ఢిల్లీ పేలుళ్లు.. అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీ సభ్యత్వం రద్దు | All Indian Universities suspended Al-Falah University membership | Sakshi
Sakshi News home page

ఢిల్లీ పేలుళ్లు.. అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీ సభ్యత్వం రద్దు

Nov 13 2025 9:09 PM | Updated on Nov 13 2025 9:13 PM

All Indian Universities suspended Al-Falah University membership

ఢిల్లీ: ఢిల్లీ పేలుళ్ల కేసులో కీలకంగా మారిన అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీపై చర్యలు ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీల సంఘం (Association of Indian Universities – AIU) ఈ అల్‌ ఫలహా్‌ యూనివర్సిటీకి ఇచ్చిన సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఢిల్లీ పేలుడు ఘటనలో ఈ యూనివర్సిటీకి సంబంధించి ఉగ్రవాద అనుమానితుల అరెస్టు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు కేసులో జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఇద్దరు డాక్టర్లు ముజమ్మీల్ షకీల్, అదీల్ అహ్మద్ ఈ యూనివర్సిటీలో పనిచేసినట్లు గుర్తించారు. వీరికి జైషే మహ్మద్‌ ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉగ్రకుట్రలో భాగంగా దేశవ్యాప్తంగా పేలుడు పదార్థాలు తరలించినట్లు విచారణలో వెల్లడైంది.

ఈ క్రమంలో ఏఐయూ అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీ సభ్యత్వాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం కాకుండా పూర్తిగా రద్దు చేసింది విద్యార్థుల భద్రత, విద్యా ప్రమాణాల పరిరక్షణ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐయూ తెలిపింది. ఈ సభ్యత్వ రద్దుతో, యూనివర్సిటీకి ఏఐయూ గుర్తింపు ద్వారా లభించే ప్రయోజనాలు ఇకపై అందుబాటులో ఉండవు.

AIU suspends Al-Falah University membership citing lack of good standing

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement