్లకు వ్యాపించాయి. స్టేషన్ గేట్ నంబర్ వన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతుల కుటుంబాలకు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)విచారణ చేస్తోంది.ఇది కూడా చదవండి: Delhi blast: చెదిరిన టాటూలు, చిరిగిన టీ-షర్టులు.. -
Delhi blast: చెదిరిన టాటూలు, చిరిగిన టీ-షర్టులు..
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న పేలుడులో మృతి చెందినవారి సంఖ్య 13కు చేరింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ నేపధ్యంలో మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. పేలుడు తీవ్రతకు మృతుల శరీరాలు తునాతునకలయ్యాయి. దీంతో మృతుల కుటుంబీకులు తమ వారిని గుర్తు పట్టేందుకు ఎంతో కష్టపడ్డారు. ఢిల్లీ పేలుడు ఘటనలో మృతులను గుర్తుపటేందుకు వారు ధరించిన టీ- షర్టులు, శరీరంపై గల టాటూలు సాయపడ్డాయని ‘హిందుస్తాన్ టైమ్స్’ పేర్కొంది. హ్యుందాయ్ ఐ20 కారులో జరిగిన పేలుడు చాలా శక్తివంతంగా ఉండటంతో సమీపంలో పార్క్ చేసిన వాహనాల అద్దాలు పగిలిపోయాయి. సమీపంలోని భవనాలు కంపించాయి. ఈ ఘటనలో చాందినీ చౌక్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ వ్యాపారవేత్త అమర్ కటారియా(34) శరీరం గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది. అయితే అతని చేతులపై ఉన్న టాటూలను చూసిన అతని తల్లిదండ్రులు అది అమర్ కటారియా మృతదేహంగా గుర్తించారు. అతని చేతులపై ‘అమ్మ నా తొలి ప్రేమ..నాన్న నా బలం’ అనే టాటూ ఉంది. దీనిని చూసినవారంతా కంట తడిపెట్టుకుంటున్నారు. #WATCH | Delhi | Father of one of the deceased, Amar Kataria, who lost his life in Red Fort Car blast, Jagdish Kataria says, "... We don't yet know if it was a terror attack. He had a shop in Bhagirath Palace and had left at around 6:45 PM. He might have been waiting for a… pic.twitter.com/fuPbg5Cdqp— ANI (@ANI) November 12, 2025ఇదే ఘటనలో జుమ్మన్ మృతి చెందాడు. ఈ సమాచారం అందుకున్న అతని కుటుంబ సభ్యులు అతని మృతదేహం కోసం 20 గంటల పాటు ఆస్పత్రిలో వెదికారు. ఎట్టకేలకు ఒక టీ- షర్ట్ ఆధారంతో బాధిత కుటుంబం జుమ్మన్ మృతదేహాన్ని గుర్తించింది. కాళ్లు లేని స్థితిలో జుమ్మన్ మృతదేహం వారికి కనిపించింది. టీ- షర్ట్ చూసి మృతదేహాన్ని గుర్తుపట్టామని జుమ్మన్ మామ మొహమ్మద్ ఇద్రిస్ మీడియాకు తెలిపారు. ఇప్పుడు అతని దివ్యాంగ భార్య పిల్లలు అనాథలుగా మిగిలారు.సోమవారం సాయంత్రం ఎర్రకోటకు సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో పేలుడు సంభవించింది. నెమ్మదిగా కదులుతున్న హ్యుందాయ్ ఐ20 కారు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో సమీపంలోని అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. ఢిల్లీ పేలుడు వెనుక ఉన్న వారిని వదిలిపెట్టబోమని, వారిని కోర్టు ముందు నిలబెడతామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు: అంత్యక్రియల్లో అత్తాకోడళ్ల వివాదం -
ఢిల్లీ పేలుడు: విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తు చేయడానికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 10 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో ఒక ఐజీ, ఇద్దరు డీఐజీలు, ముగ్గురు ఎస్పీలు, డీఎస్పీ స్థాయి అధికారులు ఉండనున్నారు. ఈ బృందానికి ఎన్ఐఏ ఏడీజీ విజయ్ సఖారే సారధ్యం వహించనున్నారు.హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) కేసు దర్యాప్తును ఎన్ఐఏకి అప్పగించింది. ఈ నేపధ్యంలో ఎన్ఐఏ అధికారులు.. జమ్ముకశ్మీర్ పోలీసులు, ఢిల్లీ పోలీసులు, హర్యానా పోలీసుల నుండి జైష్ మాడ్యూల్‌కు సంబంధించిన అన్ని కేసు డైరీలను స్వాధీనం చేసుకోనున్నారు. అలాగే ఈ కేసుపై చర్చించేందుకు ఎన్ఐఏ డీజీ, ఐబీ చీఫ్ ఈరోజు(బుధవారం) సమావేశం కానున్నారు.ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు: దీపావళికే ప్లాన్? -
ఢిల్లీ పేలుడు: దీపావళికే ప్లాన్?
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన కారు పేలుడు యావత్ దేశాన్ని భయాందోళనలోకి నెట్టివేసింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఈ కేసుపై దర్యాప్తు బృందాలు అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో నిఘా వర్గాల నుంచి ఒక కీలక సమాచారం వెల్లడయ్యింది.ఢిల్లీ పేలుళ్ల కేసులో కీలక నిందితుడు ముజమ్మిల్ దర్యాప్తు అధికారుల విచారణలో.. తాను, ఉమర్.. ఎర్రకోట ప్రాంతానికి పేలుడు జరగడానికి ముందుగా చేరుకున్నామని చెప్పాడు. వచ్చే ఏడాది జనవరి 26న దాడి చేసేందుకు ప్రణాళిక ఉందని, దానిలో భాగంగా ఎర్రకోట చుట్టుపక్కల ప్రాంతాన్ని గుర్తించామని ముజమ్మిల్ తెలిపాడు. అదేవిధంగా మొన్నటి దీపావళికి రద్దీగా ఉండే ప్రాంతంలో దాడి చేయాలని తాము ముందుగా ప్లాన్ చేశామని, అయితే దానిని అమలు చేయలేకపోయామని ముజమ్మిల్ విచారణ అధికారులకు తెలిపినట్లు ‘ఎన్డీటీవీ’ తన కథనంలో పేర్కొంది.ఎర్రకోట సమీపంలో పేలుడు జరిగిన దరిమిలా దర్యాప్తు బృందం కీలక నిందితుడు డాక్టర్ ముజమ్మిల్‌ను విచారిస్తున్నారు. ఇతను ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. ఇతని సహోద్యోగి ఉమర్ ఎర్రకోట మెట్రో స్టేషన్ ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో కారు పేలి మరణించినట్లు భావిస్తున్నారు. మూలాల ప్రకారం ముజమ్మిల్‌ను విచారిస్తున్న పోలీసులు అతని ఫోన్ డేటాను స్వాధీనం చేసుకున్నారని సమాచారం.ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు: అంత్యక్రియల్లో అత్తాకోడళ్ల వివాదం -
పేలుడుకు కొన్ని నిమిషాల ముందు...
‘జీవితాలు మారడానికి ఒక రోజు చాలు’ అంటారు. ‘జీవితమే లేకుండా పోవడానికి కొన్ని నిమిషాలు చాలు’ అనిపిస్తుంది ఈ వైరల్ పోస్ట్ చూసిన తరువాత. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుకు సంబంధించి వేణి గుప్తా అనే మహిళ ‘ఎక్స్’లో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.‘పేలుడు జరగడానికి కొన్ని నిమిషాల ముందు నేను, మా అమ్మ సంఘటన స్థలంలోనే ఉన్నాం. పెళ్లి దుస్తులు కొనడానికి వెళ్లాం. చాలామందిలాగే రుచికరమైన పాత ఢిల్లీ వంటకాలను ఆస్వాదించాం. పని పూర్తి కాగానే ఎర్రకోట నుండి ఆటో మాట్లాడుకొని మెట్రో స్టేషన్‌కు వెళ్లడం సాధారణ విషయమే. అయితే ఇప్పుడు ఏది సాధారణం అనిపించడం లేదు. జీవితం ఎంత అనూహ్యమైనది! నగరం భయం దుప్పటి కప్పుకొని ఉంది. ఢిల్లీ దుఃఖిస్తోంది. బాధిత ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’ అని రాసింది వేణి గుప్తా. పేలుడుకు ముందు ఆ పరిసర ప్రాంతాలలో తాను తీసిన ఫొటోలను షేర్ చేసింది వేణి. (చదవండి: గూగుల్ బాయ్ ఆఫ్ చత్తీస్‌గఢ్) -
ఢిల్లీ పేలుడు: అంత్యక్రియల్లో అత్తాకోడళ్ల వివాదం
లక్నో/ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నివాసి మొహ్సిన్ ఈ పేలుడులో ప్రాణాలు కోల్పోయాడు. ఇతను ఢిల్లీలో ఈ-రిక్షా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా మొహ్సిన్ ఢిల్లీలో భార్య సుల్తానా, ఇద్దరు పిల్లలతో పాటు ఉంటున్నాడు. కాగా మొహ్సిన్ మృతదేహాన్ని అతని స్వస్థలానికి అధికారులు తరలించారు. అయితే అతని ఖననంపై కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.మోహ్సిన్ మృతదేహం మీరట్‌లోని అతని ఇంటికి చేరుకున్నదని తెలియగానే స్థానికులు అక్కడకు తరలివచ్చారు. ఒక్కసారిగా అక్కడ విషాద వాతావరణం ఏర్పడింది. మృతుని అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో అతని భార్య సుల్తానా.. తన భర్త మృతదేహాన్ని మీరట్‌లో కాకుండా ఢిల్లీలో ఖననం చేయాలని అందరి ముందూ పట్టుబట్టింది. దీంతో మోహ్సిన్ అత్త, ఇతర కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు సుల్తానాను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆమె వారి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా భర్త మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఢిల్లీకి తరలించింది.ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు: ‘సయీద్ ఇంతకు తెగించారా?’.. షాక్‌లో తోటి ప్రొఫెసర్లు -
ఢిల్లీ పేలుడు: ‘సయీద్ ఇంతకు తెగించారా?’.. షాక్‌లో తోటి ప్రొఫెసర్లు
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన కారు పేలుడుపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనకు ముందు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన మహిళా డాక్టర్ షహీన్ సయీద్‌ను హర్యానాలోని ఫరీదాబాద్‌లో పేలుడు పదార్థాల అక్రమ రవాణాకు సంబంధించిన ఉదంతంలో పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ షహీన్ ఒక ప్రొఫెషనల్ మాదిరిగా తన పని తాను చేసుకుంటూ ఉండేవారు. ఆమె సన్నిహితులు కూడా ఆమె ఏమి చేస్తుంటారో గ్రహించలేకపోయారు.డాక్టర్ షహీన్ సయీద్.. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మొహమ్మద్ (జెఎమ్)కు భారతదేశంలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు కనుగొన్నాయి. హర్యానాలోగల అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో సయీద్‌తో పాటు పనిచేస్తున్న ఒక ప్రొఫెసర్ ‘ఎన్డీటీవీ’తో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు చూస్తుంటే సయీద్ ఏమి చేస్తున్నారో ఇప్పుడు అర్థం అయ్యిందన్నారు. సయీద్.. వర్శిటీలో క్రమశిక్షణతో ఉండేవారు కాదని, ఎవరికీ తెలియజేయకుండా బయటకు వెళ్లిపోయేవారని ఆ అని ప్రొఫెసర్ తెలిపారు.చాలా మంది ఆమెను కళాశాలలో కలవడానికి వచ్చేవారని, ఆమె ప్రవర్తన వింతగా ఉండేదని, ఆమెపై పలు ఫిర్యాదులు కూడా వర్శిటీ యాజమాన్యానికి అందాయని తన పేరు వెల్లడించవద్దని కోరిన ఆ ప్రొఫెసర్ తెలిపారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏకీ తాము సహకరిస్తామని చెప్పారు. కాగా సయీద్ వ్యక్తిగత రికార్డులను, ఆమె గతంలో ఎక్కడ పనిచేసిందనే వివరాలను పరిశీలించాలని వర్శిటీ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నేతృత్వంలోని జైషే మహమ్మద్ మహిళా విభాగం జమాత్ ఉల్-మోమినాత్ భారత శాఖకు సయీద్ బాధ్యత వహిస్తున్నారని ‘ఎన్డీటీవీ’ తన కథనంలో పేర్కొంది. అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో పనిచేసిన కశ్మీరీ వైద్యుడు ముజమ్మిల్ గనై అలియాస్ ముసైబ్‌తో సయీద్‌కు సంబంధాలున్నాయి. ఫరీదాబాద్‌లోని అతని ఇంటి నుండి 2,900 కిలోల పేలుడు పదార్థాలు, మండే పదార్థాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. అస్సాల్ట్ రైఫిల్, పిస్టల్, మందుగుండు సామగ్రిని నిల్వ చేయడానికి ఉపయోగించిన కారు సయీద్‌కు చెందినదని దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. కాగా ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడితో తొమ్మిది మంది మృతి చెందిన విషయం విదితమే. ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు: ‘భయంతో పేల్చేశారా?’.. నిఘా వర్గాలు -
ఢిల్లీ పేలుడు: ‘భయంతో పేల్చేశారా?’.. నిఘా వర్గాలు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు యావత్ ప్రపంచాన్ని కలవరానికి గురిచేసింది. ఈ కేసు దర్యాప్తులో పలు విషయాలు వెల్లడవుతున్నాయి. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం అనుమానితులు పేలుడు పదార్థాలను తీసుకెళ్తున్నప్పుడు భయపడి పొరపాటు చేసి ఉండవచ్చని ఉన్నత నిఘా వర్గాలు ‘ఎన్డీటీవీ’కి తెలిపాయి.దేశంలో కొంతకాలంగా ఉగ్రవాద అనుమానితులపై దాడులు, హర్యానాలోని ఫరీదాబాద్‌లో బాంబుల తయారీకి ఉపయోగించే 2,900 కిలోల రసాయనాన్ని స్వాధీనం చేసుకోవడం అనుమానితులను భయాందోళనకు గురిచేసివుంటుందని, దీంతో వారు ఆ పదార్థాలను వేరే చోటకు తరలించాల్సి రావడంతో, ఈ నేపధ్యంలోనే పొరపాటు జరిగివుండవచ్చిన నిఘా వర్గాలు అంచనావేశాయి.రవాణా సమయంలో ప్రమాదవశాత్తూ ఆ పదార్థం పేలిపోయివుండవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. కాగా నిందితుడు ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాన్ని (ఐఈడీ) సరిగ్గా అమర్చలేదని నిఘా వర్గాలు గుర్తించాయి. ఫలితంగా ఐఈడీ పరిమిత ప్రభావాన్ని చూపిందని వారు తెలిపారు. హ్యుందాయ్ ఐ20 కారులో జరిగిన పేలుడులో తొమ్మిది మంది మృతిచెందగా, 24 మంది గాయపడ్డారు. ఈ పేలుడు కారణంగా ఎర్రకోట సమీపంలోని కొన్ని భవనాలు కంపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.ఐఈడీని కారులో మోసుకెళ్తున్న అనుమానితులు వాహనం నడుపుతున్నప్పుడు ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించిందని సూచించే మరిన్ని ప్రాథమిక ఆధారాలు అధికారులకు లభించాయి. వారు భయాందోళనకు గురై, ఐఈడీని గరిష్ట నష్టం కోసం ఉపయోగించలేకపోయారని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. వాహనం కదులుతున్నందున ఐఈడీ పేలిపోయివుండవచ్చని, ఈ భావన కూడా ప్రమాదవశాత్తూ పేలుడు జరిగిందనే అంచనాకు మద్దతు ఇస్తుందని నిఘా వర్గాలు తెలిపాయి.అనుమానితులు పేలుడు పదార్థాలను తరలించడానికి లేదా వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పేలుడు జరిగిందనే అభిప్రాయాన్ని ఉన్నత నిఘా వర్గాలు తోసిపుచ్చలేదు. అయితే దేశవ్యాప్తంగా స్లీపర్ టెర్రర్ యూనిట్లపై పోలీసులు, ఇతర ఏజెన్సీలు చేసిన దాడులు విస్తృత ముప్పును అరికట్టడంలో సహాయపడిందని అధికార వర్గాలు తెలిపాయి. తెల్లని హ్యుందాయ్ ఐ20 కారును నడిపిన కీలక నిందితుడిని జమ్ముకశ్మీర్‌కు చెందిన వైద్యుడు ఉమర్ నబీగా గుర్తించారు. పేలుడు జరిగిన రోజుకు మూడు రోజుల ముందు నుంచే అతను తన ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని కుటుంబ సభ్యులతోనూ కమ్యూనికేషన్లను నిలిపివేశాడు.ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు.. పాక్ వణుకు? -
ఆత్మాహుతి దాడేనా?
న్యూఢిల్లీ/శ్రీనగర్: దేశ రాజధాని నడిబొడ్డున రుధిర ధారల్ని ఎగజిమ్మి యావత్ భారతావని ఉలిక్కిపడేలా చేసిన కారు పేలుడు ఘటనను ఉగ్రవాద దుశ్చర్యగా కేంద్ర దర్యాప్తు సంస్థలు అనధికారికంగా ప్రకటించాయి. ఉగ్ర వైద్యుడు డాక్టర్ ఉమర్ మొహమ్మద్ నబీ అత్యంత విస్ఫోటక స్వభావమున్న అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ (ఏఎన్‌ఎఫ్‌ఓ)తో నిండిన కారును ఎర్రకోట సమీపంలో నడిరోడ్డుపై పేల్చేశాడని తొలుత వార్తలొచ్చాయి. అయితే ఆరుబయట అధిక వేడిమి, ఒత్తిడి కారణంగా అమ్మోనియం నైట్రేట్ పేలిపోయి ఉంటుందని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఐ20 కారును జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా లీథ్‌పురాకు చెందిన ఉమర్ నబీ నడిపినట్లు సమీప సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. దీంతో కారులో ఉన్నది అతనేనా కాదా అనేది శాస్త్రీయంగా నిర్ధారించేందుకు ఉమర్ తల్లి షమీమా బానో నుంచి డీఎన్ఏ శాంపిళ్లను సేకరించారు. ఇప్పటికే ఆమెతోపాటు ఉమర్ సోదరులు ఆషిక్ అహ్మద్, జహూర్ అహ్మద్‌లను పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. పుల్వామాలోని ఉమర్ ఇంట్లో సోదాలుచేసి కీలక డాక్యుమెంట్లు, ఎల్రక్టానిక్ పరికరాలను స్వాదీనం చేసుకున్నారు. కారు పేలినప్పుడు అందులో ఉమర్ ఒక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స చెందుతున్న క్షతగాత్రులు ముగ్గురు మంగళవారం ప్రాణాలు కోల్పోవడంతో సోమవారం నాటి పేలుడు ఘటనలో మరణాల సంఖ్య 12కు పెరిగింది. 2,900 కేజీల పేలుడు పదార్థాల స్వాదీనం, ఢిల్లీలో పేలుడు ఘటనలతో అంతటా అలర్ట్ ప్రకటించగా రెండు కేసుల్లో మూలాలను వెతికిపట్టుకునేందుకు ఢిల్లీ పోలీస్, ఎన్ఐఏ, నిఘా ఏజెన్సీల బృందాలు దేశవ్యాప్తంగా దర్యాప్తు కోసం బయల్దేరాయి. మంగళవారం కశ్మీర్లో నలుగురు అనుమానితులను అరెస్ట్‌చేశారు. ఢిల్లీలోని ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్లు, బస్ టర్మినళ్ల వద్ద కట్టుదిట్ట భద్రత కొనసాగుతోంది. గంటల తరబడి అక్కడే... సీసీటీవీ దృశ్యాల ప్రకారం ఆ కారు ఎర్రకోట సమీప చారిత్రక సునేహ్రీ మసీదు పార్కింగ్ ఏరియాకు సోమవారం మధ్యాహ్నం 3.19 గంటలకు వచ్చింది. మూడు గంటలపాటు అది అక్కడే ఉంది. అంటే సాయంత్రం 6.22 గంటలదాకా పార్కింగ్‌లో ఉంది. అందులోని వారెవరూ కనీసం కిందకు కూడా దిగలేదు. పేలుడుకు సంబంధించిన ఉగ్రనెట్వర్క్ సూత్రధారుల నుంచి ఆదేశాల కోసం అప్పటిదాకా వేచి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సాయంత్రం రద్దీ పెరిగాకే కొద్ది నిమిషాల ముందే కిక్కిరిసిన ట్రాఫిక్‌లో చొరబడి విధ్వంసం సృష్టించి ఉంటాడని భావిస్తున్నారు. అంతకుముందు కారు సోమవారం ఉదయం ఫరీదాబాద్ నుంచి బయల్దేరింది. ఏడున్నరకు ఫరీదాబాద్ ఏసియన్ హాస్పిటల్ వద్ద కనిపించింది. బదార్పూర్ టోల్ ప్లాజా దాటి ఉదయం 8.13 గంటలకు ఢిల్లీలోకి అడుగుపెట్టింది. అక్కడి సీసీటీవీ ఫుటేజీలో డ్రైవర్ కనిపిస్తున్నా ముఖానికి మాస్క్ ఉంది. సెంట్రల్ ఢిల్లీ, పాత ఢిల్లీలోని దర్యా గంజ్, కశ్మీరీ గేట్ ప్రాంతంలో చక్కర్లు కొట్టి చివరకు ఎర్రకోటకు చేరుకుంది. పేలుడు సాయంత్రం 6.52 గంటలకు జరగ్గా ఈ కారు కొన్ని నిమిషాల ముందు ఛాందిని చౌక్ వైపు వెళ్తూ హఠాత్తుగా యూటర్న్ తీసుకుని వచ్చి సుభాష్ మార్గ్ రోడ్డులో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి పేలిపోయింది. ‘‘ తోటి ఉగ్రవాదులు ఫరీదాబాద్‌లో అరెస్టయిన వార్తలను ఇంటర్నెట్, మీడియా ద్వారా తెల్సుకుని డాక్టర్ ఉమర్ పారిపోయి ఉంటాడు. కారులోని పేలుడు పదార్థాలను ఢిల్లీలో ఎక్కడైనా దాచేందుకు వెళ్తూ మార్గమధ్యంలో సిగ్నల్ వద్ద అమ్మోనియం నైట్రేట్ ఒత్తిడి కారణంగా పేలిపోయి ఉండొచ్చు’’ అని దర్యాప్తు అధికారు ఒకరు అభిప్రాయపడ్డారు. కారు ఆర్సీ సల్మాన్ మీదనే ఉన్నా పలువురి చేతులు మారి.. కారును తొలుత ఎండీ సల్మాన్ కొన్నాడు. ఆర్సీ ఇప్పటికీ అతని పేరు మీదే ఉంది. తర్వాత నదీమ్ కొనుగోలు చేయగా తర్వాత ఫరీదాబాద్‌లోని రాయల్ కార్ జోన్ దీనిని కొనుగోలుచేసింది. తర్వాత అమీర్, ఆ తర్వాత కశ్మీర్‌కు చెందిన తారిఖ్ దార్ కొన్నారు. అతను డాక్టర్ ఉమర్‌కు అప్పగించాడు. సల్మాన్ పేరిట ఆర్సీ ఉన్నా అధికారికంగా ఇంతమంది చేతులెలా మారింది? అనేది తెలియాల్సి ఉంది. తారిఖ్ అహ్మద్ దార్‌కు ఉగ్రమాడ్యూల్తో సంబంధం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత యజమానులందరికీ ఉగ్రవాదంతో సంబంధం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద కేసు కేంద్ర ప్రభుత్వం కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. పేలుడు కోణంలో మాత్రమే చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక)(ఉపా) చట్టం కింద కేసు నమోదుచేశారు. ఉగ్రచట్టాల కింద కేసు నమోదుచేయలేదు. సాధారణంగా ఉగ్రవాదం సంబంధిత కేసులను మాత్రమే ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. ఈ లెక్కన ఈ పేలుడు ఉగ్ర చర్యేనని పరోక్షంగా ప్రభుత్వం ఒప్పుకున్నట్లయింది. ఎవరీ ఆత్మాహుతి బాంబర్? 36 ఏళ్ల డాక్టర్ ఉమర్ ప్రస్తుతం ఫరీదాబాద్‌లోని అల్–ఫలాహ్ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. ఉమర్ తండ్రి గతంలో జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఉమర్ సొంతూరు పుల్వామా సమీప కోయిల్ గ్రామం. కారును పేల్చింది ఉమర్ అని మీడియాలో వచ్చిన వార్తలు విని ఉమర్ వదిన ముఝామిల్ హుతాశురాలైంది. ‘‘ ఉమర్ పుస్తకాల పురుగు. ఎప్పుడూ వైద్యవృత్తి సంబంధ పుస్తకాలే చదువుతాడు. శుక్రవారం కూడా ఫోన్లో మాట్లాడాం. గ్రంథాలయంలో ఉన్నానని చెప్పాడు. పేదరికం నుంచి మమ్మల్ని బయటపడేస్తాడనుకున్నాం. ఉగ్రవాదభావంలో మునిగిపోతాడని అస్సలు అనుకోలేదు. ఉమర్ తల్లి చిన్నాచితకా పనులు చేస్తూ ఇంకా కష్టపడుతున్నారు. ఉమర్ అన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా తమ్ముడు స్టెనోగ్రఫీ నేర్చుకుంటున్నాడు’’ అని వదిన చెప్పింది. షాహీన్ కనుసన్నల్లో జైషే మహిళా ఉగ్ర విభాగం.. దర్యాప్తు సంస్థ అదుపులో ఉన్న వైద్యురాలు షాహీన్ సయీద్ గురించి విస్మయకర విషయాలు ఒక్కోటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈమె కారులో అసాల్ట్ రైఫిల్, పిస్టల్, మందుగుండు లభించడంతో ఉగ్రవాదులకు సాయపడుతోందని భావించి తొలుత ఆమను అరెస్ట్‌చేశారు. కానీ ఈమెనే స్వయంగా అమాయకులను ఉగ్రవాదంలోకి దింపుతున్నారని తెల్సి దర్యాప్తు అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. షాహీన్ ఏకంగా భారత్‌లో జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ మహిళా విభాగం ‘జమాత్ ఉల్ మోమినాత్’కు సారథ్యం వహిస్తోంది. ఈ విభాగం జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ పాకిస్తాన్లో ఉండి నడిపిస్తోంది. ఫరీదాబాద్‌లోని అల్–ఫలాహ్ వైద్య కళాశాలలోని తోటి వైద్యుడు ముజామిల్ ఘనీతో షాహీన్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. ఘనీకి ఈమె ప్రియురాలు అని తెలుస్తోంది. కశ్మీర్‌కు చెందిన ఘనీ ఇప్పటికే ఉగ్రమాడ్యూల్ ఉదంతంలో అరెస్ట్ అయ్యాడు. ‘‘షాహీన్ ధోరణి విచిత్రంగా ఉండేది. మెడికల్ కాలేజీలో ఆమె ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించేది. చెప్పకుండా బయటకు వెళ్లిపోయేది. ఆమెకు కలిసేందుకు ఎంతోమంది వచ్చేవారు. సరిగా విధులు నిర్వర్తించట్లేదని ఆమెపై ఎన్నో ఫిర్యాదులు అందాయి. ఆమె ఏకంగా ఉగ్ర రిక్రూటర్ అని తెల్సి నమ్మలేకపోతున్నాం’’ అని కాలేజీ యాజమాన్యం పేర్కొంది. త్వరగా నివేదిక ఇవ్వండి: అమిత్ షా ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సారథ్యంలో రెండు సార్లు అత్యున్నత స్థాయి సమావేశాలు జరిగాయి. ‘‘ ఈ పేలుడు ఘటన వెనక ఉన్న ప్రతి ఒక్కడినీ వేటాడండి. కారకులను చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తాం. పేలుడుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిపైనా దర్యాప్తు సంస్థలు ఉక్కుపాదం మోపుతాయి. కేసును దర్యాప్తుచేసేందుకు దేశంలోని అత్యున్నత స్థాయి బృందాలు రంగంలోకి దూకాయి. ఘటన మూలాల్లోకి వెళ్లిమరీ దుశ్చర్యకు కారకులను బయటకు లాగుతాం’’ అని అమిత్ షా అన్నారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ డేకా, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చా, ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ దాటె, జమ్మూకశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కారు పేలుడు, పేలుడు పదార్థాల స్వా«దీనం కేసుల పురోగతిపై అమిత్‌కు అధికారులు వివరాలు వెల్లడించారు. తర్వాత భద్రతా సమీక్షపై మరో ఉన్నతస్థాయి భేటీ జరిగింది. ఇందులోనూ వీళ్లే పాల్గొన్నారు. వీళ్లకుతోడు ఫోరెన్సిక్ సైన్స్ సర్వీసెస్ డైరెక్టర్, ఢిల్లీలోని ఫోరెన్సిక్ సైన్స్ లే»ొరేటరీ చీఫ్ డైరెక్టర్లు దర్యాప్తు తీరును వివరించారు. భారీ స్థాయిలో అమ్మోనియం నైట్రేట్ ఉగ్రవాదులకు ఎలా లభించింది? పొలాల్లో ఎరువుగా నైట్రోజన్‌గా పనికొచ్చే అమ్మోనియం నైట్రేట్‌ను విధ్వంసం కోసం ఉగ్రవాదులు వేల కిలోలకొద్దీ సేకరించిన తీరుపై దర్యాప్తు కొనసాగుతోంది. క్వారీలో రాతిని బద్దలుకొట్టేందుకు అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగిస్తారు. నిషేధిత రసాయనం అమ్మోనియ నైట్రేట్‌కు పొటాషియం క్లోరేట్, సల్ఫర్‌ను మిశ్రమంగా కలిపితే అత్యంత పేలుడు పదార్థం(ఐఈడీ) తయారువుతుంది. దీనిని ఉగ్రవాదులు గతంలో కశ్మీర్, ముంబై, ఢిల్లీలో దాడుల్లో ఉపయోగిస్తున్నారు. అమ్మోనియం నైట్రేట్ ఫూయల్ ఆయిల్(ఏఎన్‌ఎఫ్‌ఓ)కు అత్యంత వేగంగా మండే స్వభావం ఉంది. ఈ రసాయనాన్నే ఆర్డీఎక్స్తో కలిపి 2019లో పుల్వామాలో సైనిక వాహనశ్రేణిపై దాడికి ఉగ్రవాదులు ఉపయోగించారు. ఈ నేపథ్యంలో ఉగ్రమాడ్యూల్ల వద్ద ఈ రసాయనం భారీ స్తాయిలో ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. -
మళ్లీ ఉగ్రవాద పంజా!
సరిగ్గా పదమూడేళ్ల తర్వాత దేశ రాజధాని నగరంపై ఉగ్రవాదం పంజా విసిరిన ఆనవాళ్లు కనబడుతున్నాయి. చారిత్రక ఎర్రకోట సమీపంలో జరిగిన సోమవారం నాటి ఘటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సే ఉన్నా, దాని తీరుతెన్నులు గమనిస్తే అది ఆత్మాహుతి దాడే కావొచ్చనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం దీని వెనక కుట్రఉండొచ్చని చెప్పడం గమనించదగ్గది. గత పక్షం రోజులుగా జమ్మూకశ్మీర్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లలో పోలీసులు జరిపిన దాడుల్లో ఎనిమిది మంది ఉగ్రవాదుల్ని అరెస్టు చేసి, 2,913 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవటం... ఆ సంగతిని ప్రకటించిన కొన్ని గంటలకే ఢిల్లీ పేలుడు ఘటన సంభవించటం గమనిస్తే వీటిమధ్య పరస్పర సంబంధం ఉండొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. అరెస్టయిన ఉగ్రవాదుల్లో తమ సహచర వైద్యులు ముగ్గురున్న సంగతి తెలిశాక పోలీసుల చక్రబంధం నుంచి తప్పించుకుని పరారవుతూ కావాలని ఆత్మాహుతి దాడికి దిగారా, లేక మరో లక్ష్యాన్ని చేరుకోవటం కోసం వెళ్తుండగా అనుకోకుండా పేలుడు సంభవించిందా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 13కి చేరటం, గాయపడినవారిలో పలువురి పరిస్థితి ప్రమాదకరంగా ఉండటం పేలుడు తీవ్రతను చాటుతోంది. తమ చర్యల ద్వారా సమాజంలో భయోత్పాతాన్ని సృష్టించటం, అందుకోసం జన సమ్మర్దం గల ప్రాంతాలను ఎంచుకోవటం ఉగ్రవాదుల అలవాటు. తమ మతిమాలిన చర్య వల్ల ఏ వర్గాలవారు బలవుతారు, ఎన్ని కుటుంబాలను విషాదంలో ముంచెత్తుతామన్న విచక్షణ ఉగ్రవాదుల కుండదు. వీరి ఉన్మాదానికి తోపుడు బళ్లు నడిపేవారు, ఆటో డ్రైవర్లు, పగలంతా రెక్కలు ముక్కలు చేసుకుని సొంతగూటికి చేరటం కోసం వెళ్తున్న సామాన్య పౌరులు, దగ్గర్లోని దుకాణదారులు బలయిపోయారు. పేలుడు తర్వాత ఎటుచూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలూ, తెగిపడిన కాళ్లూ చేతులూ కనబడ్డాయి. కొన్ని సెకన్ల క్రితం జీవంతో తొణికిసలాడిన మనుషులు ఛిద్రమైన శరీరాలతో ఆర్తనాదాలు చేస్తూ శోకించటం... కొందరు భయంతో పరుగులు పెట్టడం, అయినవారి జాడ కోసం మరికొందరు వెదుకులాడటం తలుచుకుంటేనే గగుర్పాటు కలిగించే భీతావహ దృశ్యం.ఏదైనా ఘటన జరిగినప్పుడు అది తమ పనేనని చెప్పుకోవటం అలవాటున్న ఉగ్రవాదులు 24 గంటలు గడిచినా కిమ్మనకపోవటం అయోమయాన్ని సృష్టించటానికే కావొచ్చనిపిస్తోంది. సాధారణంగా పేలుడు జరిగిన మూడు నాలుగు గంటల్లో ఘటన స్థలిలో లభ్యమయ్యేవాటి ఆధారంగా కారకుల విషయంలో దర్యాప్తు అధికారులు ప్రాథమిక నిర్ధారణకొస్తారు. కానీ ప్రస్తుత ఘటనలో కొంత సమయం తీసుకోకతప్పదని ఎన్ఐఏ భావించి ఉండొచ్చు. వాస్తవానికి మొదట్లో వాహనంలోని సీఎన్జీ ట్యాంక్ పేలివుండొచ్చనుకున్నా, ఆ వాహనం యజమాని పుల్వామా వాసిగా అర్ధరాత్రికి ధ్రువపడటం, క్రయవిక్రయాల సమయంలో తప్పుడు పత్రాలు దాఖలు చేశాడని తేలడం ఉగ్రవాద ప్రమేయాన్ని సూచిస్తోంది. కేంద్రం తీసుకున్న అనేక చర్యల పర్యవసానంగా ఉగ్రదాడులు దేశంలో గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా ఢిల్లీలో 2012లో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం దగ్గర జరిగిన పేలుడు ఘటన తర్వాత మరేదీ చోటుచేసుకోలేదు. 2008 నాటి ముంబై పేలుళ్ల ఘటన తర్వాత ఎన్ఐఏను ఏర్పర్చటం, నిఘా వ్యవస్థను పటిష్ఠపరచటం, అందుకోసం ప్రత్యేకంగా జాతీయ నిఘా గ్రిడ్(నేట్గ్రిడ్) రూపకల్పన, అక్రమ ద్రవ్య చలామణీ నిరోధక చట్టాన్నీ, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టాన్నీ మరింత కఠినతరం చేస్తూ సవరణలు తీసుకురావటం ఉగ్రవాదం నియంత్రణకు గణనీయంగా తోడ్పడ్డాయి. అయితే ఎక్కడో ఒకచోట ఏర్పడే చిన్నపాటి ఉదాసీనత అయినా భారీ మూల్యం చెల్లించక తప్పదని తాజా ఉదంతం రుజువు చేస్తోంది. అరెస్టయిన ఉగ్రవాదుల్ని ప్రశ్నించాక పాకిస్తాన్ ప్రమేయం కనబడటాన్ని బట్టి ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత కూడా అది తన వెనకటి గుణాన్ని విడనాడలేదని అర్థమవుతోంది. అన్ని స్థాయుల్లోనూ మరింత అప్రమత్తత అవసరమని ఢిల్లీ పేలుడు ఘటనైనా, ఉగ్రవాదుల అరెస్టులైనా వెల్లడిస్తున్నాయి. -
Delhi Blast: ఇద్దరు డాక్టర్లు అరెస్ట్ భయంతో ఒకరు ఆత్మహత్య
-
ఢిల్లీ పేలుడు ఘటన: మరో ముగ్గురు డాక్టర్లు అరెస్ట్
ఢిల్లీ: ఎర్రకోట సమీపంలోని జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో మరో ముగ్గురు డాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు డాక్టర్లు హరియాణాలోని ఆల్ ఫలాహ్ యూనివర్శిటీకి చెందిన వారే కావడం గమనార్హం,. అరెస్ట్ అయిన ముగ్గురు డాక్టర్లలో డాక్టర్ ముజామిల్ షకీల్, డాక్టర్ షహీన్ షహీద్, డాక్టర్ ఉమర్ మహ్మద్‌లు ఉన్నారు. ఇందులో ఉమర్, ముజామిల్లు కశ్మీర్‌కు చెందిన వారు కాగా, షహీన్ షహీద్ లక్నోకు చెందిన వారిగా గుర్తించారు. వీరు ముగ్గురు హరియాణాలోని ఫరిదాబాద్ ఆస్పత్రిలో డాక్టర్లుగా పని చేస్తున్నారు. ఫరీదాబాద్ లోని ఆల్ ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేస్తూ దౌజా గ్రామంలో రెండు డాక్టర్ షకీల్ అద్దెకు తీసుకున్నాడు. ఆ రెండు ఇళ్లలో నుంచి 3 టన్నుల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైట్ కలర్ టెర్రర్ మాడ్యూల్ లో డాక్టర్లు, స్టూడెంట్స్ ను ఉగ్రవాదులుగా తయారు చేస్తుంది జైషే మహమ్మద్ సంస్థ. జైషే మహమ్మద్ విమెన్ వింగ్‌కు డాక్టర్ షహీనా కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే యూనివర్శిటీలోని పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ సహా సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 12కు పెరిగింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన పేలుడులో అక్కడికక్కడే 9 మంది మృతి చెందారు. అయితే.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 12కు చేరింది. గాయపడిన మరో 17 మందికి లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి (LNJP హాస్పిటల్) ఆస్పత్రిలో చికిత్స అందుతోంది.సోమవారం ఉదయం 8గం. ప్రాంతంలో బదర్పూర్ టోల్ బూత్ నుంచి ఢిల్లీలోకి ఎంట్రీ ఇచ్చిన ఐ20 కారు.. పావు గంట తర్వాత ఓకల పెట్రోల్ పంపు స్టేషన్ వద్ద కనిపించింది. మధ్యాహ్నం 3:19గం. సమయంలో ఎర్రకోట పార్కింగ్ ఏరియాలో ఎంట్రీ ఇచ్చింది. సాయంత్రం 6:22 నిమిషాలకు పార్కింగ్ ఏరియా నుంచి బయటికి వచ్చింది. ఆ సమయంలోనూ కారులో ఉమర్ ఉన్నాడు. సరిగ్గా.. రాత్రి 6: 50 నిమిషాలకు ఎర్రకోట సిగ్నల్ వద్ద నెమ్మదిగా కదులుతూ భారీ శబ్దం చేస్తూ పేలిపోయింది. పేలుడు ఉమర్ కూడా అక్కడికక్కడే మృతి చెందడంతో డీఎన్ఏ పరీక్ష ద్వారా అతని మృతదేహాన్ని నిర్ధారించే పనిలో ఉన్నారు. -
ఢిల్లీ బ్లాస్ట్: తప్పు చేసిన కారు ఓనర్!
సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడులో తొమ్మిది మంది మరణించగా, 20 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ పేలుడుకు ఉపయోగించిన కారు 'హ్యుందాయ్ ఐ20' అని తేలింది. దీనిని మొదట ఉపయోగించిన వ్యక్తి/ఓనర్ రిజిస్ట్రేషన్ బదిలీ చేయకుండా ఒకరికి విక్రయిస్తే.. వాళ్లు ఇంకొకరికి విక్రయించడంతో.. అలా, అలా చాలా రాష్ట్రాలు తిరిగింది. ఈ ఘటన సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఒకింత భయాన్ని కలిగించింది.పేలుడు సంభవించిన హ్యుందాయ్ ఐ20 రిజిస్ట్రేషన్ బదిలీ చేయలేదు కాబట్టి.. ఆ కారు మొదటి ఓనర్ పేరు మీదనే ఉంది. ఇది ఆ యజమానిని ఇబ్బందుల్లోకి నెడుతుంది. కాబట్టి సెకండ్ హ్యాండ్ వాహనాలను విక్రయించేటప్పుడు యజమాని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..సెకండ్ హ్యాండ్ కారును విక్రయించేటప్పుడు.. యాజమాన్య బదిలీ అత్యంత ముఖ్యమైన దశలలో ఒకటి. కానీ దీనినే నిర్లక్ష్యం చేస్తూ విస్మరిస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లో యజమాని ఆలా చేయకూడదు. ఎందుకంటే.. మీరు అమ్మేసిన కారు ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే ఆ కేసు మీ మీద పడే అవకాశం ఉంయింది.వెహికల్ అమ్మేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలుఒక కారు లేదా బైక్‌ను విక్రయించాలనుకున్నప్పుడు.. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. ఇందులో ఆర్సీ, భీమా, పొల్యూషన్ సర్టిఫికేట్, సర్వీస్ హిస్టరీ, ట్యాక్స్ రసీదులు ఉంటాయి. వీటన్నింటినీ అందించడం మాత్రమే కాకుండా.. రిజిస్ట్రేషన్ కూడా బదిలీ చేయలి. లేకుంటే మీరు విక్రయించే వాహనాన్ని నేరపూరిత కార్యకలాపాలకు ఉపయోగిస్తే.. అది రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉంటుందో వారిమీద పడుతుంది.బీమాను కూడా బదిలీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎందుకున్న బీమా పాలసీ కాకుండా.. కొనుగోలుదారు ఇతర బీమా ఎంచుకోవచ్చు. కాబట్టి అప్పటికే వాహనం మీద ఉన్న బీమాను కారు కొనుగోలుదారు క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంతే కాకుండా పెండింగ్‌లో ఉన్న ఏవైనా లోన్స్, చలాన్లు లేదా సర్వీస్ బకాయిలను చెల్లించండి.అధికారికంగా యాజమాన్యాన్ని బదిలీ చేయడానికి.. RTO వద్ద ఫారమ్‌లు 28, 29, 30లను సమర్పించండి. ఫారమ్ 28 నో అబ్జెక్షన్ మంజూరుకు సంబంధించినది. ఫారమ్ 29 & 30 యాజమాన్య బదిలీకి సంబంధించినవి. ఇవన్నీ పూర్తి చేయడం వల్ల వాహనం బాధ్యతలు కొనుగోలుదారుకు వెళ్తాయి.ఢిల్లీ బ్లాస్ట్‌లో హ్యుందాయ్ ఐ20నిజానికి.. ఢిల్లీ బ్లాస్ట్‌లో పేలిన హ్యుందాయ్ ఐ20 కారు రిజిస్ట్రేషన్ నంబర్ - HR26CE7674. 2013లో తయారైన ఈ కారును 2014లో గుర్గావ్ నివాసి అయిన 'సల్మాన్' కొనుగోలు చేశారు. ఆ తరువాత కొన్ని రోజులకు ఢిల్లీలోని ఓఖ్లాకు చెందిన దేవేంద్రకు విక్రయించారు. తరువాత, అది అంబాలాలోని ఒక వ్యక్తి చేతుల్లోకి వెళ్ళింది. ఆపైన జమ్మూ & కశ్మీర్లో పుల్వామా నివాసికి అమ్మినట్లు సమాచారం.ఆ కారు విక్రయం అంతటితో ఆగలేదు. ఆ తర్వాత దానిని సూసైడ్ బాంబర్‌గా అనుమానించబడిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్‌కు అప్పగించారు. ఈ అమ్మకాల ప్రక్రియ కొనసాగినప్పటికీ, రిజిస్ట్రేషన్ కొత్త యజమానులకు బదిలీ కాలేదు. మొదటి ఓనర్ కాకుండా.. తరువాత కారును కొనుగోలుచేసినవారందరూ.. చట్టబద్ధమైన యజమానులు కానందున, సల్మాన్ ఇబ్బందుల్లో పడ్డాడు.ఇదీ చదవండి: విజయ్ మాల్యా సామ్రాజ్యం: దివాలా తీసిందిలా.. -
బాంబు బ్లాస్ట్ కు వాడిన కారు.. పేలుడుకు ముందు CCTV ఫుటేజ్
-
ఢిల్లీ పేలుడు.. పాక్ వణుకు?
