ముంబై: తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల అంటూ బంధు పరివారమంతా ఆనందంగా పాటలు పాడుకుంటుండగా పెళ్లి వేదికపై కత్తిపోట్లు కలకలం రేపాయి. పెళ్లి తంతుపూర్తయి బంధువులతో కలిసి నూతన వధూవరులు ఫొటోలు దిగుతుండగా ఓ వ్యక్తి పెళ్లి కొడుకును కత్తితో పొడిచి పరారయ్యాడు. దీంతో పెళ్లి వేదికపై ఏం జరుగుతుందో అర్థం కాక బంధువులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన మహరాష్ట్రలో జరిగింది.
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో సోమవారం జరిగిన ఓ పెళ్లి వేడుకలో దారుణం జరిగింది. వేదికపై ఉన్న పెళ్లికుమారుడు సజల్ రామ్ సముద్ర (22)పై నిందితుడు రాఘో జితేంద్ర బక్షి అనే వ్యక్తి కత్తితో మూడు సార్లు దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తన స్నేహితుడు బైక్‌తో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో పెళ్లి వీడియోగ్రాఫర్ తన డ్రోన్ కెమెరాతో నిందితుణ్ని దాదాపు రెండు కిలోమీటర్లు ట్రాక్ చేశాడు.
అప్రమత్తమైన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రోన్ ఫుటేజ్ ఆధారంగా నిందితుణ్ని,అతను దాక్కున్న ప్రాంతాన్ని గుర్తించారు.
ప్రాథమిక దర్యాప్తులో, ఈ దాడికి కారణం డీజే డాన్స్ సమయంలో జరిగిన చిన్న గొడవ అని తేలింది. ఆ గొడవతో ఆగ్రహించిన నిందితుడు పెళ్లికుమారుడిపై దాడికి పాల్పడ్డాడు. గాయపడిన సజల్ రామ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
अमरावती में एक शादी समारोह में दो लड़कों ने दूल्हे पर जानलेवा हमला कर दिया। इसके बाद ड्रोन कैमरामैन में जो किया वो काबिल ए तारीफ है। pic.twitter.com/38SnObPAOO
— Shashank shukla (@shashaankshukla) November 12, 2025


