breaking news
Umar
-
అది ఆత్మాహుతి దాడే!
న్యూఢిల్లీ: కారుబాంబు పేలుడు ప్రమాదవశాత్తు జరగలేదని డాక్టర్ ఉమర్ నబీ చారిత్రక ఎర్రకోట సమీపంలో అమాయకులపై జరిపిన ఉద్దేశపూర్వక ఆత్మాహుతి దాడి అని ఎట్టకేలకు నిర్ధారణ అయింది. వైద్యుల ముసుగులో ఉన్న తోటి ఉగ్రవాదుల అరెస్ట్‌లతో తాను కూడా పట్టుబడతానన్న భయంతో పారిపోతుండగా పేలుడుపదార్థం పేలిపోయిందన్న వాదనల్లో వాస్తవంలేదని రూఢీ అయింది. తాను ఆత్మాహుతికి తెగించబోతున్నట్లు డాక్టర్ నబీ స్వయంగా చెప్పిన సెల్ఫీ వీడియో ఒకటి మంగళవారం బయటికొచ్చింది. దీంతో ఢిల్లీ ఘటన ముమ్మాటికీ ఉగ్రవాది ఆత్మాహుతి దాడి అని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రకటించింది.తనది ఆత్మహత్య కాదని, బలిదాన ఆపరేషన్ అని ఉమర్ తన ఉగ్రదుశ్చర్యను సమర్థించుకోవడం ఆ వీడియోలో కనిపించింది. సంబంధిత వీడియో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను జమ్మూకశ్మీర్ పోలీసులు ఎట్టకేలకు సంపాదించారు. ఉమర్ నబీ సోదరుడు జహూర్ ఇలాహీని విచారించగా ఈ మొబైల్ సంగతి వెల్లడించాడు. తన గురించి వినకూడదని వార్త ఏదైనా విన్న వెంటనే ఈ ఫోన్‌ను నీటిలో పడేసెయ్ అని ఉమర్ సూచించాడని ఇలాహీ పోలీసులకు వెల్లడించాడు. పాక్షికంగా ధ్వంసమైన ఫోన్ నుంచి ఫోరెన్సిక్ నిపుణులు డేటాను వెలికితీయగా అందులో ఈ సెల్ఫీ వీడియో దొరికింది.శ్రీనగర్ సీనియర్ ఎస్పీ సుందర్ చక్రవర్తి సారథ్యంలోని బృందం ఇలాహీని తమదైన రీతిలో ప్రశ్నించడంతో ఫోన్ సంగతి తెల్సింది. ఉమర్ అక్టోబర్ 26 నుంచి నాలుగురోజులపాటు సొంతూరిలో గడిపిననప్పుడు ఈ ఫోన్‌ను సోదరునికి ఇచ్చి వెళ్లాడు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్), అల్‌ఖైదా ఉగ్రసంస్థలు గతంలో జరిపిన ఆత్మాహుతి దాడులకు సంబంధించిన వీడియోలను ఉమర్ విపరీతంగా చూసేవాడని ఫోన్‌డేటా విశ్లేషణతో తేలింది. ఆత్మాహుతి దాడులకు సంబంధించిన సైతం ఉమర్ గతంలో ఎన్నో సెల్ఫీ వీడియోలు తీసినట్లు వెల్లడైంది. ఆత్మాహుతి దాడులు అనేవి ఇస్లాంలో ఎన్నో ప్రశంసలను అందుకున్నాయని ఉమర్ భావించవాడు. ఈ వీడియోలు ఈ ఏడాది ఏప్రిల్‌లో రికార్డ్చేసినట్లు తెలుస్తోంది. ఉమర్ ఇంట్లో ల్యాబ్ఫరీదాబాద్ సమీపంలో ఉమర్ నివసించిన ఇంట్లో ఒక లేబొరేటరీని దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. పేలుడు పదార్థాలను అతిచిన్న మొత్తాల్లో పేల్చి వాటి తీవ్రతను అంచనావేయడానికి ఈ ల్యాబ్‌ను ఉమర్ ఉపయోగించేవాడు. టెలిగ్రామ్ యాప్ ద్వారా సత్సంబంధాలు నెరుపుతున్న పాకిస్తాన్ హ్యాండ్లర్ ద్వారా నేర్చుకున్న బాంబు తయారీ కిటుకులను ఉమర్ ఈ ల్యాబ్‌లోనే పరీక్షించేవాడని తెలుస్తోంది. ఎర్రకోట వద్ద పేల్చిన బాంబును ఇదే ల్యాబ్‌లో ఉమర్ తయారుచేసినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. రసాయనాలను పరీక్షించడం మొదలు ట్రిగ్గర్ మెకానిజంపై పట్టుసాధించేదాకా అన్నీ ఈ ల్యాబ్‌లోనే ఉమర్ నేర్చుకున్నట్లు తెలుస్తోంది. హ్యాండ్లర్లు ఫైసల్, హషీమ్, ఉకాసాలతో డాక్టర్ ఉమర్, డాక్టర్ ముజామిల్, డాక్టర్ ఆదిల్ రాఠార్లు టెలిగ్రామ్ యాప్‌లో దాడి ప్రణాళికపై చర్చించేవారు. ఉమర్ ఉగ్రావేశ వీడియో..ఉమర్ ఉగ్రోన్మాదంతో చేసిన సెల్పీ వీడియోలో తన సూసైడ్ అమరత్వానికి సంబంధించినదని, ఇది సమర్థనీయమంటూ తన హేయమైన చర్యను సమర్థించుకునే ప్రయత్నంచేశాడు. అయితే తన సిద్ధాంతంపై తనకే స్పష్టమైన అవగాహన లేకపోవడంతో తడబడుతూ మాట్లాడటం ఆ వీడియోలో కనిపించింది. ఉగ్రావేశంతో దాదాపు రెండు నిమిషాలపాటు ఉమర్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఎలాంటి స్పష్టమైన ముగింపు లేకుండానే రికార్డింగ్‌ను అర్ధంతరంగా ఆపేసినట్లు కన్పిస్తోంది. ‘‘ ఆత్మాహుతి బాంబు దాడులను కేవలం సూసైడ్ అనే కోణంలో చూడకూడదు. అవి అమరత్వానికి బలమైన తార్కాణాలు. నాది బలిదాన ఆపరేషన్. బలిదాన ఆపరేషన్లను వీరమరణాలుగా భావించాలి. ఇలాంటి చర్యలకు పాల్పడటం ఆమోదనీయమే.జిహాద్ పవిత్ర యుద్దంలో ఇవి అత్యున్నతమైనవి. అందరూ అనుకుంటున్నట్లు సూసైడ్ బాంబింగ్ అనేది తప్పుడు చర్య కాదు. ఇస్లాంలోనూ సూసైడ్ ప్రస్తావన ఉంది. అయితే సూసైడ్‌పై ఇస్లాంలోనూ ఎన్నో భిన్నా భిప్రాయాలు, అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అయితే ఎవరైనా వ్యక్తి ఏదో ఒక రోజు తప్పకుండా మరణించాల్సిందే ఇది తథ్యం అనే నిర్దారణకు వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా వెళ్లాలని బలంగా నమ్ముతాడు. తనకు నచ్చినప్పుడే తనవు చాలిస్తానని ఆశిస్తాడు. అయితే ఎప్పుడు, ఎక్కడ ఎలా చనిపోతామో ఎవరికీ తెలీదు.