breaking news
redfort
-
సింగపూర్ చూపుతున్న మార్గం
ఢిల్లీలో ఎర్రకోట వద్ద నవంబర్ 10న జరిగిన ఉగ్ర దాడి, భారత్ ఎదుర్కొంటున్న ఆంతరంగిక భద్రతా సవాళ్ళపైకి మరోసారి దృష్టిని మరల్చింది. ఈ దాడిలో 13 మంది చనిపోగా, 30 మందికి పైగా గాయపడ్డారు. ఢిల్లీలో హైకోర్టు వద్ద 2011లో జరిగిన బాంబు పేలుడు తర్వాత, అంతటి భీతావహమైన దాడి చోటుచేసుకోవడం మళ్లీ ఇదే మొదటిసారి. ముంబయిలో 2008 నవంబర్ 26న భారత్ పెద్ద ఉగ్ర దాడిని చవిచూసింది. ఆ దాడిలో పాల్గొన్నవారిలో ఒకడైన కసబ్‌కు పాకిస్తాన్‌తో ఉన్న సంబంధం స్పష్టంగా వెల్లడైంది. వైట్ కాలర్ ఉగ్రవాదంఅయితే, ఢిల్లీ ఘటన ఇస్లామీయ ర్యాడికలైజేషన్‌లో వచ్చిన పెద్ద మార్పునకు అద్దం పడుతోందని చెబుతున్నారు. అది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు పాకింది. వృత్తి నిపుణులు (ఈ కేసులో డాక్టర్లు) తమకు తాము ఉగ్రవాదులుగా మారుతున్నారు. వారు డిజిటల్ సాధనాలను, సంస్థాపరమైన సౌలభ్యాన్ని వినియో గించుకుంటున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తదనంతర దర్యాప్తులో అనేక సంగతులు వెల్లడయ్యాయి. ఊహకందని ఉగ్ర సాలెగూడు జమ్ము–కశ్మీర్, హరియాణా, ఉత్తర ప్రదేశ్‌లను మించి విస్తరించినట్లు తేలింది. ఒక వైట్–కాలర్ ఉగ్ర వ్యవస్థ బయటపడింది. దానికి పాకిస్తాన్‌లోని జైష్–ఏ–మహమ్మద్ (జెమ్), అన్సార్ గజవత్ ఉల్– హింద్‌తో సంబంధాలున్నాయి. వారు అనుసరించిన ఎత్తుగడలు హమాస్ నుంచి స్ఫూర్తి పొందినవిగా కనిపిస్తున్నాయని కూడా ప్రాథ మిక నివేదికలు సూచించాయి. విదేశీ సూత్రధారుల (ఉదాహరణకు తుర్కియేలోని ‘ఉకాస’) ఆదేశాలను పాటించినట్లు కూడా వెల్లడవు తోంది. దానికి వారు సెషన్, టెలిగ్రామ్ వంటి యాప్‌లను వాడు కున్నారు. సోదాలలో 2,900 కిలోల పేలుడు పదార్థాలు, డిటొ నేటర్లు, అసాల్ట్ రైఫిళ్ళు, (42 వీడియోలతో సహా) ప్రాపగాండా సామగ్రి దొరికాయి. ‘జెమ్’ వంటి ఉగ్ర తండాలు, వాటి అనుబంధ వర్గాలు స్లీపర్ సెల్స్ సృష్టించేందుకు, విద్యావంతులైన యువతను లక్ష్యంగా చేసుకుంటున్నాయని, అందుకు సామాజిక మాధ్యమా లను వాడుకుంటున్నాయని తేటతెల్లమైంది. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ఉన్న అస్థిర పరిస్థితులు, అశాంతి ఈ వ్యవహారాలలో ఒక వారధిగా పనిచేయడానికి అవకాశం కల్పించి ఉండవచ్చునని కూడా అను మానిస్తున్నారు.సింగపూర్‌కూ తప్పని సంకటంఇటీవలి నా సింగపూర్ సందర్శన సందర్భంగా నాకు కొన్ని నిగూఢమైన అంశాలు తెలిసి వచ్చాయి. సోషల్ మీడియా, ఆర్టిఫిషి యల్ ఇంటెలిజె¯Œ ్స ఆధారిత ఇస్లామీయ ర్యాడికలైజేషన్ విసురు తున్న సవాల్, అది ఆ నగర రాజ్యంలోని యువ వర్గాలపై చూపు తున్న ప్రభావం దిగ్భ్రమకు గురిచేశాయి.సెక్యూరిటీ ఏజెన్సీలు నిర్భంధంలోకి తీసుకుంటున్న యువ ర్యాడికల్ సింగపూరియన్ల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోందని మరిన్ని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. సెక్యూరిటీ ఏజెన్సీలు జాగు చేయకుండా వెంటనే నివారణ చర్యలకు దిగడం వల్ల చాలా ప్రమాదకర ఘటనలు తప్పిపోయాయి. సింగపూర్‌లో తుపాకీ నిరోధక చట్టాలు పకడ్బందీగా అమలవుతున్నాయి. వాటిని తప్పించుకుని ఒక ఆయుధాన్ని తయారు చేసేందుకు, 17 ఏళ్ళ ఓ యువకుడు 3–డి ప్రింటింగ్‌ను వినియోగించుకునే ప్రణాళికలో ఉన్నాడు. కానీ, ఆంతరంగిక భద్రతా విభాగం (ఐఎస్డీ) ఈ ఏడాది మార్చిలో అతడిని నిర్బంధంలోకి తీసుకోగలిగింది. అతడి నుంచి రాబట్టిన విషయాలు మరింత ఆశ్చర్యం గొలిపాయి. అతడు ఆ ఆయుధాన్ని ఉపయోగించి స్థానిక మసీదు ఒక దానిలో కనీసం 100 మందిని చంపేసి, తనను తాను కాల్చుకుని చనిపోయే ఆలోచనలో ఉన్నాడు. దీనికి ముందు, ఫిబ్రవరి నెలలో, ఐఎస్డీకి ఓ 15 ఏళ్ళ అమ్మాయిపై అనుమానం కలిగింది. ఆమె కదలికలపై నిఘా పెట్టి, తర్వాత నిర్భంధంలోకి తీసుకుంది. ఆంతరంగిక భద్రతా చట్టం కింద సింగపూర్‌లో ఓ అమ్మాయిని అరెస్టు చేయడం అదే మొదటి సారి. ఆమె ‘ఐసిస్’ సభ్యుడిని పెళ్ళి చేసుకుని, దానికి అనుకూ లమైన కుటుంబాన్ని పెంచాలని భావిస్తోంది. సిరియాలో పోరాటంలోకి దిగి, అమర వీరురాలిగా మారాలని కలలు గంటోంది. అరికట్టే చర్యలు ఈ పెడ ధోరణులకు అడ్డుకట్ట వేసేందుకు సింగపూర్ ప్రభుత్వం రెలిజియస్ రీహ్యాబిలిటేషన్ గ్రూప్ (ఆర్.ఆర్.జి.) పేరుతో 2005లోనే ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వ్యవస్థీకృత ఉగ్ర తండాల సభ్యుల నుంచి పొంచి ఉన్న బెడదను ఎదుర్కోవడాన్ని అది మొదట లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా జెమా ఇస్లామియా (జేఐ) నుంచి ఉన్న ముప్పును నివారించే పనిలోపడింది. కాలక్రమంలో పరిస్థితులకు తగ్గట్లుగా ఆర్.ఆర్.జి. తన కార్యాచరణను మార్చుకుంటూ వచ్చింది. అసలు మతం ఉద్దేశాలు, ఆశయాల గురించి యువతకు సక్రమ అవగాహన కల్పించే పనిని ప్రశంసనీయమైన రీతిలో కొనసాగిస్తూ వచ్చింది. యువతలో కొందరు ఆవేశం, నిరాశా నిస్పృహలతో హింసకు దిగడాన్ని గమనించి అది పరిష్కారం కాదని పరివర్తనకు దారి చూపింది. అది సత్ఫలితాలను ఇచ్చినట్లు ఒక విస్తృత సర్వేలో తేలింది. సింగపూర్ ఐ.ఎస్.ఏ. కింద Výæడచిన దశాబ్దంలో కేవలం 17 మంది మాత్రమే అరెస్టు అయ్యారు. ముఖ్యంగా, ఆ నగర రాజ్యంలో పెద్ద ఉగ్ర ఘటన ఏదీ చోటుచేసుకోలేదు. అయితే, సింగపూర్ ముస్లిం వ్యవహారాల మంత్రి ప్రొఫెసర్ ఫైజల్ ఇబ్రహీం తాజా ర్యాడికలై జేషన్‌ను గమనించకపోలేదు. ‘‘దేశాల మధ్య అనుసంధానకత్వం పెరిగిపోతున్న ప్రపంచంలో ఉగ్ర సామగ్రి తేలిగ్గా అందుబాటులోకి వస్తోంది. డిజిటల్ సాధనాలలో సైద్ధాంతిక ప్రబోధాలు ప్రతిధ్వని స్తున్నాయి. యువత ఇంటర్నెట్లోనే ఎక్కువ సమయం గడుపు తూండటం వల్ల ర్యాడికలైజేషన్కు వెసులుబాటు ఏర్పడడమే కాక, ఆ ప్రక్రియ వేగం పెరుగుతోంది’’ అన్నారు.అయితే, భారతదేశాన్ని ఆ నగర రాజ్యంతో పోల్చుకోలేం. సింగపూర్ జనాభా అరవై లక్షలు మాత్రమే. భారత్ జనాభా ఇంచు మించు 150 కోట్లు. వైవిధ్యంతో కూడిన భారతీయులు దాదాపు 800 జిల్లాలలో విస్తరించి ఉన్నారు. వివిధ మతాలు, భాషలు, కులాలకు చెందిన వారి సామాజిక–సాంస్కృతిక మిశ్రమత్వం మరింత జటిలమైంది. కానీ టెక్నాలజీ, సోషల్ మీడియా, ఏఐ ఆధారిత ర్యాడికలైజేషన్ తీరుతెన్నులకు సరిహద్దులు లేవు. సింగ పూర్ ఆర్.ఆర్.జి. నమూనాను సమీక్షించి, భారతదేశానికి తగ్గ విరుగుడు కార్యక్రమాలను రూపొందించుకోవచ్చు.సి. ఉదయ్ భాస్కర్ వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్ -
ఢిల్లీ బాంబుపేలుళ్లకు హమాస్‌తో లింకులు?
