breaking news
last rights
-
అధికారిక లాంఛనాలతో నేడు సురవరం అంతిమయాత్ర
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డి అంతిమయాత్ర ఆదివారం నిర్వహించనున్నారు. అమెరికా నుంచి ఆయన పెద్దకుమారుడు రావాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో పలువురు సీపీఐ జాతీయ, రాష్ట్ర నేతలు సుధాకర్‌రెడ్డికి నివాళులు అర్పించారు. శనివారం ఉదయం వారంతా ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్‌పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఛాయాదేవి పాల్గొన్నారు. మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఇతర బీఆర్ఎస్ నేతలు సురవరం కుటుంబసభ్యులను ఖాజాగూడలోని గ్రీన్‌గ్రేస్ అపార్ట్‌మెంట్స్‌లో కలిసి పరామర్శించారు. ఆయన్ను కలిసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. మాజీ ఎంపీ కేవీపీ.రామచందర్‌రావు కూడా సురవరం కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆదివారం ఉదయం 9 గంటలకు కేర్ ఆస్పత్రి నుంచి సురవరం భౌతిక కాయాన్ని సీపీఐ రాష్ట్ర కార్యాలయమైన మఖ్దూంభవన్‌కు తరలిస్తారు. ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచుతారు. సాయంత్రం అక్కడి నుంచే సురవరం అంతిమయాత్ర గాంధీమెడికల్ కాలేజీ వరకు సాగుతుంది. వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం భౌతిక కాయాన్ని అప్పగిస్తారు. ఇప్పటికే ఆయన కళ్లను ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రికి ఇచ్చారు. సురవరం అంతిమయాత్రకు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఏర్పాట్లు చేస్తోంది. నేడు నివాళులు అర్పించనున్న సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఉదయం 10 గంటలకు మఖ్దూమ్‌భవన్‌కు చేరుకొని సురవరం సుధాకర్‌రెడ్డి భౌతిక కాయం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు అర్పిస్తారు. సీఎంతోపాటు పలువురు మంత్రులు కూడా పాల్గొంటారు. సురవరం సుధాకర్‌రెడ్డి మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నదని సీపీఎం సీనియర్ నేత పాటూరి రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల కోసం తపించిన నేత సురవరంఅణగారిన వర్గాల కోసం అనేక సామాజిక ఉద్యమాలు నిర్వహించి, జీవితాంతం పేదల కోసం పరితపించిన మహానీయుడు సురవరం సుధాకర్‌రెడ్డి అని సీపీఐ నేతలు కొనియాడారు. మఖ్ధూంభవన్‌లో సురవరం చిత్రపటానికి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, నేతలు చాడ వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు, తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటీ.నరసింహ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అవిశ్రాంత యోధుడు... సౌమ్యుడు.. మృదుస్వభావిసురవరం మృతిపట్ల పలువురి సంతాపంసాక్షి, హైదరాబాద్: సురవరం సుధాకరరెడ్డి మృతిపట్ల కేంద్రమంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తదితరులు సంతాపం తెలిపారు. సౌమ్యుడు, మృదుస్వభావి, పీడిత వర్గాల అభివృద్ధి కోసం తుది శ్వాస వరకు పనిచేసిన నాయకుడు సురవరం అని కిషన్‌రెడ్డి కొనియాడారు. సుధాకరరెడ్డి మరణం తెలుగు ప్రజలకు తీరనిలోటని బండి సంజయ్, బండారు దత్తాత్రేయ, ఎన్.రాంచందర్‌రావు పేర్కొన్నారు. సురవరం సుధాకర్‌రెడ్డి కమ్యూనిస్టు వేగుచుక్క అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి కొనియాడారు. సురవరం బలహీనవర్గాల హక్కులకోసం అవిశ్రాంతంగా పోరాడారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు. మతోన్మాదం పెరిగిపోతున్న ఈ తరుణంలో సురవరం మృతి వామపక్ష ఉద్యమాలకు, ప్రజాస్వామ్య హక్కులకు తీరని నష్టమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విచారం వ్యక్తం చేశారు. -
గాయకుడి అంత్యక్రియల్లో సెల్ఫీ పిచ్చి: ‘కొంచెమైనా సిగ్గుండాలి’!
స్మార్ట్ యుగంలో సెల్ఫీలకున్న క్రేజ్అంతా ఇంతా కాదు. సెలబ్రిటీలు కనిపిస్తే చాలు సమయం, సందర్భం చూసుకోకుండా.. పిచ్చి పట్టినట్టుగా వ్యవహరిస్తారు. దివంగత ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ అంత్యక్రియల సమయంలో జరిగిన ఘటన దీనికి తాజాగా ఉదాహరణ. అనారోగ్యంతో సోమవారం (ఫిబ్రవరి 26న) కన్నుమూసిన పంకజ్ ఉధాస్కు నివాళులు అర్పించేందుకు ఆయన నివాసానికి తరలి వెళ్లారు. తెల్లని దుస్తుల్లో అక్కడున్న వారంతా విషణ్ణ వదనాలతో ఆయన ఆత్మశాంతికోసం ప్రార్థిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటి విద్యాబాలన్ అభిమాని ఒకరు సెల్పీ కోసం వెంటబడటం అందరి దృష్టినీ ఆకర్షించింది. విద్య ఫ్యాన్ ఒకరు ఆగకుండా విద్యతో కలిసి తన ఫోన్‌ని చేతిలో పెట్టుకుని సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించాడు. పదే పదే వారిస్తున్నా వినకుండా... వెంటబడ్డాడు. అయితే దీనికి ఏమీ స్పందించకుండా, మౌనంగా అక్కడినుంచి వెళ్లిపోయారు విద్యా బాలన్. కొంతమంది విద్యా బాలన్ ప్రవర్తనను కొనియాడగా, మరికొందరు నెటిజన్లు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కొంచెమైనా సిగ్గుండాలి’’ అంటూ ఫ్యాన్‌పై మండిపడ్డారు. View this post on Instagram A post shared by Snehkumar Zala (@snehzala) కాగా గజల్ మేస్ట్రో అస్తమయంపై యావత్ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతోపాటు తమ అభిమాన గాయకుడిని కడసారి దర్శించు కునేందుకు పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి తరలి వచ్చారు. సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను, గౌరవాన్ని సంపాదించుకున్న నటి విద్యా బాలన్ కూడా పంకజ్ పార్థివ దేహాన్ని దర్శించి నివాళులర్పించారు. విద్యతో పాటు, శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్, సునీల్ గవాస్కర్ మంగళవారం ఆయనకు అంతిమ నివాళులర్పించారు. -
ఎల్బీ స్టేడియంలో గద్దర్ పార్థివదేహం.. ప్రముఖుల నివాళులు
-
భగభగ మండుతున్న స్నేహితుని చితిలో దూకిన యువకుడు... తరువాత జరిగిందిదే..
ఈ ప్రపంచంలో ఊహించని సంఘటనలు అనేకం జరుగుతుంటాయి. వాటి గురించి తెలుసుకున్నవారు తెగ ఆశ్చర్యపోతుంటారు. అలాంటి విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఒక యువకుడు మృతిచెందిన నేపధ్యంలో అతని అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుండగా ఉన్నట్టుండి అతని స్నేహితుడు అదే చితిలో పడిపోయి, తీవ్రంగా గాయపడ్డాడు. నగ్లా ఖంగ్రా పరిధిలోని మాడయి గ్రామానికి చెందిన 32 ఏళ్ల అశోక్ కుమార్ కేన్సర్ బాధితుడు. ఈ వ్యాధితో బాధపడుతూ శనివారం ఉదయం 6 గంటల సమయంలో మృతి చెందాడు. మృతుని అంతిమ సంస్కారాలలో పాల్గొనేందుకు అతని స్నేహితుడు ఆనంద్ హాజరయ్యాడు. అశోక్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఆనంద్ కళ్లుతిరిగి మండుతున్న ఆ చితిలో పడిపోయాడు.అందరూ చూస్తున్నంతలోనే అతని శరీరం 90శాతం మేరకు కాలిపోయింది. దీంతో స్థానికులు వెంటనే బాధితుడుని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో స్థానిక వైద్యులు బాధితుడిని ఆగ్రా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా మృతుడు అశోక్ బంధువు ఒకరు మాట్లాడుతూ.. చితి మండుతుండగా ఉన్నట్టుండి ఆనంద్ కళ్లుతిరిగి చితిపై పడిపోయాడన్నారు. తాము వెంటనే ఆసుపత్రికి తరలించామన్నారు. కాగా ఆనంద్‌కు నలుగురు కుమార్తెలున్నారు. మరోవైపు గ్రామస్తులు ఈ ఉదంతంపై మరో కథనాన్ని వినిపిస్తున్నారు. తన స్నేహితుడు అశోక్ మృతితో తీవ్రంగా కలత చెందిన ఆనంద్ స్నేహితుని చితిలో దూకాడని చెబుతున్నారు. స్నేహితుని మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేశాడని అంటున్నారు. -
‘ముంబై పోలీసులకు ధన్యవాదాలు’
ముంబై : దివంగత నటి శ్రీదేవి అంత్యక్రియల్లో పాల్గొన్న ముంబై పోలీస్ సిబ్బందికి బాలీవుడ్ ప్రముఖ నటుడు, శ్రీదేవి మరిది అనిల్ కపూర్ ట్వీటర్ వేదికగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘మేం దుఃఖంలోఉన్నప్పుడు మా చుట్టూ చేరి మాకు మద్దతుగా నిలిచిన మిత్రులకు, మా మంచి కోరే శ్రేయోభిలాషులకు తజ్ఞతలు. ముంబై పోలీసులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. మీ విధినిర్వహణతో మాకు కావల్సిన స్పేస్, గోప్యత దక్కాయి. మమ్మల్ని అర్థం చేసుకొని ప్రార్ధించిన వారందరికి కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్‌కు ముంబై పోలీస్ శాఖ సైతం స్పందించింది. ‘శోకంలో ఉన్న మీ కుటుంబం మొత్తంతో మేం కలిసున్నాం’ అని ట్వీట్ చేసింది. శ్రీదేవి అంత్యక్రియలు ముంబైలో గత బుధవారం జరిగిన విషయం తెలిసిందే. తమ అభిమాన నటిని కడసారి చూసేందుకు అభిమానులు పొటెత్తారు. దీంతో అంతిమ యాత్రలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముంబై పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. Thanks @MumbaiPolice pic.twitter.com/g6JaucW2N6 — Anil Kapoor (@AnilKapoor) 1 March 2018 We all are with you and your entire family in this moment of grief. https://t.co/px2flV9gIF — Mumbai Police (@MumbaiPolice) 1 March 2018 -
మానవా.. ఇక సెలవు ; శ్రీదేవి చివరి సంతకం
ముంబై : అశేష జనవాహినిని అర్ధశతాబ్ధంపాటు అలరించి, ఎన్నెన్నో మరుపురాని పాత్రల్లో జీవించి మెప్పించిన మేటి నటి శ్రీదేవి మానవలోకానికి సెలవంటూ సాగిపోయారు. బుధవారం ఆమె నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కావడానికి ముందు శ్రీదేవి పార్థివదేహంపై జాతీయ జెండాను ఉంచి, ప్రభుత్వ లాంఛనాలతో సత్కరించారు. ఆ సందర్భంగా తీసిన ఫొటోలను శ్రీదేవి కుటుంబం మీడియాకు విడుదలచేసింది. తనకు ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు చీరలో శ్రీదేవిని అలంకరించారు. ‘శ్రీదేవి చివరి సంతకం’గా సంబోధిస్తూ ఈ ఫొటోను అభిమానులు విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు. దేశం నలుమూలల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులెందరో శ్రీదేవి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
శ్రీదేవి అంత్యక్రియలు.. ఆలస్యానికి కారణాలివే!
దుబాయ్ : దిగ్గజ నటి శ్రీదేవి మరణించి దాదాపు 35 గంటలు గడుస్తున్నా తుది వీడ్కోలుపై ఇంకా స్పష్టత రాలేదు. ఆమె పార్థివదేహాన్ని దుబాయ్ నుంచి ముంబైకి తరలించడంలో జాప్యం నెలకొంది. శనివారం రాత్రి హోటల్ గదిలో అచేతనంగా పడిఉన్న శ్రీదేవిని స్థానిక వైద్య బృందం, పోలీసులు కలిసి రషీద్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయారని వైద్యులు నిర్ధారించడంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించారు. అక్కడి నుంచి భౌతిక కాయాన్ని భారత్‌కు తరలించడానికి సుదీర్ఘ ప్రక్రియ అవసరమవుతుంది. ఈ వ్యవహారం గురించి ‘ప్రవాసీ మిత్ర’ ఎడిటర్ భీంరెడ్డి కొంత సమాచారాన్ని అందించారు. దుబాయ్ నుంచి మృతదేహాన్ని తరలించాలంటే.. ►మృతదేహానికి అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఆ ఫోరెన్సిక్ నివేదికను రూపొందిస్తారు. ►అనంతరం పార్థివదేహాన్ని ముహైస్నాకు తరలించి, విమానంలో రవాణా చేసేందుకు అనువుగా సుగంధపరిమాళాలు, శుభ్రమైన వస్త్రాల్లో చుడతారు. ఈ ఎంబామింగ్ ప్రక్రియకు కనీసం రెండు గంటలు పడుతుంది. ►ఈలోపే స్థానిక పోలీసులు డెత్ సర్టిఫికేట్‌ను జారీచేయాల్సిఉంటుంది. ఇందుకోసం మృతురాలు/మృతుడి కుటుంబీకుల నుంచి అఫిడవిట్ తీసుకుంటారు. ఫోరెన్సిక్ రిపోర్టు అందిన తర్వాతే పోలీసులు ముందుకు వెళతారు. ►దుబాయ్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులు.. మృతురాలు/మృతుడి పాస్‌పోర్టును రద్దు చేస్తారు. ►ఆ తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనుమతితో మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తారు. ►అక్కడి నుంచి ఎయిర్‌పోర్ట్‌కు తరలిస్తారు. కస్టమ్స్ క్లియరెన్స్ అనంతరం విమానంలో భారత్‌కు తరలిస్తారు. ►శ్రీదేవి పార్థివదేహాన్ని తరలించేందుకు ఇప్పటికే ప్రత్యేక విమానాన్ని సిద్ధంగా ఉంచారు. ►భారతకాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 6 గంటలకు విమానం ముంబైకి చేరుకునే అవకాశంఉంది. -
మధ్యాహ్నం మురళీదేవరా అంత్యక్రియలు
ముంబయి : కేంద్ర మాజీమంత్రి మురళీ దేవరా అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న మురళీ దేవరా ఈరోజు తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా దేవ్రా మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేవ్రా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.