విధిరాత ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. చావుకు ఎప్పుడూ భయపడకూడదు. ఇస్లాంలో ఆత్మహత్య అనేది పాపం అని నాక్కూడా తెలుసు. కానీ వీరమరణం, బలిదానం, అమరత్వం కోణంలో చూస్తే ఆత్మాహుతి బాంబింగ్ అనేది ఏ రకంగానూ తప్పుకాదు’’ అని వీడియోలో ఉమర్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ వీడియోలో సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారింది.అల్ఫలాహ్ గ్రూప్ ఛైర్మన్ అరెస్ట్న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు ఆర్థిక సాయం ఆరోపణలపై నమోదైన మనీ లాండరింగ్ కేసులో అల్–ఫలాహ్ గ్రూప్ చైర్మన్ జావేద్ అహ్మద్ సిద్ధిఖీని ఈడీ అధికారులు మంగళవారం అరెస్ట్‌చేశారు. తర్వాత ఆయనను రిమాండ్ కోసం సంబంధిత కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు ఢిల్లీ–ఎన్సీఆర్ పరిధిలో అల్–ఫలాహ్ వర్సిటీకి సంబంధించిన ప్రాంగణాల్లో మంగళవారం ఈడీ ముమ్మర తనిఖీలుచేసింది. వర్సిటీ ప్రమోటర్లు, ట్రస్టీల ఇళ్లలో సోదాలు చేసింది. ఉదయం 5.15 గంటలకే 25 ప్రాంతాల్లో సోదాలు చేసి రూ.48 లక్షల నగదును స్వా«దీనంచేసుకున్నారు.వర్సిటీకి నిధులు, డొల్ల కంపెనీల నుంచి పెట్టుబడులు, విరాళాల కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఈడీ అధికారి ఒకరు తెలిపారు. అల్ఫలాహ్ గ్రూప్‌తో సంబంధమున్న 9 డొల్ల కంపెనీలు ఒకే అడ్రస్‌తో నమోదయ్యాయని ఈడీ పేర్కొంది. వర్సిటీ, ట్రస్ట్‌కు సంబంధించిన కొన్ని కీలక పత్రాల్లో డైరెక్టర్లు/ఉన్నతాధికారుల సంతకాలు లేవని, సిబ్బంది వేతనాల ఈపీఎఫ్ఓ/ఈఎస్ఐ వంటి వివరాలు అప్డేట్ చేయట్లేదని, కేవైసీలు పూర్తిగా లేవని ఈడీ దర్యాప్తులో తేలింది. ఉమర్‌తో పాటు సహకుట్రదారుగా ఉన్న జసీర్ బిలాల్ వానీని మంగళవారం ఢిల్లీలోని ప్రధాన జిల్లా, సెషన్స్ కోర్టు జడ్జి అంజూ బజాజ్ ఛంద్నా ఎదుట ఎన్ఐఏ ప్రవేశపెట్టింది. మరింత లోతుగా ప్రశ్నించేందుకు బిలాల్‌ను తమకు 10 రోజులపాటు అప్పగించాలని కోర్టును ఎన్ఐఏ కోరగా అందుకు న్యాయమూర్తి అంగీకరించారు. -
పథకం ప్రకారమే ఢిల్లీ బ్లాస్ట్? ఉగ్రవాది సంచలన వీడియో
ఢిల్లీ సాక్షి, ఎర్రకోట కారు బాంబు కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడి ఉమర్ పొరపాటున చేసింది కాదని పథకం ప్రకారమే దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆత్మాహుతి దాడి గురించి అపార్థం చేసుకుంటున్నారని కాని ఇది ఓబలిదానం అని, చనిపోయే స్థలం, సమయం, గురించి ఆ వీడియోలో మాట్లాడారు. ఈ నెల 10 న ఢిల్లీ ఎర్రకోటలో జరిగిన బాంబుపేలుళ్లలో ఎన్ఐఏ లోతైన దర్యాప్తు చేపడుతుంది. ఈ నేపథ్యంలో కారుబాంబు ఉగ్రవాది ఉమర్ సంచలన వీడియో బయిటపడింది. అందులో ఉమర్ "ఆత్మాహుతి దాడి చేసుకోవాలని చూసేవాడు భయంకరమైన మైండ్ సెట్ లోకి వెళ్లాలి. నాగరిక సమాజం దీన్ని అంగీకరించదు.చావే అంతిమ లక్షం అని భావిస్తేనే అది సాధ్యమవుతుంది. బలిదానం అనేది ఒక ఆపరేషన్ అని ఒక వ్యక్తి తాను నిర్ధిష్ఠ సమయంలో ఫలానా ప్రాంతంలో చనిపోతానని భావించడం . ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతారో ఎవరికీ తెలియదు అది విధిరాత అయితే చావుకు ఎప్పుడూ భయపడకూడదు. ఆత్మాహుతి దాడిపై సమాజంలో పలు రకాల వాదనలున్నాయి. అటువంటి దాడిని సమాజం ఒప్పుకోదు" అని ఆ వీడియోలో అన్నారు.నవంబర్ 9న ఎర్రకోట బాంబు దాడి జరిగే ఒకరోజు ముందు అల్పాల యూనివర్సిటీలో ఈవీడియో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాది ఉమర్ ఈవీడియోలో మాట్లాడిన మాటలు చూస్తుంటే కారుబాంబు బ్లాస్ట్ పక్కా ప్రణాళిక తోనే చేశారని అందుకే అది జరిగే ఒకరోజు మందు ఈ వీడియో చేశారని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదికి సంబంధంమున్న అల్ ఫలా యునివర్సిటీపై ఎన్ఐఏ మరింత విస్తృతం చేసింది. వర్సిటీకి విదేశాల నుంచి అందే నిధులపై ఆరా తీస్తుంది. ఈ బాంబు కుట్ర కేసుతో సంబంధమున్న పలువురు వ్యక్తులను ఇది వరకే పోలీసులు అరెస్ట్ చేశారు.నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోటలో జరిగిన కారుబాంబు పేలుళ్ల కేసులో 13 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అప్పుడే అమర్చి పేల్చాడా?
