ఇటీవల ఇండిగో విమానాల రద్దు ఎపిసోడ్ పెద్ద హాట్ టాపిక్. ఇండిగో ప్రయాణికుల తిప్పలు ఇక్కడ వర్ణనాతీతం. కొత్త పైలట్ విశ్రాంతి నియమాలు, షెడ్యూల్ ప్లానింగ్ లోపాలు, శీతాకాల రోస్టర్ ఒత్తిడి వల్లే ఈ భారీ రద్దులు జరిగాయి ఫలితంగా ప్రయాణికులకు అవస‍్థల తప్పలేదు. అయితే వీటితో ఇప్పడు ఒక సంఘటన వైరల్‌గా మారింది. పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్న వరుడు.. ఇండిగో విమానం రద్దుతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
అది కూడా పెళ్లి చివరి నిమిషంలో ఫ్లైట్ రద్దైన విషయం తెలియడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇదే విషయాన్ని వధువుకి కూడా చేరవేశాడు. కానీ పెళ్లి మాత్రం ఆగలేదు. వరుడు ఎక్కడో ఉన్నాడు.. వధువు కూడా వేరే చోట అంటే ఫ్లైట్ .జర్నీ చేసి వస్తే కానీ ముహూర్తానికి అందనంత దూరంలో ఉంది. ఒకవైపు పెళ్లి కొడుకులో టెన్షన్..మరొకవైపు పెళ్లి కూతురిలో అంతకుమించి ఆందోళన.
ముహూర్తం సమయానికి పెళ్లి అవుద్దా.. లేదా అనే సందిగ్థంలో పడింది. అయితే వరుడ మాత్రం తన ప్రేమకు ఎల్లలు లేవని భావించాడు. అందుకే చార్టర్ ఫ్లైట్(ప్రత్యేకంగా అద్దెకు తీసుకున్న విమానం)లో వాలిపోయాడు. ఇంకేముంది కథ సుఖాంతమైంది.. వధువు అనందానికి హద్దుల్లేకుండా పోయింది. వరుడుకి ఘనస్వాగతం లభించింది.. వధువు తన డ్యాన్స్‌తో అలరించి కాబోయే భర్తకు ఘనంగా ఆహ్వానం పలికింది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఈ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


