భారత ఆరోగ్య రక్షణ వ్యవస్థపై ఓ ఎన్నారై ప్రశంసల జల్లు కురింపించాడు. తాను అమెరికాలో ఆ వ్యాధి కోసం చాలా డబ్బులు ఖర్చుపెట్టానని, కానీ నయం కాలేదని వాపోయాడు. పదేళ్లుకు పైగా ఆ వ్యాధితో నరకం చూశానని..కానీ తన మాతృభూమిలో సులభంగా నయమైపోయిందంటూ భారత చికిత్స విధానాన్ని మెచ్చుకుంటూ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారడమే గాకా ఆ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. అంతేగాదు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఆధునిక వైద్య విధానంపై చర్చలకు తెరలేపింది కూడా. ఎవరా ఆ ఎన్నారై?, ఏమా కథ చూద్దామా..
అమెరికాలో స్టాప్ డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తున్న ఓ ఎన్నారై ఓ వ్యాధి విషయంలో అమెరికాలో తాను ఎదుర్కొన్న అనుభవాన్ని రెడ్డిట్‌లో షేర్ చేసుకున్నాడు. ఆ పోస్ట్‌లో ఆ ఎన్నారై ఇలా రాసుకొచ్చాడు. "నేను అమెరికాలో పదేళ్లకు పైగా ఉన్నాను. అక్కడే తన చదువు, కెరీర్ అద్భుతం సాగింది. కానీ ఇంటిని, ఫ్యామిలీని బాగా మిస్ అయ్యా. అయితే అక్కడ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నప్పుడు 2017లో స్కిజోఆఫెక్టివ్ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడ్డాను. దీనివల్ల రోగులు నమ్మశక్యం కానీ బ్రాంతులకు గురై ఉద్యోగ కెరీర్, వ్యక్తిగత సంబంధాలు ఇబ్బందిగా మారపోతుంటాయి.
ఈ మానసిక రోగంతో చాలా ఇబ్బంది పడ్డ. అందుకోసం అమెరికాలో చికిత్స కూడా తీసుకున్నా. అయితే అక్కడ అమెరికా డాక్టర్లు తనను డబ్బులు ఇచ్చే యంత్రంలా చూశారే గానీ, సరైన విధంగా చికిత్స చేయడంలో విఫలమయ్యారు. చాలా డబ్బు ఖర్చే చేశాను, ఏకంగా పదేళ్లకుపైగా బాధపడ్డను. కానీ, ఆ సమస్య నుంచి భయటపడింది కూడా లేదు. అయితే తనకు అక్కడ వైద్యులు ఆందోళన వల్ల ఈ సమస్య వస్తుందని, దాన్నితగ్గించుకునే ప్రయత్నంచేయమని సూచించేవారు, అందుకు సంబంధించి మందులే ఇచ్చారు.
అంతేగాదు దీన్ని అధిగమించగలమే కానీ, నయం కాదని కూడా తేల్చి చెప్పారు. అయితే తాను మరో డాక్టర్‌ని సంప్రదించి సలహా తీసుకోవాలనే ఉద్దేశ్యంతో భారత్‌కి తిరిగి వచ్చి బెంగళూరులోని నిమ్హాన్స్‌లోని ప్రముఖ మానసిక వైద్యుడిని సంప్రదించాను. అక్కడ ఆ వైద్యలు ఆధ్వర్యంలో తీసుకున్న చికిత్స కారణంగా కాస్త రీలిఫ్ లభించడమే కాకుండా..చాలమటుకు క్యూర్ అయ్యింది. అంతేగాదు..ఈ మానసిక రుగ్మత నుంచి బయటపడ్డానని, కానీ ఆందోళన మాత్రం దరిచేరకుండా చూసుకోమని వైద్యులు సూచించారు అని "రాసుకొచ్చాడు".
అందువల్లే తాను సాధ్యమైనంత తొందరలో భారత్‌కు వచ్చేసేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు కూడా ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. కాగా, నెటిజన్లు కూడా అతడి పోస్ట్‌తో ఏకభవిస్తూ..తాము కూడా అక్కడ ఉన్నప్పుడూ ఎదుర్కొన్న మానసిక సమస్యలను షేర్ చేసుకున్నారు. అంతేగాదు అక్కడ వాతావరణం కారణంగా రోగనిరోధక వ్యవస్థ సన్నగిల్లి మానసిక రుగ్మతలు బారినపడతామని అక్కడ వైద్యులు చెప్పారని మరికొందరూ పోస్ట్‌లు పెట్టడం గమనార్హం.
(చదవండి: సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం! వైరల్‌గా ఎన్నారై పోస్ట్)