న్యూఢిల్లీ: యావత్ భారతావని ఉలిక్కిపడేలా చేసిన ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో డాక్టర్ ఉమర్ నబీ ఒక్కడే ఇంతటి మారణహోమం సృష్టించాడా? లేదంటే మరికొందరు ఆరోజు అదే కారులో వచ్చి పరారయ్యారా? అనే అనుమానాలు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)లో ఎక్కువయ్యాయి. దీంతో కేసు దర్యాప్తును మెరుపువేగంతో ముందుకు తీసుకెళ్తున్నారు. నవంబర్ పదో తేదీ మధ్యాహ్నం నుంచి సాయంత్రందాకా మూడు గంటలపాటు కారులో నబీ ఏంచేశాడు? అతని వెంట ఇంకా ఎంత మంది ఉన్నారు? ఉంటే వాళ్లు ఆ తర్వాత ఏమయ్యారు? అనే ప్రశ్నలకు సమాధానాలకు వెతికేపనిలో అధికారులు తలమునకలయ్యారు. కారు మూడు గంటలపాటు పార్కింగ్‌లోనే ఉండగా చుట్టూ వాహనాలు పార్కింగ్‌లోకి వస్తూ పోతూ ఉన్నట్లు తేలడంతో ఆయా వాహనాల డ్రైవర్లు, యజమానులను అధికారులు ప్రశ్నించడం మొదలెట్టారు. సమీప వాహనాలను స్వా«దీనంచేసుకున్నారు. కారులో ఉమర్ ఏంచేశాడు? ఏదైనా బాంబులాంటిది బిగించడం చూశారా? కారులో ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది ఉన్నారా? అనే ప్రశ్నలను అడిగినట్లు సమాచారం. బాంబుల తయారీలో ఉమర్‌కు నైపుణ్యం పేలుడుపదార్థాలతో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్(ఐఈడీ) తయారుచేయడంలో డాక్టర్ ఉమర్ నైపుణ్యం సాధించాడని దర్యాప్తు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. విదేశీ హ్యాండ్లర్ నుంచి అందుకున్న బాంబుతయారీ విధాన పీడీఎఫ్ ఫైళ్లు, ఓపెన్ ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అక్రమ సమాచారంతో బాంబుల తయారీలో ఉమర్ నిపుణుడిగా మారాడని తెలుస్తోంది. అమ్మోనియం నైట్రేట్, పెట్రోలియం, డిటోనేట్ ఉపకరణాలతో వీటిని తయారుచేసి ఉండొచ్చని చెబుతున్నారు. వీటి సాయంతో ఐఈడీని కేవలం 5–10 నిమిషాల్లో తయారుచేయొచ్చు. ఎర్రకోట పార్కింగ్ స్థలంలోనే ముడిపదార్థాలతో అప్పటికప్పుడు బాంబు తయారుచేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. పేలుడు తీవ్రతను బట్టి ఆరోజు రెండు కేజీల అమ్మోనియం నైట్రేట్, పెట్రోలియం ఉపయోగించి ఉంటారని ఫోరెన్సిక్ నిపుణులు అంచనావేస్తున్నారు. ఆదివారం తోటి డాక్టర్లు అరెస్ట్ కావడంతో హడావిడిగా ముందస్తు ప్లాన్‌లేకుండా ఉమర్ సోమవారం ఎర్రకోటకు వచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సాధారణంగా ఎర్రకోట సందర్శనలకు సోమవారం సెలవు. ఆరోజు పర్యాటకులు రద్దీ ఉండదు. రద్దీ లేనప్పుడు బాంబు పేల్చినా తీవ్రత పెద్దగా ఉండదని ఉమర్ భావించి ఉండొచ్చు. సాయంత్రం వేళ అయినా కనీసం ఛాందినిచౌక్ ప్రాంత కొనుగోలుదారులు, స్థానికులతో ఆ ప్రాంతం కిటకిటలాడితే అప్పుడు బాంబు పేలుద్దామనే ఆ 3 గంటలు ఉమర్ పార్కింగ్ ఏరియాలోనే వేచిచూశాడని పోలీసులు ఓ అంచనాకొచ్చారు. -
ఢిల్లీ ఘటన.. ఉమర్ ఇంటిపై సర్జికల్ స్ట్రయిక్స్
ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనకు భద్రతా బలగాలు ప్రతిస్పందనకు దిగాయి. ప్రధాన నిందితుడు ఉమర్ మొహమ్మద్ అలియాస్ ఉమర్ ఉన్ నబీ ఇంటిని నాశనం చేశాయి. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామాలో ఉన్న అతని ఇంటిని ఈ వేకువ జామున పేలుడు పదార్థాలతో నేలమట్టం చేశాయి. పరిదాబాద్లోని అల్ ఫలాహ్ వర్సిటీలో వైద్యుడిగా పని చేస్తున్న ఉమర్.. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. నేతాజీ సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద హ్యుండాయ్ ఐ20 కారుతో జరిపిన పేలుడులో 13 మంది అమాయకులు ప్రాణాలు వదిలారు. మరో 20 మందికి గాయలయ్యాయి. అయితే.. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం వేకువ జామున ఉమర్ ఇంటిని కూల్చే ప్రక్రియ కొనసాగింది. ఐఈడీ సాయంతో నియంత్రిత పద్ధతిలో ఇంటిని పేల్చేశాయి భద్రతా బలగాలు. ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే వారికి హెచ్చరికగా ఉండాలనే ఈ పని చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంతకు ముందు.. పహల్గాం ఉగ్రదాడి కుట్రలో పాల్గొన్నవారిపై కూడా బుల్డోజర్ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక ఢిల్లీ బాంబు పేలుడు ఘటనలో ఉమర్ అవశేషాల డీఎన్ఏ పరీక్షలతో నిర్ధారించారు. ఈ దాడి జరగడానికి కొన్ని గంటల ముందే భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. సుమారు 2,900 కిలోల పేలుడు పదార్థాలు, ఆధునిక ఆయుధాలను జమ్ము కశ్మీర్-ఫరీదాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫరీదాబాద్, హైదరాబాద్.. ఇలా దేశంలోని పలు నగరాల్లోని రద్దీ ప్రాంతాల్లో దాడులకు ప్లాన్ చేసినట్లు తేలింది. ముజమ్మిల్, షాహీన్ సయీద్ అనే వైద్యుల వద్ద నుంచి ఇవి లభించాయి. వీళ్లిద్దరూ ఉమర్‌కు సహచరులుగా తేలింది. అంతేకాదు.. ఢిల్లీ పేలుడు ఘటన కేసు దర్యాప్తులోనూ విస్తూపోయే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.🚨 #BREAKING: Security forces in Pulwama, South Kashmir, have demolished the house of Umar Nabi, the car bomber behind the Delhi terror attack linked to Jaish-e-Mohammed’s Doctor Module. A strong message from India against terrorism. 🇮🇳 #AntiTerrorOperation #Pulwama pic.twitter.com/XjIrOfxDlx— UNKNOWN | 🇮🇳 | | | 𝕏 | (@BhagatSingh_07) November 14, 2025 -
ఢిల్లీ పేలుడు.. ఉమర్ డైరీలో షాకింగ్ విషయాలు
-
ఢిల్లీ పేలుడు.. ఉమర్ డైరీలో షాకింగ్ విషయాలు
ఢిల్లీ: ఢిల్లీ పేలుడు ఘటనలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉమర్ డైరీలో ఉగ్ర కుట్రలకు సంబంధించిన షాకింగ్ వివరాలు బయటపడ్డాయి. 8 మంది సూసైడ్ బాంబర్లతో దేశవ్యాప్తంగా 4 ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తేలింది. అల్-ఫలాహ్లోకి రూమ్ నెంబర్ 13లో పేలుళ్లకు పథక రచన చేయగా.. ఉమర్‌కు చెందిన రూమ్ నెం-4లో మూడు డైరీలు లభ్యమయ్యాయి.ఉగ్రకుట్రకు కేంద్రంగా అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీ మారింది. బాయ్స్ హాస్టల్ భవనంలోని రూమ్ నెంబర్-13లో పేలుళ్లకు పథక రచన చేశారు. ఆ రూమ్.. డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌కి చెందినదిగా గుర్తించారు. పేలుళ్ల కుట్ర అమలుకు రూ. 20 లక్షలు సేకరించిన ఉమర్ గ్యాంగ్.. గురుగ్రామ్, నూహ్ నుంచి 20 కేజీల ఎన్పీకే ఫెర్టిలైజర్ కొనుగోలు చేశారు.డైరీల్లో 25 మంది పేర్లు కూడా ఉన్నాయని, వారిలో ఎక్కువ మంది జమ్మూకశ్మీర్ (ముజమ్మిల్, ఉమర్ స్వస్థలం), అలాగే ఫరీదాబాద్, పరిసర ప్రాంతాలకు చెందినవారని అధికారులు తెలిపారు. అల్-ఫలాహ్ హాస్పిటల్‌లోని ఒక కంపౌండర్ సహా పలువురు యూనివర్సిటీ సిబ్బందిని విచారణ కోసం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఢిల్లీ బ్లాస్ట్ నేపథ్యంలో కాశ్మీర్లో 13 చోట్ల కౌంటర్ ఇంటెలిజెన్స్ సోదాలు చేపట్టాయి. అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఉగ్రవాదులు డాక్టర్ ఉమర్ డాక్టర్ ముజంమిల్ గదులలో డైరీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. డైరీలలో నవంబర్ 8 నుంచి 12 మధ్యలో పేలుళ్లకు పాల్పడాలని ప్లానింగ్ చేసినట్లు గుర్తించారు. పక్కా ప్రణాళికతోనే ఎర్రకోట వద్ద పేలుడుకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.ఉమర్, ముజం ముజం మిల్.. కోడ్ భాషలో కీలక సమాచారాన్ని రాసి ఉంచారు. ఐ20 కారు, ఈకోస్పోర్ట్ కారుతో పాటు మరో రెండు వాహనాల ద్వారా మొత్తం నాలుగు చోట్ల పేలుళ్లకు పాల్పడాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు 8 మంది ఈ ప్రణాళికలో పాలుపంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
కారులో డాక్టర్ ఉమర్.. DNA రిపోర్ట్ లో బయటపడ్డ సంచలన నిజాలు
-
ఢిల్లీ పేలుడు: ‘నడిపింది’ అతనే.. డీఎన్ఏ పరీక్షలో వెల్లడి
న్యూఢిల్లీ: ఢిల్లీ పేలుడు కేసులో దర్యాప్తు సంస్థల అనుమానం నిజమయ్యింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట దగ్గర పేలిన ఐ20 కారును డాక్టర్ ఉమర్ మొహమ్మద్ నడిపారని డీఎన్ఏ పరీక్షా ఫలితాలను స్పష్టం చేస్తున్నాయని సంబంధిత వర్గాలు మీడియాకు తెలిపాయి. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తోంది.డాక్టర్ ఉమర్ మొహమ్మద్.. ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో సీనియర్ వైద్యునిగా పనిచేస్తున్నారు. ఆయన డీఎన్ఏ నమూనాతో అతని తల్లి, సోదరుని డీఎన్ఏతో 100 శాతం సరిపోలిందని అధికారులు తెలిపారని ‘ఎన్డీటీవీ’ పేర్కొంది. పేలుడు తర్వాత ఐ20లో దొరికిన ఎముకలు, దంతాలు, దుస్తుల ముక్కలను సేకరించి, పరీక్షలు నిర్వహించిన అధికారులు కారు నడిపింది ఉమర్ అనే నిర్థారణకు వచ్చారు. దీనికి ముందు ఉమర్ తల్లిని డీఎన్ఏ పరీక్ష కోసం పుల్వామాలో అదుపులోనికి తీసుకున్నారు. అలాగే పేలుడు తరువాత ఉమర్ తల్లి, అతని ఇద్దరు సోదరులను విచారిస్తున్నారు.జమ్ముకశ్మీర్ పోలీసులు హర్యానాలోని ఫరీదాబాద్‌లోని రెండు నివాస భవనాల నుండి దాదాపు 3,000 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల తర్వాత ఈ పేలుడు సంభవించింది. ఈ నేపధ్యంలో వైట్-కాలర్ ఉగ్రవాద వ్యవస్థలో కీలక లింక్‌గా మారిన డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. షకీల్ కూడా అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్ నివాసి డాక్టర్ ఆదిల్ రాథర్ ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మహ్మద్‌కు మద్దతుగా పోస్టర్లు వేసినందుకు అరెస్టు చేశారు. ఆ తరువాత తర్వాత షకీల్‌ను అరెస్టు చేశారు. షకీల్, రాథర్ అరెస్టులతో భయపడిన ఉమర్ ఎర్రకోట సమీపంలో పేలుడుకు కారకునిగా నిలిచాడని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: Delhi Blast: ట్రాఫిక్‌లో కారు పేలిందిలా.. తాజా వీడియో -
అన్సారీ ఆస్తుల కోసం కుమారుని దొంగ పత్రాలు.. కోర్టులో బెడిసికొట్టిన ప్లాన్
లక్నో: ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ ఆస్తులను తిరిగి దక్కించుకునేందుకు అతని కుమారుడు ఉమర్ అన్సారీ చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. ఇందుకోసం నకిలీ పత్రాలను ఆధారాలుగా చూపిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఉదంతంపై ఘాజీపూర్ పోలీసు సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో.. ఉత్తరప్రదేశ్ గ్యాంగ్స్టర్స్ చట్టంలోని నిబంధనల ప్రకారం గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదని తెలిపారు. ఈ ఏడాది మార్చిలో యూపీలోని బండాలో గల ఒక ఆస్పత్రిలో గుండెపోటుతో ముక్తార్ అన్సారీ కన్నుమూశాడు. తాజాగా తన తండ్రి ఆస్తులను విడుదల చేయాలని కోరుతూ అతని కుమారుడు ఉమర్ అన్సారీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఇందుకోసం అతను తన తల్లి అఫ్షాన్ అన్సారీ నకిలీ సంతకాలు కలిగిన నకిలీ పత్రాలను కోర్టులో సమర్పించాడని సూపరింటెండెంట్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.కాగా పరారీలో ఉన్న ఉమర్ అన్సారీపై రూ.50 వేల రివార్డు ఉంది. ఉమర్ అన్సారీ మోసపూరిత చర్యలు బయటపడిన దరిమిలా అతనిపై మొహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. తాజాగా ఘాజీపూర్ పోలీసుల బృందం లక్నో నుండి ఉమర్ అన్సారీని అరెస్టు చేసింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. -
రోహిత్ శర్మనే బోల్తా కొట్టించాడు.. ఎవరీ ఉమర్ నజీర్?
టీమిండియా స్టార్ల రాకతో రంజీ ట్రోఫీ(Ranji Trophy)కి కొత్త కళ వస్తుందనుకుంటే... దాదాపుగా అందరూ ఉసూరుమనిపించారు. భారత టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant), శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా(Ravindra Jadeja), యశస్వి జైస్వాల్ గురువారం మొదలైన రంజీ రెండో దశ బరిలో దిగిన విషయం తెలిసిందే.తొలిరోజు జడ్డూ ఒక్కడే హిట్ముంబై తరఫున ఓపెనింగ్ చేసిన టీమిండియా ఓపెనర్ల జోడీ రోహిత్ శర్మ(3)- జైస్వాల్(4) పూర్తిగా విఫలమయ్యారు. మిగతా వాళ్లలో ఢిల్లీ స్టార్ రిషభ్ పంత్(1), పంజాబ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్(4) కూడా నిరాశపరిచారు. అయితే, సౌరాష్ట్ర స్పిన్నర్ రవీంద్ర జడేజా మాత్రం ఐదు వికెట్లతో చెలరేగాడు.ఆరడుగుల బుల్లెట్.. ఎవరీ ఉమర్ నజీర్?అయితే, ఈ అందరు స్టార్ల నడుమ ఈనాటి మ్యాచ్‌లో ఓ ఆరడుగుల బౌలర్ హైలైట్‌గా నిలిచాడు. అతడి పేరు ఉమర్ నజీర్ మీర్. జమ్మూ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్. ముంబై బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఈ స్పీడ్‌స్టర్ రోహిత్ శర్మ వికెట్ తీయడం ద్వారా క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాడు.ముంబైలోని శరద్ పవార్ క్రికెట అకాడమీ బీకేసీ మైదానంలో ముంబై- జమ్మూ కశ్మీర్ మధ్య గురువారం మొదలైన రంజీ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగి కశ్మీర్ జట్టును బౌలింగ్‌కు ఆహ్వానించింది. అయితే, ఊహించని రీతిలో పట్టుమని పది పరుగులు కూడా చేయకుండానే ఓపెనర్లు వెనుదిరిగారు.రోహిత్‌నే బోల్తా కొట్టించాడుజైస్వాల్ను ఆకిబ్ నబీ అవుట్ చేస్తే.. రోహిత్ శర్మ ఉమర్ నజీర్ బౌలింగ్‌లో కెప్టెన్ పారస్ డోగ్రాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక టీమిండియా కెప్టెన్‌ను అవుట్ చేయడం ద్వారా వికెట్ల వేట మొదలుపెట్టిన నజీర్.. హార్దిక్ తామోర్(40 బంతుల్లో 7), ముంబై సారథి అజింక్య రహానే(12), ఆల్‌రౌండర్ శివం దూబే(0) రూపంలో మరో మూడు కీలక వికెట్లు కూల్చాడు.అలా మొత్తంగా నాలుగు వికెట్లు కూల్చి ముంబై బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని నజీర్ శాసించాడు. దీంతో అతడి వివరాలపై టీమిండియా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా సమీపంలో ఉన్న మాలిక్పొరాలో నజీర్ జన్మించాడు. అతడి ఎత్తు ఆరడుగుల నాలుగు అంగుళాలకు పైమాటే. అదే అతడికి సానుకూలాంశం అయింది.ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో భేష్‌ఈ పొడగరి స్పీడ్‌స్టర్ తనదైన బౌలింగ్ శైలితో దేశవాళీ క్రికెట్లో ఎంతో మంది బ్యాటర్లకు పీడకలలు మిగిల్చాడు. 31 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్‌కు.. టీమిండియాకు ఆడాలనేది చిరకాల కోరిక. అయితే, ఇంత వరకు నజీర్‌కు ఆ అవకాశం రాలేదు.అయితే, ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మాత్రం నజీర్ గణాంకాలు మెరుగ్గానే ఉన్నాయి. మొత్తంగా 57 మ్యాచ్‌లలో అతడు 138 వికెట్లు పడగొట్టాడు. గతేడాది రంజీ ట్రోఫీ సందర్భంగా సర్వీసెస్ జట్టుపై అత్యుత్తమంగా 6/53తో రాణించాడు. తాజా రంజీ ఎడిషన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న నజీర్... గత మూడు మ్యాచ్‌లలో కలిపి పదకొండు వికెట్లు తీశాడు. అతడి ఎకానమీ రేటు 2.64గా నమోదు కావడం గమనార్హం.కుప్పకూలిన ముంబై టాప్, మిడిల్ ఆర్డర్ఇక మ్యాచ్ విషయానికొస్తే.. జైస్వాల్(4), రోహిత్ శర్మ(3), హార్దిక్ తామోర్(7), అజింక్య రహానే(12), శ్రేయస్ అయ్యర్(11), శివం దూబే(0), షామ్స్ ములానీ(0) వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో ముంబై కష్టాల్లో కూరుకుపోయింది.బ్యాట్ ఝులిపించిన శార్దూల్అయితే, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ బ్యాట్ ఝులిపించడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది. 57 బంతుల్లో శార్దూల్ ఏకంగా 51 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా తనూష్ కొటియాన్(26) రాణించాడు. వీరిద్దరి కారణంగా ముంబై గౌరవప్రదమైన స్కోరు చేసింది. 33.2 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌట్ అయింది.జమ్మూ కశ్మీర్ బౌలర్లలో ఉమర్ నజీర్, యుధ్వీర్ సింగ్ నాలుగేసి వికెట్లు కూల్చగా... ఆకిబ్ నబీ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక గురువారం నాటి తొలిరోజు ఆట ముగిసే సరికి జమ్మూ కశ్మీర్ 42 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేసింది. ముంబై కంటే 54 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. చదవండి: అతడొక సూపర్‌స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్ -
చందనను ట్రాప్ చేశారా? అలా చెయ్యమంది ఎవరు?
కరీంనగర్: ఇంట్లో నగలు, నగదు ఉన్న సమయంలోనే ప్రియుడితో కలిసి పరార్ కావాలన్న ఆలోచన చందనకు ఎవరు కల్పించారు? ఈ దిశలో ఆమెను ఎవరైనా గైడ్ చేశారా? ప్రేమ మోజులో ఆ యువతి వారి ట్రాప్‌లో పడిపోయిందా? ప్రియుడితో కలిసి వెళ్లకుండా అడ్డుకున్న అక్కను చివరకు హతమార్చే పరిస్థితికి దిగజారిందా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గతనెల 29 వేకువజామున పట్టణంలోని భీమునిదుబ్బలో ప్రియుడు ఉమర్ షేక్‌తో కలిసి చందన తన అక్క దీప్తిని సినీఫక్కీలో హత్యచేసిన కేసులో వెలుగులోకి వస్తున్న కోణాలు ఆసక్తి రేపుతున్నాయి. నాలుగేళ్ల పరిచయం.. ► 2019లో చందన బీటెక్ చదవడం కోసం హైదరాబాద్ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో చేరింది. ► తన కంటే ఒక ఏడాది సీనియర్ ఉమర్ షేక్ సుల్తాన్ డిటెయిన్ కావడంతో చందనకు పరిచయం అయ్యాడు. ► అప్పటినుంచి వీరి ప్రేమాయణం సాగుతున్నట్లు సమాచారం. ► హాస్టల్లో ఉంటూ చందన తరచూ ఉమర్ షేక్ సుల్తానా ఇంటికి వెళ్లివస్తుండేదని తెలిసింది. ► ఈక్రమంలో వీరి ప్రేమ వ్యవహారం కొన్నాళ్లకు దీప్తికి తెలిసింది. ► ఆ తర్వాత ఇంట్లోనూ అందరికీ తెలిసి గొడవలు జరిగినట్లు సమాచారం. ► దీంతో చందన తండ్రి శ్రీనివాస్‌రెడ్డి తన కూతుళ్లు దీప్తి, చందనకు వివాహాలు చేయాలని సన్నాహాలు ప్రారంభింంచారు. ► ఆయన ఆంధ్రాకు చెందిన వ్యక్తి కావడంతో అక్కడే సంబంధాలు చూస్తున్నారు. ► పెళ్లి చేసుకోవాలని ఇంట్లో పెరుగుతున్న ఒత్తిడి గురించి చందన తన ప్రియుడికి చెప్పినట్లు సమాచారం. ► అయితే, ‘మనకు జాబ్ లేదు.. ఎలాబతుకుతాం’ అని డబ్బు, నగలు తీసుకొచ్చేలా ఉమర్ షేక్.. చందన దృష్టి మళ్లించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమా.. గతనెల 28వ తేదీన ఉదయం హైదరాబాద్ నుంచి కోరుట్లకు బయలుదేరిన విషయాన్ని ఉమర్ షేక్ తన తల్లి ఆలియా, చెల్లె ఫాతిమాకు చెప్పినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే, ఆ యువకుడు, అతడి కుటుంబానికి చందనపై కేవలం ప్రేమ మాత్రమే ఉండి ఉంటే నగలు, డబ్బు అవసరం లేదని చెప్పి ఉండవచ్చు కదా? అనే సందేహాలు వేధిస్తున్నాయి. సోమవారం రాత్రి దీప్తి మద్యం మత్తులో ఉన్న సమయంలో చందన, ఉమర్ కలిసి నగలు, డబ్బు సర్దే పనిచేయకుండా చడీచప్పుడు కాకుండా పరారై ఉంటే.. దీప్తి హత్యకు ఆస్కారం ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమర్ షేక్ తల్లి గతంలో లెక్చరర్‌గా పనిచేసినట్లు సమాచారం. విద్యాధికులైన ఉమర్ షేక్ కుటుంబీకులు.. చందన, ఉమర్ కలిసి మంగళవారం నగలు, డబ్బులతో కారులో హైదరాబాద్ చేరుకోగానే.. ఇది తప్పని చెప్పి పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. అంతేకాకుండా అంతాకలిసి నగలు, డబ్బులతో తప్పించుకునే ప్రయత్నం చేయడం.. చందనను గుర్తుపట్టకుండా బుర్కా వేసి కారులో తీసుకెళ్లడం.. టోల్గేట్లకు చిక్కకుండా అడ్డదారుల్లో పయనించడం.. ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందన్న అభిప్రాయాలకు ఊతమిస్తోంది. రిమాండ్‌కు నిందితులు.. దీప్తి హత్య, డబ్బులు, నగలు ఎత్తుకెళ్లిన కేసులో నిందితులు బంక చందన, ఆమె ప్రియుడు ఉమర్‌షేక్ సుల్తానా, ఇతడి తల్లి ఆలియా, చెల్లి ఫాతిమాతోపాటు బంధువు హఫీజ్‌ను ఆదివారం మధ్యాహ్నం జడ్జి వద్ద పోలీసులు హాజరుపరిచారు. జడ్జి ఆదేశాల మేరకు 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. నిందితులపై ఐపీసీ 302, 201, 120(బీ),380 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఆయన వివరించారు. -
ప్రియుడితో కలసి అక్కను చంపి..
కోరుట్ల/జగిత్యాల క్రైం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ బంక దీప్తి (24) హత్య కేసు మిస్టరీ వీడింది. చెల్లెలు చందన ప్రేమ పెళ్లిని దీప్తి వ్యతిరేకించడంతోనే హత్య జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీప్తి హత్య కేసులో సూత్రధా రి చందన (22), ఆమె ప్రియుడు ఉమర్ షేక్ సుల్తాన్ (25), అతడి తల్లి సయ్యద్ ఆలియా (47), చెల్లెలు ఫాతిమా (22), ఉమర్ మిత్రుడు హఫీజ్ (25)ను శనివారం అరెస్టు చేసినట్లు ఎస్పీ భాస్కర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇద్దరూ బీటెక్ చదివారు.. కోరుట్లకు చెందిన బంక శ్రీనివాస్‌రెడ్డి–మాధవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు దీప్తి, చందన, కుమారుడు సాయి ఉన్నారు. పాతికేళ్ల క్రితం శ్రీనివాస్‌రెడ్డి ఉపా«ధి కోసం నెల్లూరు నుంచి కోరుట్లకు వలస వచ్చారు. ఇటుక బట్టీ వ్యాపారం చేస్తున్నారు. దీప్తిని బీటెక్ చదివించగా ఆమె పుణేకు చెందిన ఓ కంపెనీలో వర్క్‌ఫ్రం హోమ్ పద్ధతిన పనిచేస్తోంది. చందన 2019లో హైదరాబాద్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో చేరి ఇటీవల బీటెక్ పూర్తి చేసింది. తన సీనియర్, హైదరాబాద్‌కు చెందిన ఉమర్ షేక్ సుల్తాన్ ఒక ఏడాది డిటెయిన్ కావడంతో చందనకు క్లాస్మేట్ అయ్యాడు. ఈ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. నాలుగేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. చందన ఇంట్లో ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఇద్దరు కూతుళ్ల వివాహం చేసేందుకు తండ్రి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 29న మధ్యాహ్నం దీప్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం... నగదు, బంగారంతో చందన పరారు కావడం కలకలం రేపింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పెళ్లికి అభ్యంతరం చెప్పినందుకే.. చందన ప్రేమ వ్యవహారం తెలిసి కుటుంబ సభ్యులు మతాంతర వివాహానికి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ విషయాన్ని చందన తన ప్రియుడు ఉమర్ షేక్ దృష్టికి తీసుకెళ్లి ఎలాగైనా పెళ్లి చేసుకుందామని చెప్పింది. కానీ తనకు జాబ్ లేదని, డబ్బు లేదని, బతుకడం