న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తు చేయడానికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) 10 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో ఒక ఐజీ, ఇద్దరు డీఐజీలు, ముగ్గురు ఎస్‌పీలు, డీఎస్‌పీ స్థాయి అధికారులు ఉండనున్నారు. ఈ బృందానికి ఎన్‌ఐఏ ఏడీజీ విజయ్ సఖారే సారధ్యం వహించనున్నారు.
హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకి అప్పగించింది. ఈ నేపధ్యంలో ఎన్‌ఐఏ అధికారులు.. జమ్ముకశ్మీర్ పోలీసులు, ఢిల్లీ పోలీసులు, హర్యానా పోలీసుల నుండి జైష్ మాడ్యూల్‌కు సంబంధించిన అన్ని కేసు డైరీలను స్వాధీనం చేసుకోనున్నారు. అలాగే ఈ కేసుపై చర్చించేందుకు ఎన్‌ఐఏ డీజీ, ఐబీ చీఫ్ ఈరోజు(బుధవారం) సమావేశం కానున్నారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు: దీపావళికే ప్లాన్?


