పాకిస్థాన్‌లో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ని జైలులో ఉంచడం, పాక్ ఆర్మీ చీఫ్‌గా ఆసిమ్ మునీర్ బాధ్యతలు చేపట్టడం,ఉగ్రవాద ప్రభావితం అధికంగా ఉండడం తదితర కారణాలతో అంతర్గతంగా పాక్‌లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రభావం ఆదేశ మేథో సంపత్తిపై పడుతున్నట్లు తెలుస్తోంది. గడిచిన రెండేళ్లలో పాక్ నుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, అకౌంటెంట్లు పెద్దఎత్తున వలస వెళ్లినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
ఏ దేశ భవిష్యత్తయిన అక్కడి మేథో సంపత్తిపై ఆదారపడి ఉంటుంది. దేశంలోనే ప్రతిభావంతులు ఉపాధి, శాంతి భద్రతలు, తదితర కారణాలతో దేశాన్ని వీడినట్లయితే ఆదేశ అభివృద్దికే ప్రమాదం. ప్రస్తుతం పాకిస్థాన్ ఆ పరిస్థితుల్లేనే ఉన్నట్లు తెలుస్తోంది. మిలిటరీచీఫ్‌గా ఆసిమ్ మునీర్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పాక్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొందని నివేదికలు పేర్కొంటున్నాయి.
గడిచిన 24 నెలలో పాకిస్థాన్‌లోని అంతర్గత పరిస్థితుల కారణంగా దాదాపు 5 వేల మంది డాక్టర్లు, 11 వేల మంది ఇంజినీర్లు, 13 వేల మంది అకౌంటెంట్లు దేశాన్ని వీడారని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ మేథో సంపన్న వర్గం దేశాన్ని వీడడానికి అక్కడి ఆర్మీచీఫ్ ఆసిమ్ మునీర్ నిరంకుశ విధానాలే కారణమని అక్కడి మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ పరిస్థితిపై పాక్ ఆర్మీచీఫ్ వ్యంగ్యంగా స్పందించారు. వారి వలస దేశానికి "బ్రెయిన్ గేన్" మాట్లాడారు.
పాకిస్థాన్ ప్రస్తుత పరిస్థితిపై ఆదేశ సెనెటర్ ముస్తఫా నవాజ్ కోకర్ స్పందించారు. పాకిస్థాన్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఫ్రీలాన్సింగ్ ఎకానమీగా ఉందని తెలిపారు. ఇంటర్నెట్ షట్‌డౌన్స్ వల్ల 1.62 బిలియన్ డాలర్లు నష్టం జరిగిందన్నారు. అంతే కాకుండా 2.37 మిలియన్ల ఫ్రీలాన్సింగ్ జాబులు రిస్కులో పడ్డాయన్నారు. ఈ ఆర్థిక వ్యవస్థను బాగు చేయాలంటే ముందుగా రాజకీయాల్ని సరిదిద్దాలి అని తెలిపారు.
2024 పాకిస్థాన్ నివేదికల ప్రకారం విదేశాలలో ఉద్యోగాల కోసం 7,27,381 మంది రిజిష్టర్ చేసుకున్నారు. ఈ ఏడాది నవంబర్ వరకూ దాదాపు 6,87,246 మంది ఉపాధి కోసం అప్ల్పై చేసుకున్నారు. అంతేకాకుండా 2011-2024 మధ్య ఆదేశం వీడి వెళ్లిన ఆరోగ్య సిబ్బంది శాతం గతంతో పోలిస్తే 2,144 శాతం పెరిగిందని డేటా తెలుపుతుంది
ఇదిలా ఉండగా పాకిస్థాన్ నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కొంతమంది అక్కడి బిచ్చగాళ్ల మాఫియా మారారు. దీంతో దేశ పర్యాటక రంగం దెబ్బతింటుందని వారిని వెనక్కి పంపించి వేస్తున్నారు. దీంతో పాకిస్థాన్ పరువు అంతర్జాతీయంగా మంటగలిసింది.


