చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గంలో దారుణం జరిగింది. ఓ వివాహితపై ముగ్గురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన 10 రోజుల అనంతరం వెలుగులోకి వచ్చింది. బాధితురాలికి కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
కుప్పం పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి భర్త ఫిర్యాదు చేశారు. కుప్పం మండలం ఎన్. కొత్తపల్లి పంచాయతీ నిమ్మకంపల్లి గ్రామంలో ఘటన జరిగింది. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పరారీలో ఉన్న మరో నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
విషయం బయటకు చెప్తే.. తన కుటుంబాన్ని అంతం చేస్తామని నిందితులు బెదిరించారని బాధితురాలి భర్త తెలిపారు. దీంతో నా భార్య విషయం బయటకు చెప్పలేక 10 రోజులుగా మానసికంగా కుంగిపోయింది. నన్ను చంపేస్తామని, నా పిల్లలని చంపుతామని నా భార్యను బెదిరించారు’’ అని బాధితురాలి భర్త ఆవేదన వ్యక్తం చేశారు.


