Delhi blast: చెదిరిన టాటూలు, చిరిగిన టీ-షర్టులు.. | Delhi Red Fort Blast, Victims Identified Through Tattoos And T-Shirts Amidst Devastation | Sakshi
Sakshi News home page

Delhi Blast: చెదిరిన టాటూలు, చిరిగిన టీ-షర్టులు..

Nov 12 2025 12:06 PM | Updated on Nov 12 2025 12:49 PM

T-shirts helped families of victims confirm their worst fear

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న పేలుడులో మృతి చెందినవారి సంఖ్య 13కు చేరింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ నేపధ్యంలో మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. పేలుడు తీవ్రతకు మృతుల శరీరాలు తునాతునకలయ్యాయి. దీంతో మృతుల కుటుంబీకులు తమ వారిని గుర్తు పట్టేందుకు ఎంతో కష్టపడ్డారు.  

ఢిల్లీ పేలుడు ఘటనలో మృతులను గుర్తుపటేందుకు వారు ధరించిన టీ- షర్టులు,  శరీరంపై గల టాటూలు సాయపడ్డాయని ‘హిందుస్తాన్‌ టైమ్స్‌’ పేర్కొంది. హ్యుందాయ్ ఐ20 కారులో జరిగిన పేలుడు చాలా శక్తివంతంగా ఉండటంతో  సమీపంలో పార్క్ చేసిన వాహనాల అద్దాలు పగిలిపోయాయి. సమీపంలోని భవనాలు కంపించాయి. ఈ ఘటనలో చాందినీ చౌక్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ వ్యాపారవేత్త అమర్ కటారియా(34) శరీరం గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది. అయితే అతని చేతులపై ఉన్న టాటూలను చూసిన అతని తల్లిదండ్రులు అది అమర్ కటారియా మృతదేహంగా గుర్తించారు. అతని చేతులపై ‘అమ్మ నా తొలి ప్రేమ..నాన్న నా బలం’ అనే టాటూ ఉంది. దీనిని చూసినవారంతా కంట తడిపెట్టుకుంటున్నారు.
 

ఇదే ఘటనలో జుమ్మన్ మృతి చెందాడు. ఈ సమాచారం అందుకున్న అతని కుటుంబ సభ్యులు అతని మృతదేహం కోసం 20 గంటల పాటు ఆస్పత్రిలో వెదికారు. ఎట్టకేలకు ఒక టీ- షర్ట్‌ ఆధారంతో బాధిత కుటుంబం జుమ్మన్ మృతదేహాన్ని గుర్తించింది. కాళ్లు లేని స్థితిలో జుమ్మన్ మృతదేహం వారికి కనిపించింది. టీ- షర్ట్‌ చూసి మృతదేహాన్ని గుర్తుపట్టామని జుమ్మన్ మామ మొహమ్మద్ ఇద్రిస్ మీడియాకు తెలిపారు. ఇప్పుడు అతని దివ్యాంగ భార్య పిల్లలు  అనాథలుగా మిగిలారు.

సోమవారం సాయంత్రం ఎర్రకోటకు సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో పేలుడు సంభవించింది. నెమ్మదిగా కదులుతున్న హ్యుందాయ్ ఐ20 కారు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో సమీపంలోని అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. ఢిల్లీ పేలుడు వెనుక ఉన్న వారిని వదిలిపెట్టబోమని, వారిని కోర్టు ముందు నిలబెడతామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు: అంత్యక్రియల్లో అత్తాకోడళ్ల వివాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement