లక్నో: అది.. యూపీలోని లక్నోకు చెందిన జనసాంద్రత కలిగిన దాలిగంజ్ ప్రాంతం.. అక్కడి ఒక ఇరుకైన సందులో సయ్యద్ అహ్మద్ అన్సారీ ఇల్లు ఉంది. అతని కుమార్తె డాక్టర్ షాహీన్ సయీద్‌ను ఢిల్లీలో జరిగిన పేలుడు కేసుతో పాటు ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మొహమ్మద్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టు చేశారు. అప్పటి నుంచి అందరి దృష్టి డాక్టర్ షాహీన్ సయీద్‌వైపు మళ్లింది.
‘మాట్లాడి నాలుగేళ్లయ్యింది’
పాకిస్తాన్‌కు చెందిన జైష్ ఎ మొహమ్మద్ (జెఎం) మహిళా నియామక విభాగాన్ని భారతదేశంలో నెలకొల్పేందుకు డాక్టర్ సయీద్ పనిచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఫరీదాబాద్‌లో 2,900 కిలోల పేలుడు పదార్థాలు దొరికిన దరిమిలా డాక్టర్ సయీద్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
లక్నోలో ఉంటున్న సయీద్ మొహమ్మద్ షోయబ్ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు, ఏటీఎస్ అధికారులు తమ ఇంటికి వచ్చారని, మర్యాద పూర్వకంగా వ్యవహరించారని తెలిపారు. తన సోదరి నాలుగేళ్లుగా తమతో తమతో మాట్లాడలేదన్నారు. అయితే తన సోదరి గురించి తాను ఆందోళన చెందుతున్నానన్నారు. ఆమెకు ఐఐఎం రోడ్దులో ఎక్కడో ఒక ఇల్లు ఉందని మాత్రమే తెలుసని, అయితే అది ఎక్కడ ఉందో తనకు తెలియదన్నారు. ఆమె తప్పు చేసినట్లు తాను ఎప్పుడూ అనుమానించలేదని పేర్కొన్నారు. ఆమె మెడిసిన్ చదువుతున్నప్పుడు కూడా అనుమానాస్పద ఆనవాళ్లు కనిపించలేదన్నారు. ఇప్పటికీ ఈ ఆరోపణలను నమ్మలేక పోతున్నానని అన్నారు.
‘చిన్న కొడుకును అరెస్ట్ చేశారు’
డాక్టర్ సయీద్ తండ్రి సయ్యద్ అహ్మద్ అన్సారీ మాట్లాడుతూ తన కుమార్తె అలాంటి కార్యకలాపాలలో పాల్గొన్నదంటే తాను నమ్మలేకపోతున్నానని అన్నారు. తన పెద్ద కుమారుడు షోయబ్ నాతో ఇక్కడే ఉంటున్నాడని, రెండవ కొడుకు షాహీన్ సయ్యద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. తన చిన్న కొడుకు పర్వేజ్ అన్సారీ చాలా కాలం క్రితమే నగరం విడిచి వెళ్లాడన్నారు. తాను చివరిసారిగా తన కుమార్తె షాహీన్‌తో నెల రోజుల క్రితం మాట్లాడానన్నారు. సయీద్ మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నదని, ఆ తరువాత విడాకులు తీసుకున్నాదని అహ్మద్ అన్సారీ తెలిపారు.
‘విడాకుల తర్వాత...’
క్రైమ్ బ్రాంచ్ అధికారులు డాక్టర్ సయీద్ మాజీ భర్త డాక్టర్ జాఫర్ హయత్‌ను విచారించారు. తాము 2023, నవంబర్‌లో వివాహం చేసుకున్నామని, అయితే తమకు విడాకులు 2012 చివరిలో అయ్యాయన్నారు. ఆమె మనసులో ఏముందో తనకు తెలియదని, మా మధ్య ఎప్పుడూ ఎలాంటి వివాదం లేదన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలలో ఆమె ప్రమేయం ఉందనే సంగతి తనకు తెలియదని, తమ విడాకుల తర్వాత ఆమె ఏమి చేస్తున్నదో తనకు తెలియదని స్పష్టం చేశారు. ఢిల్లీ పేలుడు తర్వాత జరిగిన నిఘా సమాచారం ఆధారంగానే క్రైమ్ బ్రాంచ్ అధికారులు డాక్టర్ హయత్‌ను విచారించారని కాన్పూర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రఘుబీర్ లాల్ మీడియాకు తెలిపారని ‘ఎన్‌డీటీవీ’ పేర్కొంది.
ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు: ‘నడిపింది’ అతనే.. డీఎన్‌ఏ పరీక్షలో వెల్లడి


