సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో హైదరాబాద్‌లో బాంబ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు చేపట్టాయి. పలు షాపింగ్ మాల్స్, ఆలయాలు, బస్స్టాఫ్‌లొ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. రద్దీ ప్రదేశాల్లో బాంబ్ స్క్వాడ్‌తో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఢిల్లీ పేలుడుతో అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు.. పాతబస్తీలో అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రధానంగా హైదరాబాద్ పాత నగరం నాకాబందీతో పాటు ఇతర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా పేలుళ్ల దృష్ట్యా హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ నగర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద వ్యక్తులు,వస్తువులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.