ఢిల్లీ ఎర్రకోట బాంబుదాడి ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తులో ఉగ్రవాదుల కుట్రకోణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులలోని లాకర్లను ఆయుధాలు, ఇతర మందుగుండు సామాగ్రిని భద్రపరిచేందుకు టెర్రరిస్టులు ప్లాన్ చేసినట్లుగా ఎన్ఐఏ విచారణలో తేలింది. సరిగ్గా గాజాలో హమాస్ ఈ విధంగానే జరిగిందని ఒక వేళ ఈ ఉగ్రవాదులకు హామాస్‌తో లింకులున్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తుంది.ఆసుపత్రులంటే ఎంతో మందికి ప్రాణాలు పోసే దేవాలయాలు. అటువంటి వైద్యశాలలను ఉగ్రవాదులు సంఘ విద్రోహా చర్యలకు కేంద్రస్థానంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఎర్రకోట బాంబు దాడిలో అరెస్టైన మహమ్మద్ షకీల్ జమ్మూకశ్మీర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తారు. అతను అరెస్టైన అనంతరం షకీల్ విధులు నిర్వహించిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్ఐఏ బలగాలు సోదాలు చేశాయి. ఆ ఆసుపత్రి లాకర్లో ఒక ఏకే-47 మిషన్ గన్‌తో పాటు మందుగుండు సామాగ్రి లభ్యమయ్యాయి. ఈ విషయంపై మరింత లోతుగా ఎన్ఐఏ విచారణ చేపట్టింది.దీంతో అనంత్ నాగ్, బారముల్లా, బుడ్గాం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆయుధాలు నిల్వ చేయాలని టెర్రరిస్టులు ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. ఆసుపత్రులలో మారణాయుధాలు దాచిపెడతే ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశ్యంతో ఈ ప్లాన్ చేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి ప్రణాళిక గాజాలో హామాస్ చేసిందని దానిని వీరు కాఫీకొట్టారా లేదా ఆ ఉగ్రవాద సంస్థతో ఇక్కడి ఉగ్రవాదులకు సంబంధాలున్నాయా అనే కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది గాజాలో హమాస్ ఆల్ షిపా అనే ఆసుపత్రి కింద తన స్థావరాన్ని నిర్మించింది. దీనిని ఇజ్రాయిల్ సైన్యాలు గుర్తించగా అందులో పెద్దఎత్తున ఆయుధాలు బయిటపడ్డాయి.ఇప్పుడు జమ్ముకశ్మీర్‌లోనూ ఉగ్రవాదులు ఆసుపత్రులను ఆయుధాలు దాచడానికి వాడాలని ప్రయత్నించడంతో ఎన్ఐఏ వారి సంబంధాలపై అనుమానం వ్యక్తం చేస్తుంది. -
పథకం ప్రకారమే ఢిల్లీ బ్లాస్ట్? ఉగ్రవాది సంచలన వీడియో
ఢిల్లీ సాక్షి, ఎర్రకోట కారు బాంబు కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడి ఉమర్ పొరపాటున చేసింది కాదని పథకం ప్రకారమే దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆత్మాహుతి దాడి గురించి అపార్థం చేసుకుంటున్నారని కాని ఇది ఓబలిదానం అని, చనిపోయే స్థలం, సమయం, గురించి ఆ వీడియోలో మాట్లాడారు. ఈ నెల 10 న ఢిల్లీ ఎర్రకోటలో జరిగిన బాంబుపేలుళ్లలో ఎన్ఐఏ లోతైన దర్యాప్తు చేపడుతుంది. ఈ నేపథ్యంలో కారుబాంబు ఉగ్రవాది ఉమర్ సంచలన వీడియో బయిటపడింది. అందులో ఉమర్ "ఆత్మాహుతి దాడి చేసుకోవాలని చూసేవాడు భయంకరమైన మైండ్ సెట్ లోకి వెళ్లాలి. నాగరిక సమాజం దీన్ని అంగీకరించదు.చావే అంతిమ లక్షం అని భావిస్తేనే అది సాధ్యమవుతుంది. బలిదానం అనేది ఒక ఆపరేషన్ అని ఒక వ్యక్తి తాను నిర్ధిష్ఠ సమయంలో ఫలానా ప్రాంతంలో చనిపోతానని భావించడం . ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతారో ఎవరికీ తెలియదు అది విధిరాత అయితే చావుకు ఎప్పుడూ భయపడకూడదు. ఆత్మాహుతి దాడిపై సమాజంలో పలు రకాల వాదనలున్నాయి. అటువంటి దాడిని సమాజం ఒప్పుకోదు" అని ఆ వీడియోలో అన్నారు.నవంబర్ 9న ఎర్రకోట బాంబు దాడి జరిగే ఒకరోజు ముందు అల్పాల యూనివర్సిటీలో ఈవీడియో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాది ఉమర్ ఈవీడియోలో మాట్లాడిన మాటలు చూస్తుంటే కారుబాంబు బ్లాస్ట్ పక్కా ప్రణాళిక తోనే చేశారని అందుకే అది జరిగే ఒకరోజు మందు ఈ వీడియో చేశారని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదికి సంబంధంమున్న అల్ ఫలా యునివర్సిటీపై ఎన్ఐఏ మరింత విస్తృతం చేసింది. వర్సిటీకి విదేశాల నుంచి అందే నిధులపై ఆరా తీస్తుంది. ఈ బాంబు కుట్ర కేసుతో సంబంధమున్న పలువురు వ్యక్తులను ఇది వరకే పోలీసులు అరెస్ట్ చేశారు.నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోటలో జరిగిన కారుబాంబు పేలుళ్ల కేసులో 13 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. -
జమ్మూ కశ్మీర్ ముస్లింలంతా ఉగ్రవాదులు కాదు: ఒమర్ అబ్దుల్లా
జమ్మూకశ్మీర్‌లో ఉన్న ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదని అక్కడి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఏ మతం ప్రజలను చంపమని హింసను ప్రోత్సహించమని చెప్పదని కశ్మీర్ యువతకు ఉగ్రవాదులతో సంబంధాలు లేవన్నారు. ఢిల్లీ ఎర్రకోట బాంబుదాడి కేసులో కొంతమంది కశ్మీర్ డాక్టర్లను అరెస్టు చేసిన నేపథ్యంలో అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు."ఒక విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. కశ్మీర్ ప్రజలందరూ టెర్రరిస్టులు కాదు. వారితో సంబంధాలు లేవు. కానీ కొంతమంది మాత్రం ప్రతిసారి ఇక్కడి ప్రశాంతతను దెబ్బతీయాలని, సోదరభావాన్ని చెడగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కశ్మీర్ యువత ఎవరికివారు ప్రత్యేక మైన భావజాలం కలిగి ఉంటారు. అందరూ ఒకే రకమైన భావజాలం అందరూ టెర్రరిస్టులే అనుకుంటే అది సరైన పద్దతికాదు" అని ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు దాడి కేసులో ప్రధాన నిందితులైన డా.ఒమర్ మహమ్మద్, డా.ముజామిల్ లు పుల్వామాకు చెందిన వారు కాగా డా. ఆదిల్ అనంత్ నాగ్ ప్రాంతానికి చెందిన వారు. వీరిపై ఎన్ఐఏ జరిపిన దర్యాప్తులో వీరికి ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ తో సంబంధాలున్నట్లు తేలింది.ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల కేసులో సంబంధమున్న వారిని కఠినంగా శిక్షించాలని అదే సందర్భంలో అమాయికులైన వారిని అరెస్టు చేయడం సరికాదని అబ్దుల్లా తెలిపారు. ఎర్రకోట బాంబు పేలుళ్లకు సంబంధించిన భద్రతా వైఫల్యం అంశపైనా ఒమర్ అబ్దుల్లా కేంద్రాన్ని ప్రశ్నించారు. -
బీహార్‌లోనూ ఎర్రకోట.. చరిత్ర ఇదే
ఢిల్లీలో ఎర్రకోట ఉందనే విషయం తెలిసిందే. అయితే బీహార్‌లోని దర్భంగాలో అచ్చం ఎర్రకోటను పోలిన కోట ఉంది. ఈ కోటకు మూడువైపులా ఎత్తయిన ప్రకారాలు ఉన్నాయి.దర్భంగాలోని కోటను దర్భంగా మహారాజు(The Maharaja of Darbhanga) నిర్మించారు. ఈ కోటకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దర్భంగా మహారాజు జమీందారీ నుండి మహారాజుగా ఎదిగే వరకు జరిగిన ప్రయాణానికి ఇది గుర్తుగా మిగిలింది.ఢిల్లీలోని ఎర్రకోటను పోలిన విధంగా ఈ కోట కూడా చక్కని నిర్మాణశైలి(Architecture)లో ఉంటుంది. ఈ కోటకు మూడు వైపులా ఎత్తయిన ప్రాకారాలున్నాయి. నాల్గవవైపు ప్రాకారపు పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. భారతదేశం బ్రిటిష్ పాలన నుండి స్వతంత్రం పొందిన తరువాత దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. రాజరిక, జమీందారీ వ్యవస్థ రద్దయ్యింది. దీంతో అప్పట్లో ఏ స్థితిలో నిర్మాణపనులు ఆగిపోయాయో, ఇప్పటికీ అలానే ఉంది.1934లో దర్భంగా మహారాజు ఈ కోట నిర్మాణాన్ని ప్రారంభించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. దర్భంగా మహారాజు తన పదవీకాలంలో అనేక అద్భుతమైన కట్టడాలను నిర్మించాడు. నేడు ఆ వారసత్వ సంపద(Inheritance)కు పరిరక్షణ కొరవడినట్లు కనిపిస్తోంది.ఈ కోట లోపల చుట్టూ లోతైన చెరువులు తవ్వించారు. నేడు ఈ కోట తన అందాన్ని కోల్పోతోంది. కోటపై మొక్కలు పెరిగాయి. ఈ కోట ప్రధాన ద్వారం వద్ద అద్భుత నిర్మాణ శైలి కనిపిస్తుంది. బీహార్‌లో 45 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కోట లోపల రాంబాగ్ ప్యాలెస్ ఉన్నందున ఈ కోటను రాంబాగ్ కోట అని కూడా పిలుస్తారు.ఇది కూడా చదవండి: శీతాకాల తుపాను తీవ్రం.. అమెరికా హై అలర్ట్ -
దారి మరువని ‘యమున’.. గతాన్ని గుర్తుచేసుకుంటూ..
దేశరాజధాని ఢిల్లీలో కురిసిన భారీ వర్షాల కారణంగా యమునా నదికి వరదలు సంభవించాయి. దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. సుమారు 45 ఏళ్ల తరువాత యమునా నది తన మహోగ్రరూపాన్ని ప్రదర్శించింది. వరద ఉధృతికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయం కాగా, వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ప్రముఖ చారిత్రాత్మక ప్రాంతమైన ఎర్రకోట కూడా వరదలకు ప్రభావితమయ్యింది. కోటలోని తలుపుల వరకూ వరదనీరు చేసింది. ఈ నేపధ్యంలో పలువురు ఇంటర్నెట్ యూజర్స్ యమునా నది వరదలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తున్నారు. యూజర్ హర్ష్ వత్స్ తన ట్విట్టర్ ఖాతాలో మునిగిన ఎర్రకోట ఫొటోతోపాటు మొఘలుల కాలంనాటి ఒక పెయింటింగ్ ఫొటోను షేర్ చేశారు. A river never forgets! Even after decades and centuries pass, the river would come back to recapture its borders. Yamuna reclaims it's floodplain. #Yamuna #DelhiFloods pic.twitter.com/VGjkvcW3yg — Harsh Vats (@HarshVatsa7) July 13, 2023 దీనిలో శతాబ్ధాల కిందట సంభవించిన యమునా నది వరదల దృశ్యం కనిపిస్తోంది. ఈ ఫొటోకు క్యాప్షన్‌గా ‘ఆ నది ఈ విషయాన్ని ఎన్నడూ మరచిపోలేదు. దశాబ్ధాలు గడిచిన తరువాత కూడా తన సరిహద్దులను స్వాధీనం చేసుకునేందకు తిరిగి వచ్చింది. యమున తిరిగి తన వరద ప్రభావిత ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది’ అని రాశారు. మరో యూజర్ ఇదేవిధమైన ఫొటోను షేర్చేస్తూ ‘ప్రకృతి ఎప్పుడూ తన మార్గంలోకి తిరిగివస్తుంది..#DelhiFloods2023 #Yamuna #RedFort." అని ట్యాగ్ చేశారు. మరికొందరు యూజర్స్ ఏఏ ప్రాంతాలలోకి యమున వరద నీరు ప్రవేశించిందో అవి శతాబ్ధాల క్రితం వరద ప్రవాహానికి గురైన ప్రాంతాలేనని, అందుకే యమున తిరిగి తన దారిని వెతుక్కుంటూ ఆయా ప్రాంతాలకు వచ్చిందని రాశారు. Nature always comes back to reclaim it's course....#DelhiFloods2023 #Yamuna #RedFort pic.twitter.com/woEieUoyaN — Rohit Sharma (@rohitzsharmaz) July 14, 2023 ఇది కూడా చదవండి: 18 వ అంతస్తు నుంచి ‘అమ్మా’ అంటూ కేక... తల్లి పైకి చూసేసరికి.. -
ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు..
న్యూఢిల్లీ: పంద్రాగస్టు వేడుకలు సమీస్తున్న వేళ దేశ రాజధాని ఢిల్లీ లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఎర్రకోట వద్ద 5 వేల మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎర్రకోట పరిసరప్రాంతాల్లో ఎత్తైన భవనాలపై ఎన్ఎస్జీ, స్వాత్ కమాండోలు..కైట్ క్యాచర్స్, షార్ప్ షూటర్లు పహరా కాస్తున్నారు. ఆగస్టు 15న డ్రోన్లు, బెలూన్లు వంటివి ఎగురవేయడంపై నిషేధం విధించారు. యాంటీ డ్రోన్ల వ్యవస్థలను పోలీసులు ఏర్పాటు చేశారు. కాగా శుక్రవారం ఢిల్లీ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టిన ప్రత్యేక బ్రాంచ్ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుండి 55 పిస్తోళ్ళు, 50 లైవ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితుల నుండి 55 సెమీ ఆటోమేటిక్ పిస్టల్స్ , 50 లైవ్ క్యాట్రిడ్జ్‌లను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
మీ మనసులో మాట ప్రధాని నోట వినాలంటే.. ఇలా చేయండి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. రానున్న ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం జరుగుతున్న నేపథ్యంలో ప్రజల ఆలోచనలను తన నోట పలకాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సారి ప్రధాని జాతినుద్దేశించి ప్రసగించే కార్యక్రమం జరుగుతుంది. సాధారణంగా అయితే ఈ ప్రసంగంలో ప్రభుత్వ కార్యక్రమాలు, విధివిధానాలు, దేశాన్ని అభివృద్ధి బాటలో నడపడం గురించి ఉంటుంది. కాగా ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం రోజున భారత్‌ను ముందుకు నడిపేందుకు దేశ పౌరులను నుంచి వారి ఆలోచనలను తెలపాలన్నారు. ఎర్రకోట ప్రసంగించే మాటలు తనవే అయినా అది దేశ ప్రజల మనసులో మాటలుగా ఉండాలని మోదీ కోరుతున్నారు. అందుకు గాను ప్రధాని త్వరలో జరగనున్న ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట ప్రసంగంలో తాను ఏం మాట్లాడాలో ప్రజలే చెప్పాలని.. వారి ఆలోచనలు, ఆశయాలను దేశ ప్రజలకు చెబుతానన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ సిటిజన్ ఎంగేజ్మెంట్ ప్లాట్‌ఫారమ్ అయిన MyGovindia లో తమ ఆలోచనలను తెలపాలని కోరారు. Your thoughts will reverberate from the ramparts of the Red Fort. What are your inputs for PM @narendramodi’s speech on 15th August? Share them on @mygovindia. https://t.co/UCjTFU30XV — PMO India (@PMOIndia) July 30, 2021 -
ఎర్రకోటపై ఎగిరిన రైతు జెండా
సాక్షి, న్యూఢిల్లీ: తమ హక్కుల సాధన కోసం రోడ్డెక్కిన రైతులు 72వ గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటవైపుగా దూసుకొచ్చారు. కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత రెండు నెలలుగా ఉద్యమిస్తున్న రైతులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికపై తమ ఉద్యమ జెండాను ఎగురవేశారు. బారికేడ్లు, లాఠీలు, టియర్ గ్యాస్ ఆందోళనల మధ్య ట్రాక్టర్ పరేడ్ ఉద్రిక్తతలకు దారితీసింది. చివరకు వీటన్నిటినీ అధిగమించి వేలాదిగా ఎర్రకోటకు చేరుకోవడం విశేషం. (బ్రేకింగ్: రైతులపై విరిగిన లాఠీలు)మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం సహా తమ డిమాండ్ల సాధనకోసం దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేపట్టారు. ప్రధానంగా రిపబ్లిక్ డే సందర్భంగా వేలాది ట్రాక్టర్లతో రైతులు చేపట్టిన కిసాన్ ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. సెంట్రల్ ఢిల్లీలోకి ఆందోళనకారులు చొచ్చుకురావడానికి ప్రయత్నించిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్తితులు ఏర్పడ్డాయి. పోలీసులు రైతులపై బాష్ప వాయువు ప్రయోగించారు. లాఠీలతో విరుచుకు పడ్డారు. ఈ ఘర్షణలో అటు పోలీసులు, ఇటు రైతులు గాయపడిన సంగతి తెలిసిందే.#WATCH A protestor hoists a flag from the ramparts of the Red Fort in Delhi#FarmLaws #RepublicDay pic.twitter.com/Mn6oeGLrxJ— ANI (@ANI) January 26, 2021 -
కుటుంబ నియంత్రణే నిజమైన దేశభక్తి: మోదీ
న్యూఢిల్లీ: భారతదేశ జనాభా పెరుగుదల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా పెరుగుదల వల్ల పథకాల రూపకల్పనలో ప్రభుత్వాలకు అతి పెద్ద సవాల్‌గా మారబోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు తరాలకు అభివృద్ది ఫలాలను సమృద్దిగా అందించాలంటే జనాభా నియంత్రణ ఎంతో కీలకమని ఆయన తెలిపారు. భారత ప్రజలకు 73వస్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన మోదీ.. రెడ్‌ఫోర్ట్ వేదికగా పలు కీలక అంశాల పట్ల తన భావాలను వ్యక్త పరిచారు. ప్రజలకు జనాభా నియంత్రణ పట్ల అవగాహన కల్పించాలని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. కొన్ని వర్గాల ప్రజలు తమ సంతానానికి కావాల్సిన అవసరాల గురించి ఆలోచించకుండానే బిడ్డలకు జన్మనిస్తున్నారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలు జనాభాను నియంత్రిస్తే నిజమైన దేశ భక్తి గల వారవుతారని అన్నారు. సమాజంలో తగిన గుర్తింపు, వారి అవసరాలు తీర్చినప్పుడే సంతానం గురించి ఆలోచించాలని హితవు పలికారు. 21శతాబ్దంలో దేశం అభివృద్ది చెందాలంటే ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండడం ఎంతో అవసరం అని అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా నియంత్రణకు అనేక పథకాలు రూపొందించాలని ఆయన సూచించారు. ప్రభుత్వాలు ఎన్ని ప్రణాళికలు వేసినా ప్రజలు సహరించకపోతే అనుకున్న ఫలితాలు సాధించలేమని ఆయన పేర్కొన్నారు. 1.3 బిలియన్లతో చైనాకు దీటుగా భారత్‌లో జనాభా పెరుగుదల జరుగుతుందని అన్నారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే జనాభాను నియంత్రించడానికి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాయని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలలో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే పోటీకి అనర్హులుగా ప్రకటించారని తెలిపారు. మోదీ దేశ ప్రజలకు నీటి ప్రాముఖ్యతను తెలియజేశారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి కుటుంబానికి నీటిని అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు. ఈ పథకానికి 3.5లక్షల కోట్లను కేటాయించనున్నట్లు తెలిపారు. కానీ, 73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ తరుణంలో కూడా కొందరికి నీటిని అందించలేకపోతున్నామని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రధాని మోదీ కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ కీలక ప్రకటన చేశారు. త్రివిధ దళాధిపతిగా డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ వ్యవహరిస్తారని వెల్లడించారు. మన సేనలు దేశానికి గర్వకారణమని, ఎర్రకోట నుంచి తాను కీలక నిర్ణయం వెల్లడిస్తున్నానంటూ దేశానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) రానున్నారని స్పష్టం చేశారు. ఈ నియామకంతో మన సేనలు మరింత పటిష్టవంతమైన సేవలు అందిస్తాయని అన్నారు. సర్వీస్ చీఫ్‌లకు సీడీఎస్ సీనియర్‌గా వ్యవహరిస్తారని సాయుధ దళాలు, ప్రధానికి మధ్య సీడీఎస్ వారధిలా ఉంటారని చెప్పారు. ప్రస్తుత సైనిక వ్యవస్థలో త్రివిధ దళాల చీఫ్‌ల కమిటీ చైర్మన్‌గా ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేందర్ సింగ్ దనోవా ఉండగా ఆయన సీడీఎస్ హోదాలో పనిచేయడం లేదు. కాగా సీడీఎస్ నియామకంపై ప్రధాని ప్రకటనను కార్గిల్ యుద్ధ సమయంలో ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన వేద్ ప్రకాష్ మాలిక్ స్వాగతించారు. -
ఆర్టికల్ 370 రద్దుతో పటేల్ కల నెరవేరింది : మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గురువారం దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటలో వరుసగా ఆరోసారి జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుతో సర్ధార్ వల్లభాయ్ పటేల్ కల నెరవేరిందని అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుపై కొందరు రాజకీయ రాద్ధాంతం చేశారని చెప్పారు. జమ్మూ కశ్మీర్, లఢక్ ప్రజలు ఆర్టికల్ 370, 35(ఏ) రద్దును స్వాగతించారని అన్నారు. గత ప్రభుత్వాలు ఆర్టికల్ 370పై ఎలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళలకు అండగా నిలిచామని చెప్పారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా కఠిన చర్యలు చేపట్టామని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలను గాడిలోకి తెచ్చామని చెప్పారు. సాగునీటి వనరుల అభివృద్ధికి జలశక్తి అభియాన్ తీసుకువచ్చామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన పదినెలల్లోనే కీలక నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. 70 ఏళ్లలో చేయలేని పనులను తాము 70 రోజుల్లోనే పనిచేశామని చెప్పుకొచ్చారు. దేశ ప్రజలకు రక్షాభందన్ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని అన్నారు. వన్ నేషన్-వన్ పోల్ ఒక దేశం ఒకే రాజ్యాంగం తన ధ్యేయమని స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తే తనకు ముఖ్యమని రాజకీయ భవిష్యత్ తనకు అవసరం లేదని అన్నారు. దేశ వ్యాప్తంగా ఒకే రాజ్యాంగాన్ని సాధించామని, త్వరలోనే వన్ నేషన్-వన్ పోల్ సాకారమవుతుందని చెప్పారు. గత ప్రభుత్వాలు పేదలను ఓటుబ్యాంకుగా వాడుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలోనే సబ్ కా వికాస్ సాధ్యమైందని అన్నారు. దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. వరదలు దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వరద సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయని చెప్పారు. -
గణతంత్ర వేడుకల్లో విధ్వంసానికి జైషే స్కెచ్
సాక్షి, న్యూఢిల్లీ : గణతంత్ర వేడుకల సందర్భంగా దేశ రాజధానిలో ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు రూపొందించారనే ఆరోపణలపై ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ సభ్యులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిని అబ్దుల్ లతీఫ్ ఘనీ, హిలాల్ అహ్మద్ భట్‌లుగా గుర్తించారని ఢిల్లీ పోలీస్ అధికారులు వెల్లడించారు. వీరు జమ్మూ కశ్మీర్‌కు చెందిన వకుర, బటపోరా ప్రాంతానికి చెందిన వారని తెలిపారు. మిలటరీ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారంతో ఢిల్లీలోని లక్ష్మీనగర్‌లో ఓ ఇంటిలోకి కొందరు అనుమానితులు వస్తున్నారని పసిగట్టిన పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో రాజ్‌ఘాట్‌లో కొందరిని కలిసేందుకు ఘనీ వస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు అక్కడ మాటు వేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఘనీ నుంచి ఆయుధాలు, కొంత మెటీరియల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘనీ అనుచరులను పట్టుకునేందుకు జమ్ము కశ్మీర్ వెళ్లిన ప్రత్యేక బృందం బండిపోరలో మరో ఉగ్రవాది అహ్మద్ భట్‌ను అరెస్ట్ చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్ర దాడులకు సన్నాహకంగా ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో భట్ రెక్కీ నిర్వహించినట్టు పోలీసులు వెల్లడించారు. విచారణలో భాగంగా తాము జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలో చురుకుగా పనిచేస్తామని వారు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. -
స్వాతంత్ర్య దినోత్సవ వేళ స్పెషల్ ఎమోజీ