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన పేలుడు దరిమిలా భారత్ నుంచి ప్రతీకార దాడులుంటాయనే అనుమానం, భయంతో పాకిస్తాన్ వణికిపోతోంది. ఈ నేపధ్యంలో పాక్ వైమానిక దళం రాజస్థాన్ సరిహద్దులో వైమానిక దళ గస్తీని ప్రారంభించిందని‘దైనిక్ భాస్కర్’ తన కథనంలో తెలిపింది. పాక్‌లోని త్రివిధ దళా అధిపతులు అత్యవసర సమావేశం నిర్వహించారని పేర్కొంది. ప్రధాని షాబాజ్ షరీఫ్ కూడా సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు ఎన్ఎస్ఏ, ఐఎస్ఐతో సమావేశాలు నిర్వహించారని సమాచారం.ఢిల్లీ ఎర్రకోట వెలుపల జరిగిన కారు బాంబు పేలుడు తరువాత పాకిస్తాన్ తన అన్ని వైమానిక స్థావరాలు, వైమానిక స్థావరాల వద్ద రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారతదేశం నుండి ప్రతీకారం ఎదురయ్యే అవకాశం లేదా సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు పెరిగే చాన్స్ ఉందని నిఘా సంస్థల నుండి పాకిస్తాన్‌కు హెచ్చరికలు అందాయి. ఫలితంగా పాకిస్తాన్ తన సైన్యం, నేవీ, వైమానిక దళాలను హై అలర్ట్‌లో ఉంచింది. అలాగే పాకిస్తాన్ సెంట్రల్ కమాండ్.. పరిస్థితిని నిశితంగా పరిశీలించాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యంలోని అన్ని శాఖలను ఆదేశించింది.అంతేకాకుండా భారతదేశం నుండి ఏదైనా దాడి జరిగితే తక్షణం ప్రతీకారం తీర్చుకునేందుకు వాయు రక్షణ వ్యవస్థలను పాకిస్తాన్ యాక్టివ్ చేసింది. భారతదేశం నుంచి ముందస్తు దాడి లేదా ఇతర సైనిక చర్యను ఊహించి పాక్ ఈ తరహా నిఘా కొనసాగిస్తోంది. వైమానిక రక్షణ రాడార్లు ఇప్పుడు పాకిస్తాన్ వైమానిక సరిహద్దులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. అలాగే పాకిస్తాన్ నవంబర్ 11 నుండి 12 వరకు నోటమ్ (ఎయిర్‌మెన్‌కు నోటీసు) జారీ చేసింది. అంటే ఈ రెండు రోజుల్లో, సరిహద్దు ఆకాశంలో విమానాలు తిరిగేందుకు పరిమితులు, భద్రతా నిబంధనలు అమలులో ఉంటాయి.కాగా ఢిల్లీలో పేలుడు దరిమిలా భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లవద్దని యూకే విదేశాంగ కార్యాలయం (ఎఫ్సీడీఓ) ప్రయాణ సలహా జారీ చేసింది. భారత్-పాక్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల పరిధిలో, జమ్ముకశ్మీర్, మణిపూర్ రాష్ట్రాలలో ప్రయాణించవద్దని బ్రిటిష్ పౌరులకు యూకే ప్రభుత్వం సూచించింది. ఇదే విధంగా ఎర్రకోట తదితర పర్యాటకులతో రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లవద్దని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరులకు హెచ్చరిక జారీ చేసింది. ఢిల్లీలోని తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఫ్రెంచ్ రాయబార కార్యాలయం సూచించింది. ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు: ఈ కష్టం పగవాడికి కూడా.. కండక్టర్ విషాదాంతం -
ఢిల్లీ పేలుడు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
భుటాన్: ఢిల్లీ పేలుళ్లపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. నిన్న ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనపై స్పందించారు. థింపూలో ఆయన మాట్లాడుతూ.. ఉగ్ర కుట్రలను సహించేది లేదని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఢిల్లీ పేలుళ్ల కుట్ర వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదు. రాత్రంతా అధికారులు, నిఘా సంస్థలతో మాట్లాడుతూనే ఉన్నాం. బాధితుల దుఃఖాన్ని అర్థం చేసుకుంటా.. దేశం మొత్తం ఢిల్లీ పేలుళ్ల బాధితులకు అండగా ఉంది’’ అని మోదీ పేర్కొన్నారు.‘‘ఈ దాడికి సూత్రధారులను వదిలిపెట్టం. ఢిల్లీ పేలుడు ఘటనలో ఉగ్ర కుట్రమూలాలను గుర్తించాం. వాళ్లను న్యాయ స్థానం ముందు నిలబెడతాం. పేలుళ్లపై అర్థరాత్రి వరకు సమీక్షలు చేశాను. వివరాలు తెలుసుకున్నాను. పేలుళ్ల వెనుక ఉన్నది ఎవరైనా వదిలిపెట్టబోం. ఢిల్లీ పేలుడు ఘటన కలిచి వేసింది. చాలా బాధాకరమైన హృదయంతో భూటాన్‌కు వచ్చాను’’ అని మోదీ చెప్పారు.రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్..ఢిల్లీలోని ఎర్రకోట పేలుళ్లకు పాల్పడినవారిని కఠినంగా శిక్షిస్తామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని విడిచిపెట్టం అంటూ రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. దేశంలోని ప్రముఖ దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై వేగంగా సమగ్ర విచారణ జరుపుతున్నాయి. దర్యాప్తు వివరాలను త్వరలోనే ప్రజలకు వెల్లడిస్తాం. పేలుళ్ల ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. దర్యాప్తు కొనసాగుతుందని.. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
ఢిల్లీ పేలుడు ఘటన.. 12కి చేరిన మృతుల సంఖ్య
ఢిల్లీలోని ఎర్రకోట పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన పేలుడులో అక్కడికక్కడే 9 మంది మృతి చెందారు. అయితే.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురు కాసేపటి కిందట చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 12కు చేరింది. గాయపడిన మరో 17 మందికి లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి (LNJP హాస్పిటల్) ఆస్పత్రిలో చికిత్స అందుతోంది.ఉగ్రసంస్థతో లింకులు ఉన్న డాక్టర్ ఉమర్ మహ్మద్ ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉంటాడని పోలీసులు ఓ అంచనాకి వచ్చారు. ఎర్రకోట పేలుడు ఘటన కేసులో ఉమర్ కుటుంబ సభ్యులు సహా ఆరుగురిని జమ్ముకశ్మీర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వాళ్లలో ఉమర్ తల్లి షమీనా భానో, ఉమర్ సోదరులు ఆశిక్ అహ్మద్, జాహ్ర్ అహ్మద్‌తో పాటు ప్లంబర్‌గా పని చేసే అమిర్ రషీద్, ప్రభుత్వ ఉద్యోగి అమీర్ రషీద్ మిర్, బ్యాంకు సెక్యూరిటీ గార్డ్ తారీఖ్ మాలిక్ ఉన్నారు.జమ్ము కశ్మీర్ పహల్గాంకు చెందిన ఉమర్.. ఫరీదాబాద్ ఆయుధాల స్వాధీనం కేసులో పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో.. తానూ దొరకిపోతాననే కంగారులో ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పేలుడుకు ముందు కారు తిరిగిన ప్రదేశాలను సీసీటీవీ ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు. ఉదయం 8గం. ప్రాంతంలో బదర్పూర్ టోల్ బూత్ నుంచి ఢిల్లీలోకి ఎంట్రీ ఇచ్చిన ఐ20 కారు.. పావు గంట తర్వాత ఓకల పెట్రోల్ పంపు స్టేషన్ వద్ద కనిపించింది. మధ్యాహ్నం 3:19గం. సమయంలో ఎర్రకోట పార్కింగ్ ఏరియాలో ఎంట్రీ ఇచ్చింది. సాయంత్రం 6:22 నిమిషాలకు పార్కింగ్ ఏరియా నుంచి బయటికి వచ్చింది. ఆ సమయంలోనూ కారులో ఉమర్ ఉన్నాడు. సరిగ్గా.. రాత్రి 6: 50 నిమిషాలకు ఎర్రకోట సిగ్నల్ వద్ద నెమ్మదిగా కదులుతూ భారీ శబ్దం చేస్తూ పేలిపోయింది. పేలుడు ఉమర్ కూడా అక్కడికక్కడే మృతి చెందడంతో డీఎన్ఏ పరీక్ష ద్వారా అతని మృతదేహాన్ని నిర్ధారించే పనిలో ఉన్నారు.ఇదీ చదవండి: ఉగ్రవాదంవైపు డాక్టర్లు.. అసలేంటీ వైట్‌కాలర్ టెర్రరిజం? -
ఢిల్లీ పేలుడు: ఈ కష్టం పగవాడికి కూడా.. కండక్టర్ విషాదాంతం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడులో ప్రాణాలు కోల్పోయిన తొమ్మిది మందిలో అశోక్ కుమార్ ఒకరు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాకు చెందిన అశోక్ తన రెక్కల కష్టంతో ఎనిమిది మంది కుటుంబ సభ్యులను పోషిస్తున్నాడు. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో కండక్టర్‌గా అశోక్ పనిచేస్తున్నాడు. పాత ఢిల్లీ మార్గంలో విధులు నిర్వహిస్తుంటాడు.ఢిల్లీ పేలుడు బాధితుల జాబితాలో తన బంధువు అశోక్ పేరును చూడగానే పప్పు షాక్ అయ్యాడు. ఎల్ఎన్జేజీ ఆస్పత్రి వెలుపల మీడియాతో ఆయన మాట్లాడుతూ, ‘నేను జాబితాలో అశోక్ పేరు చూశాను. అతను నాకు బంధువు. దీనిని ధృవీకరించడానికి నేను ఫోన్ చేశాను. అశోక్ బైక్ ఏమయ్యిందో తెలియడం లేదు’ అని అన్నారు. పేలుడు సమయంలో అశోక్ విధుల్లో ఉన్నారా? అని అడగగా, అతను ఈ రూట్లోనే విధులు నిర్వహిస్తుంటాడని, డ్యూటీ లేనప్పుడు కూడా ఇదే మార్గంలో వెళుతుంటాడని’ తెలిపారు.అశోక్‌కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి 15 కి.మీ దూరంలో ఉన్న జగత్పూర్లో కుటుంబంతో పాటు ఉంటున్నాడు. అతని తల్లి సోమవతి పెద్ద కుమారుడు సుభాష్‌తో కలిసి గ్రామంలో ఉంటోంది. సుభాష్ తరచుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో.. అశోక్ వారి కుటుంబ బాధ్యతలు కూడా మోసేవాడు. పగటిపూట కండక్టర్‌గా, రాత్రి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ అశోక్ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు.ఇది కూడా చదవండి: Delhi 10/11 Blast: యూపీ నుంచి వస్తువుల కొనుగోలుకు వచ్చి.. -
Delhi 10/11 Blast: యూపీ నుంచి వస్తువుల కొనుగోలుకు వచ్చి..
న్యూఢిల్లీ: సోమవారం సాయంత్రం దేశ రాజధానిని కుదిపేసిన పేలుడులో మరణించిన వారిలో ఉత్తరప్రదేశ్‌లోని షామ్లి జిల్లాకు చెందిన 22 ఏళ్ల నౌమాన్ కూడా ఉన్నాడు. షామ్లీలోని జింఝానకు చెందిన నౌమాన్ తాను నిర్వహిస్తున్న సౌందర్య సాధనాల వ్యాపారం కోసం సంబంధిత వస్తువులు కొనుగోలు చేసేందుకు ఢిల్లీకి వచ్చాడు. ఇంతలో అతనిని మృత్యువు కబళించింది.నౌమాన్ కుటుంబ సభ్యులకు ఈ వార్త తెలియగానే వారంతా కుంగిపోయారు. మంగళవారం ఉదయం వారు లోక్ నాయక్ ఆస్పత్రికి చేరుకున్నారు. సంఘటన జరిగిన సమయంలో నౌమాన్తో పాటు ఉన్న అతని బంధువు 21 ఏళ్ల అమన్ కూడా పేలుడులో గాయపడ్డాడు. సోమవారం సాయంత్రం గౌరీ శంకర్ ఆలయం నుండి బైక్‌పై తిరిగి వస్తున్న 28 ఏళ్ల అంకుష్ శర్మ , 20 ఏళ్ల రాహుల్ కౌశిక్ సాయంత్రం 6:52 గంటలకు జరిగిన పేలుడులో తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు అంకుష్ ముఖం, శరీరం 80 శాతం మేరకు తీవ్రంగా కాలిపోయింది.ఈ పేలుడులో రాహుల్ తీవ్రంగా గాయపడ్డాడు. అంతటి బాధలోనూ అతను అంకుష్ను ఆసుపత్రికి తరలించడంలో సాయపడ్డాడు. ఆస్పత్రి వెలుపల బాధితుల కుటుంబాలు గుమిగూడి, తమవారి కోసం వెదుకుతున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలోని దృశ్యాలు చూపరులకు కంటతడి పెట్టిస్తున్నాయి. సోమవారం సాయంత్రం 6:52 గంటలకు జరిగిన ఈ పేలుడులో తొమ్మిది మంది మరణించగా, 20 మంది గాయపడ్డారు. హర్యానా రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన హ్యుందాయ్ కారు ఎర్రకోట సమీపంలోని ట్రాఫిక్ స్టాప్ వద్ద పేలిపోయింది. దీంతో సమీపంలోని పలు వాహనాలు తునాతునకలయ్యాయి. ఢిల్లీ పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదు చేశారు.ఇది కూడా చదవండి: Delhi 10/11 Blast: అనుమానితుడి మొదటి ఫొటో.. -
Delhi 10/11 Blast: అనుమానితుడి మొదటి ఫొటో..
న్యూఢిల్లీ: ఢిల్లీ పేలుడు కేసులో ఆత్మాహుతి బాంబర్‌గా అనుమానిస్తున్న డాక్టర్ ఉమర్ మొహమ్మద్ మొదటి ఫొటో బయటకు వచ్చింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలో పేలిని తెల్లని హ్యుందాయ్ ఐ20 కారు డాక్టర్ ఉమర్‌కు చెందినది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుమానిత ఆత్మాహుతి బాంబర్ మొదటి చిత్రాన్ని ‘ఎన్డీటీవీ’ యాక్సెస్ చేసింది. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో 1989, ఫిబ్రవరి 24న జన్మించిన ఉమర్.. అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. జమ్ముకశ్మీర్, హర్యానా పోలీసు బృందాలు అరెస్టు చేసిన వైద్యులు డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌లకు డాక్టర్ ఉమర్ అత్యంత సన్నిహితుడు.దర్యాప్తు అధికారులు మాడ్యూల్‌లోని ఇద్దరు కీలక సభ్యులను అరెస్టు చేశారని, 2,900 కిలోల అనుమానిత పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారని తెలుసుకున్న డాక్టర్ ఉమర్ ఫరీదాబాద్ నుండి పారిపోయాడు. తరువాత అతను భయాందోళనకు గురై పేలుడుకు పాల్పడ్డాడని సమాచారం. ఉమర్ మొహమ్మద్, అతని సహచరులు దాడి చేయడానికి అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ (ఏఎన్‌ఎఫ్‌ఓ)ఉపయోగించారు. వారు కారులో డిటోనేటర్‌ను ఉంచి ఎర్రకోట సమీపంలోని రద్దీ ప్రాంతంలో దాడికి పాల్పడ్డారని దర్యాప్తు వర్గాలు తెలిపాయి.ఎర్రకోట సమీపంలో పేలిన తెల్లని హ్యుందాయ్ ఐ20 కారు బదర్పూర్ సరిహద్దు నుండి ఢిల్లీలోకి ప్రవేశించినట్లు సీసీటీవీ వీడియో, ఫొటోలలో కనిపిస్తోంది. కారు ఔటర్ రింగ్ రోడ్ నుంచి పాత ఢిల్లీకి వచ్చింది. HR 26CE7674 నంబర్ ప్లేట్‌తో ఉన్న ఈ వాహనం ఎర్ర కోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో మూడు గంటల పాటు నిలిపి ఉంచారు. మధ్యాహ్నం 3:19 గంటలకు ప్రవేశించి సాయంత్రం 6:30 గంటలకు కారు బయలుదేరిందని భద్రతా వర్గాలు తెలిపాయి. అనుమానిత ఆత్మాహుతి దళ సభ్యుడు కారును ఒక్క నిమిషం కూడా వదిలి వెళ్లలేదని సమాచారం. -
Delhi 10/11 Blast: కీలక ఆధారం వెల్లడి
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుకు.. జమ్ముకశ్మీర్, హర్యానా పోలీసు బృందాలు పట్టుకున్న టెర్రర్ మాడ్యూల్‌కు మధ్య ఉన్న లింక్ బయటపడింది. పేలుడు జరిగిన కారు దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన ఒక వైద్యుడిదని, అతను మాడ్యూల్లో భాగమని మంగళవారం తెల్లవారుజామున ఉన్నత వర్గాలు ధృవీకరించాయని ‘ఎన్డీటీవీ’ వెల్లడించింది. ఈ పేలుడును ప్రాథమికంగా ఉగ్రవాద దాడిగా దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ)లోని 16,18 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనికితోడు హత్య, హత్యాయత్నం అభియోగాలతో పాటు పేలుడు పదార్థాల చట్టంలోని 3, 4 సెక్షన్లను కూడా జోడించారు.గత కొన్ని రోజులుగా హర్యానాలోని ఫరీదాబాద్‌లో మాడ్యూల్‌లోని ఇద్దరు కీలక సభ్యులైన డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ ఆదిల్ రాథర్లను దర్యాప్తు అధికారులు అరెస్టు చేసి 2,900 కిలోల అనుమానిత పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపధ్యంలో కారు యజమాని డాక్టర్ ఉమర్ మొహమ్మద్ భయాందోళనకు గురై ఎర్రకోట సమీపంలో పేలుడుకు కారణమయ్యాడని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఎర్రకోట నుంచి కారు నగర ముఖ్య కేంద్రం వైపు వెళుతున్నట్లు కనిపిస్తుండటంతో లక్ష్యం మధ్య ఢిల్లీలో ఎక్కడైనా ఉండవచ్చని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి.ఎర్రకోట ఉగ్రదాడిలో పెద్ద మొత్తంలో అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించారని పోలీసులు, నిఘా సంస్థలు భావిస్తున్నాయి. జమ్ముకశ్మీర్, హర్యానా పోలీసు బృందాలు ఫరీదాబాద్‌లోని రెండు ఇళ్ల నుండి వేల కిలోల అనుమానిత పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల తర్వాత ఈ పేలుడు సంభవించింది. ఈ రెండు ఇళ్లను డాక్టర్ ముజమ్మిల్ షకీల్ అద్దెకు తీసుకున్నారు. పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా విలేకరులతో మాట్లాడుతూ.. నెమ్మదిగా కదులుతున్న వాహనం రెడ్ లైట్ వద్ద ఆగిపోయిందని, ఆ వాహనంలో పేలుడు సంభవించిందన్నారు. పేలుడు కారణంగా సమీపంలోని వాహనాలు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు.ఢిల్లీ పోలీసులు, జమ్ముకశ్మీర్ పోలీసులు, ఎన్ఐఏ, ఎన్ఎస్టీ, ఇంటెలిజెన్స్ బ్యూరో, యుపీ ఎటీఎస్, హర్యానా పోలీసులు, గుజరాత్ పోలీసులు, ఫోరెన్సిక్ బృందాల సంయుక్త నేతృత్వంలో ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. పుల్వామాలో తారిక్ అనే వ్యక్తిని జమ్ముకశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో దాడిలో ఉపయోగించిన వాహనం అనేకసార్లు చేతులు మారిందని తెలుస్తోంది. కారును తొలుత అమీర్ అనే వ్యక్తికి విక్రయించారు. తరువాత తారిక్కు, చివరకు ఉమర్‌కు అప్పగించారు. విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: ఢిల్లీ ఘటన: కారులో ‘ముసుగు మనిషి’ -
ఢిల్లీ ఘటన: అంతటా హై అలర్ట్
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో 10 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ నేపధ్యంలో న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ మెట్రో స్టేషన్లలో కూడా భద్రతను పెంచారు. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లోని అన్ని రైల్వే స్టేషన్లకు కూడా హై అలర్ట్ ప్రకటించారు.సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ వెలుపల జరిగిన భారీ పేలుడులో 10 మంది మరణించగా, 24 మంది గాయపడ్దారు. ఈ నేపధ్యంలో భద్రతా సంస్థలు దేశ రాజధాని అంతటా హై అలర్ట్ ప్రకటించాయి. ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ)విమానాశ్రయంతో పాటు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లోని మెట్రో, రైల్వే స్టేషన్లకు హై అలర్ట్ ప్రకటించారు.ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌లలో..ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ వన్ సమీపంలో జరిగిన పేలుడు నేపధ్యంలో ఢిల్లీతోపాటు పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్ , హర్యానాలలో తక్షణ హై అలర్ట్ ప్రకటించారు. అలాగే ముంబై, కోల్‌కతా, హైదరాబాద్ తదితర నగరాల్లో నిఘా పెంచడంతోపాటు భద్రతా తనిఖీలను ముమ్మరం చేశాయి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) ప్రత్యేక బృందాలతో పాటు ఢిల్లీ పోలీసులు ఘటనా స్థలంలో పర్యవేక్షిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు పేలుడు స్వభావాన్ని గుర్తించేందుకు ఆధారాలను పరిశీలిస్తున్నారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) ఢిల్లీలోని అన్ని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు భద్రతను అందిస్తూ, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. పేలుళ్ల తర్వాత న్యూఢిల్లీ, పాత ఢిల్లీతో సహా చుట్టుపక్కల ఉన్న అన్ని రైల్వే స్టేషన్లను హై అలర్ట్‌లో ఉంచారు. ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్పీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) బృందాలతో పాటు డాగ్ స్క్వాడ్లను అన్ని స్టేషన్లలో మోహరించి, తనిఖీలు, నిఘాను ముమ్మరం చేశారు. అయితే రైలు సర్వీసులను నిలిపివేయలేదని షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయని అధికారులు స్పష్టం చేశారు.ఢిల్లీలో జరిగిన పేలుడు దేశంలో భయాందోళనలు రేకెత్తించింది. దీంతో కోల్‌కతా, డెహ్రాడూన్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో హై అలర్ట్ ప్రకటించడంతో పాటు భద్రతను కట్టుదిట్టం చేశారు. కోల్‌కతాలో పోలీసులు నగరం అంతటా ముమ్మర తనిఖీలను ప్రారంభించారు. హర్యానాలో ముఖ్యమంత్రి కార్యాలయం జిల్లా అధికారులను.. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలలో ప్రత్యేక నిఘా ఉంచాలని, చారిత్రక ప్రదేశాలలో పర్యవేక్షణను పెంచాలని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు రాష్ట్రం అంతటా పోలీసులను మోహరించారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, సున్నిత ప్రదేశాలలో తనిఖీలు ముమ్మరం చేశారు.ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పేలుడు తర్వాత భద్రతా చర్యలు గణనీయంగా పెంచామని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ స్వప్నిల్ నీలా మీడియాకు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, లోకమాన్య తిలక్ టెర్మినస్, దాదర్, థానే, కళ్యాణ్ వంటి కీలక స్టేషన్లలో గస్తీని పెంచారు. డాగ్ స్క్వాడ్లు, బాంబు నిర్వీర్య బృందాలు అనుమానాస్పద వస్తువులను తనిఖీ చేస్తున్నాయి. ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులను తాకకుండా ఉండాలని అధికారులు సూచించారు. -
ఢిల్లీలో బ్లాస్ట్.. 9 మంది దుర్మరణం
న్యూఢిల్లీ: హస్తినలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. లాల్ ఖిలా మెట్రోస్టేషన్ ఒకటో నంబర్ గేటు సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో ఆగిన హ్యుందాయ్ ఐ20 కారులో జరిగిన భారీ పేలుడు ధాటికి కారులోని ముగ్గురు సహా మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. పక్కన ఉన్న ఆరు కార్లు, రెండు ఇ–రిక్షాలు, ఆటోలు సైతం తీవ్రస్థాయిలో ధ్వంసమయ్యాయి. దీంతో మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ హుటాహుటిన సమీపంలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రిలో చేర్పించారు. పేలుడు ధాటికి సమీప మార్కెట్లోని ప్రజలు, రోడ్లమీద ఉన్న వ్యక్తులు ప్రాణభయంతో పరుగులుతీశారు. తీవ్రస్థాయి పేలుడు కారణంగా మృతదేహాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో అక్కడ భీతావహవాతావరణం నెలకొంది. మంటలు, హాహాకారా లు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీ సమీప ఫరీదాబాద్‌లో 2,900 కేజీల పేలుడు పదార్థాలను జమ్మూకశ్మీర్, హరియాణా, యూపీ పోలీసుల బృందం స్వాదీనంచేసుకున్న కొన్ని గంటలకే ఢిల్లీలో భారీ పేలుడు సంభవించడం యాధృచ్ఛికం కాదని దర్యాప్తు వర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పేలుడు ఘటనతో కేంద్రం అప్రమత్తమైంది. ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి దారితీసే అన్ని రహదారులపై ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎర్రకోట, పార్లమెంట్, మెట్రో స్టేషన్లు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టంచేశారు. జనసమ్మర్ధ ప్రాంతాల్లో సోదాలను పెంచారు. లాడ్జ్లలోనూ తనిఖీలు చేపట్టారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఢిల్లీ పోలీస్, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ), ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. ఆధారాలను ఫోరెన్సిక్ బృందాలు సేకరిస్తున్నాయి. ఘటన జరిగిన తీరును అక్కడి ప్రత్యక్ష సాక్షులను అడిగి తెల్సుకుంటున్నారు పేలుడు తర్వాత మంటలు, దట్టమైన పొగ అలుముకున్న ఆ ప్రాంతంలో మంటలను రాత్రి ఏడున్నరకల్లా ఆర్పేశామని ఢిల్లీ అగ్నిమాపక శాఖ తెలిపింది. అయితే ఇది ఉగ్రదాడి అని వార్తలొస్తున్నా ఇప్పటిదాకా ఏ ఉగ్రసంస్థా ఈ పేలుడుకు బాధ్యలము తామేనని ప్రకటించుకోలేదు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పేలుడు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం సరిగ్గా సాయంత్రం 6 గంటల 52 నిమిషాలకు లాల్‌ఖిలా మెట్రోస్టేషన్ ఎదురుగా ఉన్న సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఎర్రలైట్ పడటంతో కొన్ని వాహనాలు ఆగాయి. అదే సమయంలో ఐ20 మోడల్ కారు వెనుకభాగం ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో పక్కనే ఉన్న ఛాందిని చౌక్ మార్కెట్లోని జనం భయంతో పరుగులు తీశారు. పేలుడు ధాటికి సమీప వాహనాలు సైతం మంటల్లో కాలిపోయాయని ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చా మీడియాతో చెప్పారు. ఘటనపై మంత్రి అమిత్ షాతో మాట్లాడారు. ఘటన వివరాలను ప్రధాని మోదీ అమిత్‌షాను అడిగి తెల్సుకున్నారు. ఛాందిని చౌక్ మార్కెట్ సమీపంలోనే పేలుడు సంభవించడంతో జనం రద్దీని కట్టడిచేసేందుకు మంగళవారం మార్కెట్‌ను మూసేస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు సంజయ్ భార్గవ చెప్పారు. కశ్మీర్ వాసి పేరిట కారు రిజిస్ట్రేషన్ ! పేలిన కారు హరియాణాలో హెచ్ఆర్26సీఈ 7674 నంబర్‌తో రిజిస్ట్రర్ అయినట్లు గుర్తించారు. కారు యజమాని నదీం ఖాన్‌ను గురుగ్రామ్‌లో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇటీవల ఈ కారు పలువురు యజమానులు చేతులు మారినట్లు తెలుస్తోంది. అయితే చివరిసారిగా కశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన తారిఖ్ అనే వ్యక్తి దీనిని కొనుగోలుచేసినట్లు తెలుస్తోంది. అయితే కారు క్రయ, విక్రయల సమయాల్లో తప్పుడు గుర్తింపు పత్రాలు, డాక్యుమెంట్లను వినియోగించారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే 2013 మోడల్ ఐ20 తెలుపు రంగు కారుకు గతంలో యజమాలుగా ఉన్న ఎండీ సల్మాన్, దేవేందర్లనూ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గురుగ్రామ్‌లోని శాంతినగర్‌కు చెంది సల్మాన్ ఈ కారును ఏడాదిన్నర క్రితం ఢిల్లీలోని ఓఖ్లా ప్రాంతానికి చెందిన దేవేందర్‌కు విక్రయించాడు. తర్వాత ఈ కారును అంబాలా నగరంలో మరొకరు కొన్నారు. మృతదేహాల్లో కానరని బాంబు శకలాలు పేలిన కారులో ముగ్గురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతులు, గాయపడిన శరీరభాగాల్లోకి ఎలాంటి మేకులు, చిన్నపాటి ఇనుపగుండ్లు దూసుకెళ్లలేదు. ఉగ్రవాదులు ఉపయోగించే ఐఈడీ తరహా పేలుడుపదార్థంలో ఇలాంటి వాటిని చొప్పించి పేలుడు విస్తృతి ఎక్కువగా ఉండేలా, పెద్దసంఖ్యలో జనం మరణించేలా కుట్ర పన్నుతారు. కానీ ఈ ఘటనలో ఎలాంటి మేకులు, బాల్ బేరింగ్లు, చిన్న వైర్ల జాడ కనిపించలేదు. కానీ ఘటనాస్థలిలో ఒక బుల్లెట్‌ను కనుగొన్నారు. రసాయన పదార్థంకారణంగా సంభవించే కాలిన గాయాలు సైతం మృతదేహాలపై లేవు. దీంతో ఏ తరహా పదార్థం పేలిందనే అంశంపైనా పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. ఢిల్లీ నేర విభాగం, ప్రత్యేక విభాగం, జాతీయ దర్యాప్తు సంస్థలకు చెందిన బృందాలు వేర్వేరు కోణాల్లో దర్యాప్తును ముమ్మరంచేశాయి. పేలిన కారు అంతకుముందు ప్రయాణించిన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను చెక్ చేస్తున్నారు. ఘటనాస్థలిలో ఘటన జరిగినప్పుడు అక్కడ క్రియాశీలకంగా ఉన్న మొబైళ్ల తాజా లొకేషన్లనూ సరిచూస్తున్నారు. రిమోట్ కంట్రోల్ ద్వారా సమీపం నుంచే బాంబును పేల్చి ఉంటారన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు కొన్ని సెకన్ల ముందు ఒకవేళ అక్కడి పాదచారులు సెల్ఫీ వీడియోలు, ఫొటోలు తీసుకుంటే వాటిని తమకు అందజేసి దర్యాప్తునకు సహకరించాలని పోలీసు విభాగం పౌరులను కోరింది. ఈ పేలుడు అధిక–ఉష్ణోగ్రతను వెదజ్లే