ఎలా అని ఉమర్ షేక్ బదులిచ్చాడు. దీంతో తన ఇంట్లో ఉన్న డబ్బు, నగలు తెస్తానని, ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పిన చందన.. తన అమ్మానాన్న ఇంట్లో లేనిసమయంలో కోరుట్లకు రావాలని ప్రియుడికి సూచించింది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్‌లో బంధువుల గృహప్రవేశానికి వెళ్లగా చందన తన ప్లాన్ అమలు చేసింది. సూత్రధారి చందన.. తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో సోమవారం ఉదయం 11 గంటలకు ఉమర్ షేక్ కారులో కోరుట్లకు చేరుకున్నాడు. సాయంత్రం మద్యం తాగుదామని చందన తన అక్కతో చెప్పింది. ప్రియుడితో వొడ్కా, బ్రీజర్ తెప్పించింది. మద్యం ఇచ్చి వెళ్లిన ఉమర్ షేక్ స్థానికంగానే ఉండిపోయాడు. రాత్రి చందన తన అక్క దీప్తికి వొడ్కా తాగించి, తాను బ్రీజర్ తాగింది. మత్తులో అక్క నిద్రపోయిందని నిర్ధారించుకున్న చందన.. రాత్రి 2 గంటల సమయంలో షేక్ ఉమర్‌కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చింది. ఉమర్ షేక్ వచ్చాక నగదు, బంగారం బ్యాగుల్లో సర్దుతున్న క్రమంలో దీప్తికి మెలకువ వచ్చి.. ‘ఏం చేస్తున్నారని’ చందనను నిలదీసింది. దీంతో చందన, ఆమె ప్రియుడు కలిసి దీప్తిని చున్నీతో కట్టేసి నోరు, ముక్కుకు ప్లాస్టర్ వేసి చంపి సోఫాలో పడేశారు. అనుమానం రాకుండా ఆ తర్వాత తొలగించారు. దీప్తి అతిగా మద్యం తాగి నిద్రలో చనిపోయినట్లు నమ్మించడం కోసం సినీఫక్కీలో సీన్ క్రియేట్ చేశారు. తర్వాత ఇద్దరూ కారులో హైదరాబాద్ పరారయ్యారు. వాయిస్ మెసేజ్‌తో దారిమళ్లింపు.. అక్కను చంపాక పరారైన చందన.. మర్నాడు హైదరాబా ద్‌లోని తన ప్రియుడు ఉమర్ షేక్ కలసి అతని తల్లి అలి యా, చెల్లి ఫాతిమా వద్దకు వెళ్లింది. వారంతా కలసి నగదు, డబ్బుతో నాగ్‌పూర్ వెళ్లాలనుకున్నారు. ఇంతలో చందన బుధవారం తన తమ్ముడు సాయికి ఫోన్లో వాయిస్ మెసేజ్ పంపించింది. అక్కను తాను చంపలేదని.. బాయ్‌ఫ్రెండ్‌తో రాత్రివేళ ఇంటికి రావాలని అక్క చెప్పిందని, తాను వద్దన్నా నని హత్య కేసును దారిమళ్లించే ప్రయత్నం చేసింది. నాగ్‌పూర్ వెళ్తుండగా.. చందన, ఉమర్‌షేక్ సెల్ఫోన్ల డేటా ఆధారంగా వారు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు మూడు ప్రత్యేక బృందాలతో అక్కడకు వెళ్లారు. అయితే కారులో బురఖా వేసుకొని తప్పించుకొని తిరుగుతున్న చందనతోపాటు ప్రియుడు ఉమర్ షేక్, అతడి తల్లి అలియా, చెల్లి ఫాతిమా, బంధువు హఫీజ్‌ను నాగ్‌పూర్ వైపు పరారవుతుండగా శనివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్–బాల్కొండ మార్గంలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 1.20 లక్షల నగదు, సుమారు రూ.80 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన మెట్పల్లి డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు కిరణ్, చిరంజీవిని ఎస్పీ అభినందించారు. -
సేమ్ టు సేమ్.. లవ్‌లో పడ్డారు కదూ!
తాను పట్టుకున్న మంచానికి మూడే కాళ్లన్నట్టుగా ఉంది సోషల్ మీడియాలో కొందరి పరిస్థితి. ఎవరైనా ఇద్దరూ ఇంచుమించు ఒకేలా ఉన్న డ్రెస్ వేసుకుంటే వారి మధ్యలేదో ఉందంటూ లేనిపోనివి సృష్టించేస్తున్నారు. ప్రేమపక్షులు అంటూ ముద్రవేస్తున్నారు. తాజాగా హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఉమర్ రియాజ్, హీరోయిన్ పరిణీతి చోప్రా లవ్‌లో పడ్డారంటూ నెట్టింట కొందరు పోస్టులు చేస్తున్నారు. ఇద్దరూ ఒకే టీషర్ట్స్ వేసుకున్నారని, ఇది ప్రేమలో ఉన్నామని అంగీకరించడమే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అవునవును, ఇద్దరి టీషర్ట్స్ ఒకేలా ఉన్నాయి. ఇద్దరి మధ్య ఏదో ఉదంటూ మరికొందరు దానికి వంత పాడుతున్నారు. ఉమర్ ఫ్యాన్స్ ఓ అడుగు ముందుకు వేసి ఇద్దరి ఫొటోలను ఎడిటింగ్ చేసి మరీ పోస్ట్ చేస్తుండటం గమనార్హం. అయితే ఇదంతా కేవలం ఫన్ కోసం చేశారని తెలుస్తోంది. కాగా గతంలో ఉమర్ బిగ్‌బాస్ కంటెస్టెంట్ రష్మీ దేశాయ్‌తో లవ్‌లో ఉన్నాడంటూ రూమర్లు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే! Exclusive & Confirm #UmarRiaz Dating #ParineetiChopra 😍😍❤️ 1. Umar Riaz & Parineeti Chopra Wear Same White T-Shirt ❤️ pic.twitter.com/JUyTiUasbi — 👑 LION UMAR RIAZ 👑 (@Ragib_08) April 15, 2022 2. #UmarRiaz & #ParineetiChopra Wear Same Black T-shirt ❤️ pic.twitter.com/RSd14MlXnx — 👑 LION UMAR RIAZ 👑 (@Ragib_08) April 15, 2022 8. #UmarRiaz & #ParineetiChopra Together At Jammu ❤️ pic.twitter.com/zX74Jf9szW — 👑 LION UMAR RIAZ 👑 (@Ragib_08) April 15, 2022 చదవండి: ప్రియురాలితో యాంకర్ వివాహం, నెట్టింట ఫొటోలు వైరల్ ట్విటర్ అకౌంట్ పేరు మార్చిన చిరంజీవి.. రామ్‌చరణ్ స్పెషల్ వీడియో వైరల్ -
కరోనా నుంచి కోలుకున్న పాక్ మాజీ క్రికెటర్ తౌఫిక్
కరాచీ: పాకిస్తాన్ మాజీ ఓపెనర్ తౌఫీక్ ఉమర్ ప్రాణాంతక కరోనా వైరస్ నుంచి కోలుకున్నాడు. రెండు వారాల క్రితం వైరస్ బారిన పడిన తాను ప్రస్తుతం పూర్తిస్థాయిలో కోలుకున్నానని 38 ఏళ్ల తౌఫీక్ శుక్రవారం తెలిపాడు. కోవిడ్–19 మహమ్మారిని తీవ్రంగా పరిగణించాలని, రోగ నిరోధక శక్తికి పెంపొందించుకునే మార్గాలపై శ్రద్ధ వహించాలని అతను ప్రజలకు సూచించాడు. ‘ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటించండి. పాజిటివ్‌గా తేలాక రెండు వారాల పాటు నేను ఒక గదికే పరిమితమయ్యా. ఇంట్లో పిల్లలకు, పెద్దవారికి దూరంగా ఉన్నా. ఒకవేళ ఎవరైనా కరోనా పాజిటివ్‌గా తేలితే కంగారు పడకుండా రోగనిరోధకత పెంచుకోవడంపై దృష్టి పెట్టండి’ అని ఉమర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్ జూనియర్ సెలక్షన్ కమిటీలో సభ్యుడైన ఉమర్.. 44 టెస్టులు, 22 వన్డేల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. -
పాలకులు ఎలా ఉండాలి?
హజ్రత్ ఉమర్ గొప్పనాయకుడు. బాధ్యతాయుతమైన పాలకుడు. అన్నిటికీ మించి దైవభక్తి పరాయణుడు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడం కోసం ఇతరులపై ఆధారపడకుండా, ఆయన స్వయంగా పర్యటించేవారు. అందులో భాగంగానే ఒకసారి మారువేషం ధరించి గస్తీకి బయలుదేరారు. కొన్ని ప్రాంతాలు పర్యటించిన తరువాత ఒక పూరిగుడిసె దగ్గర ఆగారు. ఆ గుడిసెలో ఒక వృద్ధురాలు నివాసం ఉంటోంది. మారువేషంలో ఉన్న హజ్రత్ ఉమర్ (ర)ఆమె దగ్గరికి వెళ్ళి క్షేమ సమాచారాలు విచారించారు. మీ పాలకుడు ఉమర్ పాలన ఎలా ఉందని ప్రశ్నించారు.దానికామె, ‘‘ఆ..ఏమి ఉమరో ఏమిటో నాయనా! దేవుడు ఆయనకు మేలుచేయడు.’ అన్నది.‘‘అయ్యయ్యో.. ఏంటి పెద్దమ్మా.. అంతమాట అనేశావు..అసలేం జరిగింది?’’ అని ఆరాతీశారు.‘‘ఏమీలేదు నాయనా.. నేనింత ముసలిదాన్నికదా...నన్నెప్పుడైనా పట్టించుకున్నాడా..?’’అని నిష్టురమాడింది.‘‘అమ్మా..! రాజు అంటే చాలా పనులుంటాయి కదమ్మా..! నువ్వెప్పుడైనా నీసమస్యను రాజుగారి దృష్టికి తీసుకెళ్ళావా?’ అన్నారు ఉమర్ .‘‘అదేంటి బాబూ అలా అంటావు? పాలకుడన్నవాడికి తన రాజ్యంలో ఎక్కడ ఏం జరుగుతోంది? ప్రజలు ఎలా ఉన్నారు. వారి కష్టసుఖాలేమిటి? అన్న విషయాలు తెలుసుకోవాలన్న బాధ్యత ఉండదా? పాలకుడంటే సేవకుడు కదా..? నేను వెళ్ళి దేహీ అని అడుక్కోవాలా? ప్రజల బాగోగులు చూడడం, వారి అవసరాలు తీర్చడం పాలకుడి బాధ్యత కాదా?’అని ప్రశ్నించింది.వృద్ధురాలి మాటల్లోని సత్యాన్ని అర్థం చేసుకున్న హజ్రత్ ఉమర్ కు దుఖంపొంగుకొచ్చింది. ‘ఈ వృద్ధురాలికున్నంత తెలివి కూడా నీకు లేదా ఉమర్! రేపు దైవానికి ఏం సమాధానం చెబుతావు?’ అంటూ తనను తాను ప్రశ్నించుకున్నారు ఉమర్ తరువాత ఆయన, ‘‘అయితే.. నీ విషయంలో ఉమర్ వల్ల జరిగిన నిర్లక్ష్యానికి ఎంతమూల్యం చెల్లించమంటావో చెప్పు. నేను ఆ మూల్యాన్ని నీకు చెల్లించి ఉమర్‌ను కాపాడాలనుకుంటున్నాను’’ అన్నారు.‘‘బాబూ.. ఈ ముసలిదాన్ని ఎందుకు ఆటపట్టిస్తావు? ఉమర్ నిర్లక్ష్యానికి నువ్వు మూల్యం చెల్లిస్తావా?.’అంటూ నవ్వింది వృద్ధురాలు. ‘‘లేదమ్మా.. నేను నిజమే చెబుతున్నాను’’ నమ్మబలికారు ఉమర్.‘‘సరే, అయితే.. ఇరవై ఐదు వరహాలు ఇవ్వు..’ అన్నది వృద్ధురాలు..అంతలో హజ్రత్ అలీ(ర), హజ్రత్ ఇబ్నెమస్ ఊద్ (ర)అటుగా వచ్చారు. వారు హజ్రత్ ఉమర్ గారిని చూస్తూనే, సలామాలేకుం ఉమర్ ఖలీఫా’’ ఈ మాట వింటూనే వృద్ధురాలికి ముచ్చెమటలు పట్టాయి. ఆమె ఆందోళనను గమనించిన హజ్రత్ ఉమర్ ‘‘అమ్మా.. ఆందోళన చెందకు.అల్లాహ్ కరుణించుగాక.. నువ్వు సత్యం మాట్లాడావు’’ అంటూ ఆప్యాయంగా అనునయించారు. ఒక సామ్రాజ్యానికి పాలకుడైనటువంటి హజ్రత్ ఉమర్(ర)ఎంత నిబద్దతతో, ఎంతబాధ్యతతో, ఎంత జవాబుదారీతనంతో ప్రజలతో వ్యవహరించారో చూడండి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఈవ్‌టీజర్ పోలీసులకు అప్పగింత
బంజారాహిల్స్: షాపింగ్ మాల్లో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న ఓ యువకుడిని స్థానికులు పట్టుకొని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఓల్డ్‌సిటీకి చెందిన ఇద్దరు యువతులు సిటీ సెంటర్ మాల్లో షాపింగ్ చేస్తుండగా ఏడుగురు యువకులు వారిని అనుసరిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని బాధిత యువతులు అక్కడ ఉన్న సెక్యూరిటీకి ఫిర్యాదు చేశారు. సెక్యూరిటీ సిబ్బందితో పాటు వ్యాపారులు ఆ యువకులను పట్టుకోవడానికి ప్రయత్నించగా ఆరుగురు పరారీ కాగా.. ఉమర్ అనే యువకుడు దొరికాడు. అతడిని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఉమర్‌పై ఈవ్‌టీజింగ్ కేసు నమోదు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.


