ఢిల్లీ: ఢిల్లీలో మరో పేలుడు సంభవించింది. రాడిసన్ హోటల్ సమీపంలో గురువారం ఉదయం భారీ శబ్దంతో పేలుడు జరిగింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఉదయం 9.18 గంటల సమయంలో ఈ పేలుడు జరిగినట్లు సమాచారం. డీటీసీ బస్సు టైర్ పేలిన భారీ శబ్దంగా పోలీసులు పేర్కొన్నారు.
అనుమానాస్పద వస్తువులేవి కనిపించలేదని పోలీసులు వెల్లడించారు. సాధారణ టైరు పగిలిన సంఘటనగా పోలీసులు తేల్చారు. 9.18 నిమిషాల సమయంలో పేలుడు శబ్దం వినిపించిందని కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ శబ్దం విన్న ఓమహిళ మొదట PCR కాల్ చేయగా, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
At 9:18am on November 13, a commuter informed the Delhi Police about explosion near Radisson Hotel in Mahipalpur #Delhi
Upon reaching the site, the police found nothing.
It was a tyre burst of a DTC bus. #RedFort #LalQila #DelhiPolice pic.twitter.com/60WMstnA9r— Anish Singh (@anishsingh21) November 13, 2025
ఢిల్లీ పోలీస్ బృందాలు, బాంబు నిర్వీర్య దళం, అగ్నిమాపక సిబ్బందితో కలిసి తనిఖీ చేపట్టారు. అయితే, హోటల్ పరిసరాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఢౌలా కువాన్ వైపు వెళ్తున్న డీటీసీ బస్సు వెనుక టైరు పేలడంతో ఆ శబ్దం వచ్చిందని తెలిపారు. నవంబర్ 10 సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కార్ పేలుడు నేపథ్యంలో రాజధానితో పాటు ఇతర రాష్ట్రాల్లో విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి.


