హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవం (Koti Deepotsavam) పెన్నెండవ రోజు కూడా ఘనంగా జరిగింది.
సాయంత్రం 6 గంటలకు శంఖారావంతో మొదలైన ఈ కార్యక్రమం శ్రీభ్రామరి విజయశంకర వేదపాఠశాల,ఓల్డ్ఆల్వాల్ వారిచే వేద పఠనం జరిగింది.
ఆ తర్వాత ప్రాంగణంలోని మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం జరిగింది.
బాసర మహాసరస్వతి పూజ భక్తులచే సరస్వతీ విగ్రహాలకు పూజ ,కోల్కతా కాళీ కుంకుమార్చన చాలా ప్రత్యేకంగా జరిగింది.
పదకొండవ రోజు ముఖ్య అతిధిలు గా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వి.సి.సజ్జనార్ ,ఎం.ఈ.ఐ.ఎల్. శ్రీ కృష్ణారెడ్డి గారు వచ్చారు .


