ఎక్కువమంది ఫాలో అయిన ఫిట్‌నెస్‌ సూత్రాలివే | Rewind 2025: fitness trends outdoor yoga and mobile fitness apps | Sakshi
Sakshi News home page

Rewind 2025: ఎక్కువమంది ఫాలో అయిన ఫిట్‌నెస్‌ సూత్రాలివే

Dec 27 2025 8:01 PM | Updated on Dec 27 2025 8:16 PM

Rewind 2025: fitness trends outdoor yoga and mobile fitness apps

2025వ సంవత్సరం డిసెంబర్‌ చివరి వారంలో ఉన్నాం మనం. ఈ సందర్భంగా వివిధ రంగాలలో జీవన శైలి పరంగా ముఖ్యంగా ఫిట్‌నెస్‌ కోసం అత్యధికులు అనుసరించిన ట్రెండ్స్‌ ఏమిటో తెలుసుకుందాం..

ఫిట్‌గా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అయితే ఫిట్‌గా ఉండేందుకు ఎంచుకునే విధానాలే రకరకాలుగా ఉంటాయి. కొందరు జిమ్‌ మెంబర్‌షిప్‌ తీసుకుని ఫిట్‌ అవుతారు. మరికొందరు యోగా చేయడాన్ని ఇష్టపడతారు. ఇంకొంతమంది తమ ఆహారపు అలవాట్లను మార్చుకుని ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో 2025 సంవత్సరంలో ఫిట్‌గా ఉండేందుకు ఎక్కువమంది దేనిని అనుసరించారో ఓసారి రివైండ్‌ చేసుకుందాం.

మొబైల్‌ ఫిట్‌నెస్‌ యాప్స్‌
ఈ సంవత్సరంలో ప్రజలు తమ ఫిట్‌నెస్‌ను (Fitness) ట్రాక్‌ చేయడానికి ట్రాకింగ్‌ యాప్స్‌ను విస్తృతంగా ఉపయోగించారు. ధరించే పరికరాలు, ఆటోమేటెడ్‌ అలర్ట్‌లు ఇచ్చే ఫిట్‌నెస్‌ ట్రాకర్స్, స్మార్ట్‌ వాచ్‌లు, హార్ట్‌ రేట్‌ మానిటర్ల వంటి పరికరాలు ఈ సంవత్సరం బాగా చర్చలో నిలిచాయి. పర్సనల్‌ ట్రైనర్‌ను నియమించుకోవడం కంటే ప్రజలు ఈ సంవత్సరం తమ ఫిట్‌నెస్‌ను సొంతంగా ట్రాక్‌ చేసుకున్నారు.

మితంగా తినే మినిమల్‌ ఈటింగ్‌ హ్యాబిట్‌
ఈ సంవత్సరంలో ఎక్కువమంది సమతుల్య ఆహారం (Balanced Diet) ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. దీనిపై సోషల్‌ మీడియా ప్రభావం కూడా ఉందని చెప్పవచ్చు. రోజూ ప్రోటీన్‌ అధికంగా ఉండే హెల్తీ స్నాక్స్‌ రీల్స్‌ చూసి చూసీ చూసీ ఈ ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం ప్రారంభించి, తమ డైట్‌లో మంచి మార్పులు చేసుకున్నారు.

ఔట్‌డోర్‌ యోగా
2025లో అధిక సంఖ్యాకులు ఫిట్‌నెస్‌ను సీరియస్‌గా తీసుకుని ఔట్‌డోర్‌ యాక్టివిటీస్‌పైనా దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఔట్‌డోర్‌ యోగా చేయడం ద్వారా తమను తాము ఫిట్‌గా ఉంచుకున్నారు. వీటితో పాటు వాకింగ్‌ చేయడం, పరుగెత్తడం, హైకింగ్, స్కీయింగ్‌ వంటి యాక్టివిటీస్‌ కూడా ప్రజల ఫిట్‌నెస్‌ రొటీన్‌లో భాగమయ్యాయి.

చ‌ద‌వండి: వ్యాయామానికి ముందు కాఫీ తాగొచ్చా?

మార్నింగ్‌ వర్కవుట్స్‌
సాయంత్రం సమయాన్ని బయట తిరగడానికి కేటాయించడం కోసం చాలామంది తమ ఉదయం రొటీన్‌లో వ్యాయామాన్ని చేర్చుకున్నారు. కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా యోగా లేదా వాక్‌ చేయడానికి కూడా ఉదయం సమయం సరైనదిగా నిలిచింది.

కలిసి మెలిసి..
2025లో వైరల్‌ అయిన వాటిలో గ్రూప్‌ ట్రైనింగ్‌ యాక్టివిటీ ఒకటి. అదేంటంటే... ఇంట్లో ఒంటరిగా వ్యాయామం చేయడం కంటే స్నేహితులు లేదా భాగస్వామితో కలిసి వ్యాయామం చేయడం మరింత మెరుగ్గా ఉంటుందనిపించి చాలామంది తమకు తోడుగా ఎవరైనా ఉంటే జిమ్‌కి వెళ్లడం లేదా వర్కవుట్‌ చేయడంలో మునిగిపోయారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement