ఢిల్లీ సాక్షి, ఎర్రకోట కారు బాంబు కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడి ఉమర్ పొరపాటున చేసింది కాదని పథకం ప్రకారమే దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆత్మాహుతి దాడి గురించి అపార్థం చేసుకుంటున్నారని కాని ఇది ఓబలిదానం అని, చనిపోయే స్థలం, సమయం, గురించి ఆ వీడియోలో మాట్లాడారు.
ఈ నెల 10 న ఢిల్లీ ఎర్రకోటలో జరిగిన బాంబుపేలుళ్లలో ఎన్ఐఏ లోతైన దర్యాప్తు చేపడుతుంది. ఈ నేపథ్యంలో కారుబాంబు ఉగ్రవాది ఉమర్ సంచలన వీడియో బయిటపడింది. అందులో ఉమర్ "ఆత్మాహుతి దాడి చేసుకోవాలని చూసేవాడు భయంకరమైన మైండ్ సెట్ లోకి వెళ్లాలి. నాగరిక సమాజం దీన్ని అంగీకరించదు.చావే అంతిమ లక్షం అని భావిస్తేనే అది సాధ్యమవుతుంది. బలిదానం అనేది ఒక ఆపరేషన్ అని ఒక వ్యక్తి తాను నిర్ధిష్ఠ సమయంలో ఫలానా ప్రాంతంలో చనిపోతానని భావించడం . ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతారో ఎవరికీ తెలియదు అది విధిరాత అయితే చావుకు ఎప్పుడూ భయపడకూడదు. ఆత్మాహుతి దాడిపై సమాజంలో పలు రకాల వాదనలున్నాయి. అటువంటి దాడిని సమాజం ఒప్పుకోదు" అని ఆ వీడియోలో అన్నారు.
నవంబర్ 9న ఎర్రకోట బాంబు దాడి జరిగే ఒకరోజు ముందు అల్పాల యూనివర్సిటీలో ఈవీడియో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాది ఉమర్ ఈవీడియోలో మాట్లాడిన మాటలు చూస్తుంటే కారుబాంబు బ్లాస్ట్ పక్కా ప్రణాళిక తోనే చేశారని అందుకే అది జరిగే ఒకరోజు మందు ఈ వీడియో చేశారని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదికి సంబంధంమున్న అల్ ఫలా యునివర్సిటీపై ఎన్ఐఏ మరింత విస్తృతం చేసింది. వర్సిటీకి విదేశాల నుంచి అందే నిధులపై ఆరా తీస్తుంది. ఈ బాంబు కుట్ర కేసుతో సంబంధమున్న పలువురు వ్యక్తులను ఇది వరకే పోలీసులు అరెస్ట్ చేశారు.నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోటలో జరిగిన కారుబాంబు పేలుళ్ల కేసులో 13 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.


