‘జీవితాలు మారడానికి ఒక రోజు చాలు’ అంటారు. ‘జీవితమే లేకుండా పోవడానికి కొన్ని నిమిషాలు చాలు’ అనిపిస్తుంది ఈ వైరల్ పోస్ట్ చూసిన తరువాత. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుకు సంబంధించి వేణి గుప్తా అనే మహిళ ‘ఎక్స్’లో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘పేలుడు జరగడానికి కొన్ని నిమిషాల ముందు నేను, మా అమ్మ సంఘటన స్థలంలోనే ఉన్నాం. పెళ్లి దుస్తులు కొనడానికి వెళ్లాం. చాలామందిలాగే రుచికరమైన పాత ఢిల్లీ వంటకాలను ఆస్వాదించాం. పని పూర్తి కాగానే ఎర్రకోట నుండి ఆటో మాట్లాడుకొని మెట్రో స్టేషన్‌కు వెళ్లడం సాధారణ విషయమే.
అయితే ఇప్పుడు ఏది సాధారణం అనిపించడం లేదు. జీవితం ఎంత అనూహ్యమైనది! నగరం భయం దుప్పటి కప్పుకొని ఉంది. ఢిల్లీ దుఃఖిస్తోంది. బాధిత ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’ అని రాసింది వేణి గుప్తా. పేలుడుకు ముందు ఆ పరిసర ప్రాంతాలలో తాను తీసిన ఫొటోలను షేర్ చేసింది వేణి.
(చదవండి: గూగుల్ బాయ్ ఆఫ్ చత్తీస్‌గఢ్)


