కుమారుడిని కడతేర్చిన తండ్రి
మెదక్ జిల్లాలో దారుణం
హవేళిఘణాపూర్(మెదక్): ఓ వ్యక్తి భార్యపై అనుమానంతో తరచూ గొడవలు పడుతుండటంతో భరించలేని ఆమె తల్లిగారింటికి వెళ్లిపోయింది. అయితే ఆమె తిరిగి కాపురానికి రావ డం లేదనే అక్కసుతో అతను తన కుమారుడిని హత్య చేశాడు. మెదక్ జిలాల్లోని మెదక్ మండలంలో ఆదివారం ఈ ఘటన వెలుగు చూసింది. మెదక్ రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్ద బాయి తండాకు చెందిన భాస్కర్ తన భార్య అమీనాపై అనుమానంతో తరచూ గొడవ పడుతుండేవాడు.
ఈనెల 19న సాయంత్రం భాస్కర్ తన భార్యను కొట్టడంతో ఆమె పిల్లలను వదిలివేసి తల్లిగారింటికి వెళ్లిపోయింది. దీంతో తిరిగి కాపురం చేసేందుకు రావడంలేదనే కోపంతో అతను శనివారం రాత్రి నిద్రిస్తున్న తన చిన్న కుమారుడు లక్కీ(3)ని గొంతు నొలిమి చంపాడు. ఈ ఘటనపై తల్లి అమీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెదక్ రూరల్ ఎస్‌ఐ లింగం తెలిపారు. ప్రస్తుతం చిన్నారి లక్కీ మృతదేహాన్ని మెదక్‌జిల్లా ఆస్పత్రి మార్చురీలో ఉంచారు.


