బంగ్లాదేశ్ ప్రస్తుతం హింసతో అట్టుడుకిపోతుంది. ఇటీవల అక్కడ రాడికల్ నేత ఉస్మాన్ హాదీ మరణంతో అక్కడ అక్కడి మతతత్వ శక్తులు ఆదేశంలోని హిందువులే టార్గెట్‌గా దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే హత్యకు గురైన ఉస్మాన్ హాదీ సోదరుడు అక్కడి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలను ప్రక్కదోవ పట్టించేందుకు యూనస్ ప్రభుత్వమే ఉస్మాన్‌ని హత్య చేయించిందని ఆరోపించారు.
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై ప్రస్తుతం దేశవ్యాప్త చర్చ నడుస్తోంది. స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హాదీ మరణం తర్వాత ఆ దేశంలోని మతతత్వ శక్తులు భారత్‌పై పగ పెంచుకున్నాయి. ఈ సందర్భంలోనే అక్కడ నివసిస్తున్న దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని అక్కడి అల్లరిమూకలు తీవ్రంగా కొట్టిచంపారు. అనంతరం మరో హిందూ కుటుంబంపై దాడి చేయగా వారు తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనలతో భారత్‌లో నిరసనలు మిన్నంటాయు ఢిల్లీలోని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కార్యలయాన్ని వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ముట్టడించారు.
అయితే ఇటీవల జరిగిన ఉస్మాన్ హాదీ హత్యపై ఆయన తమ్ముడు ఒమర్ హాది సంచలన ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వమే ఎలక్షన్లని తప్పుదారి పట్టించాలనే ఉద్దేశంతో ఉస్మాన్ హాదీని హత్య చేయించిందని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లోని షాబాద్‌లో ఉస్మాన్ మృతి సంతాపంగా ర్యాలీ నిర్వహించారు అందులో అతన సోదరుడు మాట్లాడుతూ. "మీరే ఉస్మాన్ హాదీని చంపించారు. ఇప్పుడు అతని చావు పేరుతో ఎన్నికలకు ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.నా సోదరుడు ఎన్నికలు జరగాలని కోరుకున్నాడు. ఆయన నిర్ణయాన్ని గౌరవించి ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి" అని ఒమర్ తెలిపారు.
ఉస్మాన్ హాదీ విదేశీ శక్తులకు తలొగ్గడానికి నిరాకరించాడని అందుకే ఆయనను కుట్రపన్ని హత్య చేయించారని తెలిపారు. అతని చావుకు కారణమైన వారు ఏదో ఒకరోజు దేశాన్ని వదిలి పారిపోవాల్సివస్తుందని హెచ్చరించారు. ఉస్మాన్ హాదిని హత్య చేసిన వారిని గుర్తించడానికి ప్రభుత్వానికి 30 రోజుల గడువు ఇస్తున్నామని అంతలోపు వారిని అరెస్టు చేయకపోతే బంగ్లావ్యాప్తంగా తీవ్ర నిరసనలు చేపడతామని అక్కడి నాయకులు యూనస్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.


