సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. రాయదుర్గం నియోజకవర్గంలో ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇద్దరు కూతుళ్లను చంపిన కసాయి తండ్రి కల్లప్ప.. బళ్లారి సమీపంలోని హైలెవల్ కెనాల్‌లో తోసేశాడు. చిన్నారుల అనసూయ (9), చంద్రకళ (10) మృతి చెందారు. బొమ్మనహాల్ మండలం నేమకల్లులో ఘటన జరిగింది.
దైవ దర్శనం కోసమని చెప్పి ఇద్దరు కూతుళ్లను చంపిన కల్లప్పకు దేహశుద్ధి చేసిన స్థానికులు.. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.