విస్ఫోటనం కాకుండా యాంత్రిక లేదా రసాయనిక విస్ఫోటనం అయి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అందుకే నైట్రేట్లు లేదా టీఎన్టీ వంటి జాడను వెతుకుతున్నారు. ఆస్పత్రులకు పోటెత్తిన బాధితుల కుటుంబసభ్యులు పేలుడు ఘటనలో తమ వారు ప్రాణాలు కోల్పోయారన్న వార్త తెలిసి కుటుంబసభ్యులు, బంధువులు హుటాహుటిన మార్చురీలు, ఆస్పత్రులకు చేరుకుని దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. క్షతగాత్రుల కుటుంబసభ్యులు, స్థానికులు, మీడియా ప్రతినిధులతో ఆస్పత్రి ప్రాంగణం నిండిపోయింది. తమ వారిని ఐసీయూలో చేర్పించారని, ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఏ విషయాలు చెప్పట్లేరని పలువురు కుటుంబసభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రహోం మంత్రి అమిత్ షా సైతం లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రుల ఆరోగ్యంపై వాకబు చేశారు. స్వల్ప గాయాలైన క్షతగాత్రులను ఓదార్చారు. ఘటన జరిగిన తీరును ప్రధాని మోదీకి వివరించారు. తర్వాత ఘటనాస్థలికి రాత్రి పదిన్నర ప్రాంతంలో అమిత్ షా చేరుకున్నారు. పేలుడు జరిగిన తీరును అక్కడి దర్యాప్తు అధికారులు అమిత్ షా వివరించారు. ఎటు చూసినా రక్తపు ముద్దలు ‘‘శక్తివంతమైన పేలుడు దెబ్బకు కొద్దిసేపు మా చెవులు గిల్లుమన్నాయి. అసలేం జరిగిందో చూసేలోపే అంతటా మంటలు. చుట్టూతా ముక్కలైన మృతదేహాలు శరీరభాగాలు. కొన్ని ముక్కలు వాహనాలపై, మరొకొన్ని రోడ్లమీద పడ్డాయి. అంతటా రక్తపు మరకలు. మంటలు అంతెత్తున ఎగసిపడ్డాయి. పేలుడు ధాటికి ఎంతో ఎత్తున ఉండే హైమాస్ట్ వీధిదీపాలు సైతం పగిలిపోయాయి. దుకాణాల, మెట్రో స్టేషన్ గాజు ప్యానెళ్లు సైతం బద్దలయ్యాయి. సమీప వాహనాలు, అందులోని వాహనాదారులకు సైతం మంటలు అంటుకున్నాయి’’అని ప్రత్యక్ష సాక్షి, 36 ఏళ్ల అమిత్ ముద్గల్ భయంభయంగా చెప్పారు. ముగ్గురు పురుషులు ముక్కలై పడి ఉన్నారని మరో ప్రత్యక్ష సాక్షి భూపీందర్ సింగ్ చెప్పారు. ‘‘చాలా మంది చేతులు, వేళ్లు తెగి పడ్డాయి. ఒక కారు స్టీరింగ్ చక్రం విరిగిపోయింది. తోపుడు బళ్లు నడిపేవాళ్లు, ట్యాక్సీ డ్రైవర్లు మంటల్లో చిక్కుకుపోయారు. వాళ్లు బతకడం కష్టమే’’అని మరో ప్రత్యక్ష సాక్షి ఇర్ఫాన్ చెప్పారు. ‘‘పేలుడు జరిగిన సెకన్లలోనే అక్కడంతా ఎర్రని పొగ అలుకుముంది. అక్కడున్న వారంతా భయంతో తలోదిక్కు పారిపోయారు. గాయాలతో కిందపడిన చాలా మందిని నేను అప్పటికే వచ్చిన అంబులెన్సుల్లోకి ఎక్కించా’’అని ఆయన అన్నారు. ‘‘నేనో ఆటో రిక్షా డ్రైవర్‌ను. సిగ్నల్ వద్ద నా ఆటోకు ముందువైపు కొంచెం దూరంలో ఓ కారు ఆగింది. దాని వెనుకభాగంలోనే పేలుడు సంభవించింది’’అని నుదుటికి గాయమైన డ్రైవర్ చెప్పారు. ‘‘పేలుడు తీవ్రతకు నా దుకాణంలోని వస్తువులన్నీ ఒక్కసారిగా కంపించాయి’’అని సమీప దుకాణదారుడు వివరించారు. పేలుడు శబ్దం కిలోమీటర్ దూరంలో ఉన్న జామా సమీదు దాకా వినపడింది. పేలుడు ఘటనపై పుకార్లను ప్రచారం చేయొద్దని, సంయమనం పాటించాలని ఢిల్లీవాసులకు రాష్ట్ర మహిళా ముఖ్యమంత్రి రేఖా గుప్తా విజ్ఞప్తిచేశారు. అమెరికా ఎంబసీ తమ పౌరులకు అలర్ట్ పేలుడు ఘటనపై ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వెంటనే స్పందించింది. ఎర్రకోట వంటి జనం విపరీతంగా గుమిగూడే ప్రాంతాలకు వెళ్లకూడదని తమ పౌరులకు అమెరికా ఎంబసీ సోమవారం ఒక భద్రతా అలర్ట్‌ను పంపించింది. స్థానిక యంత్రాంగం సూచనలు, సలహాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ జనసమ్మర్ద ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది. మరోవైపు పేలుడు ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్‌చేశారు. అన్ని దారులు పుల్వామాకే! ఢిల్లీ పేలుడుకు మూలాలు పుల్వామాలో ఉన్నాయని వార్తలొస్తున్నాయి. దీనికి బలం చేకూర్చే సిద్ధాంతాలు వెలువడుతున్నాయి. సోమవారం కశ్మీర్, హరియణా, యూపీ సంయుక్త ఆపరేషన్‌లో పట్టుబడిన ఒక వైద్యుడు పుల్వామాకు చెందిన వ్యక్తే. 2019 ఫిబ్రవరి 14న సైనిక వాహనశ్రేణిపై దాడి జరిగింది పుల్వామాలోనే. ఇక ఢిల్లీ పేలుడు ఘటనలో కారు యజమాని తారిఖ్ సైతం పుల్వామాకు చెందిన వ్యక్తే. ]శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్ శంషాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారులోని పేలుళ్ల నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్‌ను విధించారు. ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ భద్రతాదళాలతో పాటు సెంట్రల్ రిజర్వ్డ్ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు, ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ రక్షకదళాలు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. విమానాశ్రయంలో ఆర్వోబీ గేటు నుంచి మొదటి రోటరీ, రెండో రోటరీలతోపాటు ఎయిర్‌పోర్టులో అరైవల్, డిపార్చుర్ టెరి్మనళ్ల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. వాహనాలను ఆపి విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఢిల్లీ పేలుడు ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అమానుష ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రారి్థంచారు.ఢిల్లీ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: ఢిల్లీ ఎర్రకోట మెట్రోస్టేషన్ వద్ద సోమవారం జరిగిన భారీ పేలుడు ఘటన చాలా దిగ్భ్రాంతికి, బాధకు గురిచేసిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘ఈ దుర్ఘటనలో మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రారి్థస్తున్నాను’ అని వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఢిల్లీ పేలుడుపై కేటీఆర్ ఆవేదన సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలోని రెడ్‌ఫోర్ట్ మెట్రో స్టేషన్లో జరిగిన పేలుడు ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ‘ఎక్స్’లో స్పందించారు. ‘ఈ విషాదకర ఘటనలో పలువురు అమాయక ప్రజలు మరణించారనే వార్త నన్ను కలచివేసింది. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రారి్థస్తున్నాను’అని కేటీఆర్ పేర్కొన్నారు. బ్రిటిష్ ఎయిర్వేస్కు బాంబు బెదిరింపు విస్తృతంగా తనిఖీలు చేపట్టిన అధికారులు శంషాబాద్: బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు పంపిన ఈ–మెయిల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేపింది. వివరాల మేరకు... సోమవారం తెల్లవారుజామున ఎయిర్‌పోర్టు కస్టమర్ సపోర్ట్‌కు వచి్చన ఈ –మెయిల్లో లండన్‌లోని హీత్రూ విమానా శ్రయం నుంచి హైదరాబాద్‌కు వచ్చే బ్రిటిష్ ఎయిర్వేస్ –277 విమానంలో బాంబు ఉందని పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్, భద్రతాధికారులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి విమానం ల్యాండ్ అయిన తర్వాత విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఫేక్ మెయిల్‌గా తేలడంతో ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఢిల్లీ పేలుళ్ల కేసుపై వెలువడ్డ తీర్పు
న్యూఢిల్లీ: ఢిల్లీ వరుస బాంబు పేలుళ్ల కేసు(2005) నిందితుడు తరిక్ అహ్మద్‌కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ పటియాల కోర్టు గురువారం తీర్పు చెప్పింది. తరిక్ అహ్మద్‌తో పాటు కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్ రఫీక్ షా, మహ్మద్ హుస్సేన్ ఫజిల్‌లను నిర్దోషులుగా పేర్కొంది. నిందితులపై పోలీసులు టెర్రర్ చార్జీలు దాఖలు చేశారు. కానీ కేసును విచారించిన కోర్టు తరిక్‌పై ఉన్న అన్‌లాఫుల్ యాక్టివిటీస్‌కు శిక్షను విధించింది. దీంతో ఢిల్లీ పోలీసులను షాక్ కు గురయ్యారు. దోషుల్లో ఎవరూ బాంబులను పెట్టలేదనే సమాచారం ఉంది. వీరందరూ బాంబు పేలుళ్లకు సహకారం మాత్రమే అందించారని తెలిసింది. పటియాలా కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లాలా? లేదా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఢిల్లీ ప్రత్యేక పోలీసు విభాగం పేర్కొంది. పేలుళ్లు ఎలా జరిగాయంటే.. - 2005 అక్టోబర్ 29న సాయంత్రం 5.38 నిమిషాలకు పహర్‌గంజ్‌లోని రద్దీ మార్కెట్లో తొలి బాంబు పేలింది. - సాయంత్రం 6.00గంటలకు దక్షిణ ఢిల్లీలోని గోవింద్‌పురిలో బస్సుకు దగ్గరగా రెండో బాంబు పేలింది. - సాయంత్రం 6.05 గంటలకు సరోజని నగర్ మార్కెట్లో మూడో బాంబు పేలింది. - పేలుళ్లలో మొత్తం 63 మంది ప్రాణాలు కోల్పోగా.. 100 మందికి పైగా గాయాలపాలయ్యారు.