న్యూఢిల్లీ : దేశమంతా 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను చాలా ఘనంగా జరుపుకొంటున్నారు. ఈ పాటికే మీ మీ సోషల్ మీడియా సైట్ల ద్వారా సన్నిహితులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి ఉంటారు. కానీ కాస్తా క్రియేటివిటీగా శుభాకాంక్షలు తెలపాలనుకునే వారి కోసం ట్విటర్ ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ రోజు సాధరణంగా ఎక్కువ మంది మూడు రంగుల జెండాతో ఉన్న సందేశాలనే పంపిస్తుంటారు. అలా కాకుండా కాస్తా భిన్నంగా ఎర్రకోట ఎమోజీని పంపిస్తే ఎలా ఉంటుంది.. ? చాలా బాగుంటుంది కదా. ఇలాంటి ఆలోచనతోనే ట్విటర్ తన యూజర్ల కోసం ఈ సదుపాయాన్ని కల్పించింది. అది కూడా మాతృభాషలో శుభాకాంక్షలు తెలిపివారికి మాత్రమే ఈ అవకాశం అంటుంది. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో పాటు ఎర్రకోట ఎమోజీని పంపిచాలనుకునే వారు మీ సందేశంతో పాటు ‘#IndependenceDayIndia’ను జత చేస్తే ఎరుపు రంగులో ఉన్న ఎమోజీ ఒకటి వస్తుంది. అది ఏంటంటే ఎర్రకోట. అవును మొఘలుల కాలంలో నిర్మించిన ఎర్రకోట.. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతిని ఉద్దేశించి దేశ ప్రధాని ప్రసంగించే ఎర్రకోట ఎమోజీ వస్తుంది. అంతేకాక స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకుంటే ‘#IndiaIndependenceDay’ హాష్‌ట్యాగ్‌ను క్లిక్ చేస్తే సరిపోతుంది అని తెలిపింది. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ కేవలం ట్విటర్ మాత్రమే కాక గెయింట్ సెర్చింజన్ గూగుల్ కూడా డూడుల్‌ని ప్రత్యేకంగా డిజైన్ చేయించింది. ఈ డూడుల్ మీద క్లిక్ చేస్తే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించిన వార్తా విశేషాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పిస్తోంది గూగుల్. -
18 ఏళ్ల తర్వాత అరెస్ట్.. ఢిల్లీలో అలర్ట్
సాక్షి, ఢిల్లీ : ఉగ్రవాది అరెస్ట్ తో దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కి పడింది. లష్కర్-ఇ-తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2000 సంవత్సరంలో ఎర్రకోట వద్ద జరిగిన ఉగ్రవాద దాడిలో ఇతను నిందితుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 37 ఏళ్ల బిలాల్ అహ్మద్ కవాను న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ వద్ద బుధవారం అదుపులోకి తీసుకున్నారు. శ్రీనగర్ నుంచి అతను వచ్చినట్లు గుజరాత్ ఏటీస్-స్పెషల్ సెల్ పోలీసులు వెల్లడించారు. హెడ్ క్వార్టర్స్‌కు అతన్ని తరలించిన అధికారులు ప్రస్తుతం అతన్ని ప్రశ్నిస్తున్నారు. కవా బ్యాంక్ అకౌంట్ వివరాలు సేకరించిన అధికారులు హవాలా ద్వారా జమ్ము కశ్మీర్‌లోని ఉగ్ర సంస్థలకు అతను నగదు బదిలీ చేసినట్లు ధృవీకరించారు. ఎర్ర కోట దాడి తర్వాత 18 ఏళ్లుగా కవా పలు ప్రాంతాలు తిరుగుతూ.. చివరకు కశ్మీర్‌కు చేరాడని తెలుస్తోంది. గణతంత్ర్య దినోత్సవ వేడుకలు దగ్గర పడుతుండటంతో మరోసారి ఏదైనా దాడులకు ఫ్లాన్ చేశారేమోనన్న అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అలర్ట్ ప్రకటించిన ఢిల్లీ పోలీసులు రద్దీ ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అయితే తన సోదరుడిని చూడటానికి ఢిల్లీకి వచ్చానని.. పోలీసులు అరోపిస్తున్నట్లు తనకు ఉగ్రవాద సంస్థలతో సంబంధం లేదని కవా చెబుతున్నాడు. డిసెంబర్ 20, 2000 సంవత్సరంలో ఎర్రకోట వద్ద జరిగిన ఉగ్ర కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించిన సంబంధించి పాక్‌కు చెందిన మహ్మద్ అరిఫ్‌తోపాటు మరో 10 మందిని దోషులుగా న్యాయస్థానం తేల్చింది. -
ఎర్రకోటలో ఘనంగా దసరా వేడుకలు
-
దేశానికి ఎర్రకోట.. మనకు గోల్కొండ కోట
* చారిత్రక ప్రాంతంపై ఎగరనున్న జాతీయజెండా సాక్షి, హైదరాబాద్: దేశానికి ఎర్రకోట.. మనకు గోల్కొండ కోట.. పంద్రాగస్టు వేడుకలు గోల్కొండ కోటపై జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ ప్రజలనోట ప్రస్తుతం వినిపిస్తున్న మాటలివి.. కాకతీయుల కాలం నుంచి కుతుబ్‌షాహీల పాలన వరకు... మట్టికోట నుంచి మహా దుర్భేద్యమైన కోటగా మారిన గోల్కొండ కోటకు వేలసంవత్సరాల చరిత్ర ఉంది. చుట్టూ రక్షణ ప్రాకారాలు.. నలువైపులా ఎనిమిది ప్రధాన ద్వారాలు... అద్భుతమైన రాజప్రాసాదాలు... అందమైన ఉద్యానవనాలు... అంచెలంచెలుగా 87 బురుజులు... కుతుబ్‌షాహీల వైభవోపేతమైన పరిపాలనకు నిలువెత్తు నిదర్శనం గోల్కొండ కోట... మొఘలుల దాడులతో ప్రాభవాన్ని కోల్పోయినా అసఫ్‌జాహీల ఆదరణతో కొత్త వెలుగులద్దుకొంది. ఇప్పుడు ప్రపంచ పర్యాటక ప్రాంతంగా పేరొందింది. తాజాగా సీఎం కేసీఆర్ ప్రకటనతో మరోసారి ఈ చారిత్రక కోట ప్రాచుర్యంలోకి వచ్చింది.


