అన్నాచెల్లెళ్ల అనుబంధం గురించి వెండితెరపై ఎన్నో సీన్‌లు చూస్తుంటాం. అడపదడపా కన్నీళ్లు కూడా పెడుతుంటాం. ఇది కూడా అలాంటి భావోద్వేగ దృశ్యమే. అయితే ఇది నిజజీవిత సంఘటన. తన సోదరుడికి భారతీయ అధికారుల నుంచి అవసరమైన చట్టపరమైన, వైద్యసహాయం కోరుతూ ప్రముఖ బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించింది.
నాలుగు వారాల లోపు అతడి గురించి స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీస్ జారీ చేసింది హైకోర్ట్. జైట్లీ సోదరుడి పరిస్థితి తెలుసుకోవడానికి నోడల్ ఆఫీసర్‌ని నియమించాలని డిల్లీ హై కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశం తరువాత సెలీనా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్ వైరల్ అయింది.


