లక్నో/ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నివాసి మొహ్సిన్ ఈ పేలుడులో ప్రాణాలు కోల్పోయాడు. ఇతను ఢిల్లీలో ఈ-రిక్షా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా మొహ్సిన్ ఢిల్లీలో భార్య సుల్తానా, ఇద్దరు పిల్లలతో పాటు ఉంటున్నాడు. కాగా మొహ్సిన్ మృతదేహాన్ని అతని స్వస్థలానికి అధికారులు తరలించారు. అయితే అతని ఖననంపై కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
మోహ్సిన్ మృతదేహం మీరట్‌లోని అతని ఇంటికి చేరుకున్నదని తెలియగానే స్థానికులు అక్కడకు తరలివచ్చారు. ఒక్కసారిగా అక్కడ విషాద వాతావరణం ఏర్పడింది. మృతుని అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో అతని భార్య సుల్తానా.. తన భర్త మృతదేహాన్ని మీరట్‌లో కాకుండా ఢిల్లీలో ఖననం చేయాలని అందరి ముందూ పట్టుబట్టింది. దీంతో మోహ్సిన్ అత్త, ఇతర కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు సుల్తానాను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆమె వారి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా భర్త మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఢిల్లీకి తరలించింది.
ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు: ‘సయీద్ ఇంతకు తెగించారా?’.. షాక్‌లో తోటి ప్రొఫెసర్లు


