ఢిల్లీ: ఢిల్లీ పేలుడు ఘటనలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉమర్ డైరీలో ఉగ్ర కుట్రలకు సంబంధించిన షాకింగ్ వివరాలు బయటపడ్డాయి. 8 మంది సూసైడ్ బాంబర్లతో దేశవ్యాప్తంగా 4 ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తేలింది. అల్-ఫలాహ్‌లోకి రూమ్ నెంబర్ 13లో పేలుళ్లకు పథక రచన చేయగా.. ఉమర్‌కు చెందిన రూమ్ నెం-4లో మూడు డైరీలు లభ్యమయ్యాయి.
ఉగ్రకుట్రకు కేంద్రంగా అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీ మారింది. బాయ్స్ హాస్టల్ భవనంలోని రూమ్ నెంబర్-13లో పేలుళ్లకు పథక రచన చేశారు. ఆ రూమ్.. డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌కి చెందినదిగా గుర్తించారు. పేలుళ్ల కుట్ర అమలుకు రూ. 20 లక్షలు సేకరించిన ఉమర్ గ్యాంగ్.. గురుగ్రామ్, నూహ్ నుంచి 20 కేజీల ఎన్‌పీకే ఫెర్టిలైజర్ కొనుగోలు చేశారు.
డైరీల్లో 25 మంది పేర్లు కూడా ఉన్నాయని, వారిలో ఎక్కువ మంది జమ్మూకశ్మీర్ (ముజమ్మిల్, ఉమర్ స్వస్థలం), అలాగే ఫరీదాబాద్, పరిసర ప్రాంతాలకు చెందినవారని అధికారులు తెలిపారు. అల్-ఫలాహ్ హాస్పిటల్‌లోని ఒక కంపౌండర్ సహా పలువురు యూనివర్సిటీ సిబ్బందిని విచారణ కోసం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ బ్లాస్ట్ నేపథ్యంలో కాశ్మీర్‌లో 13 చోట్ల కౌంటర్ ఇంటెలిజెన్స్ సోదాలు చేపట్టాయి. అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఉగ్రవాదులు డాక్టర్ ఉమర్ డాక్టర్ ముజంమిల్ గదులలో డైరీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. డైరీలలో నవంబర్ 8 నుంచి 12 మధ్యలో పేలుళ్లకు పాల్పడాలని ప్లానింగ్ చేసినట్లు గుర్తించారు. పక్కా ప్రణాళికతోనే ఎర్రకోట వద్ద పేలుడుకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఉమర్, ముజం ముజం మిల్.. కోడ్ భాషలో కీలక సమాచారాన్ని రాసి ఉంచారు. ఐ20 కారు, ఈకోస్పోర్ట్ కారుతో పాటు మరో రెండు వాహనాల ద్వారా మొత్తం నాలుగు చోట్ల పేలుళ్లకు పాల్పడాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు 8 మంది ఈ ప్రణాళికలో పాలుపంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


