గూగుల్‌ బాయ్‌ ఆఫ్‌ చత్తీస్‌గఢ్‌ | 6 year old Armaan Ubrani from Chhattisgarh called Google Math Boy | Sakshi
Sakshi News home page

గూగుల్‌ బాయ్‌ ఆఫ్‌ చత్తీస్‌గఢ్‌

Nov 12 2025 10:39 AM | Updated on Nov 12 2025 10:48 AM

6 year old Armaan Ubrani from Chhattisgarh called Google Math Boy

‘గూగుల్‌ బాయ్‌ ఆఫ్‌ చత్తీస్‌గఢ్‌’గా పేరు తెచ్చుకున్న అర్మాన్‌ ఉబ్రానీ వంద సంక్లిష్టమైన పజిల్స్‌ను 13 నిమిషాల లోపు పరిష్కరించి రికార్డ్‌ సాధించాడు. అయిదు సంవత్సరాల అర్మాన్‌ మూడు పుస్తకాలు రాశాడు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ అందుకున్నాడు.

బిలాస్‌పూర్‌లోని ఒక వ్యాపారవేత్త ఏకైక కుమారుడు అయిన అర్మాన్‌ చిన్నప్పటి నుంచే తన వయసుకు మించిన తెలివితేటలను ప్రదర్శించేవాడు. మ్యాథ్స్‌ ప్రాబ్లమ్స్‌ సాల్వ్‌ చేయడానికి తన కంటే చాలా పెద్ద వయసు వాళ్లు కుస్తీలు పడుతుంటే...

‘ఇదిగో ఇలా చేస్తే సరిపోతుంది’ అని నిమిషాల వ్యవధిలో ఆ ప్రాబ్లమ్స్‌ సాల్వ్‌ చేసి వారిని ఆశ్చర్యపరిచేవాడు. ‘నంబర్‌–సాల్వింగ్‌ స్కిల్స్‌’ విభాగంలో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, హార్వర్డ్‌ వరల్డ్‌ రికార్డ్స్, ఆన్‌లైన్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సాధించాడు. అర్మాన్‌ రాసిన ‘పింక్‌ డాల్ఫిన్‌’ ప్లానెక్స్‌’ ‘మై కాంటినెంట్‌’ పుస్తకాలకు మంచి ఆదరణ లభించింది. ఈ పుస్తకాలు అమెజాన్, గూగుల్‌ బుక్స్, కోబో బుక్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

‘ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవాలనే తపన అర్మాన్‌లో కనిపిస్తుంది. మామూలుగా మ్యాథ్స్‌ పాఠాలు చెబుతుంటే పిల్లల్లో ఆసక్తి ఉండదు. అయితే అర్మాన్‌ మాత్రం చాలా ఆసక్తిగా వినేవాడు’ అని కుమారుడి గురించి చెప్పింది తల్లి నైనా ఉబ్రానీ. 

(చదవండి: రియల్‌ అన్నాచెల్లెళ్ల అనుబంధం..! ప్రముఖ బాలీవుడ్‌ నటి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement