భారత్‌లో మరోసారి ఆత్మాహుతి దాడికి జైషే కుట్ర | Jaish-e-Mohammed Plotted Red Fort–Style Attacks in India | Sakshi
Sakshi News home page

భారత్‌లో మరోసారి ఆత్మాహుతి దాడికి జైషే కుట్ర

Nov 19 2025 3:42 PM | Updated on Nov 19 2025 4:56 PM

Jaish-e-Mohammed Plotted Red Fort–Style Attacks in India

ఢిల్లీ: ఎర్రకోట బాంబు తరహాలో భారత్‌లో మరోసారి ఆత్మాహుతి దాడికి నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్- మహమ్మద్ ప్రయత్నిస్తుందని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా ఆదాడి కోసం పాకిస్థాన్‌లో విరాళాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నాయి.

ఎర్రకోట బాంబు పేలుళ్లపై ఎన్ఐఏ జరుపుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జైష్ ఉగ్ర సంస్థ ఎర్రకోట కారు బాంబు తరహాలో భారత్‌లో మరో ఆత్మాహుతి దాడి (ఫిదాయిన్)కు ప్రణాళికలు రచించిందని తెలుస్తోంది. అంతే కాకుండా ఆ దాడికోసం డిజిటల్ మార్గాల ద్వారా విరాళాలు సేకరిస్తుందని అందులో సదాపే అనే పాకిస్థాన్‌కు చెందిన యాప్ కూడా ఉందని తెలిపింది.  ఫండ్ రుసుము పాకిస్థాన్ కరెన్సీలో 20వేలు భారత్(రూ.6400) ఉన్నట్లు పేర్కొంది. ఈ డబ్బులను ఉగ్రవాదుల ఖర్చులకోసం ఉపయోగిస్తున్నట్లు సమాచారం.

వీటితో పాటు ఉగ్రవాదులకు చలికాలపు కిట్‍ ముజాహిద్ ఇచ్చే వారినెవరినైనా జిహాదీలుగా పరిగణిస్తారని జిహాదీల మరణానంతరం వారిపై శ్రద్ధ కనిపించేవారిని సైతం జిహాదీలుగానే గుర్తిస్తున్నట్లు దర్యాప్తులో వివరాలు తెలిసాయి. ఇటీవల ఎర్రకోటలో జరిగిన బాంబు దాడులలో టెర్రర్ డాక్టర్ గ్రూప్‌కు డిజిటల్ మార్గంలోనే నిధులు అంది ఉండవచ్చని దానిపై ప్రత్యేక దర్యాప్తు చేపడుతున్నామని ఎన్ఐఏ బృందాలు పేర్కొన్నాయి.

కాగా ఇటీవల ఫరీదాబాద్ అక్రమ పేలుడు పదార్థాల కేసులో అరెస్టయిన డాక్టర్. షహీన్ సయీద్ ఈ దాడికి ఫండ్ చేసిందని ఎన్ఐఏ బృందాలు అనుమానిస్తున్నాయి. ఈ బాంబు పేలుళ్ల కేసులో షహీన్ సయీద్‌ను మేడమ్ సర్జన్ అనే కోడ్ నేమ్‌ కలిగి ఉంది. జమాత్ - ఉల్- ముమినాత్ అనే యూనిట్‌లో ఆమె సభ్యురాలిగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement